Imtaepo vaarivaari - ఇంతేపో వారివారి

రాగం:గుజ్జర

ఇంతేపో వారివారిహీనాధికములెల్ల పంతాన తా మేపాతిభాగ్యము నాపాటే।

అందరిలో దేవుడుండు అందధికులు గొందరు కొందరు హీనులై కుందుదు రింతే చెంది వీచేగాలొకటే చేనిపంటా నొకటే పొంది గట్టికొలుచుండి పొల్లు కడబడును।

పుట్టుగందరి కొకటే భూమిలో యేలికలును వెట్టిబంట్లు గొందరై వీగుదు రింతే చుట్టి వరి గురుమతో జొన్న గింజ సరిదూగు తెట్టెలై మేలొకటికి తీలొకటికాయ

కోరి శ్రీవేంకటపతికుక్షిలోనే లోకములు ఆరయ గిందెడు మీదెడై వున్నవింతే యీరీతి నితనిదాసు లెక్కిరి పొడవులకు తారి కిందికి దిగిరి దానవులై కొందరు

Raagam: Gujjara

Imtaepo vaarivaariheenaadhikamulella Pamtaana taa maepaatibhaagyamu naapaatae

Amdarilo daevudumdu amdadhikulu gomdaru Komdaru heenulai kumdudu rimtae Chemdi veechaegaalokatae chaenipamtaa nokatae Pomdi gattikoluchumdi pollu kadabadunu

Puttugamdari kokatae bhoomilo yaelikalunu Vettibamtlu gomdarai veegudu rimtae Chutti vari gurumato jonna gimja saridoogu Tettelai maelokatiki teelokatikaaya

Kori sreevaemkatapatikukshilonae lokamulu Aaraya gimdedu meededai vunnavimtae Yeereeti nitanidaasu lekkiri podavulaku Taari kimdiki digiri daanavulai komdaru

iMtE marEmilEdu - ఇంతే మరేమిలేదు

ప|| ఇంతే మరేమిలేదు యిందుమీదను | దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట ||

చ|| వుల్లములో నుండి దేహమొగి రక్షించేహారి- | నొల్లకున్న తన్ను దానొల్లకుండుట |

బల్లిదు డతని మానిపరుల వేడేదెల్లా | పొల్లకట్టు దంచిదంచి పోగుసేసుకొనుట ||

చ|| యెయ్యెడా బుణ్యఫలము లేమి గలిగిన హరి- | కియ్యకున్న నది దైవమియ్యకుండుట |

చెయ్యార నాతని కొప్పుసేయని భోగములెల్లా | చయ్యన జెరకుబిప్పి చవిగొనుట ||

చ|| శ్రీకాంతుడైనట్టి శ్రీవేంకటేశ్వరుని | జేకొంటె సిరులెల్లా జేకొనుట |

మేకులశ్రీహరినామమే నోరనుడుగుట | కైకొన్న యమృతపుగందు వగుట ||

pa|| iMtE marEmilEdu yiMdumIdanu | doMtulakarmAlu dummudUrupettuTa ||

ca|| vullamulO nuMDi dEhamogi rakShiMcEhAri- | nollakunna tannu dAnollakuMDuTa | ballidu Datani mAniparula vEDEdellA | pollakaTTu daMcidaMci pOgusEsukonuTa ||

ca|| yeyyeDA buNyaPalamu lEmi galigina hari- | kiyyakunna nadi daivamiyyakuMDuTa | ceyyAra nAtani koppusEyani BOgamulellA | cayyana jerakubippi cavigonuTa ||

ca|| SrIkAMtuDainaTTi SrIvEMkaTESvaruni | jEkoMTe sirulellA jEkonuTa | mEkulaSrIharinAmamE nOranuDuguTa | kaikonna yamRutapugaMdu vaguTa ||

iMtulAla cUDaramma - ఇంతులాల చూడరమ్మ

ప|| ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు | చెంత రమాదేవిగూడె శ్రీ నరసింహుడు ||

చ|| సరిగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ | సొరిదిమోములు తొంగి చూచుకొంటాను |

విరులచెండులగొని వేటులాడుకొంటాను | సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు ||

చ|| భవనాశిలోని నీరుపై జల్లులాడుకొంటాను | నవకపు సిరులను నవ్వుకొంటాను |

జవళిగెమ్మోవులు సన్నలజూపుకొంటాను | చివన నిందరినంటె శ్రీ నరసింహుడు ||

చ|| వేమరు దొడలెక్కుక వీడుదోడులాడుకొంటా | ప్రేమమున గౌగిళ్ళ బెనగుకొంటా |

ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి | శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుడు ||

pa|| iMtulAla cUDaramma iddaru jANalE vIru | ceMta ramAdEvigUDe SrI narasiMhuDu ||

ca|| sarigoMDa lekkukoni sarasamulADukoMTU | soridimOmulu toMgi cUcukoMTAnu | virulaceMDulagoni vETulADukoMTAnu | siritODa vihariMcI SrI narasiMhuDu ||

ca|| BavanASilOni nIrupai jallulADukoMTAnu | navakapu sirulanu navvukoMTAnu | javaLigemmOvulu sannalajUpukoMTAnu | civana niMdarinaMTe SrI narasiMhuDu ||

ca|| vEmaru doDalekkuka vIDudODulADukoMTA | prEmamuna gaugiLLa benagukoMTA | Amuka SrI vEMkaTAdri nauBaLAna niliciri | SrI mahAlakShmitODa SrI narasiMhuDu ||

iMtayu nImAyAmaya - ఇంతయు నీమాయామయ

ప|| ఇంతయు నీమాయామయ మేగతి దెలియగవచ్చును | దొంతిబెట్టినకుండలు తొడరినజన్మములు ||

చ|| కలలోపలి సంభోగము ఘనమగు సంపదలిన్నియు | వలలోపలి విడిపరుపులు వన్నెల విభవములు |

తలపున గలిగియు నిందునే తగులక పోదెవ్వరికిని | తెలిసిన దెలియదు యిదివో దేహరహస్యంబు ||

చ|| అద్దములోపలినీడలు అందరిదేహపు రూపులు | చద్దికివండిన వంటలు జంటగర్మములు |

పొద్దొకవిధమయి తోచును భువి నజ్ఞానాంబుధిలో- | నద్దినదిది దెలియగరా దంబుదముల మెఱిగు ||

చ|| మనసున దాగినపాలివి మదిగలకోరిక లిన్నియు | యిసుమున నిగిరిన నీళ్ళు యిల నాహారములు |

పనివడి శ్రీ వేంకటగిరిపతి నీ దాసులివిన్నియు- | కని మని విడిచిన మనుజుల కాయపుమర్మములు ||

pa|| iMtayu nImAyAmaya mEgati deliyagavaccunu | doMtibeTTinakuMDalu toDarinajanmamulu ||

ca|| kalalOpali saMBOgamu Ganamagu saMpadalinniyu | valalOpali viDiparupulu vannela viBavamulu |

talapuna galigiyu niMdunE tagulaka pOdevvarikini | telisina deliyadu yidivO dEharahasyaMbu ||

ca|| addamulOpalinIDalu aMdaridEhapu rUpulu | caddikivaMDina vaMTalu jaMTagarmamulu |

poddokavidhamayi tOcunu Buvi naj~jAnAMbudhilO- | naddinadidi deliyagarA daMbudamula merxigu ||

ca|| manasuna dAginapAlivi madigalakOrika linniyu | yisumuna nigirina nILLu yila nAhAramulu |

panivaDi SrI vEMkaTagiripati nI dAsulivinniyu- | kani mani viDicina manujula kAyapumarmamulu ||

iMtaTa: gAvagadE - ఇంతట: గావగదే

ఇంతట: గావగదే ఇందిరానాయక నన్ను
పంతాన గాకాసురని బాలించినట్లు ||

దించని పంచభూతాల దేహము మోచితిగాన
నించిన యజ్గ్యానమున నిన్ను నెరగ
పంచేంద్రియములచే బట్టు వడ్డవాడ గాన
యెంచరాని సాపములే యిన్నియు జేసితిని ||

మిన్నువంటి జఠరాగ్ని మింగి వున్నవాడగాన
కన్నవెల్లా వేడివేడి కిశ్టపడితి
పన్నిన సంసారపుబ్రమ బడ్డవాడగాన
అన్నిటా దేవతలకు సరిగాపవైతి ||

ఆతుమలో నీ వుండే భాగ్యము గలవాడగాన
చైతన్యమున నీకు శరణంటిని
నీతితో శ్రీఎంకటేశ నీ పాలివాడగాన
బాతితో సర్వము నీ కొప్పనము సేసితిని ||

iMtaTa: gAvagadE iMdirAnAyaka nannu
paMtAna gAkAsurani bAliMchinaTlu ||

diMchani paMchabhUtAla dEhamu mOchitigAna
niMchina yajgyAnamuna ninnu neraga
paMchEMdriyamulachE baTTu vaDDavADa gAna
yeMcharAni sApamulE yinniyu jEsitini ||

minnuvaMTi jaTharAgni miMgi vunnavADagAna
kannavellA vEDivEDi kishTapaDiti
pannina saMsArapubrama baDDavADagAna
anniTA dEvatalaku sarigApavaiti ||

AtumalO nI vuMDE bhAgyamu galavADagAna
chaitanyamuna nIku SaraNaMTini
nItitO SrIVeMkaTESa nI pAlivADagAna
bAtitO sarvamu nI koppanamu sEsitini ||


iMta sEsebO daiva - ఇంత సేసెబో దైవ

రాగం:కన్నడగౌళ

ఇంత సేసెబో దైవ మింతలోననే అయ్యొ
సంతపాకలంజ దెచ్చి సన్యాసి జేసె ||

పరిగెలేరేటివాని బట్టపురాజుగా
బిరతభోగములిచ్చి నిలిపినట్లు
ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు
అరయ నిత్తడి దెచ్చి యపరంజి జేసె ||

కుక్కలవండుకతినే కులహీనుని దెచ్చి
వెక్కసపుబాపని గావించినయట్లు
దిక్కులెఋఅగగ గష్టదేహిని నన్ను దెచ్చి
గక్కన దెలుకపిండి కస్తూరి సేసె ||

చెడుగైనదోమ దెచ్చి సింహపుగొదమగా
బెడిదంపు బ్రేమతోడ బెంచినయట్లు
కడునధముని వేంకటపతి నను నిటు
చిడిపిరాయి దెచ్చి చింతామణి సేసె ||

Raagam:kannaDagouLa

iMta sEsebO daiva miMtalOnanE ayyo
saMtapAkalaMja dechchi sanyAsi jEse ||

parigelErETivAni baTTapurAjugA
biratabhOgamulichchi nilipinaTlu
dharalOna natipAtakuni nannu niTlu
araya nittaDi dechchi yaparaMji jEse ||

kukkalavaMDukatinE kulahInuni dechchi
vekkasapubApani gAviMchinayaTlu
dikkuleRagaga gaShTadEhini nannu dechchi
gakkana delukapiMDi kastUri sEse ||

cheDugainadOma dechchi siMhapugodamagA
beDidaMpu brEmatODa beMchinayaTlu
kaDunadhamuni vEMkaTapati nanu niTu
chiDipirAyi dechchi chiMtAmaNi sEse ||

iMkAnEla chalamu - ఇంకానేల చలము

ఇంకానేల చలము యేమిసేయగలము
అంకెకు వచ్చెను అధరామ్రుత ఫలము ||

కలికి వనాలనీడగడు నీకెదురుచూడ
కులుకు నవ్వులతోడ గొప్పువీడ
చెలులెల్లా జూచేరు జిగి గొఊనిలసియాడ
బలిమి జేకొనవయ్య బత్తితోగూడ ||

సతి నీపాదాలు మెట్ట చన్నుల నీవు ముట్ట
తతి నిన్ను నిదె దిట్టతనాల దిట్ట
అతివలు సొలసేరు అంగాల జెమటదొట్ట
సతతము మెచ్చవయ్యా జాణలు చేపట్ట ||

జలజాక్శి నీపక్క సరసముల వేచొక్క
తలపోసీ దనచక్కదనాలు నిక్క
లాలి శ్రీవేంకటేశ నీలలని నీకు మొక్క
కకాలమేలు మిక్కడరతికెక్క ||
iMkAnEla chalamu yEmisEyagalamu
aMkeku vachchenu adharAmruta phalamu ||

kaliki vanAlanIDagaDu nIkeduruchUDa
kuluku navvulatODa goppuvIDa
chelulellA jUchEru jigi goUnilasiyADa
balimi jEkonavayya battitOgUDa ||

sati nIpAdAlu meTTa channula nIvu muTTa
tati ninnu nide diTTatanAla diTTa
ativalu solasEru aMgAla jemaTadoTTa
satatamu mechchavayyA jANalu chEpaTTa ||

jalajAkshi nIpakka sarasamula vEchokka
talapOsI danachakkadanAlu nikka
lAli SrIvEMkaTESa nIlalani nIku mokka
kakAlamElu mikkaDaratikekka ||