eMtapApakarmamAya - ఎంతపాపకర్మమాయ

ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ (రాగం: ) (తాళం : )

ప|| ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ | వింతవారితోడిపొందు వేసటాయ దైవమా ||

చ|| చూడజూడ గొత్తలాయ చుట్టమొకడు లేడాయ | వీడుబట్టు అలుచాయ వేడుక లుడివోయను |
జోడుజోడు గూడదాయ చొక్కుదనము మానదాయ | యేడకేడ తలపోత యెంతసేసె దైవమా ||

చ|| నీరులేనియేరు దాటనేర దెంతేలోతాయ | మేరవెళ్ళ నీదడాయ మేటి జేరడాయను |
తోరమైన ఆసలుబ్బి తోవ గానిపించదాయ | కోరి రాకపోకచేత కొల్లబోయ గాలము ||

చ|| తల్లిదండ్రి దాత గురువు తానెయైననాచారి- | వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము |
కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు | మొల్లమాయ నామనసు మోదమాయ దైవమా ||

eMtapApakarmamAya (Raagam: ) (Taalam: )

pa|| eMtapApakarmamAya yeMtaviMtaciMtalAya | viMtavAritODipoMdu vEsaTAya daivamA ||

ca|| cUDajUDa gottalAya cuTTamokaDu lEDAya | vIDubaTTu alucAya vEDuka luDivOyanu |
jODujODu gUDadAya cokkudanamu mAnadAya | yEDakEDa talapOta yeMtasEse daivamA ||

ca|| nIrulEniyEru dATanEra deMtElOtAya | mEraveLLa nIdaDAya mETi jEraDAyanu |
tOramaina Asalubbi tOva gAnipiMcadAya | kOri rAkapOkacEta kollabOya gAlamu ||

ca|| tallidaMDri dAta guruvu tAneyainanAcAri- | vallaBuMDu nAku mEluvaMTidAya janmamu |
kallagAdu vEMkaTESuGanuni pAdasEva nAku | mollamAya nAmanasu mOdamAya daivamA ||


eMtanErcenE I kaliki - ఎంతనేర్చెనే ఈ కలికి

ఎంతనేర్చెనే ఈ కలికి (రాగం: ) (తాళం : )

ప|| ఎంతనేర్చెనే ఈ కలికి | ఇంతుల కేటకే ఇంతేసి పగటు ||

చ|| చలముల నెరపుచు సవతుల దూరుచు | సలిగెల పొరలీ జవరాలు |
చెలువుని సొలయుచు చేతులు చాపుచు | కెలపుల నగవుల కెరలీని ||

చ|| సాటికి పెనగుచు సణగుచు రాల్చుచు | నీటున మురిసీ నెరజాణ |
మాటల గునియుచు మదమున మొరయుచు | జూటుదనంబుల జూచీని ||

చ|| మంతన మాడుచు మలయుచు నవ్వుచు | పంతము లాడీ పసలాడీ |
ఇంతలో శ్రీవేంకటేశుడు నన్నేలె | పొంతనుండి నను పొగడీని ||

eMtanErcenE I kaliki (Raagam: ) (Taalam: )

pa|| eMtanErcenE I kaliki | iMtula kETakE iMtEsi pagaTu ||

ca|| calamula nerapucu savatula dUrucu | saligela poralI javarAlu |
celuvuni solayucu cEtulu cApucu | kelapula nagavula keralIni ||

ca|| sATiki penagucu saNagucu rAlcucu | nITuna murisI nerajANa |
mATala guniyucu madamuna morayucu | jUTudanaMbula jUcIni ||

ca|| maMtana mADucu malayucu navvucu | paMtamu lADI pasalADI |
iMtalO SrIvEMkaTESuDu nannEle | poMtanuMDi nanu pogaDIni ||


eMtaTivAralu nevvarunu - ఎంతటివారలు నెవ్వరును

ఎంతటివారలు నెవ్వరును (రాగం: ) (తాళం : )

ప|| ఎంతటివారలు నెవ్వరును హరి | జింతించక నిశ్చింతలు గారు ||

చ|| అతిజితేంద్రియులు ననశనవ్రతులు- | నతులతపోధనులగువారు |
చతురాననగురుస్మరణము దొరకక | తతి నూరక పుణ్యతములు గారు ||

చ|| అనఘులు శాంతులు సధ్యాత్మతతులు- | ననుపమపుణ్యులు యాజకులు |
వనజోదరు ననవరతము దలచక | వినుతిస్మృతిని విబుధులు గారు ||

చ|| దురితవిదూరులు దుర్మతిహీనులు | నిరతానందులు నిత్యులును |
తిరువేంకటగిరిదేవుని గొలువక | పరమార్గమునకు బ్రహ్మలు గారు ||

eMtaTivAralu nevvarunu (Raagam: ) (Taalam: )

pa|| eMtaTivAralu nevvarunu hari | jiMtiMcaka niSciMtalu gAru ||

ca|| atijitEMdriyulu nanaSanavratulu- | natulatapOdhanulaguvAru |
caturAnanagurusmaraNamu dorakaka | tati nUraka puNyatamulu gAru ||

ca|| anaGulu SAMtulu sadhyAtmatatulu- | nanupamapuNyulu yAjakulu |
vanajOdaru nanavaratamu dalacaka | vinutismRutini vibudhulu gAru ||

ca|| duritavidUrulu durmatihInulu | niratAnaMdulu nityulunu |
tiruvEMkaTagiridEvuni goluvaka | paramArgamunaku brahmalu gAru ||


eMtaTi vADavu ninnEmani - ఎంతటి వాడవు నిన్నేమని

ఎంతటి వాడవు (రాగం: ) (తాళం : )

ప|| ఎంతటి వాడవు నిన్నేమని నుతింతును | వింతలు నీకమర కుండగ విచారించే ||

చ|| పాల సముద్రములోనం బవ్వళించి యుండే నీకు | బాలుండవై తేనెవెన్న బాతాయెనా |
కాలమెల్లను శ్రీకాంత కౌగిట నుండ నీకు | గొల్లవైతే గొల్లతలం గూడ వేడుకాయెనా ||

చ|| పరమ పదమునందు బ్రహ్మమై వుండే | పెరిగీ రేపల్లెవాడ ప్రియమాయెనా |
సురలనెల్ల గావగ సులభుండవైన నీకు | గరిమెతోడ పసులకావగ వేడుకాయె ||

చ|| ఏ ప్రొద్దు ముక్తుల నెనసి వుండే నీకు | గోపాలురతో గూడుండ కోరికాయెనా |
బాపురె యలమేల్మంగపతి శ్రీ వేంకటేశ్వర | యే ప్రొద్దు నిట్టి లీలలే హితవాయెనా ||

eMtaTi vADavu (Raagam: ) (Taalam: )

pa|| eMtaTi vADavu ninnEmani nutiMtunu | viMtalu nIkamara kuMDaga vicAriMcE ||

ca|| pAla samudramulOnaM bavvaLiMci yuMDE nIku | bAluMDavai tEnevenna bAtAyenA |
kAlamellanu SrIkAMta kaugiTa nuMDa nIku | gollavaitE gollatalaM gUDa vEDukAyenA ||

ca|| parama padamunaMdu brahmamai vuMDE | perigee rEpallevADa priyamAyenA |
suralanella gAvaga sulaBuMDavaina nIku | garimetODa pasulakAvaga vEDukAye ||

ca|| E proddu muktula nenasi vuMDE nIku | gOpAluratO gUDuMDa kOrikAyenA |
bApure yalamElmaMgapati SrI vEMkaTESvara | yE proddu niTTi lIlalE hitavAyenA ||


eMtacEsina tanakEdi - ఎంతచేసిన తనకేది తుద

ఎంతచేసిన తనకేది (రాగం: ) (తాళం : )

ప|| ఎంతచేసిన తనకేది తుద | చింత శ్రీహరిపై జిక్కుటే చాలు ||

చ|| ఎడపక పుణ్యాలెన్ని చేసినా | గడమే కాకిక గడయేది |
తడబడ హరియే దైవమనుచు మది | విడువకవుండిన వెరవే చాలు ||

చ|| యెన్నితపములివి యెట్లజేసినా | అన్నువ కధికము అలవేది |
వన్నెల గలగక వనజాక్షునిపై | వున్న చిత్తమది వొక్కటే చాలు ||

చ|| యిందరి వాదములెల్ల గెలిచినా | కందే గాకిక గరిమేది |
యిందరినేలిన యీవేంకటపతి | పొందుగ మహిమల పొడవే చాలు ||

eMtacEsina tanakEdi (Raagam: ) (Taalam: )

pa|| eMtacEsina tanakEdi tuda | ciMta SrIharipai jikkuTE cAlu ||

ca|| eDapaka puNyAlenni cEsinA | gaDamE kAkika gaDayEdi |
taDabaDa hariyE daivamanucu madi | viDuvakavuMDina veravE cAlu ||

ca|| yennitapamulivi yeTlajEsinA | annuva kadhikamu alavEdi |
vannela galagaka vanajAkShunipai | vunna cittamadi vokkaTE cAlu ||

ca|| yiMdari vAdamulella gelicinA | kaMdE gAkika garimEdi |
yiMdarinElina yIvEMkaTapati | poMduga mahimala poDavE cAlu ||

eMtachuTTamO nIkunidivO - ఎంతచుట్టమో నీకునిదివో

ఎంతచుట్టమో నీకునిదివో (రాగం: ) (తాళం : )

ఎంతచుట్టమో నీకునిదివో ఆపె
సంతసపు వలపుల జడిసీ నాపె ||

తేనెగారే పెదవుల తేటమాటలాడీ నాపె
నానబెట్టి సెలవుల నవ్వీనాపె
సానబెట్టిన చూపులు జరిపించీ నీపైనానాపె
మోనముతో దొమ్ములను మొక్కినాపె ||

నిండుజెక్కుటద్దముల నీడలు చూపీనాపె
గండు దుమ్మిద కొప్పుతోగదిమీనాపె
కొండలవంటి చన్నులకొనలు దాకించీ నాపె
మెండుజిగురుచేతుల మెచ్చు మెచ్చీ నాపె ||

ఆయపు మెఋగు మేన ఆసలురేచీ నాపె
పాయపు సిగ్గులచేత భ్రమించీ నాపె
మోయరాని పిరుదుల మురిపెము చూసీనాపె
యీ యెడ శ్రీవేంకటేశ యెనసె నిన్నాపె ||

eMtachuTTamO nIkunidivO (Raagam: ) (Taalam: )

eMtachuTTamO nIkunidivO Ape
saMtasapu valapula jaDisI nApe ||

tEnegArE pedavula tETamATalADI nApe
nAnabeTTi selavula navvInApe
sAnabeTTina chUpulu jaripiMchI nIpainAnApe
mOnamutO dommulanu mokkinApe ||

niMDujekkuTaddamula nIDalu chUpInApe
gaMDu dummida kopputOgadimInApe
koMDalavaMTi channulakonalu dAkiMchI nApe
meMDujiguruchEtula mechchu mechchI nApe ||

Ayapu meRugu mEna AsalurEchI nApe
pAyapu siggulachEta bhramiMchI nApe
mOyarAni pirudula muripemu chUsInApe
yI yeDa SrIvEMkaTESa yenase ninnApe ||


eMta vanikOkAni - ఎంత వనికోకాని

ఎంత వనికోకాని (రాగం: ) (తాళం : )

ఎంత వనికోకాని యెఋగనేను
చెంతనే తెలుసుకో నేజెప్పితి నీ సుద్దులు ||

వదలే జారు దురుము వైపుగా ముడుచు కొంటా
కదలు గన్నుల చూపు కాడి పారగా
మదమువలెనే పెంజెమటలు చెక్కులగార
వెదకీ నెవ్వతో నిన్ను వీదుల వీదులను ||

అడచి చన్నులపై బయ్యద బిగిఇంచుకొంటా
కడలేని నిట్టూర్పులు కడుమగాను
తడబడ బెదవుల తమ్మబేంట్లు రాలగా
అడిగీ నీ వున్నచోటు అంగనల నెల్లాను ||

వుక్కుమీరి కరముల వొడిమీద బెట్టుకొని
మిక్కిలి నీ కాపెపొందు మీ దెత్తగా
ఇక్కడ శ్రీవేంకటేశ యిటు నన్ను గూడేవు
చొక్కుచు నీ మేడ దిక్కే చూచీ దానదివో ||

eMta vanikOkAni (Raagam: ) (Taalam: )

eMta vanikOkAni yeRuganEnu
cheMtanE telusukO nEjeppiti nI suddulu ||

vadalE jAru durumu vaipugA muDuchu koMTA
kadalu gannula chUpu kADi pAragA
madamuvalenE peMjemaTalu chekkulagAra
vedakI nevvatO ninnu vIdula vIdulanu ||

aDachi channulapai bayyada bigiiMchukoMTA
kaDalEni niTTUrpulu kaDumagAnu
taDabaDa bedavula tammabEMTlu rAlagA
aDigI nI vunnachOTu aMganala nellAnu ||

vukkumIri karamula voDimIda beTTukoni
mikkili nI kApepoMdu mI dettagA
ikkaDa SrIvEMkaTESa yiTu nannu gUDEvu
chokkuchu nI mEDa dikkE chUchI dAnadivO ||