sakalaM hE saKi jAnAmi tata - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

One of the very few Srungara Keerthanams in Sanskrit.

ప|| సకలం హే సఖి జానామి తత | ప్రకట విలాసం పరమం ధధసే ||

చ|| అలిక మౄగమద మయ మషీకల నో- | జ్జ్వలతాం హే సఖి జానామి |
లలితం తవ పల్లవి తమనసి ని- | శ్చలతర మేఘ శ్యామం ధధసే ||
చ|| చారు కపోలస్థల కరాంచిత వి- | చారం హే సఖి జానామి |
నారాయణ మహినాయక శయనం | శ్రీ రమణం తవ చిత్తే ధధసే ||
చ|| ఘనకుచ శైలాగ్ర స్థిత విధుమణి | జననం హే సఖి జానామి |
కనదురసా వేంకట గిరిపతే | వినుత భోగసుఖ విభవం దధసే ||

pa|| sakalaM hE saKi jAnAmi tata | prakaTa vilAsaM paramaM dhadhasE ||
ca|| alika mRugamada maya maShIkala nO- | jjvalatAM hE saKi jAnAmi |
lalitaM tava pallavi tamanasi ni- | Scalatara mEGa SyAmaM dhadhasE ||
ca|| cAru kapOlasthala karAMcita vi- | cAraM hE saKi jAnAmi |
nArAyaNa mahinAyaka SayanaM | SrI ramaNaM tava cittE dhadhasE ||
ca|| Ganakuca SailAgra sthita vidhumaNi | jananaM hE saKi jAnAmi |

by Nayanatara Kosaraju, during 599th annamayya jayanti programs, Annamayyapuram.

Sakalamhesakhi_NayanataraKosaraju
Sakalamhesakhi_Nay...
Hosted by eSnips

Sakalam He Sakhi
Sakalam He Sakhi.f...
Hosted by eSnips


siMgAramUritivi cittaju guruDavu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ప||
సింగారమూరితివి చిత్తజు గురుడవు |
చక్కగ జూచేరు మిము సాసముఖా ||

చ||
పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి |
పూవులు ఆకసము మోప పూచిచల్లుచు |

దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా |
సావధానమగు నీకు సాసముఖా ||

చ||
అంగరంగవైభవాల అమరకామినులాడ |
నింగినుండి దేవతలు నినుజూడగా |

సంగీత తాళవాద్య చతురతలు మెరయ |
సంగడిదేలేటి నీకు సాసముఖా ||

చ||
పరగ కోనేటిలోన పసిడి మేడనుండి |
అరిది యిందిరయు నీవు ఆరగించి |

గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ |
సరవి నోలాడు సాసముఖా ||




pa||

siMgAramUritivi cittaju guruDavu |

cakkaga jUcEru mimu sAsamuKA ||


ca||

pUvula teppalamIda polatulu nIvunekki |

pUvulu Akasamu mOpa pUcicallucu |


dEvaduMduBulu mrOya dEvatalu koluvagA |

sAvadhAnamagu nIku sAsamuKA ||


ca||

aMgaraMgavaiBavAla amarakAminulADa |

niMginuMDi dEvatalu ninujUDagA |


saMgIta tALavAdya caturatalu meraya |

saMgaDidElETi nIku sAsamuKA ||


ca||

paraga kOnETilOna pasiDi mEDanuMDi |

aridi yiMdirayu nIvu AragiMci |


garima SrIvEMkaTESa kannula paMDuvakAga |

saravi nOlADu sAsamuKA ||

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA



satulAla chUDarE SrAvaNabahuLAshTami - Annamayya


సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి(
గతలాయ నడురేయి( గలిగె శ్రీకృషుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు




satulAla chUDarE SrAvaNabahuLAshTami(
gatalAya naDurEyi( galige SrIkRshuDu

puTTEyapuDE chaturbhujAlu SaMkhuchakrAlu
yeTTu dhariyiMchenE yI kRshNuDu
aTTe kirITamu nAbharaNAlu dhariMchi
yeTTA neduTa nunnADu yI kRshNuDu

vachchi brahmayu rudruDu vAkiTa nutiMchagAnu
yichchagiMchi vinuchunnA(DIkRshNuDu
muchchaTADI dEvakitO muMchi vasudEvunitO
hechchinamahimalatO yI kRshNuDu

koda dIra mari naMdagOpunaku yaSOdaku
idigO tA biDDADAye nIkRshNuDu
adana SrI vEMkaTESuDai yalamElmaMga(gUDi
yeduTanE niluchunnA DIkRshNuDu


siggari pendli kutura - సిగ్గరి పెండ్లి కూతుర


సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ
దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా

అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను
యెల్లినేడే పెండ్లాడీ నిదివో నిన్ను
యెల్లగా జనకుడు నిన్నిచ్చీనట వీడె
వెల్లవిరి నీమాట వినవమ్మా

అదె పెండ్లితెర యెత్తి రండనే వశిష్టుడుండి
చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా
మొదల రాముని కంటె ముంచి తలంబ్రాలు వోసి
సుదతి యాతని మోము చూడవమ్మా

కంకణదారాలు గట్టి కాలుదొక్కితివి మీరు
పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ
వుంకువ వావిలిపాట నుండి శ్రీవేంకటగిరి
తెంకుల నిన్ను గూడి తిరమాయనమ్మా


siggari peMDli kUtura sItamma
daggari siMgArabomma talavaMchakammA

allanADE rAGhavuDu harivillu virichenu
yellinEDE peMDlADI nidivO ninnu
yellagA janakuDu ninnichchInaTa vIDe
vellaviri nImATa vinavammA

ade peMDlitera yetti raMDanE vaSiShTuDuMDi
chadivI maMtrAlu sEsa challavammA
modala rAmuni kaMTe muMchi talaMbrAlu vOsi
sudati yAtani mOmu chUDavammA

kaMkaNadArAlu gaTTi kAludokkitivi mIru
poMkAna buvva maMdarO pottula namma
vuMkuva vAvilipATa nuMDi SrIvEMkaTagiri
teMkula ninnu gUDi tiramAyanammA


sumukha maMgaLamu - సుముఖ మంగళము

sumukha maMgaLamu - సుముఖ మంగళము | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

సుముఖ మంగళము జయమంగళము
శమదమగత తే జయమంగళం

గంభీరగుణ కమలారమణా
శంభురాని నుత సకళలోకయుత
మాంభజతే జయమంగళం
అంభోధిశయన హరినయనా

కనకాంబర నిజఘనచరణాంబర
దనుజగణ హతదైత్యగణా
అనుపమచరిత అనంత నిరత
సనకప్రియ తే జయ మంగళము

చతుర్భుజాంగా సదయా పాంగ
గతనక్రాంబుజకర చక్ర
శ్రితశరణాగత శ్రీవేంకటపతి
చతుర నమో తే జయమంగలం



sumukha maMgaLamu jayamaMgaLamu
Samadamagata tE jayamaMgaLaM

gaMbhIraguNa kamalAramaNA
SaMbhurAni nuta sakaLalOkayuta
mAMbhajatE jayamaMgaLam
aMbhOdhiSayana harinayanA

kanakAmbara nijaghanacharaNAMbara
danujagaNa hatadaityagaNA
anupamacharita anaMta nirata
sanakapriya tE jaya maMgaLamu

chaturbhujAMgA sadayA pAMga
gatanakrAMbujakara chakra
SritaSaraNAgata SrIvEMkaTapati
chatura namO tE jayamaMgalaM

sakalabalaMbulu nIvE - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు
అకలంకమగుసుఖమే అన్నిటనిదే నాకు

పొందుగ( జక్రాంకితమే బుజబల మిదే నాకు
అందినహరి నీచింతే ఆత్మబలము నాకు
సందడి( బేరుబలము కేశవనామము నాకు
యిందును నందును భవభయ మిక లేదిదే నాకు

అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు
సంగతి నీపై పాటలె సర్వబలి మిదే నాకు
రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు
యింగితముగ నిహపరముల కెదురే దిదే నాకు

కనుగొను నీవిగ్రహమే గ్రహబలి మిదే నాకు
విను నీదాసులసేవే వెనుబలిమిదె నాకు
తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు
ఘనమే చెప్పగ నింతటా కలిగెబో యిదే నాకు


In English:

sakalabalaMbulu nIvE sarwESwarA nAku
akalaMkamagusukhamE anniTanidE nAku

poMduga( jakrAMkitamE bujabala midE nAku
aMdinahari nIchiMtE Atmabalamu nAku
saMdaDi( bErubalamu kESavanAmamu nAku
yiMdunu naMdunu bhavabhaya mika lEdidE nAku

aMgapu tirumaNulivi paMchAMgabalamu nAku
saMgati nIpai pATale sarwabali midE nAku
raMguga nIguNarAsulE rAsibalamu nAku
yiMgitamuga nihaparamula kedurE didE nAku

kanugonu nIvigrahamE grahabali midE nAku
vinu nIdAsulasEvE venubalimide nAku
tanarina SrIvEMkaTapati daivabalamu nAku
ghanamE cheppaga niMtaTA kaligebO yidE nAku

Sung by Kum.Nayanatara Kosaraju, in Annamayyapuram, May2nd,07. as part of 599thAnnamacharya jayanti prog's.


Sakalabalambu_Nayanatara
Sakalabalambu_Naya...
Hosted by eSnips

Saranu saranu veda sastra nipuna - శరణు శరణు వేద శాస్త్ర నిపుణ


శరణు శరణు వేద శాస్త్రనిపుణ నీకు
అరుదైన రామ కార్యదురంధరా

హనుమంతరాయ అంజనాతనయా
ఘనవాయుసుత దివ్యకామరూప
అనుపమలంకాదహన వార్ధిలంఘన
జనసురనుత కలశాపురనివాస

రవితనయస(న?)చివ రావణవనాపహార
పవనవేగబలాఢ్య భక్తసులభ
భువనపూర్ణదేహా బుధ్ధివిశారద
జవసత్వవేగ కలశాపురనివాస

సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ
ఆతతప్రతాపశౌర్యా అసురాంతకా
కౌతుక శ్రీవేంకటేశు కరుణాసమేత
సాతకుంభవర్ణ కలశాపురనివాస

SaraNu SaraNu vEda SAstranipuNa nIku
arudaina rAma kAryaduraMdharA

hanumaMtarAya aMjanAtanayA
ghanavAyusuta divyakAmarUpa
anupamalaMkAdahana vArdhilaMghana
janasuranuta kalaSApuranivAsa

ravitanayasa(na?)chiva rAvaNavanApahAra
pavanavEgabalADhya bhaktasulabha
bhuvanapUrNadEhA budhdhiviSArada
javasatvavEga kalasApuranivAsa

sItASOkanASana saMjIvaSailAkarshaNa
AtatapratApaSauryA asurAMtakA
kautuka SrIvEMkaTESu karuNAsamEta
sAtakuMbhavarNa kalaSApura nivAsa