ivi sEyaga nEnalasuDa - ఇవి సేయగ నేనలసుడ

ఇవి సేయగ (రాగం: ) (తాళం : )

ప|| ఇవి సేయగ నేనలసుడ యెటువలె మోక్షంబడిగెదను |
వివరముతోడుత నీవు సులభూడవు విష్ణుడ నిన్నే కొలిచెదగాక ||

చ|| జపయజ్ఞదానకర్మంబులు యెంచగ జిరకాలఫలంబులు |
యెపుడు బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు |
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు |
వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకు గారణంబులు ||

చ|| రవిచంద్ర గ్రహతారాబలములు భువిలో గామ్యఫలములు |
తవిలిన పంచేంద్రియ నిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు |
అవిరళ ధర్మార్థ కామంబులు మఱియైశ్వర్యములకు మూలములు |
ఆవల గ్రహణకానాలుష్ఠానము లధికఫలంబులు ఆశామయము ||

చ|| పరగ సప్తసంతాన బ్రాహ్మణ తర్పణములు ఖ్యాతిసుకృతములు |
అరయ బుత్రదార క్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము |
హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొసగెడిదాతవు |
సరగున నీవే దయతో రక్షించజాలుదు వేకాలమును మమ్ములను ||

ivi sEyaga (Raagam: ) (Taalam: )

pa|| ivi sEyaga nEnalasuDa yeTuvale mOkShaMbaDigedanu |
vivaramutODuta nIvu sulaBUDavu viShNuDa ninnE kolicedagAka ||

ca|| japayaj~jadAnakarmaMbulu yeMcaga jirakAlaPalaMbulu |
yepuDu buNyatIrthasnAnamulu yila pApavimOcanamulu |
aparimita dEvatAMtaraBajanalu AyAlOkaprAptulu |
vupavAsAdi niyamavratamulu tapOniShThaku gAraNaMbulu ||

ca|| ravicaMdra grahatArAbalamulu BuvilO gAmyaPalamulu |
tavilina paMcEMdriya nigrahaMbulu tanudharulaku durlaBamulu |
aviraLa dharmArtha kAmaMbulu marxiyaiSvaryamulaku mUlamulu |
Avala grahaNakAnAluShThAnamu ladhikaPalaMbulu ASAmayamu ||

ca|| paraga saptasaMtAna brAhmaNa tarpaNamulu KyAtisukRutamulu |
araya butradAra kShEtrasaMgraha maMdarikini saMsAraBOgamu |
hari narahari SrIvEMkaTESvarA aKilamu nosageDidAtavu |
saraguna nIvE dayatO rakShiMcajAludu vEkAlamunu mammulanu ||


ilayunu naBamunu - ఇలయును నభమును

ఇలయును నభమును (రాగం: ) (తాళం : )

ప|| ఇలయును నభమును నేకరూపమై | జలజల గోళ్ళు జళిపించితివి ||

చ|| ఎడసిన నలముక హిరణ్యకశిపుని | దొడికిపట్టి చేతుల బిగిసి |
కెడసి తొడలపై గిరిగొన నదుముక | కడుపుచించి కహకహ నవ్వితివి ||

చ|| రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు | గుప్పుచు లాలలు గురియుచును |
కప్పినబెబ్బులి కసరుహుంకృతుల | దెప్పరపసురల ధృతి యణచితివి ||

చ|| పెళపెళనార్చుచు బెడబొబ్బలిడుచు | థళథళ మెరవగ దంతములు |
ఫళఫళ వీరవిభవరస రుధిరము | గుళగుళ దిక్కుల గురియించితివి ||

చ|| చాతినప్రేవుల జన్నిదములతో | వాతెరసింహపు వదనముతో |
చేతులువేయిట జెలగి దితిసుతుని | పోతర మణపుచు భువి మెరసితివి ||

చ|| అహోబలమున నతిరౌద్రముతో | మహామహిమల మలయుచును |
తహతహ మెదుపుచు దగువేంకటపతి | యిహము బరము మాకిపుడొసగితివి ||

ilayunu naBamunu (Raagam: ) (Taalam: )

pa|| ilayunu naBamunu nEkarUpamai | jalajala gOLLu jaLipiMcitivi ||

ca|| eDasina nalamuka hiraNyakaSipuni | doDikipaTTi cEtula bigisi |
keDasi toDalapai girigona nadumuka | kaDupuciMci kahakaha navvitivi ||

ca|| roppula nUrpula roccula kasarulu | guppucu lAlalu guriyucunu |
kappinabebbuli kasaruhuMkRutula | depparapasurala dhRuti yaNacitivi ||

ca|| peLapeLanArcucu beDabobbaliDucu | thaLathaLa meravaga daMtamulu |
PaLaPaLa vIraviBavarasa rudhiramu | guLaguLa dikkula guriyiMcitivi ||

ca|| cAtinaprEvula jannidamulatO | vAterasiMhapu vadanamutO |
cEtuluvEyiTa jelagi ditisutuni | pOtara maNapucu Buvi merasitivi ||

ca|| ahObalamuna natiraudramutO | mahAmahimala malayucunu |
tahataha medupucu daguvEMkaTapati | yihamu baramu mAkipuDosagitivi ||


iravainayaTTuMDu - ఇరవైనయట్టుండు

ఇరవైనయట్టుండు (రాగం: ) (తాళం : )

ప|| ఇరవైనయట్టుండు యెఱగనీ దీమాయ | తెరమఱగుమెకమువలె తిరుగు నీబ్రదుకు ||

చ|| అనిశమును దేహమున కన్నపానము లిడిన | యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో |
గొనకొన్నమానినులకూటములసుఖము లివి | మనసుదాగినపాలు మట్టులేదెపుడు ||

చ|| వొదలబెట్టినసొమ్ము లొగి దనకు గానరా- | వడవి గాసినవెన్నె లది కన్నులకును |
వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే | బెడిదంపుభ్రమతోడి పెనుగాలిమూట ||

చ|| చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు | యెద్దుయెనుపోతునై యేకంబు గాదు |
వొద్దికై శ్రీవేంకటోత్తముడు యింతలో | అద్దంపునీడవలె నాత్మ బొడచూపె ||

iravainayaTTuMDu (Raagam: ) (Taalam: )

pa|| iravainayaTTuMDu yer~aganI dImAya | teramar~agumekamuvale tirugu nIbraduku ||

ca|| aniSamunu dEhamuna kannapAnamu liDina | yinumu guDicinanIru yeMdukekkinadO |

gonakonnamAninulakUTamulasuKamu livi | manasudAginapAlu maTTulEdepuDu ||

ca|| vodalabeTTinasommu logi danaku gAnarA- | vaDavi gAsinavenne ladi kannulakunu |

vuDivOniparimaLamu lokanimiShamAtramE | beDidaMpuBramatODi penugAlimUTa ||

ca|| caddisaMsAramuna sarusa suKaduHKamulu | yedduyenupOtunai yEkaMbu gAdu |

voddikai SrIvEMkaTOttamuDu yiMtalO | addaMpunIDavale nAtma boDacUpe ||


iravaguvAriki - ఇరవగువారికి

ఇరవగువారికి యిహపర (రాగం: ) (తాళం : )

ప|| ఇరవగువారికి యిహపర మిదియే | హరిసేవే సర్వాత్ములకు ||

చ|| దురితమోచనము దుఃఖపరిహరము | హరినామమెపో ఆత్మలకు |
పరమపదంబును భవనిరుహరణము | పరమాత్ముచింతే ప్రపన్నులకు ||

చ|| సారము ధనములు సంతోషకరములు | శౌరికథలు సంసారులకు |
కోరినకోర్కియు కొంగుబంగరువు | సారె విష్ణుదాస్యము లోకులకు ||

చ|| యిచ్చయగుసుఖము యిరవగుపట్టము | అచ్చుతుకృప మోక్షార్థులకు |
అచ్చపుశ్రీవేంకటాధిపుశరణము | రచ్చల మాపాలి రాజ్యపుసుగతి ||

iravaguvAriki yihapara (Raagam: ) (Taalam: )

pa|| iravaguvAriki yihapara midiyE | harisEvE sarvAtmulaku ||

ca|| duritamOcanamu duHKapariharamu | harinAmamepO Atmalaku |
paramapadaMbunu BavaniruharaNamu | paramAtmuciMtE prapannulaku ||

ca|| sAramu dhanamulu saMtOShakaramulu | Saurikathalu saMsArulaku |
kOrinakOrkiyu koMgubaMgaruvu | sAre viShNudAsyamu lOkulaku ||

ca|| yiccayagusuKamu yiravagupaTTamu | accutukRupa mOkShArthulaku |
accapuSrIvEMkaTAdhipuSaraNamu | raccala mApAli rAjyapusugati ||


iyya koMTi nIpanulu - ఇయ్య కొంటి నీపనులు

ఇయ్య కొంటి నీపనులు (రాగం: ) (తాళం : )

ప|| ఇయ్య కొంటి నీపనులు ఇంతా మేలే | చెయ్యి మీదాయ నాకు సిరులేమి బాతి ||

చ|| నయగారి వాడవు నాకు నీవు గలవు | ప్రియములేమి గడమ పెక్కుమారులు |
క్రియ లెఱుగుదువు కేలు చాచేవు నా మీద | నియతాన నిందుకే నీ యాలనైతిని ||

చ|| చలపాది వాడవు సతమై వున్నాడవు | చిలిము యేమి గడమ పై పై నేడు |
వలపించ నేరుతువు వంచేవు నాపై ననుపు | కలకాలమును నీకు గైవశమైతిని ||

చ|| శ్రీ వేంకటేశుడవు చేరి నన్నుగూడితివి | దైవిక మేమి గడమ తగులాయను |
భావమెఱుగుదువు పచ్చిగా నవ్వేవు నాతో | వే వెలకును నీకే వెల్లివిరి యైతిని ||

iyya koMTi nIpanulu (Raagam: ) (Taalam: )

pa|| iyya koMTi nIpanulu iMtA mElE | ceyyi mIdAya nAku sirulEmi bAti ||

ca|| nayagAri vADavu nAku nIvu galavu | priyamulEmi gaDama pekkumArulu |
kriya lerxuguduvu kElu cAcEvu nA mIda | niyatAna niMdukE nI yAlanaitini ||

ca|| calapAdi vADavu satamai vunnADavu | cilimu yEmi gaDama pai pai nEDu |
valapiMca nErutuvu vaMcEvu nApai nanupu | kalakAlamunu nIku gaivaSamaitini ||

ca|| SrI vEMkaTESuDavu cEri nannugUDitivi | daivika mEmi gaDama tagulAyanu |
BAvamerxuguduvu paccigA navvEvu nAtO | vE velakunu nIkE velliviri yaitini ||


ippuDiTu viBubAsi - ఇప్పుడిటు విభుబాసి

ఇప్పుడిటు విభుబాస (రాగం: ) (తాళం : )

ప|| ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు | తప్పు లోపలి తప్పు దైవమా చెలికి ||

చ|| నగవు లోపలి యలపు నంపైన పొలయలుక | పగటు లోపలి వెరగు పచ్చివేడి | మొగము కాంతుల మెఱపు ముంచు నలుకల చెదరు | పగలు చీకట్లాయె బాపురా చెలికి ||

చ|| బలిమి లోపలి భయము పలుకుదేనెల కనరు | చెలిమి లోపలి చేదు చింత చెలికి | బలుపు కుచములలోని బట్టబయలగు నడుము | కలిమి లోపలి లేమి కట కటా చెలికి ||

చ|| నిడుపు లోపలి కురుచ నీడ లోపలి యెండ | వడి మంచి తరువు వడువని తమకము | కడు వేంకటేశ్వరుని కౌగిటను పరవశము | మడుగు లోపలి మైల మాన దీచెలికి ||

ippuDiTu viBubAsi(Raagam: ) (Taalam: )

pa|| ippuDiTu viBubAsi yiMtalOnane nEDu | tappu lOpali tappu daivamA celiki ||

ca|| nagavu lOpali yalapu naMpaina polayaluka | pagaTu lOpali veragu paccivEDi | mogamu kAMtula merxapu muMcu nalukala cedaru | pagalu cIkaTlAye bApurA celiki ||

ca|| balimi lOpali Bayamu palukudEnela kanaru | celimi lOpali cEdu ciMta celiki | balupu kucamulalOni baTTabayalagu naDumu | kalimi lOpali lEmi kaTa kaTA celiki ||

ca|| niDupu lOpali kuruca nIDa lOpali yeMDa | vaDi maMci taruvu vaDuvani tamakamu | kaDu vEMkaTESvaruni kaugiTanu paravaSamu | maDugu lOpali maila mAna dIceliki ||

innilAgulacEta - ఇన్నిలాగులచేత

ఇన్నిలాగులచేత (రాగం: ) (తాళం : )

ప|| ఇన్నిలాగులచేత లివియపో కడు- | నెన్నికకెక్కిన చేతులివియపో ||

చ|| గునియుచు దనునెత్తికొమ్మని తల్లిపై- | నెనయజాచిన చేతులివియపో |
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన | యినుమువంటి చేతులివియపో ||

చ|| పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన | యిసుమంతలు చేతులివియపో |
పసుల గాచుచు గొల్లపడచుల యమునలో | యిసుకచల్లిన చేతులివియపో ||

చ|| పరమచైతన్యమై ప్రాణులకెల్లను | యెరవులిచ్చిన చేతులివియపో |
తిరువేంకటగిరి దేవుడై ముక్తికి- | నిరవుచూపెడు చేతులివియపో ||

innilAgulacEta (Raagam: ) (Taalam: )

pa|| innilAgulacEta liviyapO kaDu- | nennikakekkina cEtuliviyapO ||

ca|| guniyucu danunettikommani tallipai- | nenayajAcina cEtuliviyapO |
kinisi gOvardhanagiri vellagiMcina | yinumuvaMTi cEtuliviyapO ||

ca|| pisiki pUtakicannu bigiyiMcipaTTina | yisumaMtalu cEtuliviyapO |
pasula gAcucu gollapaDacula yamunalO | yisukacallina cEtuliviyapO ||

ca|| paramacaitanyamai prANulakellanu | yeravuliccina cEtuliviyapO |
tiruvEMkaTagiri dEvuDai muktiki- | niravucUpeDu cEtuliviyapO ||