dEvadEvu Dekkenade - దేవదేవు డెక్కెనదె

దేవదేవు డెక్కెనదె (రాగం: ) (తాళం : )

ప|| దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల మనోరథము ||

చ|| జగతి బాలులకై జలధులు వేరజేసి | పగటున దోలెనదె పైడిరథము |
మిగులగ గోపగించి మెరయురావణమీద | తెగ యెక్కి తోలెనదె దేవేంద్రరథము ||

చ|| దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు | బక్కన మరలిచె బుష్పరథము |
నిక్కి నరకాసురునిపై నింగిమోవ నెక్కి తోలె | వెక్కసపు రెక్కలతో విష్ణురథము ||

చ|| బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె | అలయేగుబెండ్లి కల్యాణరథము |
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి | కలకాలమును వేగె ఘనమైనరథము ||

dEvadEvu Dekkenade (Raagam: ) (Taalam: )

pa|| dEvadEvu Dekkenade divyarathamu | mAvaMTivArikella manOrathamu ||

ca|| jagati bAlulakai jaladhulu vErajEsi | pagaTuna dOlenade paiDirathamu |
migulaga gOpagiMci merayurAvaNamIda | tega yekki tOlenade dEvEMdrarathamu ||

ca|| dikkulu sAdhiMci sItAdEvitO nayOdhyaku | bakkana maralice buShparathamu |
nikki narakAsurunipai niMgimOva nekki tOle | vekkasapu rekkalatO viShNurathamu ||

ca|| balimi rukmiNi decci parulagelici yekke | alayEgubeMDli kalyANarathamu |
yelami SrIvEMkaTAdri nalamElumaMga gUDi | kalakAlamunu vEge Ganamainarathamu ||


Deva devottama - దేవ దేవొత్తమ

Deva devottama - దేవ దేవొత్తమ | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by OLETI VENKATESWARLU:

దేవ దేవొత్తమ (రాగం: ) (తాళం : )

దేవ దేవొత్తమ తే నమోనమో
రావణ దమన శ్రీ రఘురామా

రవికులాంబుధి సోమ రామలక్ష్మనాగ్రజ
భువి భరతశత్రుఘ్న పూర్వజ
సవన పాలక కౌసల్యానంద వర్ధన
ధవలాబ్జ నయనా సీతా రామా

దనుజ సమ్హారక దశరథ నందన
జనక భుపాలక జామాత
వినమిత సుగ్రీవ విభిషణ సమేత
ముని జన విముఖ సుముఖ సుచరిత్ర

అనిలజ వరద అహల్య శాపమోచన
సనకాది సేవిత చరణాంబుజ
కలతార శ్రీవేంకట గిరినివాస
అనుపమోదార విహరా గంభిరా

deva devottama (Raagam: ) (Taalam: )

deva devottama te namonamo
ravana damana sri raghurama

ravikulambudhi soma raamalakshmanaagraja
bhuvi bharatasatrughna purvaja
savana paalaka kausalya nanda vartdhana
dhavalabja nayana seeta raamana

danuja samharaka dasaratha nandana
janaka bhupaalaka jaamaata
vinamita sugreeva vibhishana sameta
muni jana vimukha sumukha sucharitra

anilaja varada ahalya saapamochana
sanakadi sevita charanambuja
kalatara srivenkata girinivaaasa
anupamodara viharaa gambhira


dEvara chittaM - దేవర చిత్తం

దేవర చిత్తం (రాగం: ) (తాళం : )

దేవర చిత్తం దివ్య నిధి
దేవనిర్మిత నిధీ యవధానం ||

అతివలు నాట్యంబాడెదమని వు
న్నతి మెఅయుచు నున్నారిదివో
ప్రతినలతో రంధయు మేనకయును
ధ్రుతి విద్య తమకంబున వినుమని ||

గానవిద్య తమకంబున వినుమని
కానుకలివె సురకాంతలవి
కానుపించుకో గంధర్వ సతులను
ధీనుత పంపుసుధీ యవధానం ||

పరియంకంబున బవళించెదవో
సిరుల విభవముల జెలగెదవో
తిరువేంకటగిరిదేవ యన్నిటా
తిరమందితి విటు ధీ యవధానం ||

dEvara chittaM (Raagam: ) (Taalam: )

dEvara chittaM divya nidhi
dEvanirmita nidhI yavadhAnaM ||

ativalu nATyaMbADedamani vu
nnati meRayuchu nunnAridivO
pratinalatO raMdhayu mEnakayunu
dhruti vidya tamakaMbuna vinumani ||

gAnavidya tamakaMbuna vinumani
kAnukalive surakAMtalavi
kAnupiMchukO gaMdharva satulanu
dhInuta paMpusudhI yavadhAnaM ||

pariyaMkaMbuna bavaLiMchedavO
sirula vibhavamula jelagedavO
tiruvEMkaTagiridEva yanniTA
tiramaMditi viTu dhI yavadhAnaM ||


Daevaa namo daevaa - దేవా నమో దేవా

దేవ నమో (రాగం: ) (తాళం : )

దేవా నమో దేవా
పావన గుణగణభావా ॥పల్లవి॥

జగదాధారా చతుర్భుజ
గగననీల మేఘశ్యామ
నిగమపాదయుగ నీరజనాభ
అగణిత లావణ్యాననా ॥దేవ॥

ఘనవేదాంతై ర్గణన వుదార
కనకశంఖ చక్ర కరాంకా
దినమణి, శశాంక దివ్యవిలోచన
అనుపమ రవిబింబాధరా ॥దేవ॥

భావజకంజ భవజనక
శ్రీవనితా హృదయేశ
శ్రీవేంకటగిరి శిఖరవిహార
పావన గుణగణభావా। ॥దేవ॥

Daeva namo (Raagam: ) (Taalam: )

Daevaa namo daevaa
Paavana gunagana bhaavaa ||pallavi||

Jagadaadhaara chaturbhuja
Gagananeela maeghasyaama
Nigamapaadayuga neerajanaabha
Aganita laavanyaananaa ||daeva||

Ghanavaedaamtair ganana vudaara
Kanakasamkhachakrakaraamkaa
Dinamanisasaamkadivyavilochana
Anupamaravibimbaadharaa ||daeva||

Bhaavajakambhavajaraka
Sreevanitaahrdayaesa
Sreevaemkatagirisikharavihaara
Paavanagunaganabhaavaa ||daeva||

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

dEvadEvaM BajE - దేవ దేవం భజే

దేవ దేవం (రాగం:ధన్నాసి ) (తాళం : )

దేవ దేవం భజే దివ్యప్రభావం|రావణాసురవైరి రణపుంగవం||

రాజవరశేఖరం రవికులసుధాకరం|ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం|రాజీవలోచనం రామచంద్రం||

నీలజీమూత సన్నిభశరీరం|ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం|భూలలనాధిపం భోగిశయనం||

పంకజాసనవినుత పరమనారాయణం|శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం|వెంకటేశం సాధు విబుధ వినుతం||

Daeva daevam (Raagam:dhannaasi ) (Taalam: )

pa|| dEvadEvaM BajE divya praBAvaM | rAvaNAsuravairi raGu puMgavaM ||


ca|| rAjavara SEKaraM ravikula sudhAkaraM | AjAnu bAhuM nIlABra kAyaM |
rAjAri kOdaMDa rAjadIkShA guruM | rAjIva lOcanaM rAmacaMdraM ||


ca|| nIlajImUta sanniBa SarIraM Gana vi- | SAla vakShasaM vimala jalaja nABaM |
kAlAhi naga haraM dharma saMsthApanaM | BU lalanAdhipaM BOgaSayanaM ||


ca|| paMkajAsana vinuta parama nArAyaNaM | SaMka rArjita janaka cApa daLanaM |
laMkA viSOShaNaM lAlita viBIShaNaM | vEMkaTESaM sAdhu vibudha vinutaM ||

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

dEvaraguNamulu - దేవరగుణములు

దేవరగుణములు (రాగం: ) (తాళం : )

ప|| దేవరగుణములు దెలియవు | నీవే మాకును నేరుప వయ్యా||

చ|| వదలక నీతో వాసికి బెనగిన | యెదుటనె నీ మన సెట్టుండునో |
కదిసి నీరీతికి గడు దమకించిన | యిది వేసాలని యెంతువో నీవు ||

చ|| చెనకగ నీ యెడ సిగ్గులు నెరపిన | పనులవి యేమని భావింతువో |
ననిచి నీ యెదుట నవ్వులు నవ్విన | తనివి లేనిదని తగ నాడుదువో ||

చ|| కూడుదు నిన్నిట గుబ్బల నొత్తిన | వోడ దనుచు గో రూదుదువో |
యీడనె శ్రీ వేంకటేశ యేలితివి | వీడెమిచ్చితే వెరగందుదువో ||

dEvaraguNamulu (Raagam: ) (Taalam: )

pa|| dEvaraguNamulu deliyavu | nIvE mAkunu nErupa vayyA||

ca|| vadalaka nItO vAsiki benagina | yeduTane nI mana seTTuMDunO |
kadisi nIrItiki gaDu damakiMcina | yidi vEsAlani yeMtuvO nIvu ||

ca|| cenakaga nI yeDa siggulu nerapina | panulavi yEmani BAviMtuvO |
nanici nI yeduTa navvulu navvina | tanivi lEnidani taga nADuduvO ||

ca|| kUDudu ninniTa gubbala nottina | vODa danucu gO rUduduvO |
yIDane SrI vEMkaTESa yElitivi | vIDemiccitE veragaMduduvO ||


dEva yI tagavu dIrcavayyA - దేవ యీ తగవు దీర్చవయ్యా

దేవ యీ (రాగం: ) (తాళం : )

ప|| దేవ యీ తగవు దీర్చవయ్యా | వేవేలకు నిది విన్నపమయ్యా ||

చ|| తనువున బొడమినతతి నింద్రియములు | పొనిగి యెక్కడికి బోవునయా |
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో | యెనగొని యెక్కడి కేగుదురయ్యా ||

చ|| పొడుగుచు మనమున బొడమిన యాసలు | అదన నెక్కడికి నరుగునయా |
వొదుగుచు జలములనుండు మత్స్యములు | పదపడి యేగతి బాసీనయ్యా ||

చ|| లలి నొకటొకటికి లంకెలు నివే | అలరుచు నేమని యందునయా |
బలు శ్రీవేంకటపతి నాయాత్మను | గలిగితి వెక్కడి కలుషములయ్యా ||

dEva yI (Raagam: ) (Taalam: )

pa|| dEva yI tagavu dIrcavayyA | vEvElaku nidi vinnapamayyA ||

ca|| tanuvuna boDaminatati niMdriyamulu | ponigi yekkaDiki bOvunayA |
penagi tallikaDa biDDalu BuvilO | yenagoni yekkaDi kEgudurayyA ||

ca|| poDugucu manamuna boDamina yAsalu | adana nekkaDiki narugunayA |
vodugucu jalamulanuMDu matsyamulu | padapaDi yEgati bAsInayyA ||

ca|| lali nokaTokaTiki laMkelu nivE | alarucu nEmani yaMdunayA |
balu SrIvEMkaTapati nAyAtmanu | galigiti vekkaDi kaluShamulayyA ||