IBavamunaku jUDa - ఈభవమునకు జూడ

ఈభవమునకు జూడ (రాగం: ) (తాళం : )

ప|| ఈభవమునకు జూడ నేది గడపల తనదు- | ప్రాభవం బెడలించి బాధ పెట్టించె ||

చ|| చెప్పించె బ్రియము వలసినవారలకునెల్ల | రప్పించె నెన్నడును రానిచోట్లకును |

నొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను | తిప్పించె కోరికల తిరిగి నలుగడల ||

చ|| పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల | కట్టించె సంసారకలితబంధముల |

పెట్టించె ఆసలను పెడకొడముల దన్ను | తిట్టించె నిజద్రవ్యదీనకులచేత ||

చ|| బెదరించె దేహంబు పెనువేదనలచేత | చెదరించె శాంతంబు చెలగి చలమునను |

విదళించె భవములను వేంకటేశ్వరు గొలిచి | పదిలించె నతనికృప పరమసౌఖ్యములు ||


IBavamunaku jUDa (Raagam: ) (Taalam: )

pa|| IBavamunaku jUDa nEdi gaDapala tanadu- | prABavaM beDaliMci bAdha peTTiMce ||

ca|| ceppiMce briyamu valasinavAralakunella | rappiMce nennaDunu rAnicOTlakunu |

noppiMce nAsalaku vOraMta proddunanu | tippiMce kOrikala tirigi nalugaDala ||

ca|| puTTiMce hEyaMpuBOgayOnulanella | kaTTiMce saMsArakalitabaMdhamula |

peTTiMce Asalanu peDakoDamula dannu | tiTTiMce nijadravyadInakulacEta ||

ca|| bedariMce dEhaMbu penuvEdanalacEta | cedariMce SAMtaMbu celagi calamunanu |

vidaLiMce Bavamulanu vEMkaTESvaru golici | padiliMce natanikRupa paramasauKyamulu ||


Ipeku nitaDu dagu - ఈపెకు నితడు దగు

ఈపెకు నితడు (రాగం: ) (తాళం : )

ఈపెకు నితడు దగు నితనికీపె దగు
చూపులకు పండుగాయ శోభనము నేడు ||

పిలువరె పెండ్లి కూతుబెండ్లిపీటమీదకి
చెలగి తానెదురు చూచీ దేవుడు
బలువుగా నిద్దరికి బాసికములు గట్టరె
కలిమెల్ల మెరసి సింగారించరే ||

ఆతలదెచ్చి పెట్టరె ఆ పెండ్లి కూతురును
యీతడే జంట సోభన మిద్దరికిని
కాతరాన బువ్వానకు గక్కన బెట్టరె మీరు
రేతిట నుండియు వేగిరించేరు వీరు ||

పానుపు పరచరె బలునాగవల్లి నేడు
పూని తెరవేయరె పోలతులాల
ఆనుక శ్రీవేంకటేశుడలమేలుమంగయును
లోననె భూకాంతయును లోలువైరి తాము ||

Ipeku nitaDu (Raagam: ) (Taalam: )

Ipeku nitaDu dagu nitanikIpe dagu
chUpulaku paMDugAya SObhanamu nEDu ||

piluvare peMDli kUtubeMDlipITamIdaki
chelagi tAneduru chUchI dEvuDu
baluvugA niddariki bAsikamulu gaTTare
kalimella merasi siMgAriMcharE ||

Ataladechchi peTTare A peMDli kUturunu
yItaDE jaMTa sObhana middarikini
kAtarAna buvvAnaku gakkana beTTare mIru
rEtiTa nuMDiyu vEgiriMchEru vIru ||

pAnupu parachare balunAgavalli nEDu
pUni teravEyare pOlatulAla
Anuka SrIvEMkaTESuDalamElumaMgayunu
lOnane bhUkAMtayunu lOluvairi tAmu ||


IdEha vikAramunaku - ఈదేహ వికారమునకు

ఈదేహ వికారమునకు(రాగం: ) (తాళం : )

ప|| ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము | మోదమెరంగని మోహము ముందర గననీదు ||

చ|| నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు | సత్యాలాపవిచారము జరగదు లోభికిని |

హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును | ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు ||

చ|| సతతానందవికాసము సంధించదు తామసునకు | గతకల్మష భావము దొరకదు వ్యసనికిని |

జితకాముడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి | అతులితగంభీర గుణంబలవడ దధమునకు ||

చ|| శ్రీవేంకటగిరి వల్లభుసేవా తత్పరభావము- | ద్రోవ మహాలంపటులకు తోపదు తలపునకు |

దేవోత్తముడగు నీతని దివ్యామృతమగు నామము | సేవింపగ నితరులకును చిత్తంబొడబడదు ||

IdEha vikAramunaku(Raagam: ) (Taalam: )

pa|| IdEha vikAramunaku nEdiyu gaDapala Ganamu | mOdameraMgani mOhamu muMdara gananIdu ||

ca|| nityAnityavivEkamu nIrasunaku nonagUDadu | satyAlApavicAramu jaragadu lOBikini |

hatyAvirahita karmamu aMTadu krUrAtmunakunu | pratyakShaMbagu pApamu pAyadu kaShTunaku ||

ca|| satatAnaMdavikAsamu saMdhiMcadu tAmasunaku | gatakalmaSha BAvamu dorakadu vyasanikini |

jitakAmuDu dAnavuTaku siddhiMpadu duShkarmiki | atulitagaMBIra guNaMbalavaDa dadhamunaku ||

ca|| SrIvEMkaTagiri vallaBusEvA tatparaBAvamu- | drOva mahAlaMpaTulaku tOpadu talapunaku |

dEvOttamuDagu nItani divyAmRutamagu nAmamu | sEviMpaga nitarulakunu cittaMboDabaDadu ||


IdigAka soubhAgyamidigAka - ఈదిగాక సౌభాగ్యమిదిగాక

ఈదిగాక సౌభాగ్యమిదిగాక (రాగం:ముఖ్హారి ) (తాళం : )

ఈదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి
ఇదిగాక వైభవం బిక నొకతిగలదా? ||

అతివ జన్మము సఫలమై పరమయొగి వలె
నితర మొహోపేక్ష లిన్ని యును విదిచె
సతి కోరికలు మహాశాంతమై ఇదెచూడ
సతత విగ్నాన వాసనవోలె నుండె ||

తరుణి హ్రుదయము క్రుతార్ఢత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయమంది ఇంతలో
సరిలేక మనసు నిశ్చల భావమాయ ||

శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్వ
భావంబు నిజముగా బట్టె చెలియాత్మ
దేవోత్తముని క్రుపాధీనురాలై ఇపుడు
లావణ్యవతికి నుల్లంబు తిరమాయ ||

IdigAka soubhAgyamidigAka (Raagam:muKhAri ) (Taalam: )

IdigAka soubhAgyamidigAka tapamu maRi
idigAka vaibhavaM bika nokatigaladA? ||

ativa janmamu saphalamai paramayogi vale
nitara mohOpEkSha linni yunu vidiche
sati kOrikalu mahASAMtamai idechUDa
satata vignAna vAsanavOle nuMDe ||

taruNi hrudayamu krutArDhata boMdi vibhumIdi
paravaSAnaMda saMpadaku niravAya
sarasijAnana manO jayamaMdi iMtalO
sarilEka manasu niSchala bhAvamAya ||

SrI vEMkaTESvaruni jiMtiMchi paratatva
bhAvaMbu nijamugA baTTe cheliyAtma
dEvOttamuni krupAdhInurAlai ipuDu
lAvaNyavatiki nullaMbu tiramAya ||


Itani mahimalu eMtani - ఈతని మహిమలు ఎంతని

ఈతని మహిమలు(రాగం: ) (తాళం : )

ప|| ఈతని మహిమలు ఎంతని చెప్పెద | చేతుల మ్రొక్కెద చెలగుచు నేను ||

చ|| శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి | నానా విధకర నఖరుడు |

దానవ దైత్య విదారుడు విష్ణుడు | తానకమగు మా దైవంబితడు ||

చ|| అహోబలేశుడు ఆదిమపురుషుడు | బహు దేవతాసార్వ భౌముడు |

సహజానందుడు సర్వరక్షకుడు | ఇహపరము లొసగు యేలిక యితడు ||

చ|| కేవలుడగు సుగ్రీవనృసింహుడు | భావించ సుజన పాలకుడితడు |

శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు | వేవేలకు వేల్పు ఇతడు ||

Itani mahimalu (Raagam: ) (Taalam: )

pa|| Itani mahimalu eMtani ceppeda | cEtula mrokkeda celagucu nEnu ||

ca|| SrI narasiMhuDu cinmaya mUriti | nAnA vidhakara naKaruDu |

dAnava daitya vidAruDu viShNuDu | tAnakamagu mA daivaMbitaDu ||

ca|| ahObalESuDu AdimapuruShuDu | bahu dEvatAsArva BaumuDu |

sahajAnaMduDu sarvarakShakuDu | ihaparamu losagu yElika yitaDu ||

ca|| kEvaluDagu sugrIvanRusiMhuDu | BAviMca sujana pAlakuDitaDu |

SrIvEMkaTESuDu cittaja janakuDu | vEvElaku vElpu itaDu ||


Eetani golichitaenae yinni - ఈతని గొలిచితేనే యిన్ని

ఈతని గొలిచితేనే (రాగం:గౌళ ) (తాళం : )

ఈతని గొలిచితేనే యిన్ని గొలలును దీరు చేతనబెట్టుపుణ్యాలు చేరువనే కలుగు

పట్టి కాళింగుని దోలి పాముకొల దీర్చినాడు బట్టబాయిటనే రేపల్లెవారికి అట్టె పూతన జంపి ఆడుగొల దీర్చినాడు గట్టిగా గృష్ణుడు లోకమువారికెల్లను

బలురావణు జంపి బాపనకొల దీర్చినాడు యిలమీద గలిగినఋషులకెల్లా కొలదిమీరినయట్టికోతికొల దీర్చినాడు సొలసి రాఘవుడదె సుగ్రీవునికిని

వొలిసి పురాలు చొచ్చి పూర గొల దీర్చినాడు అల తనదాసులైన అమరులకు సిలుగుగొలలు దీర్చి సేన వరా లిచ్చినాడు చెలగి పరుషలకు శ్రీవేంకటేశుడు


Eetani golichitaenae (Raagam: Gaula) (Taalam: )

Eetani golichitaenae yinni golalunu deeru Chaetanabettupunyaalu chaeruvanae kalugu

Patti kaalimguni doli paamukola deerchinaadu Battabaayitanae raepallevaariki Atte pootana jampi aadugola deerchinaadu Gattigaa grshnudu lokamuvaarikellanu

Baluraavanu jampi baapanakola deerchinaadu Yilameeda galiginarshulakellaa Koladimeerinayattikotikola deerchinaadu Solasi raaghavudade sugreevunikini

Volisi puraalu chochchi poora gola deerchinaadu Ala tanadaasulaina amarulaku Silugugolalu deerchi saena varaa lichchinaadu Chelagi parushalaku sreevaemkataesudu


ItaDE raghurAmuDItaDEkAMgavIruDu - ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు

ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు (రాగం: ) (తాళం : )

ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు|యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు||

ఖరదూషణాదులను ఖండతుండముల సేసె|అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవి కొండలచేత సముద్రము బంధించె|ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము||

కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల|తోడనే రావణుజంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె|యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన||


పుడమియంతయు( గాచె పొందుగా తనంతలేసి-|కొడుకుల( గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె|అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె||

ItaDE raghurAmuDItaDEkAMgavIruDu (Raagam: ) (Taalam: )

ItaDE raghurAmuDItaDEkAMgavIruDu|yItaDu chEsina chEta lenniyainA kalavu

kharadUshaNAdulanu khaMDatuMDamula sEse|arudugA vAli nokkayammuna nEse
saravi koMDalachEta samudramu baMdhiMche|iravai vibhIshaNunikichche laMkArAjyamu||

kUDapeTTe vAnarula, kuMbhakarNAdidaityula|tODanE rAvaNujaMpe duramu gelche
vEDukatO sItAdEvi kUDenu pushpakamekke|yIDu jODai siMhAsana mEle nayOdhyalOna

puDamiyaMtayu( gAche poMdugA tanaMtalEsi-|koDukula( gAMchenu kuSalavula
yeDayaka SrIvEMkaTESuDai varamulichche|aDari tArakabrahmamai ide velase

Sung By:Balakrishna Prasad