paTTamu gaTTitiviMka bratukarayyA

ప|| పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా | చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా ||
చ|| అలమేలు మంగకు సింహాసనము నీవురము | కలిత హారములే సింగారపు దండలు |
తొలుత నీహస్తములే తోరణ గంభములు | చెలి రాజ్యమే నీవు శ్రీ వేంకటేశుడా ||
చ|| పరగు తులసీదండ పచ్చ తోరణమాపెకు | మెరుగు గౌస్తుభమణి మించుటద్దము |
గరిమ నీసొబగులు కప్పములు గానికలు | సిరులు నీ కూరిమలు శ్రీ వేంకటేశుడా ||
చ|| సంతతమైన విందులు సారె నీమోవి తేనెలు | వింత రతి భోగములు వినోదాలు |
కొంత నియ్యారును బొడ్డు కుంచెయు గాళాణి | చెంతలనన్నీ నమరె శ్రీ వేంకటేశుడా ||


pa|| paTTamu gaTTitiviMka bratukarayyA | ciTTakAlu lEvu mIku SrI vEMkaTESuDA ||
ca|| alamElu maMgaku siMhAsanamu nIvuramu | kalita hAramulE siMgArapu daMDalu |
toluta nIhastamulE tOraNa gaMBamulu | celi rAjyamE nIvu SrI vEMkaTESuDA ||
ca|| paragu tulasIdaMDa pacca tOraNamApeku | merugu gaustuBamaNi miMcuTaddamu |
garima nIsobagulu kappamulu gAnikalu | sirulu nI kUrimalu SrI vEMkaTESuDA ||
ca|| saMtatamaina viMdulu sAre nImOvi tEnelu | viMta rati BOgamulu vinOdAlu |
koMta niyyArunu boDDu kuMceyu gALANi | ceMtalanannI namare SrI vEMkaTESuDA ||

Sung by: Balakrishna Prasad
Note:poor quality in the first few seconds of the audio

Get this widget | Track details | eSnips Social DNA

pUjalaMdaru jEsEdE pushpayAgamu


పూజలందరు జేసేదే పుష్పయాగము
ఆజి నర్జునుడు చేసినది పుష్పయాగము

మొదల శ్రీసతి చేతి మోహన కమలమే
పొదల నీకెపుడును పుష్పయాగము
గుదిగొన మిమ్మిద్దరి గూడించే మరువిరులు
పొదిగి పూజించిన పుష్పయాగము

మాలాకారుడిచ్చిన మధురలో పూదండా
పోలింప నీకు నదె పుష్పయాగము
కేలితో నారదుడొసగిన పారిజాతము
భుఊలోకమున నీకు పుష్పయాగము

తొరలి అలమేల్మంగ తురుమున విరులే నీకు
పొరసి నీవురముపై పుష్పయాగము
సిరులతో మునులెల్ల శ్రీవేంకటాద్రీశ నీకు
పొరిపొరి జేసేరు పుష్పయాగము

pUjalaMdaru jEsEdE pushpayAgamu
Aji narjunuDu chEsinadi pushpayAgamu

modala SrIsati chEti mOhana kamalamE
podala nIkepuDunu pushpayAgamu
gudigona mimmiddari gUDimchE maruvirulu
podigi pUjiMchina pushpayAgamu

mAlAkAruDichchina madhuralO pUdaMDA
pOliMpa nIku nade pushpayAgamu
kElitO nAraduDosagina pArijAtamu
bhuUlOkamuna nIku pushpayAgamu

torali alamElmaMga turumuna virulE nIku
porasi nIvuramupai pushpayAgamu
sirulatO munulella SrIvEMkaTAdrISa nIku
poripori jEsEru pushpayAgamu

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

paripUrNagaruDAdripaMcAnanaM

ప|| పరిపూర్ణగరుడాద్రిపంచాననం | పరమం సేవే పంచాననం ||
చ|| కౄరదంష్ట్రాగ్నికణఘోరపంచాననం | పారీణచక్రధర పంచాననం |
వీరపంచాననం విజయపంచాననం | భారభూభారహరపంచాననం ||
చ|| దివిజపంచాననం తీవ్రనఖకాననం | భవనాశినీతీరపంచాననం |
కువలయాకాశసంఘోషపంచాననం | పవిశబ్దదంతరవపంచాననం ||
చ| శ్రీవేంకటాఖ్య ఘనశిఖరిపంచాననం | పావనం పంచముఖపంచాననం |
సేవితప్రహ్లాదసిద్ధిపంచాననం | భావితం శ్రీయుక్తపంచాననం ||


pa|| paripUrNagaruDAdripaMcAnanaM | paramaM sEvE paMcAnanaM ||
ca|| kRUradaMShTrAgnikaNaGOrapaMcAnanaM | pArINacakradhara paMcAnanaM |
vIrapaMcAnanaM vijayapaMcAnanaM | BAraBUBAraharapaMcAnanaM ||
ca|| divijapaMcAnanaM tIvranaKakAnanaM | BavanASinItIrapaMcAnanaM |
kuvalayAkASasaMGOShapaMcAnanaM | paviSabdadaMtaravapaMcAnanaM ||
ca| SrIvEMkaTAKya GanaSiKaripaMcAnanaM | pAvanaM paMcamuKapaMcAnanaM |
sEvitaprahlAdasiddhipaMcAnanaM | BAvitaM SrIyuktapaMcAnanaM ||


Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA


Sung by: Dr Pasupati

Get this widget | Track details | eSnips Social DNA

piluvarE kRShNuni pErukoni yiMtaTAnu


పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయ నిపుడు

వెన్నలారగించ(బోయి వీధులలో దిరిగీనో
యెన్నరాని యమునలో యీదులాడీనో
సన్నల సాందీపనితో చదువ(గ(బోయినాడో
చిన్నవాడాకలి గొనె చెలులాల యిపుడు

మగువల కా(గిళ్ళ మఱచి నిద్దిరించీనో
సొగిసి యావుల( గాచే చోట నున్నాడో
యెగువ నుట్లకెక్కి యింతులకు( జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయ నిపుడు

చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె ఇంటనున్నాడో
అందపు శ్రీవేంకటేశు( డాడివచ్చె నిదె వేడె
విందుల మాపొత్తుకు రా వేళాయ నిపుడు


piluvarE kRShNuni pErukoni yiMtaTAnu
polasi yAragiMchE poddAya nipuDu

vennalAragiMcha(bOyi vIdhulalO dirigInO
yennarAni yamunalO yIdulADInO
sannala sAMdIpanitO chaduva(ga(bOyinADO
chinnavADAkali gone chelulAla yipuDu

maguvala kA(giLLa ma~rachi niddiriMchInO
sogisi yAvula( gAchE chOTa nunnADO
yeguva nuTlakekki yiMtulaku( jikkinADO
sagamu vEDikUralu challanAya nipuDu

cheMdi nemali chuMgula siMgAriMchukonInO
iMdunE dEvaravale iMTanunnADO
aMdapu SrIvEMkaTESu( DADivachche nide vEDe
viMdula mApottuku rA vELAya nipuDu


Sung by: Anusuya Murthy & Tuned by:Chakrapani

Piluvarekrishnuni
Piluvarekrishnuni....
Hosted by eSnips

parama suj~nAnulaku prapannulaku

పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు
మరుగురుని మీదట మనసుండవలదా

ఆకలిగొన్నవానికి అన్నముపై నుండినట్టు
యేకట వుండవలదా యీశ్వరునిపై
కాకల విటులచూపు కాంతలపై నుండినట్టు
తేకువ నుండవలదా దేవునిమీదటను

పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు
కొసరే భక్తివలదా గోవిందునిపై
వెసదెరువరి తమి విడిదలపై నునట్టు
వసియించ వలదా శ్రీవల్లభుమీదను

వెప్పున ధనవంతుడు నిధి కాచియుందినట్టు
తప్పక శ్రీవేంకటేశు తగులవద్దా
అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్టు
యిప్పుడే వుండవలదా యీతని మీదనూ



parama suj~nAnulaku prapannulaku
maruguruni mIdaTa manasuMDavaladA

AkaligonnavAniki annamupai nuMDinaTTu
yEkaTa vuMDavaladA yISwarunipai
kAkala viTulachUpu kAMtalapai nuMDinaTTu
tEkuva nuMDavaladA dEvunimIdaTanu

pasibiDDalaku nAsa pAlachaMTipai nunnaTlu
kosarE bhaktivaladA gOviMdunipai
vesaderuvari tami viDidalapai nunaTTu
vasiyiMcha valadA SrIvallabhumIdanu

veppuna dhanavaMtuDu nidhi kAchiyuMdinaTTu
tappaka SrIvEMkaTESu tagulavaddA
appasamaina bhrama AlajAlAlakunnaTTu
yippuDE vuMDavaladA yItani mIdanU


Get this widget | Track details | eSnips Social DNA

parusamu sOkaka pasiDaunA

ప|| పరుసము సోకక పసిడౌనా | పురుషోత్తముడే బుద్ధిచ్చు గాక ||
చ|| భువి భోగములకు పుట్టిన దేహము | వివరపు మోక్షము వెదకీనా |
ఇవల సకలమును యేలేటి దేవుడు | తవిలి రక్షించుట ధర్మము గాక ||
చ| ఘనమగు సంసార కారణ జీవుడు | తన సుజ़్జానము తలచీనా |
వెనుక మునుప శ్రీ వేంకట పతియే | కనుగొని మమ్మిట గాచుట గాక ||


pa|| parusamu sOkaka pasiDaunA | puruShOttamuDE buddhiccu gAka ||
ca|| Buvi BOgamulaku puTTina dEhamu | vivarapu mOkShamu vedakInA |
ivala sakalamunu yElETi dEvuDu | tavili rakShiMcuTa dharmamu gAka ||
ca| Ganamagu saMsAra kAraNa jIvuDu | tana suj~jAnamu talacInA |
venuka munupa SrI vEMkaTa patiyE | kanugoni mammiTa gAcuTa gAka ||

Audio link Musicindiaonline: Malladi Brothers, Raga Kedaram

paratatwaM bagu bAluDu



పరతత్వం బగు బాలుడు
పరిపరివిధముల బాలుడు

చద్దులమూటలు చంకల వ్రేలెడి
ముద్దులపడుచుల మూకలతో
పెద్దరికంబున పేయల( గాచిన
బద్దులనటనల బాలుడూ

వెన్నలుదాకగ వేట్లాడుచును
సన్నపుబడుచుల సంగడిని
కన్నెలు దూరగ కలకల నవ్విన
పన్నిన మాయల బాలుడు

బచ్చన రూపుల పాయపుబడుచులు
నిచ్చలు కొలువగ నెమ్మదిని
నచ్చిన వేంకట నగమున నాడెడి
పచ్చిలపదకపు బాలుడు


paratatwaM bagu bAluDu
pariparividhamula bAluDu

chaddulamUTalu chaMkala vrEleDi
muddulapaDuchula mUkalatO
peddarikaMbuna pEyala( gAchina
baddulanaTanala bAluDU

vennaludAkaga vETlADuchunu
sannapubaDuchula saMgaDini
kannelu dUraga kalakala navvina
pannina mAyala bAluDu

bachchana rUpula pAyapubaDuchulu
nichchalu koluvaga nemmadini
nachchina vEMkaTa nagamuna nADeDi
pachchilapadakapu bAluDu


Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA