కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై - పడని పాట్ల నెల్ల పడి పొరలనేలా
పరుల మనసునకు నాపదలు కలుగగ జేయు - పరితాపకరమైన బ్రతుకేలా
సొరిది నితరుల మేలు చూచిసైపగలేక - తిరుగుచుండేటి కష్టదేహమేలా
యెదిరికెప్పుడు జేయు హితమెల్ల తనదనుచు - చదివి చెప్పని యట్టి చదువేలా
పొదిగొన్న యాసలో బుంగుడై సతతంబు - సదమదంబై పడయు చవులు దనకేలా
శ్రీ వేంకటేశ్వరుని సేవానిరతి గాక - జీవన భ్రాంతి పడు సిరులేలా
దేవోత్తముని నాత్మ దెలియ నొల్లక పెక్కు - త్రోవలేగిన దేహి దొరతనంబేలా
kaDupeMta taaguDuchu kuDupeMta diinikai - paDani paaTla nella paDi poralanElaa
parula manasunaku naapadalu kalugaga jEyu - paritaapakaramaina bratukElaaa
soridi nitarula mElu chuuchisaipagalEka - tiruguchuMDETi kaShTadEhamEla
yedirikeppuDu jEyu hitamella tanadanuchu - chadivi cheppani yaTTi chaduvEla
podigonna yaasalO buMguDai satataMbu - sadamadaMbai paDayu chavulu danakElaa
Srii vEMkaTESwaruni sEvaanirati gaaka - jIvana bhraaMti paDu sirulEla
dEvOttamuni naatma deliya nollaka pekku - trOvalEgina dEhi doratanaMbEla
Composer:M.Balamurali Krishna
kaDupeMta taaguDuchu - కడుపెంత తాగుడుచు
7:46 AM
K-Annamayya, క