iTu garuDani nI - ఇటు గరుడని నీ

ప|| ఇటు గరుడని నీ వెక్కినను | పటపట దిక్కులు బగ్గన బగిలె ||

చ|| ఎగసినగరుడని యేపున ’థా’యని | జిగిదొలకచబుకు చేసినను |

నిగమాంతంబులు నిగమసంఘములు | గగనము జగములు గడ గడ వడకె ||

చ|| బిరుసుగ గరుడని పేరెము దోలుచు | బెరసి నీవు కోపించినను |

సరుస నిఖిలములు జర్జరితములై | తెరుపున నలుగడ దిరదిర దిరిగె ||

చ|| పల్లించిననీపసిడిగరుడనిని | కెల్లున నీ వెక్కినయపుడు |

ఝల్లనె రాక్షససమితి నీమహిమ- | వెల్లి మునుగుదురు వేంకటరమణా ||

pa|| iTu garuDani nI vekkinanu | paTapaTa dikkulu baggana bagile ||

ca|| egasinagaruDani yEpuna 'ThA'yani | jigidolakacabuku cEsinanu |

nigamAMtaMbulu nigamasaMGamulu | gaganamu jagamulu gaDa gaDa vaDake ||

ca|| birusuga garuDani pEremu dOlucu | berasi nIvu gOpiMcinanu |

sarusa niKilamulu jarjaritamulai | terupuna nalugaDa diradira dirige ||

ca|| palliMcinanIpasiDigaruDanini | kelluna nI vekkinayapuDu |

Jallane rAkShasasamiti nImahima- | velli munuguduru vEMkaTaramaNA ||

iTa mIda kaDamellA - ఇట మీద కడమెల్లా

ప|| ఇట మీద కడమెల్లా నిక నీవు దీర్చవయ్యా | పటుకున జెలి నీకు బాలుపెట్టీ నిదిగో ||

చ|| నెలత మంచముపై కిన్నెర వాయించి వాయించి | తలకొని నీవురాగా దలవంచెను |

సొలసి చెలులతోడ సుద్దులు దాజెప్పి చెప్పి | చెలగి నీమోము చూచి సిగ్గువడీ నిదిగో ||

చ|| పడతి నీమీది పాట పాడిపాడి అర్థము నీ- | వడిగితే నవ్వలి మోమై నవ్వీని |

అడియాలముల రూపు అద్దములో జూచి చూచి | కడు నీవు కొంగు వట్టగా భ్రమసీని ||

చ|| సతి యేకతాన నుండి జవ్వాది పూసి పూసి | రతి నీవు గూడగా సరసమాడీని |

ఇతవైన శ్రీ వేంకటేశ నీవాపె గూడగా | పతి చూచి యిప్పుడిట్టె పక్కున నవ్వీని ||

pa|| iTa mIda kaDamellA nika nIvu dIrcavayyA | paTukuna jeli nIku bAlupeTTI nidigO ||

ca|| nelata maMcamupai kinnera vAyiMci vAyiMci | talakoni nIvurAgA dalavaMcenu |

solasi celulatODa suddulu dAjeppi ceppi | celagi nImOmu cUci sigguvaDI nidigO ||

ca|| paDati nImIdi pATa pADipADi arthamu nI- | vaDigitE navvali mOmai navvIni |

aDiyAlamula rUpu addamulO jUci cUci | kaDu nIvu koMgu vaTTagA BramasIni ||

ca|| sati yEkatAna nuMDi javvAdi pUsi pUsi | rati nIvu gUDagA sarasamADIni |

itavaina SrI vEMkaTESa nIvApe gUDagA | pati cUci yippuDiTTe pakkuna navvIni ||

Ichchalo goraevallaa - ఇచ్చలో గోరేవల్లా

రాగం:రామక్రియ

ఇచ్చలో గోరేవల్లా ఇచ్చేధనము అచ్చుతనామమెపో అధికపుధనము

నారదాదులువొగడేనాలుకపయిధనము సారపువేదములలో చాటేధనము కూరిమిమునులు దాచుకొన్నట్టిధనము నారాయణనామ మిదే నమ్మినట్టిధనము

పరమపదవికి సంబళమైనధనము యిరవై భక్తులకెల్లా నింటిధనము పరగ నంతరంగాన పాతినట్టిధనము హరినామ మిదియపో అరచేతిధనము

పొంచి శివుడు కాశిలో బోధించేధనము ముంచినాఅచార్యుల మూలధనము పంచి శ్రీ వేంకటపతి పాలించేధనము నించి విష్ణునామ మదే నిత్యమైనధనము।

Raagam: Raamakriya

Ichchalo goraevallaa ichchaedhanamu Achchutanaamamepo adhikapudhanamu

Naaradaaduluvogadaenaalukapayidhanamu Saarapuvaedamulalo chaataedhanamu Koorimimunulu daachukonnattidhanamu Naaraayananaama midae namminattidhanamu

Paramapadaviki sambalamainadhanamu Yiravai bhaktulakellaa nimtidhanamu Paraga namtaramgaana paatinattidhanamu Harinaama midiyapo arachaetidhanamu

Pomchi sivudu kaasilo bodhimchaedhanamu Mumchinaaachaaryula mooladhanamu Pamchi sree vaemkatapati paalimchaedhanamu Nimchi vishnunaama madae nityamainadhanamu

iMdulOnE kAnavaddA - ఇందులోనే కానవద్దా

ప|| ఇందులోనే కానవద్దా యితడు దైవమని | విందువలె నొంటిమెట్టవీరరఘరాముని ||

చ|| యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు | కందువ రాఘవుడు ఖండించినాడు |

ముందట జలధి యేమూల చొచ్చె గొండలచే | గొందిబడ గట్టివేసి కోపగించేనాడు ||

చ|| యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి | వేడుకతో హరివిల్లు విఱిచేనాడు |

వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు | కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు ||

చ|| జము డెక్కడికి బోయ సరయవులో మోక్ష- | మమర జీవుల కిచ్చె నల్లనాడు | తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి | తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు ||

pa|| iMdulOnE kAnavaddA yitaDu daivamani | viMduvale noMTimeTTavIraraGarAmuni ||

ca|| yeMdu cocce brahmavara mila rAvaNutalalu | kaMduva rAGavuDu KaMDiMcinADu |

muMdaTa jaladhi yEmUla cocce goMDalacE | goMdibaDa gaTTivEsi kOpagiMcEnADu ||

ca|| yEDanuMDe mahimalu yiMdari kitaDu vacci | vEDukatO harivillu virxicEnADu |

vODaka yiMdrAdu leMdu nodigi rItanibaMTu | kUDabaTTi saMjIvikoMDa deccEnADu ||

ca|| jamu DekkaDiki bOya sarayavulO mOkSha- | mamara jIvula kicce nallanADu |

temali vAnarulai yIdEvatalE baMTlairi | timiri SrIvEMkaTapatiki nEDu nADu ||

Imdulo modalikarta - ఇందులో మొదలికర్త

రాగం: ఆహిరి

ఇందులో మొదలికర్త యెవ్వడు లేడుగాబొలు ముందు కరివరదుడే ముఖ్యుడుగాబోలు

ఆడితిబో బహురూపా లన్ని యోనుల బుట్టి తోడనె బ్రహ్మాదులనేదొరలెదుటా జాడలు మెచ్చాలేరు చాలునన్న వారు లేరు వేడుక నడవిగానేవెన్నెలాయ బ్రదుకు

అన్ని కర్మములు జేసి ఆటలో బ్రాహ్మణుడనైతి నన్ని వేదములనేటియంగడివీధి నన్ను జూచేవారు లేరు నవ్వేటివారు లేరు వన్నెలసముద్రములో వానలాయ బ్రదుకు

సంసారపు నాటకసాలలో ప్రతిమనైతి కంసారి శ్రీవేంకటపతిమాయలోన యింసలెన్నియు దేరె నిందరు జుట్టములైరి హంసచేతిపాలునీరునట్లాయ బ్రదుకు

Raagam:aahiri

Imdulo modalikarta yevvadu laedugaabolu Mumdu karivaradudae mukhyudugaabolu

Aaditibo bahuroopaa lanni yonula butti Todane brahmaadulanaedoraledutaa Jaadalu mechchaalaeru chaalunanna vaaru laeru Vaeduka nadavigaanaevennelaaya braduku

Anni karmamulu jaesi aatalo braahmanudanaiti Nanni vaedamulanaetiyamgadiveedhi Nannu joochaevaaru laeru navvaetivaaru laeru Vannelasamudramulo vaanalaaya braduku

Samsaarapu naatakasaalalo pratimanaiti Kamsaari sreevaemkatapatimaayalona Yimsalenniyu daere nimdaru juttamulairi Hamsachaetipaaluneerunatlaaya braduku

iMdumIda satibhAva - ఇందుమీద సతిభావ

ఇందుమీద సతిభావ మెట్లౌనో యేమౌనో
విందుగా జెలువునికి విన్నవించరే ||

కోవిలకూతకుగానే గుండె జల్లురని చెలి
పూవక పూచిన యట్టు పులకించె
మావినుండి యంతలోనే మదన భూతముసోకె
పోవులైన పుప్పొడినే పోయరే బడిమి ||

కోమలి చందురుడనే కొరవిదయ్యము జూచి
దీమన మింతయు మాని దిగులందెను
తేమలైన వెన్నెలల దిమ్మువట్టి నిలువున
మైమఅచె గప్పురాన మంత్రించరే ||

ఇంతలో శ్రీవేంకటేశుడిందుకు విచ్చేయగాను
చింతదీర మేనెల్ల జెమరించెను
వింతలైన రతులలొ విరహపు సోకు వాసె
కంతు చిగురాకు రక్షగట్టరే యంగనకు ||
iMdumIda satibhAva meTlounO yEmaunO
viMdugA jeluvuniki vinnaviMcharE ||

kOvilakUtakugAnE guMDe jallurani cheli
pUvaka pUchina yaTTu pulakiMche
mAvinuMDi yaMtalOnE madana bhUtamusOke
pOvulaina puppoDinE pOyarE baDimi ||

kOmali chaMduruDanE koravidayyamu jUchi
dImana miMtayu mAni digulaMdenu
tEmalaina vennelala dimmuvaTTi niluvuna
maimaRache gappurAna maMtriMcharE ||

iMtalO SrIvEMkaTESuDiMduku vichchEyagAnu
chiMtadIra mEnella jemariMchenu
viMtalaina ratulalo virahapu sOku vAse
kaMtu chigurAku rakShagaTTarE yaMganaku ||

iMdunuMDa mIkeDa - ఇందునుండ మీకెడ

ప|| ఇందునుండ మీకెడ లేదు | సందడిసేయక చనరో మీరు ||

చ|| నాలుక శ్రీహరినామంబున్నది | తూలుచు బారరో దురితములు |

చాలి భుజంబున చక్రంబున్నది | తాలిమి భవబంధము లటుదలరో ||

చ|| అంతర్యామై హరి వున్నాడిదె | చింతలు వాయరొ చిత్తమున |

వింతల జెవులను విష్ణుకథ లివిగొ | పొంత గర్మములు పోరో మీరు ||

చ|| కాపయి శ్రీవేంకటపతి పేరిదె | నాపై నున్నది నయమునను |

కోపపు కామాది గుణములాల మీ- | రేపున కడగడ నెందైన బోరో ||

pa|| iMdunuMDa mIkeDa lEdu | saMdaDisEyaka canarO mIru ||

ca|| nAluka SrIharinAmaMbunnadi | tUlucu bArarO duritamulu |

cAli BujaMbuna cakraMbunnadi | tAlimi BavabaMdhamu laTudalarO ||

ca|| aMtaryAmai hari vunnADide | ciMtalu vAyaro cittamuna |

viMtala jevulanu viShNukatha livigo | poMta garmamulu pOrO mIru ||

ca|| kApayi SrIvEMkaTapati pEride | nApai nunnadi nayamunanu |

kOpapu kAmAdi guNamulAla mI- | rEpuna kaDagaDa neMdaina bOrO ||