ప|| భారమైన వేపమాను పాలువోసి పెంచినాను | తీరని చేదేకాక/ని దియ్యనుండీనా ||
చ|| పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి నాను | చాయ కెంతగట్టినాను చక్కనుండీనా |
కాయపు వికారమిది కలకాలము జెప్పినా | పోయిన పోకలే కాక బుద్ధి వినీనా ||
చ|| ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా | మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా |
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది | దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా ||
చ|| కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా | సారె సారె గుట్టుగాక చక్కనుండీనా |
వేరులేని మహిమల వేంకటవిభుని కృప | ఘోరమైన ఆస మేలుకోర సోకీనా ||
pa|| BAramaina vEpamAnu pAluvOsi peMcinAnu | tIrani cEdEkAka diyyanuMDInA ||
ca|| pAyadIsi kukkatOka baddalu veTTi bigisi nAnu| cAya keMtagaTTinAnu cakkanuMDInA |
kAyapu vikAramidi kalakAlamu jeppinA | pOyina pOkalE kAka buddhi vinInA ||
ca|| muMcimuMci nITilOna mUla nAnabeTTukonnA | miMcina goDDali nEDu mettanayyi nA |
paMcamahApAtakAla bAri baDDacittamidi | daMci daMci ceppinAnu tAki vaMgInA ||
ca|| kUrimitO dEludecci kOkalOna beTTukonnA | sAre sAre guTTugAka cakkanuMDInA |
vErulEni mahimala vEMkaTaviBuni kRupa | GOramaina Asa mElukOra sOkInA ||