iMdukEpOveragayyI - ఇందుకేపోవెరగయ్యీ

ప|| ఇందుకేపోవెరగయ్యీ నేమందును | కందులేని నీమహిమ కొనియాడగలనా ||

చ|| అటుదేవతలకెల్ల నమృతమిచ్చిననీవు | యిటు వెన్న దొంగిలుట కేమందును |

పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు | నట రోలగట్టవడ్డచందాన కేమందును ||

చ|| కలిగి యాకరిరాజు గరుణ గాచిననీవు | యిల నావుల గాచుట కేమందును |

తలవ బ్రహ్మాదిదేవతలకు జిక్కనినీవు | చెలులకాగిళ్ళకు జిక్కితి వేమందును ||

చ|| భావించ నన్నిటికికంటే బరమమూర్తివి నీవు | యీవల బాలుడవైతి వేమందును |

కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని | శ్రీవేంకటాద్రినిలిచితి వేమందును ||

pa|| iMdukEpOveragayyI nEmaMdunu | kaMdulEni nImahima koniyADagalanA ||

ca|| aTudEvatalakella namRutamiccinanIvu | yiTu venna doMgiluTa kEmaMdunu |

paTugati balIMdruni baMdhiMcinaTTi nIvu | naTa rOlagaTTavaDDacaMdAna kEmaMdunu ||

ca|| kaligi yAkarirAju garuNa gAcinanIvu | yila nAvula gAcuTa kEmaMdunu |

talava brahmAdidEvatalaku jikkaninIvu | celulakAgiLLaku jikkiti vEmaMdunu ||

ca|| BAviMca nanniTikikaMTE baramamUrtivi nIvu | yIvala bAluDavaiti vEmaMdunu | kAviMci brahmAMDAlu kaDupuna niDukoni | SrIvEMkaTAdriniliciti vEmaMdunu ||

iMdukEnA viBuDu - ఇందుకేనా విభుడు

ప|| ఇందుకేనా విభుడు నీయింట నెలకొన్నాడు | కందువెఱుగుదువు యీకత నీవే నేర్తువే ||

చ|| నయమెంత గలిగినా ననుపులకే మేలు | ప్రియమెంత గలిగినా పెనపులకే మేలు |
జయమెంత గలిగినా చనవులకే మేలు | క్రియలెఱుగుదువు యీకీలు నీవే నేర్తువే ||

చ|| మొగమెంత చూచినా మోహానకే మూలము | తగవెంత నెరపినా తగులుకే మూలము |
నగవెంత గలిగినాను నమ్మికలకు మూలము | పగటెరుగుదువు యీపాడి నీవే నేర్తువే ||

చ|| వూడిగ మెంతసేసినా వొద్దికలకే దాపు | వేడుకెంత నిలిపినా విఱ్ఱవీగుటకే దాపు |
కూడితివిన్ని చందాల కోరిక శ్రీ వేంకటేశు | జాడెఱుగుదువు సరసము సరసము నీవే నేర్తువు ||

pa|| iMdukEnA viBuDu nIyiMTa nelakonnADu | kaMduverxuguduvu yIkata nIvE nErtuvE ||

ca|| nayameMta galiginA nanupulakE mElu | priyameMta galiginA penapulakE mElu | jayameMta galiginA canavulakE mElu | kriyalerxuguduvu yIkIlu nIvE nErtuvE ||

ca|| mogameMta cUcinA mOhAnakE mUlamu | tagaveMta nerapinA tagulukE mUlamu | nagaveMta galiginAnu nammikalaku mUlamu | pagaTeruguduvu yIpADi nIvE nErtuvE ||

ca|| vUDiga meMtasEsinA voddikalakE dApu | vEDukeMta nilipinA virxrxavIguTakE dApu | kUDitivinni caMdAla kOrika SrI vEMkaTESu | jADerxuguduvu sarasamu sarasamu nIvE nErtuvu ||

iMdukEkAbOlu nIvu - ఇందుకేకాబోలు నీవు

ప|| ఇందుకేకాబోలు నీవు యిట్టే యవధరించేవు | కందువ లన్నియు నీమై గనియైనట్లుండె ||

చ|| హరి నీవు కప్పురకా పవధరించేవేళ | విరివిగా నిందరు భావించి చూచితే |

తరుణులనవ్వులెల్లా దట్టమై నీమేనిమీద | పెరిగిపెరిగి యట్టే పేరినయట్లుండె ||

చ|| భువనేశ నీవు తట్టుపుణుగు చాతుకొనగ | యివల నీదాసులెల్లా నెంచిచూచితే |

కవగూడి నీసతులకనుచూపులెల్లాను | తివిరి నీమేనిమీద తిరమైనట్లుండె ||

చ|| శ్రీవేంకటేశ నీచెలి యలమేల్మంగతో | తావున మెరసేది నే దలిచితేను |

కోవరపుగొల్లెతల గుబ్బలకుంకుమనిగ్గు | వేవేలయి నీయందచ్చు వేసినయట్లుండె ||

pa|| iMdukEkAbOlu nIvu yiTTE yavadhariMcEvu | kaMduva lanniyu nImai ganiyainaTluMDe ||

ca|| hari nIvu kappurakA pavadhariMcEvELa | virivigA niMdaru BAviMci cUcitE |

taruNulanavvulellA daTTamai nImEnimIda | perigiperigi yaTTE pErinayaTluMDe ||

ca|| BuvanESa nIvu taTTupuNugu cAtukonaga | yivala nIdAsulellA neMcicUcitE |

kavagUDi nIsatulakanucUpulellAnu | tiviri nImEnimIda tiramainaTluMDe ||

ca|| SrIvEMkaTESa nIceli yalamElmaMgatO | tAvuna merasEdi nE dalicitEnu |

kOvarapugolletala gubbalakuMkumaniggu | vEvElayi nIyaMdaccu vEsinayaTluMDe ||

iMdukugA nAyeragami - ఇందుకుగా నాయెరగమి

ప|| ఇందుకుగా నాయెరగమి నేమని దూరుదును | అందియు నినునే దెలియక అయ్యోనేనిపుడు ||

చ|| ఆతుమ లోన నుండి యఖిలోపాయములు | చేతనునకు నీవే చింతించగాను |

కాతుర పడి నేను కర్తననుచు బనులు | యాతల జెప్పగబూనే విస్సిరో ||

చ|| తనువిటు నీవొసగి తగుభాగ్యము నీవై | అనువుగ జీవునినీ యటు నీవేలగను |

తనియక నేనొరులు దాతలనుచుబోయి | కనుగొని వేడగ దొడగేకటకటా ||

చ|| శ్రీ వేంకటాద్రిపై నుండి చేరి కన్నులెదుటను | సేవగొని యిటేకృపసేయ గాను |

సేవలగన్న వారెల్ల జుట్టములంట నేను | జీవులతోబొందు సేసేజెల్లబో ||

pa|| iMdukugA nAyeragami nEmani dUrudunu | aMdiyu ninunE deliyaka ayyOnEnipuDu ||

ca|| Atuma lOna nuMDi yaKilOpAyamulu | cEtanunaku nIvE ciMtiMcagAnu |

kAtura paDi nEnu kartananucu banulu | yAtala jeppagabUnE vissirO ||

ca|| tanuviTu nIvosagi taguBAgyamu nIvai | anuvuga jIvuninI yaTu nIvElaganu |

taniyaka nEnorulu dAtalanucubOyi | kanugoni vEDaga doDagEkaTakaTA ||

ca|| SrI vEMkaTAdripai nuMDi cEri kannuleduTanu | sEvagoni yiTEkRupasEya gAnu |

sEvalaganna vArella juTTamulaMTa nEnu | jIvulatOboMdu sEsEjellabO ||

Imdukamtae mari - ఇందుకంటే మరి

రాగం: బౌళి

ఇందుకంటే మరి యికలేదు హితోపదేశము వోమనసా అంది సర్వసంపన్నుడు దేవుడు అతనికంటే నేరుతుమా

కల దొకటే ధర్మము కల్పాంతమునకు నిలిచినది తలకక మీశరణుచొచ్చి మీదాసుడ ననెడి దొకమాట వలవనిజోలే యింతాను వడి నిదిగాక యేమిసేసినను సులభ మిందునే తొల్లిటివారలు చూరలు గొని రదేమోక్షంబు

మొదలొకటే యిన్నిటికి ముందర వెనకా వచ్చేది వొదుగుచు గోవిందునిదాసులకు నొక్కమాటే మొక్కినజాలు తుదకెక్కనివే యితరములు దొరకొని మరేమిసేసినను బదికి లిరిందునే పరమవైష్ణవులు పలుచదువులలో వినరాదా

తగులొకటే విడువరానిది తతి నెన్నటికిని జెడనిది వొగి శ్రీవేంకటపతినామజపము వొకమాటే అబ్బిన జాలు నగుబాటే యింతాను నానాటి కేమేమిసేసినను తగునీబుద్దుల నడచిరి మున్నిటిదైవజ్ఞులు పూర్వాచార్యులును

Raagam: Bauli

Imdukamtae mari yikalaedu hitopadaesamu vomanasaa Amdi sarvasampannudu daevudu atanikamtae naerutumaa

Kala dokatae dharmamu kalpaamtamunaku nilichinadi Talakaka meesaranuchochchi meedaasuda nanedi dokamaata Valavanijolae yimtaanu vadi nidigaaka yaemisaesinanu Sulabha mimdunae tollitivaaralu chooralu goni radaemokshambu

Modalokatae yinnitiki mumdara venakaa vachchaedi Voduguchu govimdunidaasulaku nokkamaatae mokkinajaalu Tudakekkanivae yitaramulu dorakoni maraemisaesinanu Badiki lirimdunae paramavaishnavulu paluchaduvulalo vinaraadaa

Tagulokatae viduvaraanidi tati nennatikini jedanidi Vogi sreevaemkatapatinaamajapamu vokamaatae abbina jaalu Nagubaatae yimtaanu naanaati kaemaemisaesinanu Taguneebuddula nadachiri munnitidaivaj~nulu poorvaachaaryulunu

iMdu nuMDi mIkeDa - ఇందు నుండి మీకెడ

ప|| ఇందు నుండి మీకెడలేదు | సందడి సేయక చనరో మీరు ||

చ|| నాలుక శ్రీహరి నామంబున్నది | తూలుచు బారరొ దురితముల |

చాలి భుజంబున చక్రంబున్న | తారిమి భవబంధములటు తొలగరో ||

చ|| అంతర్యామై హరి వున్నాడిదె | చింతలు వాయరొ చిత్తమున |

వింతలు జెవులను విష్ణుకథలివిగొ | పొంత గర్మములు పోరో మీరు ||

చ|| కాపయి శ్రీ వేంకటపతి పేరిదె | నాపై నున్నది నయమునను |

కోప(పు) కామాది గుణములాల మీ- | రేపున కడగడ నెందైన బోరొ ||

pa|| iMdu nuMDi mIkeDalEdu | saMdaDi sEyaka canarO mIru ||

ca|| nAluka SrIhari nAmaMbunnadi | tUlucu bAraro duritamula |

cAli BujaMbuna cakraMbunna | tArimi BavabaMdhamulaTu tolagarO ||

ca|| aMtaryAmai hari vunnADide | ciMtalu vAyaro cittamuna |

viMtalu jevulanu viShNukathalivigo | poMta garmamulu pOrO mIru ||

ca|| kApayi SrI vEMkaTapati pEride | nApai nunnadi nayamunanu |

kOpa(pu) kAmAdi guNamulAla mI- | rEpuna kaDagaDa neMdaina bOro ||

iMdirApatimAyalu - ఇందిరాపతిమాయలు

ప|| ఇందిరాపతిమాయలు యింతులు సుండీ | మందలించి హరి గొల్చి మనుదురుగాని ||

చ|| అతివలచూపులే ఆయాలు దాకీ జుండీ | జితమైనపులకల జిల్లులౌజుండీ |

రతిపరవశములు రాగినమూర్ఛలు సుండీ | మతిలో దప్పించుక మనుదురుగాని ||

చ|| మెఱయించేచన్నులే మించుబెట్లగుండ్లు సుండీ | మెరగుమోపులే మచ్చుమేపులు సుండీ |

మఱి మంచిమాటలు మాయపుటురులు సుండీ | మఱవక తప్పించుక మనుదురుగాని ||

చ|| బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీ | వెలలేని వలపులు విషము సుండీ |

యెలమితో శ్రీవేంకటేశ్వరుమఱుగు చొచ్చి | మలయుచు సొలయుచు మనుదురుగాని ||

pa|| iMdirApatimAyalu yiMtulu suMDI | maMdaliMci hari golci manudurugAni ||

ca|| ativalacUpulE AyAlu dAkI juMDI | jitamainapulakala jillulaujuMDI |

ratiparavaSamulu rAginamUrCalu suMDI | matilO dappiMcuka manudurugAni ||

ca|| merxayiMcEcannulE miMcubeTlaguMDlu suMDI | meraxgumOpulE maccumEpulu suMDI |

marxi maMcimATalu mAyapuTurulu suMDI | marxavaka tappiMcuka manudurugAni ||

ca|| balusaMsArapupoMdu pAmutODipottu suMDI | velalEni valapulu viShamu suMDI |

yelamitO SrIvEMkaTESvarumarxugu cocci | malayucu solayucu manudurugAni ||