vEdamulE nI nivAsamaTa - Top/PopularAnnamayya/annamacarya/ spiritual/devotional/traditional/ songs/ lyrics/Audio/videos/telugu/english


:పెదతిరుమలాచార్య కీర్తన:
ప|| వేదములే నీ నివాసమట విమలనారసింహ |
నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ ||

చ|| ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన |
నారాయణ రమాథినాయక నగధర నరసింహ |

నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు |
ఈరీతి త్రివిక్రమాకౄతి నేచితి నరసింహ ||

చ|| గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ |
శ్రీవల్లభ పురాణపురుష శిఖసఖ నరసింహ |

దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు |
భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ ||

చ|| దాసపరికర సులభ తపన చంద్రనేత్ర |
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ |

భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన |
ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ ||



pa|| vEdamulE nI nivAsamaTa vimalanArasiMha |
nAdapriya sakalalOkapati namOnamO narasiMha ||


ca|| GOrapAtaka niruharaNa kuTiladaityadamana |
nArAyaNa ramAthinAyaka nagadhara narasiMha |

nIrUpaMbu iMta aMtayani nijamu teliyarAdu |
IrIti trivikramAkRuti nEciti narasiMha ||


ca|| gOviMda guNagaNarahita kOTisUryatEja |
SrIvallaBa purANapuruSha SiKasaKa narasiMha |

dEvA mimu brahmAdulakunu teliya nalavikAdu |
BAviMcaga prahlAdu neduTa paragiti narasiMha ||


ca|| dAsaparikara sulaBa tapana caMdranEtra |
vAsava suramuKa munisEvita vaMdita narasiMha |

BAsuramuga SrIvEMkaTagirini pAyanidaivama vaTugAna |
OsarakipuDu EgitiviTla ahObala narasiMha ||



Sung by:Balakrishna Prasad


Get this widget | Track details | eSnips Social DNA