లెండో లెండో మాటాలించరో మీరు|కొండలరాయనినే పేర్కొన్నదిదె జాలి॥
మితిమీరె చీకట్లు మేటితలవరులాల|జతనము జతనము జాలోజాలి||
యితవరులాల వాయించే వాద్యాలకంటె|అతిఘోషముల తోడ ననరో జాలి॥
గాములు వారెడి పొద్దు కావలి కాండ్లాల|జాము జాము దిరుగరో జాలో జాలి||
దీమసపు పారివార దీవె పంజులు చేపట్టి|యేమరక మీలో మీరు యియ్యరో జాలి॥
కారుకమ్మె నడురేయి గడచె గట్టికవార|సరె సరె పలుకరో జాలోజాలి||
యీ రీతి వేంకటేశుడిట్టె మేలుకొన్నాడు|గారవాన నిక మాన కదరో జాలి॥
leMDO leMDOmATaliMcarO mIru | koMDalarAyanine pErkonnadide jAli ||
mitimIre jIkaTlu mETi talavaru lAla | jatanamu jatanamu jAlO jAli |
yitavarulAla vAyiMcE vAdyAlakaMTe| ati GOShamula tODa nanarOjAli ||
gAmulu vAreDi poddu kAvAli kAMDlAla | jAmu jAmu dirugarO jAlO jAli |
dImasapu parivAra dIve paMjAlu cEpaTTi | yEmaraka mIlOmIru yiyyarO jAli ||
kAru kamme naDurEyi gaDace gaTTika vAra | sAre sAre palukarO jAlO jAli |
yIrIti SrIvEMkaTESuDiTTe mElukonnADu | gAravAnanika mAnagadarO jAli ||
|