HOME PAGE

Learn Brief description about Annamayya and other information.

Learn Lyrics in Telugu and English script

Learn and Enjoy the lyrics in Telugu and English scripts.

Annamayya Videos

Enjoy and Practice Annamayya video songs.

Annamayya Audio Songs

Listen and Enjoy Annamayya Audio Songs.

Devotional Songs

Enjoy listening devotional/sanskrit songs.

Learn English Vocabulary & Help the Poor| Vocaulary |<><><><><>Free download annamayya annamacarya top popular audio video songs lyrics music sung by bala subrahmanyam murali krishna prasad mangalampalli priya sisters nitya santoshini sobha raju SP sailaja etc

Showing posts with label Pooja. Show all posts
Showing posts with label Pooja. Show all posts

Vinayaka Vratha Katha - వినాయక వ్రత కథ

 

Sri Siddhi Vinayaka Vratha Katha – శ్రీ సిద్ధివినాయక వ్రత కథ


విఘ్నేశ్వరుని కథా ప్రారంభమ

మున్ను నైమిశారణ్యంబున సత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు సకలకథావిశారదుడగు సూతమహాముని యొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, శాపమోక్షప్రకారంబును చెప్పదొడంగెను.

గజాసుర వృత్తాంతం :
పూర్వము గజరూపముతో నున్న రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్ప, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్ష్యమై వరంబు కోరుమన, గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి “స్వామీ! మీరు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి కాపాడుచుండు”డని కోరగా భక్తసులభుండగు నా మహేశ్వరుండాతని కోర్కెదీర్ప గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుగ నుండె.

కైలాసమున పార్వతీదేవి భర్తజాడ దెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంతకాలంబునకు గజాసురగర్భస్థుడగుట తెలిసి రప్పించుకొనుమార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతివృత్తాంతమును దెలిపి, “యో మహానుభావ! పూర్వము భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నాకొసంగితివి. ఇప్పుడుగూడ నుపాయాంతరముచే రక్షింపు” మని విలపింప హరి యాపార్వతీదేవి నూరడించి కైలాసంబున నుండుమని దెల్పి యంత నా హరియు బ్రహ్మాదిదేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి, పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దుగ నలంకరించి, బ్రహ్మాదిదేవతలందరిని విచిత్ర వాద్యముల ధరింపచేసి తానును చిరుగంటలు, సన్నాయిని దాల్చి గజాసురపురంబు జొచ్చి అందందు జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుండు విని, వారలబిలిపించి తన భవనము నెదుట నాడించ నియమించగా బ్రహ్మాదిదేవతలు తమవాద్యవిశేషంబులు భోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు నాహరి చిత్రవిచిత్రగతుల గంగిరెద్దు నాడించగా గజాసురుండు పరమానందభరితుడై “మీకేమి కావలయునో కోరుడొసంగెద”నన, హరి సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకువచ్చె గాన శివునొసంగు” మని పల్కె. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుండగు శ్రీహరిగా నెరింగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని దలచి “నా శిరస్సు త్రిలోకపూజ్యముగ చేసి, నాచర్మమును నీవు ధరింపవే”యని ప్రార్థించి, విష్ణుమూర్తికి తన అంగీకారము దెలుప నాతండు నందిని ప్రేరేపించె. నందియు తన శృంగమ్ములచే గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుండు గజాసుర గర్భమునుండి వెలువడివచ్చి విష్ణుమూర్తిని స్తుతించె. అంత నా హరియు “దుష్టాత్ములకిట్టి వరంబులీయరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు”నని యుపదేశించి ఈశ్వరుని, బ్రహ్మాది దేవతలను వీడ్కోలిపి, తాను వైకుంఠమ్మున కెరిగె. అంత శివుండును నందినెక్కి కైలాసంబున కతివేగంబుగ జనియె.

వినాయకోత్పత్తి :
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదులవలన విని ముదమంది, అభ్యంగనస్నానమాచరించుచు నలుగుబిండి నొక బాలునిగజేసి, ప్రాణంబొసంగి, వాకిలిద్వారమున కావలియుంచి, పార్వతి స్నానమాడి, సర్వాభరణములనలంకరించుకొనుచు పత్యాగమనమును నిరీక్షించుచుండె. అంత పరమేశ్వరుండు కైలాసమందిరమునకు వచ్చి, నందినవరోహించి లోనికిపోబోవ వాకిలిద్వారమందున్న బాలకుడడ్డగింప, కోపావేశుండై త్రిశూలంబుచే బాలకుని కంఠంబుదునిమి లోనికేగె.

అంత పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులపూజించె; నంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము రాగా, అంత నమ్మహేశ్వరుండు తానొనరించినపనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు నాబాలుని కతికించి ప్రాణంబొసంగి గజాననుడను నామంబొసంగి యాతని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండె. గజాననుండును సులభముగ నెక్కితిరుగుటకు అనింద్యుడను నొక ఎలుకను వాహనముగా చేసికొనియె.

కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జనియించె. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతి గాంచియుండెను.

విఘ్నేశాధిపత్యము 
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసంబునకేగి పరమేశ్వరుని సేవించి, విఘ్నముల కొక్కని అధిపతిగా తమకొసంగుమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడనుగనుక ఆ యాధిపత్యము తన కొసంగమనియు; గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు గాన ఇయ్యాధిపత్యంబు తన కొసంగుమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంత నక్కుమారులజూచి “మీలో నెవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నెవరు నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యంబొసంగుదు”నని మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలివాహనమెక్కి వాయువేగంబుననేగె.

అంత గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి “అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయదగునే? మీపాదసేవకుండను. నాయందు కటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి రక్షింపవే” యని ప్రార్ధింప, మహేశ్వరుండు దయాళుడై “సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం! గంగాదిసర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక.” “కుమారా! ఒకసారి నారాయణమంత్రమును బఠించిన మాత్రమున మూడువందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమొనర్చినవాడగును” అని సక్రమముగ నారాయణమంత్రంబుపదేశింప, గజాననుడు నత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసమ్మునుండె.

అమ్మంత్రప్రభావంబున అంతకు పూర్వము గంగా నదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నది లో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోగూడ నటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబునకేగి యచటగూడ తండ్రిసమీపమందున్న గజాననుని గాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుడు. తమ నిర్ణయంబు ననుసరించి యీ ఆధిపత్యము అన్నగారికే యొసగు” మని ప్రార్థించె.

అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థీనాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు, మొదలుగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహమునకొసంగియు, కొన్ని చేతధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబునకేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమికానిన చేతులు భూమికందవయ్యె. బలవంతముగ చేతులానింప చరణంబు లాకసంబుజూచె. ఇట్లు దండప్రణామంబు సేయ గడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటముగ నవ్వె. నంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లెడల దొర్లె. నతండును మృతుండయ్యె.

అంత పార్వతి శోకించుచు చంద్రుని జూచి, “పాపాత్ముడా! నీదృష్టి తగిలి నా కుమారుడు మరణించెగాన, నిన్ను జూచినవారు పాపాత్ములై నిరాపనింద నొందుదురుగాక” యని శపించెను.

ఋషిపత్నులకు నిరాపనింద కలుగుట :
ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబుచేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను జూచి మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండ నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపముదక్క తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబుసేయ, ఋషులద్దానిం గనుంగొని అగ్నిదేవునితో నున్నవారు తమభార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నిరాపనింద కలిగినది. దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపంబుదాల్చి వచ్చుట దెల్పి సప్తమహర్షులను సమాధానపరచి వారితోగూడ బ్రహ్మ కైలాసంబునకేతెంచి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు “ఓ దేవీ! పార్వతీ! నీవొసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడువాటిల్లెగాన దాని నుపసంహరింపు”మని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయె కుమారునిజేరదీసి ముద్దాడి “ఏదినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వె నాదినంబున చంద్రుని జూడరాదు” అని శాపావకాశం బొసంగె. అంత బ్రహ్మాదిదేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థీయందు మాత్రము చంద్రునింజూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇట్లు కొంతకాలంబు గడచె.

శమంతకోపాఖ్యానము :
ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు “స్వామీ! సాయం సమయమయ్యె. ఈనాడు వినాయకచతుర్థిగాన పార్వతీశాపంబుచే చంద్రునిం జూడరాదుగనుక నిజగృహంబుకేగెద సెలవిండు” అని పూర్వవృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికి దెల్పి నారదుడు స్వర్గలోకంబునకేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుననెవ్వరు చూడరాదని పట్టణమున చాటింపించెను. నాటిరాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తాను మింటివంక చూడక గోష్ఠమునకుబోయి పాలుపితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి “ఆహా! ఇక నాకెట్టి యపనింద రానున్నదో” యని సంశయమున నుండెను.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్ధమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద జేసి ఆ మణిని మన రాజుకిమ్మని యడిగిన, అతడు “ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిదీ మణి. ఎంతటి యాప్తునకే మందమతైననిచ్చునా” యని పలికిన పోనిమ్మని కృష్ణుడూరకుండెను. అంత నొకనాడా సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుండా శమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవికిజన నొక సింహమా మణిని మాంసఖండమని భ్రమించి వానిని జంపి యా మణిని గొనిపోవుచుండ, నొక భల్లూకమా సింహమును దునిమి యా మణింగొని తన కొండబిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెకు ఆటవస్తువుగ నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని “కృష్ణుండు మణి యివ్వలేదను కారణమున నా సోదరుని జంపి రత్నమపహరించె” నని పట్టణమున చాటె. అది కృష్ణుండు విని “ఆహా! నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోషఫలం బిటుల కలిగిన” దని యెంచి దానిం బాపుకొన బంధుజన సేనాసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా నొక్కచో ప్రసేన మృత కళేబరంబును, సింగపు కాలిజాడలను, పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను.

ఆ దారింబట్టి పోవుచుండ నొక పర్వతగుహలోనికీ చిహ్నములు గాన్పింప నంత గుహద్వారమువద్ద పర్వారమ్మునుంచి, కృష్ణుండు గుహలోపలకేగి అచట మిరుమిట్లుగొల్పుచు బాలిక ఊయెల పై కట్టబడియున్న మణింజూచి అచ్చటకు మెల్లనజని ఆ మణిని చేతపుచ్చుకుని వచ్చునంత ఊయలలోని బాలిక ఏడ్వదొడంగెను. అంత దాదియును వింతమానిషి వచ్చెననుచు కేకలు వేయ నది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై, చనుదెంచి శ్రీకృష్ణునిపైబడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరలు గొరకుచు, ఘోరముగ యుద్ధముచేయ, కృష్ణుండును వానిం బడద్రోసి, వృక్షంబులచేతను, రాళ్ళచేతను, తుదకు ముష్టిఘాతములచేతను రాత్రింబవళ్ళు యెడతెగక యిరువదెనిమిది దినములు యుద్ధమొనర్ప, జాంబవంతుడు క్షీణబలుండై, దేహంబెల్ల నొచ్చి భీతిచెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి ఘటించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా! నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను
పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితి; ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొనుమని ఆజ్ఞ యొసంగ నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు జేయవలెనని కోరుకొంటిని. కాలాంతరమున నిది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచు నిటనుండ నిపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరంబంతయు శిథిలమయ్యెను ప్రాణములుకడబెట్టె. జీవితేచ్ఛ నశించె. నా యపరాధములు క్షమించి కాపాడుము నీకన్న వేరుదిక్కులేదు” అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయముంబాపి “భల్లుకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపైనారోపించిన యపనింద బాపుకొనుటకిటువచ్చితి గాన మణినొసంగిన నేనేగెద” నని జాంబవంతునకు దెల్ప నతడు శ్రీకృష్ణునకు మణిసహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగి రక్షింపవేడ నాతని కభయమొసంగి, కృష్ణుడు గుహవెల్వడి తన యాలస్యమునకు పరితపించు బంధు మిత్ర సైన్యంబుల కానందంబు కలిగించి కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరే.

సభాస్థలికి పిన్న పెద్దలను జేర్చి సత్రాజిత్తును రావించి యావద్వృత్తాంతమును దెల్పి యాతనికి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు “అయ్యో! పరమాత్ముడగు శ్రీకృష్ణునిపై లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి” నని చాల విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను. అంత శ్రీకృష్ణుండును, సత్యభామను గైకొని సంతోషించి “ఇతర మణులేల? మాకు భామామణి చాలును. సూర్యవరప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే యుంచుకొనుము. మాకు వలదు” అనుచు మణిని సత్రాజిత్తునకొసంగి యాదరించెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి, సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనక నిరాపనింద బాపుకొంటిరి. మా కేమిగతి”యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపదశుద్ధ చతుర్థిన ప్రమాదంబున చంద్రదర్శనమయ్యె నేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నిరాపనింద నొందకుండెదరు గాక” అని ఆనతీయ దేవాదులు “అనుగ్రహించబడితి” మని ఆనందించుచు తమ తమ నివాసములకేగి ప్రతి సంవత్సరమున భాద్రపదశుద్ధ చతుర్థీ యందు దేవతలు, మహర్షులు, మానవులు మున్నగువారందరు తమ తమ విభవములకొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి గాంచుచు సుఖముగ నుండిరని శాపమోక్ష ప్రకారము శౌనకాదిమునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగె.

గమనిక : చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః |
సుకుమారకమారోదీః తపహ్యేష శమంతకః ||

సర్వేజనాస్సుఖినోభవంతు |

విఘ్నేశ్వర దండకం, మంగళహారతులు చూ. |

Vinayaka Vrata Kalpam (Part 2) - వినాయక వ్రతకల్పం (2)

Sri Vinayaka Vrata Kalpam (Part 2) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (2)


శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం

శ్రీ వరసిద్ధివినాయక పూజా విధానం

పూజ చేయు విధానం చూ. ||

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే ||

(పూజ పూర్వాంగము లో ఆచమనం, దీపారాధన, ప్రాణాయామము చేయవలెను. సంకల్పము చెప్పునపుడు ఎడమ అరచేతిని కుడి అరచేతితో పట్టుకుని ఈ క్రింది సంకల్పము చెప్పవలెను)

పూర్వాంగం చూ. ||

సంకల్పం –
శ్రీ గోవింద గోవింద ||
మమ ఉపాత్త ………. సమేతస్య, అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థఫల సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం వరసిద్ధివినాయక దేవతాముద్దిశ్య, వరసిద్ధివినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ భాద్రపద శుక్ల చతుర్థీ పుణ్యకాలే యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ||

|| వినాయక పూజా ప్రారంభః ||

ప్రార్థనా –
భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ |
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ||
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ||
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ |
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ||

ధ్యానం –
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం –
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి |

ఆసనం –
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి |

అర్ఘ్యం –
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి |

పాద్యం –
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి |

ఆచమనీయం –
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ |
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం –
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం –
గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః |
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ |
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి |

అక్షతాన్ –
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |

పుష్పాణి –
సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ |
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి |

అథాంగపూజా –
ఓం పార్వతీనందనాయ నమః | పాదౌ పూజయామి (పాదములను) |
ఓం గణేశాయ నమః | గుల్ఫౌ పూజయామి (చీలమండను) |
ఓం జగద్ధాత్రే నమః | జంఘే పూజయామి (మోకాలుక్రింద) |
ఓం జగద్వల్లభాయ నమః | జానునీ పూజయామి (మోకాలు చిప్ప) |
ఓం ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి (తొడలను) |
ఓం వికటాయ నమః | కటిం పూజయామి (నడుమును పూజింపవలెను) |
ఓం గుహాగ్రజాయ నమః | గుహ్యం పూజయామి (మర్మ స్థానములను) |
ఓం మహోత్తమాయ నమః | మేఢ్రం పూజయామి |
ఓం నాథాయ నమః | నాభిం పూజయామి (బొడ్డును) |
ఓం ఉత్తమాయ నమః | ఉదరం పూజయామి (పొట్టను) |
ఓం వినాయకాయనమః | వక్షఃస్థలం పూజయామి (ఛాతిని) |
ఓం పాశచ్ఛిదేనమః | పార్శ్వే పూజయామి (పక్కలను) |
ఓం హేరంబాయ నమః | హృదయం పూజయామి (హృదయము) |
ఓం కపిలాయనమః | కంఠం పూజయామి (కంఠమును) |
ఓం స్కందాగ్రజాయ నమః | స్కంధౌ పూజయామి (భుజములను) |
ఓం హరసుతాయ నమః | హస్తౌ పూజయామి (చేతులను) |
ఓం బ్రహ్మచారిణే నమః | బాహున్ పూజయామి (బాహువులను) |
ఓం సుముఖాయ నమః | ముఖం పూజయామి (ముఖమును) |
ఓం ఏకదంతాయ నమః | దంతౌ పూజయామి (దంతములను) |
ఓం విఘ్ననేత్రే నమః | నేత్రే పూజయామి (కన్నులను) |
ఓం శూర్పకర్ణాయనమః | కర్ణౌ పూజయామి (చెవులను) |
ఓం ఫాలచంద్రాయనమః | లలాటం పూజయామి (నుదురును) |
ఓం నాగాభరణాయనమః | నాసికాం పూజయామి (ముక్కును) |
ఓం చిరంతనాయ నమః | చుబుకం పూజయామి (గడ్డము క్రింది భాగమును) |
ఓం స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠౌ పూజయామి (పై పెదవిని) |
ఓం గళన్మదాయ నమః | గండే పూజయామి (గండమును) |
ఓం కపిలాయ నమః | కచాన్ పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును) |
ఓం శివప్రియాయై నమః | శిరః పూజయామి (శిరస్సును) |
ఓం సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని పూజయామి (సర్వ అవయవములను) |

ఏకవింశతి పత్ర పూజ (౨౧ ఆకులు)
ఓం ఉమాపుత్రాయ నమః | మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
ఓం హేరంబాయ నమః | బృహతీపత్రం సమర్పయామి (నేలములక) |
ఓం లంబోదరాయ నమః | బిల్వపత్రం సమర్పయామి (మారేడు) |
ఓం ద్విరదాననాయ నమః | దూర్వాపత్రం సమర్పయామి (గరిక) |
ఓం ధూమకేతవే నమః | ధత్తూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త) |
ఓం బృహతే నమః | బదరీపత్రం సమర్పయామి (రేగు) |
ఓం అపవర్గదాయ నమః | అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
ఓం ద్వైమాతురాయ నమః | తులసీపత్రం సమర్పయామి (తులసి) |
ఓం చిరంతనాయ నమః | చూతపత్రం సమర్పయామి (మామిడి ఆకు) |
ఓం కపిలాయ నమః | కరవీరపత్రం సమర్పయామి (గన్నేరు) |
ఓం విష్ణుస్తుతాయ నమః | విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
ఓం ఏకదంతాయ నమః | దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ) |
ఓం అమలాయ నమః | ఆమలకీపత్రం సమర్పయామి (దేవదారు) |
ఓం మహతే నమః | మరువక పత్రం సమర్పయామి (మరువము) |
ఓం సింధూరాయ నమః | సింధువార పత్రం సమర్పయామి (వావిలి) |
ఓం గజాననాయ నమః | జాతీ పత్రం సమర్పయామి (జాజిపత్రి) |
ఓం గండగళన్మదాయ నమః | గండవీ పత్రం సమర్పయామి (తెల్లగరికె) |
ఓం శంకరప్రియాయ నమః | శమీ పత్రం సమర్పయామి (జమ్మి) |
ఓం భృంగరాజత్కటాయ నమః | అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి) |
ఓం అర్జునదంతాయ నమః | అర్జునపత్రం సమర్పయామి (మద్ది) |
ఓం అర్కప్రభాయ నమః | అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు) |

ఏకవింశతి పుష్ప పూజా – (౨౧ పుష్పాలు)
ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం మహా గణపతయే నమః | మందార పుష్పం సమర్పయామి |
ఓం ధీర గణపతయే నమః | దాడిమీ పుష్పం సమర్పయామి |
ఓం విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం సమర్పయామి |
ఓం ఆమోద గణపతయే నమః | అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి |
ఓం ప్రమథ గణపతయే నమః | పాటలీ పుష్పం సమర్పయామి |
ఓం రుద్ర గణపతయే నమః | ద్రోణ పుష్పం సమర్పయామి |
ఓం విద్యా గణపతయే నమః | ధత్తూర పుష్పం సమర్పయామి |
ఓం విఘ్న గణపతయే నమః | చంపక పుష్పం సమర్పయామి |
ఓం దురిత గణపతయే నమః | రసాల పుష్పం సమర్పయామి |
ఓం కామితార్థప్రద గణపతయే నమః | కేతకీ పుష్పం సమర్పయామి |
ఓం సమ్మోహ గణపతయే నమః | మాధవీ పుష్పం సమర్పయామి |
ఓం విష్ణు గణపతయే నమః | శమ్యాక పుష్పం సమర్పయామి |
ఓం ఈశ గణపతయే నమః | అర్క పుష్పం సమర్పయామి |
ఓం గజాస్య గణపతయే నమః | కల్హార పుష్పం సమర్పయామి |
ఓం సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా పుష్పం సమర్పయామి |
ఓం వీర గణపతయే నమః | బిల్వ పుష్పం సమర్పయామి |
ఓం కందర్ప గణపతయే నమః | కరవీర పుష్పం సమర్పయామి |
ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః | కుంద పుష్పం సమర్పయామి |
ఓం బ్రహ్మ గణపతయే నమః | పారిజాత పుష్పం సమర్పయామి |
ఓం జ్ఞాన గణపతయే నమః | జాతీ పుష్పం సమర్పయామి |

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)
ఓం గణాధిపాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం పాశాంకుశధరాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఆఖువాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం వినాయకాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఈశపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఏకదంతాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఇభవక్త్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం మూషకవాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కుమారగురవే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కపిలవర్ణాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం బ్రహ్మచారిణే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం మోదకహస్తాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సురశ్రేష్ఠాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం గజనాసికాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కపిత్థఫలప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం గజముఖాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సుప్రసన్నాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సురాగ్రజాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఉమాపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం స్కందప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళీ చూ. |

శ్రీ గణేశ అష్టోత్తరశతనామావళీ చూ. |

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి |

నైవేద్యం –
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ |
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |

తాంబూలం –
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి |

నీరాజనం –
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా |
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం –
గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన |
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ||
ఏకదంతైకవదన తథా మూషకవాహన |
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణం –
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ||
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం –
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి |

ప్రార్థన –
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ||
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ |
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |

రాజోపచార పూజా –
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఛత్రమాచ్ఛాదయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | చామరైర్వీజయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గీతం శ్రావయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | నృత్యం దర్శయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | వాద్యం ఘోషయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఆందోళికాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | అశ్వాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గజాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

పునరర్ఘ్యం –
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక |
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |

సమర్పణం –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

వినాయక వ్రతకథ చూ. |

విఘ్నేశ్వర దండకం, మంగళహారతులు చూ. |

Vinayaka Vrata Kalpam - వినాయక వ్రతకల్పం

 

Sri Vinayaka Vrata Kalpam (Part 1) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1)

విఘ్నేశ్వర పూజ


సూచనలు :

భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను.

పూజకు కావలిసిన సామాగ్రినంతను సిద్ధము చేసికొనవలెను. ఒక పళ్ళెములో పళ్ళు, పూలు, అక్షతలు, అగరువత్తులు, కర్పూరము ఉంచుకోవలెను. వినాయకునకు కుడుములు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ప్రీతికరమైనవి. వినాయకునకు సమర్పించు అరటిపళ్ళు కుడుములు మొదలుగున్నవి ౨౧ సంఖ్యగలవిగా సమర్పించుట శ్రేష్ఠము. లేనిచో యథాశక్తి సమర్పించవచ్చును.

మూడు చిన్న గిన్నెలను గాని గ్లాసులను గాని తీసుకొని మొదటిదానిలో పాద్యజలము, రెండవదానిలో ఆచమన జలము, మూడవదానిలో అర్ఘ్యజలమునుంచవలెను. అర్ఘ్యమిచ్చునప్పుడు ఏదైనా పండును తీసుకొని నీటితో కలిపి గిన్నెలో వదలవలెను. మధుపర్కము సమర్పించునపుడు తేనె, పాలు, నెయ్యి కలిపి వినాయకునకు చూపవలెను.

పంచామృత స్నానము చేయించునపుడు, తేనె, నెయ్యి, పటికబెల్లము, పెరుగు, పాలు కలిపి అయ్యవారి విగ్రహమునకు అభిషేకము చేయవలెను. శక్తియున్నవారు పాలు, పెరుగు, పండ్లరసము, గంధములు కూడా అభిషేకము చేయవచ్చును. ప్రతి అభిషేకము తరువాత శుద్ధోదక స్నానము చేయించవలెను. ప్రతి శ్లోకమును చదివి శ్లోకము దిగువ యిచ్చినట్లు ఉపచారములు చేయవలెను.

ఏకవింశతి పత్రములు –

వివిధ ఓషధులను గుర్తించుటకు భాద్రపదమాసము అనువైన కాలము. ఇరవై ఒక్క రకముల పత్రిని సేకరించుట అనగా ఇరవైఒక్క రకముల వనౌషధులతో పరిచితి ఏర్పరుచుకొనుటయే. ఓషధీ పరిజ్ఞానముకూడ అవసరమైన విద్యయే. సేకరించుట దేవపూజకు కాబట్టి శ్రద్ధతో జరుగును.

౧. సూచీ – అనగా కుశమ్, కుశదర్భ, బర్హి, సూచ్యగ్ర మున్నగునవి దీని పర్యాయ పదములు, శుభాశుభ కర్మలలో దీనిని హెచ్చుగా వాడెదరు.
౨. బృహతీ – నేలములక, పెద్దములక, వాకుడు మున్నగునవి యిందులో భేదములు.
౩. బిల్వ – మారేడు, శివునకు ప్రియమైనది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో సాటిలేనిది.
౪. దూర్వా – అనగా గరిక.
౫. దుత్తూర – ఉమ్మెత్త, విషాన్ని హరించడంలో పెట్టింది పేరు.
౬. బదరీ – రేగు.
౭. అపామార్గ – ఉత్తరేణి.
౮. తులసి – శివకేశవులకిద్దరకు ప్రీతికరమైనది.
౯. చూతపత్రం – మామిడి ఆకు.
౧౦. కరవీర – గన్నేరు, వాడగన్నేరు.
౧౧. విష్ణుక్రాంత – నీలవర్ణపు చిన్న చిన్న పూలు పూయును.
౧౨. దాడిమీ – దానిమ్మ
౧౩. దేవదారు – ఆకులు, చిన్నవిగా, గుండ్రంగా, సువాసన కలిగి ఉంటాయి.
౧౪. మరువక – మరువము, చక్కనివాసన గల పత్రములు కలది
౧౫. సింధువార – వావిలి.
౧౬. జాజిపత్ర – జాజిపత్రి, జాపత్రి ఒక చెట్టువే. జాజిపత్రి ఆకు, జాపత్రి కాయ మీదితొడుగు. పాఠభేదంతో మాలతీలతకు అర్థం చెప్పుకోవాలని కొందరు అంటున్నారు.
౧౭. గండవీ – తెల్లగరికె.
౧౮. శమీ – జమ్మి
౧౯. అశ్వత్థ – రావి.
౨౦. అర్జున – మద్ది.
౨౧. ఆర్కపత్రం – జిల్లేడు.
ఇట్లు ఇరవై ఒక్క పత్రములతో పూజ చేయవలెను. పూజకోసం సేకరిస్తూ పై ఓషధులతో పరిచితి చిన్ననాటనే ఏర్పరచుకోవడం బ్రతుకుతెరువు నేర్చుకొనడమే.

Puja Vidhanam - పూజావిధానం

 

Puja Vidhanam (Poorvangam – Smartha Paddhati) – పూజావిధానం (పూర్వాంగం – స్మార్తపద్ధతిః)



శ్రీమహాగణాధిపతయే నమః |
శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓమ్ |

శుచిః –
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ||

ప్రార్థనా –
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||

దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి |
సా నో॑ మ॒న్ద్రేష॒మూర్జ॒o దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు॑ ||

యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా |
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళమ్ ||

తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ |
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః |
ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ||

శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః |
ఉమామహేశ్వరాభ్యాం నమః |
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః |
శచీపురందరాభ్యాం నమః |
అరుంధతీవసిష్ఠాభ్యాం నమః |
శ్రీసీతారామాభ్యాం నమః |
మాతాపితృభ్యో నమః |
సర్వేభ్యో మహాజనేభ్యో నమః |

ఆచమ్య –
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అధోక్షజాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్రీకృష్ణాయ నమః |

దీపారాధనమ్ –
దీపస్త్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ ||
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||

భూతోచ్చాటనమ్ –
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా ||

ప్రాణాయామమ్ –
ఓం భూః ఓం భువ॑: ఓగ్‍ం సువ॑: ఓం మహ॑: ఓం జన॑: ఓం తప॑: ఓగ్‍ం సత్యమ్ |
ఓం తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ |
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృత॒o బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోమ్ ||

సంకల్పమ్ –
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే (*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రోద్భవస్య …… నామధేయస్య (మమ ధర్మపత్నీ శ్రీమతః …… గోత్రస్య …… నామధేయః సమేతస్య) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ ………. ఉద్దిశ్య శ్రీ ………. ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార* పూజాం కరిష్యే ||

(నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీమహాగణపతి పూజాం కరిష్యే |)

తదంగ కలశారాధనం కరిష్యే |

కలశారాధనమ్ –
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య |
కలశే ఉదకం పూరయిత్వా |
కలశస్యోపరి హస్తం నిధాయ |

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః |
మూలే త్వస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతా ||
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా |
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |

ఓం ఆక॒లశే”షు ధావతి ప॒విత్రే॒ పరి॑షిచ్యతే |
ఉ॒క్థైర్య॒జ్ఞేషు॑ వర్ధతే |

ఆపో॒ వా ఇ॒దగ్‍ం సర్వ॒o విశ్వా॑ భూ॒తాన్యాప॑:
ప్రా॒ణా వా ఆప॑: ప॒శవ॒ ఆపోఽన్న॒మాపోఽమృ॑త॒మాప॑:
స॒మ్రాడాపో॑ వి॒రాడాప॑: స్వ॒రాడాప॒శ్ఛందా॒గ్॒‍స్యాపో॒
జ్యోతీ॒గ్॒‍ష్యాపో॒ యజూ॒గ్॒‍ష్యాప॑: స॒త్యమాప॒:
సర్వా॑ దే॒వతా॒ ఆపో॒ భూర్భువ॒: సువ॒రాప॒ ఓమ్ ||

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ |
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ |
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ||

ఆయాంతు శ్రీ …….. పూజార్థం మమ దురితక్షయకారకాః |
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య,
దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ||

శంఖపూజా –
కలశోదకేన శంఖం పూరయిత్వా ||
శంఖే గంధకుంకుమపుష్పతులసీపత్రైరలంకృత్య ||

శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతామ్ |
పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||
త్రైలోక్యేయాని తీర్థాని వాసుదేవస్యదద్రయా |
శంఖే తిష్ఠంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే |
పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే ||
గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |
నవనాదేనపాతాళే పాంచజన్య నమోఽస్తు తే ||

ఓం శంఖాయ నమః |
ఓం ధవళాయ నమః |
ఓం పాంచజన్యాయ నమః |
ఓం శంఖదేవతాభ్యో నమః |
సకలపూజార్థే అక్షతాన్ సమర్పయామి ||

ఘంటపూజా –
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా |
ఘంటదేవతాభ్యో నమః |
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి |

ఘంటానాదమ్ –
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసామ్ |
ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనమ్ ||
ఇతి ఘంటానాదం కృత్వా ||

ఇప్పుడు  శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చేయండి.

Satyanarayana Vrata Kalpam Part - 2

Sri Satyanarayana Vrata Kalpam – Part 2 – శ్రీ సత్యనారాయణ పూజ – భాగం 2


(గమనిక: స్వామివారి ప్రతిమను ముందుగా పంచామృతాలతో అభిషేకము చేసి తరువాత పూజచేయవలెను)

పంచామృత శోధనం –
౧. ఆప్యాయస్యేతి క్షీరం (పాలు) –
ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
క్షీరేణ స్నపయామి ||

౨. దధిక్రావ్ణో ఇతి దధి (పెరుగు) –
ఓం ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
దధ్నా స్నపయామి ||

౩. శుక్రమసీతి ఆజ్యం (నెయ్యి) –
ఓం శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
ఆజ్యేన స్నపయామి ||

౪. మధువాతా ఋతాయతే ఇతి మధు (తేనె) –
ఓం మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వ॒గ్॒o రజ॑: |
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః |
మధునా స్నపయామి ||

౫. స్వాదుః పవస్యేతి శర్కరా (చక్కెర) –
ఓం స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
శర్కరేణ స్నపయామి ||

ఫలోదకం (కొబ్బరినీళ్ళు) –
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
ఫలోదకేన స్నపయామి ||

(ప్రతిమను బయటకు తీసి నీటితో శుభ్రపరుస్తూ ఇది చదవండి)
శుద్ధోదకం (నీళ్ళు) –
ఓం ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః |
శుద్ధోదకేన స్నపయామి |

(ప్రతిమను వస్త్రంతో తుడిచి, గంధం కుంకుమ పెట్టి, తమలపాకులో పెట్టి మంటపంలో కలశం దగ్గర పెట్టాలి)

ఓం నా॒రా॒య॒ణాయ॑ వి॒ద్మహే॑ వాసుదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ విష్ణుః ప్రచో॒దయా”త్ ||
ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్నీ చ॑ ధీమహి |
తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా”త్ ||

అస్మిన్కలశే అస్యాం ప్రతిమాయాం శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామిన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ప్రాణప్రతిష్ఠాపనం –
ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః, ఋగ్యజుస్సామాథర్వాణి ఛందాంసి, ప్రాణశ్శక్తిః, పరా దేవతా, ఆం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం, శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రాణప్రతిష్ఠార్థే వినియోగః |

కరన్యాసం –
ఓం ఆం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః |
ఓం క్రోం మధ్యమాభ్యాం నమః |
ఓం ఆం అనామికాభ్యాం నమః |
ఓం హ్రీం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం క్రోం కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసం –
ఓం ఆం హృదయాయ నమః |
ఓం హ్రీం శిరసే స్వాహా |
ఓం క్రోం శిఖయై వషట్ |
ఓం ఆం కవచాయ హుం |
ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్రోం అస్త్రాయ ఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||

ధ్యానం –
రక్తాంభోధిస్థపోతోల్లసదరుణసరోజాధిరూఢా కరాబ్జైః |
పాశం కోదండమిక్షూద్భవమళిగుణమప్యంకుశం చాపబాణామ్ |
బిభ్రాణా సృక్కపాలం త్రిణయనలసితా పీనవక్షోరుహాఢ్యా |
దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః |

ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

ఓం ఆం హ్రీం క్రోం క్రోం హ్రీం ఆం యం రం లం వం శం షం సం హం ళం క్షం హం సః సోఽహం |
అస్యాం మూర్తౌ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రాణః ఇహ ప్రాణః |
శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా జీవః ఇహః స్థితః |
అస్యాం మూర్తౌ శ్రీ రమాసహిత సత్యనారాయణస్య సర్వేంద్రియాణి వాఙ్మనః త్వక్ చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణిపాద పాయూపస్థాని ఇహైవాగత్య సుఖం చిరం తిష్టంతు స్వాహా |

ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితో భవ స్థాపితో భవ |
సుప్రసన్నో భవ వరదో భవ |

స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం |
తావత్త్వం ప్రీతిభావేన కలశేఽస్మిన్ సన్నిధిం కురు ||

సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ధ్యానం –
ధ్యాయేత్సత్యం గుణాతీతం గుణత్రయసమన్వితమ్ |
లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం ||
పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం |
గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరపి పూజితం ||
శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ధ్యానం సమర్పయామి ||

ఆవాహనం –
ఓం స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
జ్యోతిశ్శాంతం సర్వలోకాంతరస్థం
ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం |
సాంగం శక్తిం సాయుధం భక్తిసేవ్యం
సర్వాకారం విష్ణుమావాహయామి ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి |

ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
కల్పద్రుమూలే మణివేదిమధ్యే
సింహాసనం స్వర్ణమయం విచిత్రం |
విచిత్ర వస్త్రావృతమచ్యుత ప్రభో
గృహాణ లక్ష్మీధరణీసమేత ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆసనం సమర్పయామి |

పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
నారాయణ నమస్తేఽస్తు నరకార్ణవతారక |
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్థయ ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
వ్యక్తాఽవ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః |
మయా నివేదితో భక్త్యాహ్యర్ఘ్యోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం |
తదిదం కల్పితం దేవ సమ్యగాచమ్యతాం విభో ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |

పంచామృత స్నానం –
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః క్షీరేణ స్నపయామి |

ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః దధ్నా స్నపయామి |

శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆజ్యేన స్నపయామి |

మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్ పార్థి॑వ॒గ్॒oరజ॑: |
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః మధునా స్నపయామి |

స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః శర్కరేణ స్నపయామి |

యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఫలోదకేన స్నపయామి |

శుద్ధోదక స్నానం –
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః |

తీర్థోదకైః కాంచనకుంభ సంస్థైః
సువాసితైర్దేవ కృపారసార్ద్రైః |
మయార్పితం స్నానవిధిం గృహాణ
పాదాబ్జనిష్య్టూత నదీప్రవాహః |

నదీనాం చైవ సర్వాసామానీతం నిర్మలోదకం |
స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||

వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
వేదసూక్తసమాయుక్తే యజ్ఞసామ సమన్వితే |
సర్వవర్ణప్రదే దేవ వాస శీతే వినిర్మితే ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం |
గృహాణ భగవన్విష్ణో సర్వేష్టఫలదో భవ ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |

ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః |
సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః సర్వాభరణాని సమర్పయామి |

పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో |
మయాఽహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతామ్ |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథాంగ పూజ –
ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి |
ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి |
ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి |
ఓం అనఘాయ నమః జానునీ పూజయామి |
ఓం జనార్దనాయ నమః ఊరూ పూజయామి |
ఓం విష్టరశ్రవసే నమః కటిం పూజయామి |
ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి |
ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి |
ఓం లక్ష్మీవక్షస్స్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి |
ఓం శంఖచక్రగదాశార్ఙ్గపాణయే నమః బాహూన్ పూజయామి |
ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి |
ఓం పూర్ణేందునిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి |
ఓం కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి |
ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి |
ఓం రత్నకుండలాయ నమః కర్ణౌ పూజయామి |
ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి |
ఓం సులలాటాయ నమః లలాటం పూజయామి |
ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి |
శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి ||

అష్టోత్తరశతనామావళిః –
శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః చూ. |
(లేక)
శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిః చూ. |

ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం |
ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృత ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
ఘృతా త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం |
దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహం ||
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహి మాం నరకాద్ఘోరాత్ దీపజ్యోతిర్నమోఽస్తు తే ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః దీపం సమర్పయామి |

నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |

సౌవర్ణస్థాలిమధ్యే మణిగణఖచితే గోఘృతాక్తాన్ సుపక్వాన్ |
భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యానపరిమితరసాన్ చోష్యమన్నం నిధాయ ||
నానాశాకైరుపేతం దధి మధు స గుడ క్షీర పానీయయుక్తం |
తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి ||
రాజాన్నం సూప సంయుక్తం శాకచోష్య సమన్వితం |
ఘృత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ |
భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా |
ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపిధానమసి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి |
పాదౌ ప్రక్షాళయామి | ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
పూగీఫలైః స కర్పూరైః నాగవల్లీ దళైర్యుతం |
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |

నర్య॑ ప్ర॒జాం మే॑ గోపాయ | అ॒మృ॒త॒త్వాయ॑ జీ॒వసే” |
జా॒తాం జ॑ని॒ష్యమా॑ణాం చ | అ॒మృతే॑ స॒త్యే ప్రతి॑ష్ఠితామ్ |
అథ॑ర్వ పి॒తుం మే॑ గోపాయ | రస॒మన్న॑మి॒హాయు॑షే |
అద॑బ్ధా॒యోఽశీ॑తతనో | అవి॑షం నః పి॒తుం కృ॑ణు |
శగ్గ్ంస్య॑ ప॒శూన్మే॑ గోపాయ | ద్వి॒పదో॒ యే చతు॑ష్పదః || (తై.బ్రా.౧.౨.౧.౨౫)
అ॒ష్టాశ॑ఫాశ్చ॒ య ఇ॒హాగ్నే” | యే చైక॑శఫా ఆశు॒గాః |
సప్రథ స॒భాం మే॑ గోపాయ | యే చ॒ సభ్యా”: సభా॒సద॑: |
తాని॑న్ద్రి॒యావ॑తః కురు | సర్వ॒మాయు॒రుపా॑సతామ్ |
అహే॑ బుధ్నియ॒ మన్త్ర॑o మే గోపాయ | యమృష॑యస్త్రైవి॒దా వి॒దుః |
ఋచ॒: సామా॑ని॒ యజూగ్॑oషి | సా హి శ్రీర॒మృతా॑ స॒తామ్ || (తై.బ్రా.౧.౨.౧.౨౬)

మా నో హిగ్ంసీజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ |
అభిభ్ర దగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ ||
సమ్రాజం చ విరాజం చాఽభి శ్రీర్యాచ నో గృహే |
లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సగ్ం సృజామసి ||
సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ||

నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం |
తేజోరాశిమయం దత్తం గృహాణ త్వం సురేశ్వర ||

ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం –
ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |

మంత్రపుష్పం చూ. ||

ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సత్యేశ్వర |

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం |
సంసారసాగరాన్మాం త్వం ఉద్ధరస్య మహాప్రభో ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగముచ్యతే ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |

సర్వోపచారాః –
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

క్షమాప్రార్థన –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే |

అనయా పురుషసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామీ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

(కూర్చోండి)

ప్రార్థన –
అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం |
హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్ ||
స గుణం చ గుణాతీతం గోవిందం గరుఢధ్వజం |
జనార్దనం జనానందం జానకీవల్లభం హరిమ్ ||

ప్రణమామి సదా భక్త్యా నారాయణమతః పరం |
దుర్గమే విషమే ఘోరే శత్రుణా పరిపీడితః |
నిస్తారయతు సర్వేషు తథాఽనిష్టభయేషు చ |
నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సితమాప్నుయాత్ |
సత్యనారాయణ దేవం వందేఽహం కామదం ప్రభుం |
లీలయా వితతం విశ్వం యేన తస్మై నమో నమః ||

ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |

ఫలమ్ –
ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ |
తేన మే స ఫలాఽవాప్తిర్భవేజ్జన్మని జన్మని ||
ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఫలం సమర్పయామి |

(కథలు చదవండి)
కథలు చూ. ||

(కథల తర్వాత మంగళ నీరాజనం ఇవ్వండి. తరువాత తీర్థం, ఫలం, ప్రాసాదం స్వీకరించండి.)

అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం |
సమస్త పాపక్షయకరం శ్రీ సత్యనారాయణ పాదోదకం పావనం శుభం ||
శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ||

కలశోద్వాసన –
య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః |
తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ |
తే హ॒ నాక॑o మహి॒మాన॑: సచన్తే |
యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాః సన్తి॑ దే॒వాః ||
శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆవాహిత సర్వేభ్యో దేవేభ్యో నమః సర్వాభ్యో దేవతాభ్యో నమః యథా స్థానం ప్రవేశయామి ||
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

సమస్త సన్మంగళాని భవంతు ||
సర్వేజనాః సుఖినో భవంతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః |

స్వస్తి ||

Learn English Vocabulary & Help the Poor| Vocaulary |<><><><><>Free download annamayya annamacarya top popular audio video songs lyrics music sung by bala subrahmanyam murali krishna prasad mangalampalli priya sisters nitya santoshini sobha raju SP sailaja etc

 
google.com, pub-5837603693761062, DIRECT, f08c47fec0942fa0