ihameTTidO parameTTidO - ఇహమెట్టిదో పరమెట్టిదో

ఇహమెట్టిదో పరమెట్టిదో (రాగం: ) (తాళం : )

ప|| ఇహమెట్టిదో పరమెట్టిదో ఇక నాకు | సహజమై హరియే శరణము నాకు ||

చ|| చిత్తమిది యొకటే చింత వేవేలసంఖ్య | పొత్తుల హరిదలచ బొద్దులేదు |
జొత్తుల కన్నుల రెండు చూపులైతే ననంతాలు | తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు ||

చ|| చేతులివియు రెండే చేష్టలు లక్షోపలక్ష | యీతల హరి బూజింప నిచ్చలేదు |
జాతి నాలిక వొకటే చవులు కోటానగోటి | రీతి హరినామ ముచ్చరించ వేళలేదు ||

చ|| వీనులివి రెండే వినికి కొలదిలేదు | పూని హరిభక్తి విన బుద్ధి లేదు |
యీనటన శ్రీవేంకటేశు డిటు చూచినను | తానే యేలె నిక దడబాటు లేదు ||

ihameTTidO parameTTidO (Raagam: ) (Taalam: )

pa|| ihameTTidO parameTTidO ika nAku | sahajamai hariyE SaraNamu nAku ||

ca|| cittamidi yokaTE ciMta vEvElasaMKya | pottula haridalaca boddulEdu |
jottula kannula reMDu cUpulaitE nanaMtAlu | tattariMci harirUpu daggari cUDalEdu ||

ca|| cEtuliviyu reMDE cEShTalu lakShOpalakSha | yItala hari bUjiMpa niccalEdu |
jAti nAlika vokaTE cavulu kOTAnagOTi | rIti harinAma muccariMca vELalEdu ||

ca|| vInulivi reMDE viniki koladilEdu | pUni hariBakti vina buddhi lEdu |
yInaTana SrIvEMkaTESu DiTu cUcinanu | tAnE yEle nika daDabATu lEdu ||


ihamunu baramunu - ఇహమును బరమును

ఇహమును బరమును (రాగం: ) (తాళం : )

ప|| ఇహమును బరమును యిందే వున్నవి | వహికెక్క దెలియువారలు లేరు ||

చ|| చట్టువంటి దీచంచలపుమనసు | కొట్టులబడేది గుఱిగాదు |
దిట్ట వొరులు బోధించిన గరగదు | పట్టబోయితే పసలేదు ||

చ|| చిగురువంటి దీజీవశరీరము | తగుళ్ళు పెక్కులు తతిలేదు |
తెగనిలంపటమే దినమును బెనచును | మొగము గల దిదే మొనయును లేదు ||

చ|| గనివంటిది యీఘనసంసారము | తనిసితన్పినా దగ లేదు |
ఘనుడగు శ్రీవేంకటపతి గావగ | కొనమొద లేర్పడె కొంకే లేదు ||

ihamunu baramunu (Raagam: ) (Taalam: )

pa|| ihamunu baramunu yiMdE vunnavi | vahikekka deliyuvAralu lEru ||

ca|| caTTuvaMTi dIcaMcalapumanasu | koTTulabaDEdi gurxigAdu |
diTTa vorulu bOdhiMcina garagadu | paTTabOyitE pasalEdu ||

ca|| ciguruvaMTi dIjIvaSarIramu | taguLLu pekkulu tatilEdu |
teganilaMpaTamE dinamunu benacunu | mogamu gala didE monayunu lEdu ||

ca|| ganivaMTidi yIGanasaMsAramu | tanisitanpinA daga lEdu |
GanuDagu SrIvEMkaTapati gAvaga | konamoda lErpaDe koMkE lEdu ||


Ihamu baramu jikke - ఇహము బరము జిక్కె

ఇహము బరము (రాగం:వసంతవరాళి ) (తాళం : )

ఇహము బరము జిక్కె నీతనివంక
అహిశయనునిదాసులంతవారు వేరీ

సిరికలిగినవారు చింతలిన్నిటను బాసి
నిరతపువర్గముతో నిక్కేరటా
సిరికి మగడయిన శ్రీపతి యేలి మ__
మ్మరయుచునున్నాడు మాయంతవారు వెరి

బలవంతుడైనవాడు భయములిన్నిట బాసి
గెలిచి పేరువాడుచు గెరిలీనటా
బలదేవుడైన శ్రీపతి మా యింటిలోన
అలరివున్నాడు మాయంతవారు వేరి

భూములేలేటివాడు భోగములతో దనిసి
కామించి యానందమున గరగీనటా
సేమముతో భూపతైన శ్రీవేంకటేశుడు మాకు
ఆముకొనివుండగా మాయంతవారు వేరీ

Ihamu baramu (Raagam: Vasamtavaraali) (Taalam: )

Ihamu baramu jikke neetanivamka
Ahisayanunidaasulamtavaaru vaeree

Sirikaliginavaaru chimtalinnitanu baasi
Niratapuvargamuto nikkaerataa
Siriki magadayina Sreepati yaeli ma__
Mmarayuchununnaadu maayamtavaaru veri

Balavamtudainavaadu bhayamulinnita baasi
Gelichi paeruvaaduchu gerileenataa
Baladaevudaina Sreepati maa yimtilona
Alarivunnaadu maayamtavaaru vaeri

Bhoomulaelaetivaadu bhogamulato danisi
Kaamimchi yaanamdamuna garageenataa
Saemamuto bhoopataina sreevaemkataesudu maaku
Aamukonivumdagaa maayamtavaaru vaeree


ihaparamulakunu - ఇహపరములకును

ఇహపరములకును (రాగం: ) (తాళం : )

ప|| ఇహపరములకును ఏలికవు | బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||

చ|| వేయికరంబుల వివిధాయుధంబుల | దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు | పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||

చ|| కదిమి దుష్టులను గతము చేసితివి | త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ | బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||

చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు | కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన | భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||

ihaparamulakunu (Raagam: ) (Taalam: )

pa|| ihaparamulakunu Elikavu | bahurUpaMbula prahlAdavaraduDu ||

ca|| vEyikaraMbula vividhAyudhaMbula | dAyala naDacina daivamavu |
nIyaMdunnavi niKila jagaMbulu | pAyaka mammElu prahlAdavarada ||

ca|| kadimi duShTulanu gatamu cEsitivi | tridaSula gAcina dEvuDavu |
vadala kiMdariki varamulosaMgaga | bratikiti midivO prahlAdavarada ||

ca|| SrIvallaBuDavu cittajaguruDavu | kAvalasinacO kaluguduvu |
SrIvEMkaTAdrini SrI ahObalAna | BAviMtu nImUrti prahlada varada ||

isuka pAtara - ఇసుక పాతర

ఇసుక పాతర (రాగం: ) (తాళం : )

ప|| ఇసుక పాతర యిందుకేది కడగురుతు | రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి ||

చ|| బయలు వలె నుండును పట్టరాదు వలపు | మొయిలి వలె నుండును ముద్దు శాయరాదు |
నియతము లేదిందుకు నేరిచిన వారి సొమ్ము | క్రియ యెరుంగు తా నన్ను గెరలించ నేటికి ||

చ|| గాలివలె బారుచుండు కానరాదు మనసు | పాలవలె బొంగుచుండు పక్కన నణగదు |
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగ గుజ్జు | లోలోనే మమ్ము నింత లోచి చూడనేటికి ||

చ|| వెన్నెలే కాయుచు నుండు వింతగాను వయసు | అన్నిటా వసంత ఋతువై యుండ బోదు |
వున్నతి శ్రీ వేంకటేశుడుండ నుండ జవి బుట్ట | మన్నించె యింక మారు మాటలాడ నేటికి ||

isuka pAtara (Raagam: ) (Taalam: )

pa|| isuka pAtara yiMdukEdi kaDagurutu | rasikuDa nannu niMta ravva SAya nETiki ||

ca|| bayalu vale nuMDunu paTTarAdu valapu | moyili vale nuMDunu muddu SAyarAdu |
niyatamu lEdiMduku nEricina vAri sommu | kriya yeruMgu tA nannu geraliMca nETiki ||

ca|| gAlivale bArucuMDu kAnarAdu manasu | pAlavale boMgucuMDu pakkana naNagadu |
yElIlA geluvarAdu yekkitE yEnuga gujju | lOlOnE mammu niMta lOci cUDanETiki ||

ca|| vennelE kAyucu nuMDu viMtagAnu vayasu | anniTA vasaMta Rutuvai yuMDa bOdu |
vunnati SrI vEMkaTESuDuMDa nuMDa javi buTTa | manniMce yiMka mAru mATalADa nETiki ||


ivi sEyaga nEnalasuDa - ఇవి సేయగ నేనలసుడ

ఇవి సేయగ (రాగం: ) (తాళం : )

ప|| ఇవి సేయగ నేనలసుడ యెటువలె మోక్షంబడిగెదను |
వివరముతోడుత నీవు సులభూడవు విష్ణుడ నిన్నే కొలిచెదగాక ||

చ|| జపయజ్ఞదానకర్మంబులు యెంచగ జిరకాలఫలంబులు |
యెపుడు బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు |
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు |
వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకు గారణంబులు ||

చ|| రవిచంద్ర గ్రహతారాబలములు భువిలో గామ్యఫలములు |
తవిలిన పంచేంద్రియ నిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు |
అవిరళ ధర్మార్థ కామంబులు మఱియైశ్వర్యములకు మూలములు |
ఆవల గ్రహణకానాలుష్ఠానము లధికఫలంబులు ఆశామయము ||

చ|| పరగ సప్తసంతాన బ్రాహ్మణ తర్పణములు ఖ్యాతిసుకృతములు |
అరయ బుత్రదార క్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము |
హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొసగెడిదాతవు |
సరగున నీవే దయతో రక్షించజాలుదు వేకాలమును మమ్ములను ||

ivi sEyaga (Raagam: ) (Taalam: )

pa|| ivi sEyaga nEnalasuDa yeTuvale mOkShaMbaDigedanu |
vivaramutODuta nIvu sulaBUDavu viShNuDa ninnE kolicedagAka ||

ca|| japayaj~jadAnakarmaMbulu yeMcaga jirakAlaPalaMbulu |
yepuDu buNyatIrthasnAnamulu yila pApavimOcanamulu |
aparimita dEvatAMtaraBajanalu AyAlOkaprAptulu |
vupavAsAdi niyamavratamulu tapOniShThaku gAraNaMbulu ||

ca|| ravicaMdra grahatArAbalamulu BuvilO gAmyaPalamulu |
tavilina paMcEMdriya nigrahaMbulu tanudharulaku durlaBamulu |
aviraLa dharmArtha kAmaMbulu marxiyaiSvaryamulaku mUlamulu |
Avala grahaNakAnAluShThAnamu ladhikaPalaMbulu ASAmayamu ||

ca|| paraga saptasaMtAna brAhmaNa tarpaNamulu KyAtisukRutamulu |
araya butradAra kShEtrasaMgraha maMdarikini saMsAraBOgamu |
hari narahari SrIvEMkaTESvarA aKilamu nosageDidAtavu |
saraguna nIvE dayatO rakShiMcajAludu vEkAlamunu mammulanu ||


ilayunu naBamunu - ఇలయును నభమును

ఇలయును నభమును (రాగం: ) (తాళం : )

ప|| ఇలయును నభమును నేకరూపమై | జలజల గోళ్ళు జళిపించితివి ||

చ|| ఎడసిన నలముక హిరణ్యకశిపుని | దొడికిపట్టి చేతుల బిగిసి |
కెడసి తొడలపై గిరిగొన నదుముక | కడుపుచించి కహకహ నవ్వితివి ||

చ|| రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు | గుప్పుచు లాలలు గురియుచును |
కప్పినబెబ్బులి కసరుహుంకృతుల | దెప్పరపసురల ధృతి యణచితివి ||

చ|| పెళపెళనార్చుచు బెడబొబ్బలిడుచు | థళథళ మెరవగ దంతములు |
ఫళఫళ వీరవిభవరస రుధిరము | గుళగుళ దిక్కుల గురియించితివి ||

చ|| చాతినప్రేవుల జన్నిదములతో | వాతెరసింహపు వదనముతో |
చేతులువేయిట జెలగి దితిసుతుని | పోతర మణపుచు భువి మెరసితివి ||

చ|| అహోబలమున నతిరౌద్రముతో | మహామహిమల మలయుచును |
తహతహ మెదుపుచు దగువేంకటపతి | యిహము బరము మాకిపుడొసగితివి ||

ilayunu naBamunu (Raagam: ) (Taalam: )

pa|| ilayunu naBamunu nEkarUpamai | jalajala gOLLu jaLipiMcitivi ||

ca|| eDasina nalamuka hiraNyakaSipuni | doDikipaTTi cEtula bigisi |
keDasi toDalapai girigona nadumuka | kaDupuciMci kahakaha navvitivi ||

ca|| roppula nUrpula roccula kasarulu | guppucu lAlalu guriyucunu |
kappinabebbuli kasaruhuMkRutula | depparapasurala dhRuti yaNacitivi ||

ca|| peLapeLanArcucu beDabobbaliDucu | thaLathaLa meravaga daMtamulu |
PaLaPaLa vIraviBavarasa rudhiramu | guLaguLa dikkula guriyiMcitivi ||

ca|| cAtinaprEvula jannidamulatO | vAterasiMhapu vadanamutO |
cEtuluvEyiTa jelagi ditisutuni | pOtara maNapucu Buvi merasitivi ||

ca|| ahObalamuna natiraudramutO | mahAmahimala malayucunu |
tahataha medupucu daguvEMkaTapati | yihamu baramu mAkipuDosagitivi ||