miMchi dEvAMganaliTTe - మించి దేవాంగనలిట్టె


మించి దేవాంగనలిట్టె మెచ్చేరమ్మ
యెంచ నలమేల్మంగ యెంతదానవమ్మా

మాటలనే వూరడించి మచ్చికల పొద్దు వుచ్చి
నీటున పతిని తేలించ నేరుతువమ్మ
పాటలనే కరగించి పంతముల మరిగించి
చాటునను ఆతని గూడా జాణవమ్మా

నగుతానే రప్పించి నటనల మెప్పించి
తగుపతి దక్కగొన దంటవమ్మా
పగటుల భ్రమయించి బడినుండే వలపించి
చిగిరించ జేయ పతిచిత్తము వత్తువమ్మా

కాగిటనే చొక్కించి కందువల మొక్కించి
ఆగి పతివురమెక్కేవు అప్పుడే యమ్మ
పాగిన శ్రీవేంకటేశు పట్టపు రాణివి నీవు
నీగని వేడుకతోడ నీవారమమ్మా


miMchi dEvAMganaliTTe mechchEramma
yeMcha nalamElmaMga yeMtadAnavammA

mATalanE vUraDiMchi machchikala poddu vuchchi
nITuna patini tEliMcha nErutuvamma
pATalanE karagiMchi paMtamula marigiMchi
chATunanu Atani gUDA jANavammA

nagutAnE rappiMchi naTanala meppiMchi
tagupati dakkagona daMTavammA
pagaTula bhramayiMchi baDinuMDE valapiMchi
chigiriMcha jEya patichittamu vattuvammA

kAgiTanE chokkiMchi kaMduvala mokkiMchi
Agi pativuramekkEvu appuDE yamma
pAgina SrIvEMkaTESu paTTapu rANivi nIvu
nIgani vEDukatODa nIvAramammA


Sung by:Balakrishna Prasad