ప|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
చ|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ||
చ|| బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||
చ|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||
pa|| piDikiTa talaMbrAla peMDli kUturu koMta | paDamarali navvIne peMDli kUturu ||
ca|| pErukala javarAle peMDli kUturu pedda | pErula mutyAla mEDa peMDli kUturu |
pEraMTAMDla naDimi peMDli kUturu viBu | pErukuccu sigguvaDI beMDli kUturu ||
ca|| birudu peMDamu veTTe beMDli kUturu nera | birudu magani kaMTe beMDli kUturu |
piridUri nappuDE peMDli kUturU pati | berarEcI nidivO peMDli kUturu ||
ca|| peTTenE pedda turumu peMDli kUturu nEDe | peTTeDu cIralu gaTTi peMDli kUturu |
gaTTiga vEMkaTapati kaugiTanu | peTTina nidhAnamayina peMDli kUturu ||
|