Pademu nemu paramatma - పాడేము నేము పరమాత్మ
Pademu nemu paramatma - పాడేము నేము పరమాత్మ | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by SOBHARAJU:
పాడేము నేము (రాగం: ) (తాళం : )
| ॥పల్లవి॥ | పాడేము నేము పరమాత్మ నిన్నును వేడుక ముప్పదిరెండు వేళల రాగాలను | |
| ॥చ1॥ | తనువే వొళవు తలయే దండెకాయ ఘనమై వూర్పులు రెండు కట్టిన తాళ్ళు మనసే నీబద్దితాడు మరి గుణాలె జీవాళి మొనసిన పుట్టుగే మూలమైన కరడి | |
| ॥చ2॥ | పాపపుణ్యా లిరువంక పైఁడివెండియనుసులు పైపైఁ గుత్తికె మేటిపై చనిగె కోపుల నాలికెలోనఁ గుచ్చికట్టినట్టి తాడు చూపరాని సంసారమే సూత్రపు గణికె | |
| ॥చ3॥ | జీవునికిని దండె సేసినవాఁడవు నీవు వావాతి మాటలే నీపై వన్నెపదాలు యీవి మాకు నిహపరా లిచ్చితివి మెచ్చితివి శ్రీవేంకటేశ నీవే చేకొన్నదాతవు |
pADEmu nEmu (Raagam: ) (Taalam: )
|| Pallavi || pAdEmu nEmu paramAtma ninnunu
vEDuka muppadiramDu vELala rAgAlanu
|| Charanam 1 || tanuvE voLavu talayE daMdekAya
ghanamai vUrpulu reMdu kaTTina tALLu
manasE neebadditADu mari guNAlE jeevALi
monasina puTTugE mUlamaina karadi
|| Charanam 2 || pApapuNyA liruvaMka pai~diviMdiyanusulu
paipei~ gutTIke mETipai chanige
kOpula nAlikelOna~ gucchikaTTinaTTi tADu
chUparAnI saMsAramE sUtrapu gaNike
|| Charanam 3 || jeevunikini daMde sEsinavADavu neevu
vAvAti mATalE neepai vannepadAlu
yeevi mAku nihaparA licchitivi mecchitivi
Sree veMkatESa neeve chEkonnadAtavu