iMdumIda satibhAva - ఇందుమీద సతిభావ

ఇందుమీద సతిభావ మెట్లౌనో యేమౌనో
విందుగా జెలువునికి విన్నవించరే ||

కోవిలకూతకుగానే గుండె జల్లురని చెలి
పూవక పూచిన యట్టు పులకించె
మావినుండి యంతలోనే మదన భూతముసోకె
పోవులైన పుప్పొడినే పోయరే బడిమి ||

కోమలి చందురుడనే కొరవిదయ్యము జూచి
దీమన మింతయు మాని దిగులందెను
తేమలైన వెన్నెలల దిమ్మువట్టి నిలువున
మైమఅచె గప్పురాన మంత్రించరే ||

ఇంతలో శ్రీవేంకటేశుడిందుకు విచ్చేయగాను
చింతదీర మేనెల్ల జెమరించెను
వింతలైన రతులలొ విరహపు సోకు వాసె
కంతు చిగురాకు రక్షగట్టరే యంగనకు ||
iMdumIda satibhAva meTlounO yEmaunO
viMdugA jeluvuniki vinnaviMcharE ||

kOvilakUtakugAnE guMDe jallurani cheli
pUvaka pUchina yaTTu pulakiMche
mAvinuMDi yaMtalOnE madana bhUtamusOke
pOvulaina puppoDinE pOyarE baDimi ||

kOmali chaMduruDanE koravidayyamu jUchi
dImana miMtayu mAni digulaMdenu
tEmalaina vennelala dimmuvaTTi niluvuna
maimaRache gappurAna maMtriMcharE ||

iMtalO SrIvEMkaTESuDiMduku vichchEyagAnu
chiMtadIra mEnella jemariMchenu
viMtalaina ratulalo virahapu sOku vAse
kaMtu chigurAku rakShagaTTarE yaMganaku ||

iMdunuMDa mIkeDa - ఇందునుండ మీకెడ

ప|| ఇందునుండ మీకెడ లేదు | సందడిసేయక చనరో మీరు ||

చ|| నాలుక శ్రీహరినామంబున్నది | తూలుచు బారరో దురితములు |

చాలి భుజంబున చక్రంబున్నది | తాలిమి భవబంధము లటుదలరో ||

చ|| అంతర్యామై హరి వున్నాడిదె | చింతలు వాయరొ చిత్తమున |

వింతల జెవులను విష్ణుకథ లివిగొ | పొంత గర్మములు పోరో మీరు ||

చ|| కాపయి శ్రీవేంకటపతి పేరిదె | నాపై నున్నది నయమునను |

కోపపు కామాది గుణములాల మీ- | రేపున కడగడ నెందైన బోరో ||

pa|| iMdunuMDa mIkeDa lEdu | saMdaDisEyaka canarO mIru ||

ca|| nAluka SrIharinAmaMbunnadi | tUlucu bArarO duritamulu |

cAli BujaMbuna cakraMbunnadi | tAlimi BavabaMdhamu laTudalarO ||

ca|| aMtaryAmai hari vunnADide | ciMtalu vAyaro cittamuna |

viMtala jevulanu viShNukatha livigo | poMta garmamulu pOrO mIru ||

ca|| kApayi SrIvEMkaTapati pEride | nApai nunnadi nayamunanu |

kOpapu kAmAdi guNamulAla mI- | rEpuna kaDagaDa neMdaina bOrO ||

iMdunaMdu dirugucu - ఇందునందు దిరుగుచు

ప|| ఇందునందు దిరుగుచు నెవ్వరివాడవుగాక | బందెపసరమువైతి బాపు జీవుడా ||

చ|| తోలుబొక్కలోన జొచ్చి తూలేటియాకలిచేత | పాలుమాలి యిందరికి బంటుబంటవై |

యేలినవాని గానక యేచినయాసలవెంట | కూలికిబో దొరకుంటి కూళజీవుడా ||

చ|| తీటమేనిలోన జొచ్చి దిమ్మరిదొంగలచేత | మూటగట్టించుక నీవు మూలదొరవై |

గాటపువిభునిచేతిఘనత కోరికలకు | వేటకుక్కవైతివి వెర్రిజీవుడా ||

చ|| చీమలింటిలోన జొచ్చి చిక్కువడి అందరిలో | దోమకరకుట్లకు తోడిదొంగవై | యేమరి వేంకటవిభు నెరుగక జాడుజొప్ప | నాము మేయ దొరకొంటి నాలిజీవుడా ||

pa|| iMdunaMdu dirugucu nevvarivADavugAka | baMdepasaramuvaiti bApu jIvuDA ||

ca|| tOlubokkalOna jocci tUlETiyAkalicEta | pAlumAli yiMdariki baMTubaMTavai |

yElinavAni gAnaka yEcinayAsalaveMTa | kUlikibO dorakuMTi kULajIvuDA ||

ca|| tITamEnilOna jocci dimmaridoMgalacEta | mUTagaTTiMcuka nIvu mUladoravai |

gATapuviBunicEtiGanata kOrikalaku | vETakukkavaitivi verrijIvuDA ||

ca|| cImaliMTilOna jocci cikkuvaDi aMdarilO | dOmakarakuTlaku tODidoMgavai |

yEmari vEMkaTaviBu nerugaka jADujoppa | nAmu mEya dorakoMTi nAlijIvuDA ||

iMdukorake yiMdarunu - ఇందుకొరకె యిందరును

ప|| ఇందుకొరకె యిందరును నిట్లయిరి | కిందుపడి మరికాని గెలుపెరగరాదు ||

చ|| అటమటపు వేడుకల నలయించి మరికదా | ఘటియించు బరము తటుకన దైవము |

ఇటుసేయు నీశ్వరున కీసు గలదా లేదు | కుటిలమతి గని కాని గురి గానరాదు ||

చ|| బెండుపడ నవగతుల బెనగించి మరికదా | కొండనుచు బరమొసంగును దైవము |

బండుసేయగ హరికి బంతమా యటుగాదు | యెండదాకక నీడహిత వెరగరాదు ||

చ|| మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మరికదా | తనభక్తి యొసగు నంతట దైవము |

ఘనవేంకటేశునకు గపటమా అటుగాదు | తినక చేదును దీపు తెలియనేరాదు ||

pa|| iMdukorake yiMdarunu niTlayiri | kiMdupaDi marikAni geluperagarAdu ||

ca|| aTamaTapu vEDukala nalayiMci marikadA | GaTiyiMcu baramu taTukana daivamu | iTusEyu nISvaruna kIsu galadA lEdu | kuTilamati gani kAni guri gAnarAdu ||

ca|| beMDupaDa navagatula benagiMci marikadA | koMDanucu baramosaMgunu daivamu | baMDusEyaga hariki baMtamA yaTugAdu | yeMDadAkaka nIDahita veragarAdu ||

ca|| munupa vElpulakella mrokkiMci marikadA | tanaBakti yosagu naMtaTa daivamu | GanavEMkaTESunaku gapaTamA aTugAdu | tinaka cEdunu dIpu teliyanErAdu ||

iMdukEpOveragayyI - ఇందుకేపోవెరగయ్యీ

ప|| ఇందుకేపోవెరగయ్యీ నేమందును | కందులేని నీమహిమ కొనియాడగలనా ||

చ|| అటుదేవతలకెల్ల నమృతమిచ్చిననీవు | యిటు వెన్న దొంగిలుట కేమందును |

పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు | నట రోలగట్టవడ్డచందాన కేమందును ||

చ|| కలిగి యాకరిరాజు గరుణ గాచిననీవు | యిల నావుల గాచుట కేమందును |

తలవ బ్రహ్మాదిదేవతలకు జిక్కనినీవు | చెలులకాగిళ్ళకు జిక్కితి వేమందును ||

చ|| భావించ నన్నిటికికంటే బరమమూర్తివి నీవు | యీవల బాలుడవైతి వేమందును |

కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని | శ్రీవేంకటాద్రినిలిచితి వేమందును ||

pa|| iMdukEpOveragayyI nEmaMdunu | kaMdulEni nImahima koniyADagalanA ||

ca|| aTudEvatalakella namRutamiccinanIvu | yiTu venna doMgiluTa kEmaMdunu |

paTugati balIMdruni baMdhiMcinaTTi nIvu | naTa rOlagaTTavaDDacaMdAna kEmaMdunu ||

ca|| kaligi yAkarirAju garuNa gAcinanIvu | yila nAvula gAcuTa kEmaMdunu |

talava brahmAdidEvatalaku jikkaninIvu | celulakAgiLLaku jikkiti vEmaMdunu ||

ca|| BAviMca nanniTikikaMTE baramamUrtivi nIvu | yIvala bAluDavaiti vEmaMdunu | kAviMci brahmAMDAlu kaDupuna niDukoni | SrIvEMkaTAdriniliciti vEmaMdunu ||

iMdukEnA viBuDu - ఇందుకేనా విభుడు

ప|| ఇందుకేనా విభుడు నీయింట నెలకొన్నాడు | కందువెఱుగుదువు యీకత నీవే నేర్తువే ||

చ|| నయమెంత గలిగినా ననుపులకే మేలు | ప్రియమెంత గలిగినా పెనపులకే మేలు |
జయమెంత గలిగినా చనవులకే మేలు | క్రియలెఱుగుదువు యీకీలు నీవే నేర్తువే ||

చ|| మొగమెంత చూచినా మోహానకే మూలము | తగవెంత నెరపినా తగులుకే మూలము |
నగవెంత గలిగినాను నమ్మికలకు మూలము | పగటెరుగుదువు యీపాడి నీవే నేర్తువే ||

చ|| వూడిగ మెంతసేసినా వొద్దికలకే దాపు | వేడుకెంత నిలిపినా విఱ్ఱవీగుటకే దాపు |
కూడితివిన్ని చందాల కోరిక శ్రీ వేంకటేశు | జాడెఱుగుదువు సరసము సరసము నీవే నేర్తువు ||

pa|| iMdukEnA viBuDu nIyiMTa nelakonnADu | kaMduverxuguduvu yIkata nIvE nErtuvE ||

ca|| nayameMta galiginA nanupulakE mElu | priyameMta galiginA penapulakE mElu | jayameMta galiginA canavulakE mElu | kriyalerxuguduvu yIkIlu nIvE nErtuvE ||

ca|| mogameMta cUcinA mOhAnakE mUlamu | tagaveMta nerapinA tagulukE mUlamu | nagaveMta galiginAnu nammikalaku mUlamu | pagaTeruguduvu yIpADi nIvE nErtuvE ||

ca|| vUDiga meMtasEsinA voddikalakE dApu | vEDukeMta nilipinA virxrxavIguTakE dApu | kUDitivinni caMdAla kOrika SrI vEMkaTESu | jADerxuguduvu sarasamu sarasamu nIvE nErtuvu ||

iMdukEkAbOlu nIvu - ఇందుకేకాబోలు నీవు

ప|| ఇందుకేకాబోలు నీవు యిట్టే యవధరించేవు | కందువ లన్నియు నీమై గనియైనట్లుండె ||

చ|| హరి నీవు కప్పురకా పవధరించేవేళ | విరివిగా నిందరు భావించి చూచితే |

తరుణులనవ్వులెల్లా దట్టమై నీమేనిమీద | పెరిగిపెరిగి యట్టే పేరినయట్లుండె ||

చ|| భువనేశ నీవు తట్టుపుణుగు చాతుకొనగ | యివల నీదాసులెల్లా నెంచిచూచితే |

కవగూడి నీసతులకనుచూపులెల్లాను | తివిరి నీమేనిమీద తిరమైనట్లుండె ||

చ|| శ్రీవేంకటేశ నీచెలి యలమేల్మంగతో | తావున మెరసేది నే దలిచితేను |

కోవరపుగొల్లెతల గుబ్బలకుంకుమనిగ్గు | వేవేలయి నీయందచ్చు వేసినయట్లుండె ||

pa|| iMdukEkAbOlu nIvu yiTTE yavadhariMcEvu | kaMduva lanniyu nImai ganiyainaTluMDe ||

ca|| hari nIvu kappurakA pavadhariMcEvELa | virivigA niMdaru BAviMci cUcitE |

taruNulanavvulellA daTTamai nImEnimIda | perigiperigi yaTTE pErinayaTluMDe ||

ca|| BuvanESa nIvu taTTupuNugu cAtukonaga | yivala nIdAsulellA neMcicUcitE |

kavagUDi nIsatulakanucUpulellAnu | tiviri nImEnimIda tiramainaTluMDe ||

ca|| SrIvEMkaTESa nIceli yalamElmaMgatO | tAvuna merasEdi nE dalicitEnu |

kOvarapugolletala gubbalakuMkumaniggu | vEvElayi nIyaMdaccu vEsinayaTluMDe ||