iTTi j~jAnamAtramuna - ఇట్టి జ్ఞానమాత్రమున

ప|| ఇట్టి జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే | పుట్టుగులు మరిలేవు పొందుదురు మొక్షము

చ|| అతిసూక్ష్మమీయాత్మ అందులో హరియున్నాడు | కతలే వినుటగాని కానరాదు |

క్షితిదేహాలు ప్రకృతిజెందిన వికారములు | మతినిది దెలియుటే మహిత జ్ఞానము ||

చ|| లోకము శ్రీపతియాజ్ఞలో తత్త్వాలిరువదినాల్గు | కైకొని సేతలు సేసీగర్తలు లేరు |

సాకిరింతే జీవుడు స్వతంత్రుడు దేవుడు | యీకొలది గని సుఖియించుటే సుజ్ఞానము ||

చ|| కాలము దైవము సృష్టి కలిమన్యుల భాగ్యము | వాలాయించి యెవ్వరికి వచింపరాదు | ఈలీలలు శ్రీవేంకటేశునివి ఆచార్యుడు | తాలిమి జెప్పగా విని తలంచుటే సుజ్ఞానము ||

pa|| iTTi j~jAnamAtramuna nevvarainA muktulE | puTTugulu marilEvu poMduduru mokShamu

ca|| atisUkShmamIyAtma aMdulO hariyunnADu | katalE vinuTagAni kAnarAdu |

kShitidEhAlu prakRutijeMdina vikAramulu | matinidi deliyuTE mahita j~jAnamu ||

ca|| lOkamu SrIpatiyAj~jalO tattvAliruvadinAlgu | kaikoni sEtalu sEsIgartalu lEru |

sAkiriMtE jIvuDu svataMtruDu dEvuDu | yIkoladi gani suKiyiMcuTE suj~jAnamu ||

ca|| kAlamu daivamu sRuShTi kalimanyula BAgyamu | vAlAyiMci yevvariki vaciMparAdu |

IlIlalu SrIvEMkaTESunivi AcAryuDu | tAlimi jeppagA vini talaMcuTE suj~jAnamu ||

iTuvalepO sakalamu - ఇటువలెపో సకలము

ప|| ఇటువలెపో సకలము యించుకగన భావించిన | అటమటములసంతోషము ఆసలుసేయుటలు ||

చ|| పగగొనితిరుగేటిజన్మపుబాధలు తన కేకాలము | తగుసుఖ మెక్కడ నున్నది తడతాకులేకాక |

పొగలోపల సెకగాసిన భుగభుగ గన్నుల నీళ్ళు | నిగిడినదుఃఖమేకాకిలు నిజసౌఖ్యము గలదా ||

చ|| పొలసినమాయపురూపులు పొలతులమచ్చికమాటలు | తలచిన తనకేమున్నది తలపోతలేకాక |

బలుపున బారగ మోహపుపాశము తనమేడ దగిలిన | తలకిందుగ బడుటెల్లను తనకిది ప్రియమౌనా ||

చ|| చేతిపదార్థము దలచక చేరువనుండినవారల- | చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా |

ఆతుమగలవేంకటపతి నాత్మ దలచి సుఖింపక | యేతరిసుఖముల దిరిగిన నింపులు దనకౌనా ||

pa|| iTuvalepO sakalamu yiMcukagana BAviMcina | aTamaTamulasaMtOShamu AsalusEyuTalu ||

ca|| pagagonitirugETijanmapubAdhalu tana kEkAlamu | tagusuKa mekkaDa nunnadi taDatAkulEkAka |

pogalOpala sekagAsina BugaBuga gannula nILLu | nigiDinaduHKamEkAkilu nijasauKyamu galadA ||

ca|| polasinamAyapurUpulu polatulamaccikamATalu | talacina tanakEmunnadi talapOtalEkAka |

balupuna bAraga mOhapupASamu tanamEDa dagilina | talakiMduga baDuTellanu tanakidi priyamaunA ||

ca|| cEtipadArthamu dalacaka cEruvanuMDinavArala- | cEtipadArthamu gOrina cEtiki lOnaunA |

AtumagalavEMkaTapati nAtma dalaci suKiMpaka | yEtarisuKamula dirigina niMpulu danakaunA ||

iTuvaMTivADu tAnu - ఇటువంటివాడు తాను

ప|| ఇటువంటివాడు తాను యెదురాడేనా నేను | చిటుకన జెప్పినట్టు సేసేనే తనకు ||

చ|| వినయము సేసే చోట వెంగెములాడగ రాదు | చనవిచ్చిన చోటును జరయరాదు |

మనసొక్కటైన చోట మంకులు చూపగరాదు | ననువులు గలిగితే నమ్మకుండరాదూ ||

చ|| ప్రియము చెప్పేయప్పుడు బిగిసె ననగరాదు | క్రియగల పొందులు తగ్గించగరాదు |

నయమిచ్చి మాటాడగా నవ్వక మానరాదు | దయతో దగులగాను దాగగరాదు ||

చ|| పచ్చిదేర గూడగాను పంతములుడుగరాదు | కచ్చుపెట్టి చెనకగా గాదనరాదు | ఇచ్చట శ్రీ వేంకటేశుడింతలోనే నన్నుగూడె | మెచ్చి సరస మాడగా మితిమీఱరాదు ||


pa|| iTuvaMTivADu tAnu yedurADEnA nEnu | ciTukana jeppinaTTu sEsEnE tanaku ||

ca|| vinayamu sEsE cOTa veMgemulADaga rAdu | canaviccina cOTunu jarayarAdu |

manasokkaTaina cOTa maMkulu cUpagarAdu | nanuvulu galigitE nammakuMDarAdU ||

ca|| priyamu ceppEyappuDu bigise nanagarAdu | kriyagala poMdulu taggiMcagarAdu |

nayamicci mATADagA navvaka mAnarAdu | dayatO dagulagAnu dAgagarAdu ||

ca|| paccidEra gUDagAnu paMtamuluDugarAdu | kaccupeTTi cenakagA gAdanarAdu |

iccaTa SrI vEMkaTESuDiMtalOnE nannugUDe | mecci sarasa mADagA mitimIrxarAdu ||

iTuvaMTi dAna nAkETi - ఇటువంటి దాన నాకేటి

ప|| ఇటువంటి దాన నాకేటి యలుకే | గట కట తేరాగా గాదనేనా నేను ||

చ|| మాటలాడ కుండు గాని, మనసు లోపల నైతే | నాటినది తనమీద నా చిత్తము |

కాటుక కన్నుల జూచి కసరుదుగాని నేను | వాటపు వలపు మీద వంతుబో లోలోనే ||

చ|| దగ్గరి రాకుందుగాని, తా నన్ను నంటినప్పుడే | వెగ్గళించి సిగ్గులెల్లా వీడ గలవే |

యెగ్గువట్టి వుందుగాని, యేపాటి నవ్వించినాను | అగ్గలపు సరసము లాడుదుబో నేను ||

చ|| నివ్వెర గందితిగాని, నేడు నన్ను గూడగాను | పవ్వళించి నప్పుడే పో పరవశము |

యివ్వల శ్రీ వేంకటేశుడేకతమాయ నాతోను | జవ్వన భారము చేత జడిసీబో తనువు ||

pa|| iTuvaMTi dAna nAkETi yalukE | gaTa kaTa tErAgA gAdanEnA nEnu ||

ca|| mATalADa kuMDu gAni, manasu lOpala naitE | nATinadi tanamIda nA cittamu |

kATuka kannula jUci kasarudugAni nEnu | vATapu valapu mIda vaMtubO lOlOnE ||

ca|| daggari rAkuMdugAni, tA nannu naMTinappuDE | veggaLiMci siggulellA vIDa galavE |

yegguvaTTi vuMdugAni, yEpATi navviMcinAnu | aggalapu sarasamu lADudubO nEnu ||

ca|| nivvera gaMditigAni, nEDu nannu gUDagAnu | pavvaLiMci nappuDE pO paravaSamu |

yivvala SrI vEMkaTESuDEkatamAya nAtOnu | javvana BAramu cEta jaDisIbO tanuvu ||

iTugana sakalOpAyamu - ఇటుగన సకలోపాయము

ప|| ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుడే రక్షకుడు |
తటుకున స్వతంత్రముడిగినయాత్మకు తగునిశ్చింతయే పరమసుఖము ||

చ|| ఆకటి కడుగనిశిశువుకు దల్లి యడిచిపాలు ద్రాగించినరీతి |
యీకడ గోరికలుడిగినయోగికి నీశ్వరుడే రక్షకుడు |
చేకొని బుద్దెరిగినబిడ్డలపై జింతింపరు తొల్లిటివలె దల్లులు |
యీకొలదులనే స్వయత్నదేహుల కీశ్వరుడును వాత్సల్యము వదలు ||

చ|| తతిగరిరాజు గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు |
హితమతి స్వతంత్రముడిగినయోగికి యీశ్వరుడే రక్షకుడు |
అతడును భస్మంబయ్యిననాడు అజునిశిరంబటు ద్రుంచిననాడు |
చతురుడు దానడ్డమురాడాయను స్వతంత్రముడుగని జీవుడుగాన ||

చ|| దిక్కని యనిశము జిత్తములోన జింతించేటి శరణాగతజనులకు |
యిక్కడనక్కడ శ్రీవేంకటాగిరియీశ్వరుడే రక్షకుడు |
మక్కువతో దనయంతర్యామిని మరచినస్వామిద్రోహులకెల్లా |
అక్కరతో బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన ||
pa|| iTugana sakalOpAyamu luDigina yISvaruDE rakShakuDu |
taTukuna svataMtramuDiginayAtmaku taguniSciMtayE paramasuKamu ||

ca|| AkaTi kaDuganiSiSuvuku dalli yaDicipAlu drAgiMcinarIti |
yIkaDa gOrikaluDiginayOgiki nISvaruDE rakShakuDu |
cEkoni budderiginabiDDalapai jiMtiMparu tolliTivale dallulu |
yIkoladulanE svayatnadEhula kISvaruDunu vAtsalyamu vadalu ||

ca|| tatigarirAju gAcinayaTlu draupadimAnamu gAcinayaTlu |
hitamati svataMtramuDiginayOgiki yISvaruDE rakShakuDu |
ataDunu BasmaMbayyinanADu ajuniSiraMbaTu druMcinanADu |
caturuDu dAnaDDamurADAyanu svataMtramuDugani jIvuDugAna ||

ca|| dikkani yaniSamu jittamulOna jiMtiMcETi SaraNAgatajanulaku |
yikkaDanakkaDa SrIvEMkaTAgiriyISvaruDE rakShakuDu |
makkuvatO danayaMtaryAmini maracinasvAmidrOhulakellA |
akkaratO buTTugulE BOgyaM bahaMkAramu viDuvarugAna ||

iTu garuDani nI - ఇటు గరుడని నీ

ప|| ఇటు గరుడని నీ వెక్కినను | పటపట దిక్కులు బగ్గన బగిలె ||

చ|| ఎగసినగరుడని యేపున ’థా’యని | జిగిదొలకచబుకు చేసినను |

నిగమాంతంబులు నిగమసంఘములు | గగనము జగములు గడ గడ వడకె ||

చ|| బిరుసుగ గరుడని పేరెము దోలుచు | బెరసి నీవు కోపించినను |

సరుస నిఖిలములు జర్జరితములై | తెరుపున నలుగడ దిరదిర దిరిగె ||

చ|| పల్లించిననీపసిడిగరుడనిని | కెల్లున నీ వెక్కినయపుడు |

ఝల్లనె రాక్షససమితి నీమహిమ- | వెల్లి మునుగుదురు వేంకటరమణా ||

pa|| iTu garuDani nI vekkinanu | paTapaTa dikkulu baggana bagile ||

ca|| egasinagaruDani yEpuna 'ThA'yani | jigidolakacabuku cEsinanu |

nigamAMtaMbulu nigamasaMGamulu | gaganamu jagamulu gaDa gaDa vaDake ||

ca|| birusuga garuDani pEremu dOlucu | berasi nIvu gOpiMcinanu |

sarusa niKilamulu jarjaritamulai | terupuna nalugaDa diradira dirige ||

ca|| palliMcinanIpasiDigaruDanini | kelluna nI vekkinayapuDu |

Jallane rAkShasasamiti nImahima- | velli munuguduru vEMkaTaramaNA ||

iTa mIda kaDamellA - ఇట మీద కడమెల్లా

ప|| ఇట మీద కడమెల్లా నిక నీవు దీర్చవయ్యా | పటుకున జెలి నీకు బాలుపెట్టీ నిదిగో ||

చ|| నెలత మంచముపై కిన్నెర వాయించి వాయించి | తలకొని నీవురాగా దలవంచెను |

సొలసి చెలులతోడ సుద్దులు దాజెప్పి చెప్పి | చెలగి నీమోము చూచి సిగ్గువడీ నిదిగో ||

చ|| పడతి నీమీది పాట పాడిపాడి అర్థము నీ- | వడిగితే నవ్వలి మోమై నవ్వీని |

అడియాలముల రూపు అద్దములో జూచి చూచి | కడు నీవు కొంగు వట్టగా భ్రమసీని ||

చ|| సతి యేకతాన నుండి జవ్వాది పూసి పూసి | రతి నీవు గూడగా సరసమాడీని |

ఇతవైన శ్రీ వేంకటేశ నీవాపె గూడగా | పతి చూచి యిప్పుడిట్టె పక్కున నవ్వీని ||

pa|| iTa mIda kaDamellA nika nIvu dIrcavayyA | paTukuna jeli nIku bAlupeTTI nidigO ||

ca|| nelata maMcamupai kinnera vAyiMci vAyiMci | talakoni nIvurAgA dalavaMcenu |

solasi celulatODa suddulu dAjeppi ceppi | celagi nImOmu cUci sigguvaDI nidigO ||

ca|| paDati nImIdi pATa pADipADi arthamu nI- | vaDigitE navvali mOmai navvIni |

aDiyAlamula rUpu addamulO jUci cUci | kaDu nIvu koMgu vaTTagA BramasIni ||

ca|| sati yEkatAna nuMDi javvAdi pUsi pUsi | rati nIvu gUDagA sarasamADIni |

itavaina SrI vEMkaTESa nIvApe gUDagA | pati cUci yippuDiTTe pakkuna navvIni ||