కొండలలో నెలకొన్న (రాగం: ) (తాళం : ) కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు మంచివాడై కరుణ బాలించినవాడు Komdalalo nelakonna (Raagam: ) (Taalam: ) Komdalalo nelakonna koneti rayadu vadu Komdalamta varamulu guppeduvadu Kummara dasudaina kuruvaratinambi Yimmanna varamulella niccinavadu Dommulu sesinayatti tomdamam cakkuravarti Rammanna cotiki vacci namminavadu Accapu vedukatoda nanamtaluvariki Muccili vettiki mannu mocinavadu Maccika dolaka dirumalanambi toduta Niccanicca mataladi noccinavadu Kamcilona numda dirukaccinambi mida Karunimci tanayedaku rappimcina vadu Emci yekkudaina vemkatesudu manalaku Mamcivadai...