Ettu gelutu bamchaemdriyamula - ఎట్టు గెలుతు బంచేంద్రియముల

ఎట్టు గెలుతు (రాగం: కన్నడగౌళ ) (తాళం : )

ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే
బట్టరానిఘనబలవంతములు

కడునిసుమంతలు కన్నులచూపులు
ముడుగక మిన్నులు ముట్టెడిని
విడువక సూక్ష్మపువీనులు యివిగో
బడిబడి నాదబ్రహ్మము మోచె

అదె తిలపుష్పంబంతనాసికము
కదిసి గాలి ముడెగట్టెడని
పొదిగి నల్లెడే పొంచుక నాలికె
మొదలుచు సర్వము మింగెడిని

బచ్చెనదేహపుపైపొర సుఖమే
యిచ్చ బ్రపంచం బీనెడిని
చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరు
దచ్చి తలచగా దరిచెరెడిని

Ettu gelutu (Raagam: Kannadagaula ) (Taalam: )

Ettu gelutu bamchaemdriyamula nae
Battaraanighanabalavamtamulu

Kadunisumamtalu kannulachoopulu
Mudugaka minnulu muttedini
Viduvaka sookshmapuveenulu yivigo
Badibadi naadabrahmamu moche

Ade tilapushpambamtanaasikamu
Kadisi gaali mudegattedani
Podigi nalledae pomchuka naalike
Modaluchu sarvamu mimgedini

Bachchenadaehapupaipora sukhamae
Yichcha brapamcham beenedini
Chechchera manasidi sreevaemkataesvaru
Dachchi talachagaa daricheredini


eTTu gUDe beMDli - ఎట్టు గూడె బెండ్లి

ఎట్టు గూడె (రాగం: ) (తాళం : )

ప|| ఎట్టు గూడె బెండ్లి యోగమిద్దరికి నీవేళ | అట్టు లక్ష్మీనారాయణ యోగము ||

చ|| నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు | పొలతి నీకు గూడె పొంతనాలు |
వలుద చక్రవాకాలు వనితకు చాలు నీకు | యెలమి జక్రాయుధుడ నిద్దరికి దగును ||

చ|| తరుణి నీలకుంతల తగునీల వర్ణుడవు | సరుస మీకే తగు సమ్మంధము |
నిరతి హేమవర్ణకె నీవు పీతాంబరుడవు | పరవి నిద్దరకొక్క జాతియ్యము ||

చ|| పాలవెల్లి బుట్టె నాకె పాలవెల్లి యిల్లు నీకు | మేలు మేలు యిద్దరికి మేనవావి |
యీలీల శ్రీ వేంకటేశ యింతి నీవు గూడితివి | పోలి మాకు పెట్టరాదా సోబన విడేలు ||

eTTu gUDe (Raagam: ) (Taalam: )

pa|| eTTu gUDe beMDli yOgamiddariki nIvELa | aTTu lakShmInArAyaNa yOgamu ||

ca|| nelata kamalavAsi nIvu kamalAkShuDavu | polati nIku gUDe poMtanAlu |
valuda cakravAkAlu vanitaku cAlu nIku | yelami jakrAyudhuDa niddariki dagunu ||

ca|| taruNi nIlakuMtala tagunIla varNuDavu | sarusa mIkE tagu sammaMdhamu |
nirati hEmavarNake nIvu pItAMbaruDavu | paravi niddarakokka jAtiyyamu ||

ca|| pAlavelli buTTe nAke pAlavelli yillu nIku | mElu mElu yiddariki mEnavAvi |
yIlIla SrI vEMkaTESa yiMti nIvu gUDitivi | pOli mAku peTTarAdA sObana viDElu ||


eTTivArikinella - ఎట్టివారికినెల్ల

ఎట్టివారికినెల్ల (రాగం: ) (తాళం : )

ప|| ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా- | యెట్టివారికి నింక నేది తోవయ్య ||

చ|| పాము జంపినయట్టిపాతకమున బెద్ద- | పాముమీద నీకు బవళించవలసె |
కోమలి జంపినకొరతవల్ల నొక్క- | కోమలి నెదబెట్టుకొని యుండవలసె ||

చ|| బండి విరిచినట్టిపాతకమున బెద్ద- | బండిబోయిడవై పనిసేయవలసె |
కొండవెరికినట్టిగుణమున దిరుమల- | కొండమీద నీకు గూచుండవలసె ||

eTTivArikinella (Raagam: ) (Taalam: )

pa|| eTTivArikinella niTTikarmamulu mA- | yeTTivAriki niMka nEdi tOvayya ||

ca|| pAmu jaMpinayaTTipAtakamuna bedda- | pAmumIda nIku bavaLiMcavalase |
kOmali jaMpinakoratavalla nokka- | kOmali nedabeTTukoni yuMDavalase ||

ca|| baMDi viricinaTTipAtakamuna bedda- | baMDibOyiDavai panisEyavalase |
koMDaverikinaTTiguNamuna dirumala- | koMDamIda nIku gUcuMDavalase ||


Ettayinaa jaesuko - ఎట్టయినా జేసుకో

ఎట్టయినా జేసుకో (రాగం: ఆహిరి) (తాళం : )

ఎట్టయినా జేసుకో ఇక నీ చిత్తము నన్ను
పట్టిచ్చె మాగురుడు నీపాదాలు విడువను

పోడిమి నా నామములు పొద్దువొద్దు నుడిగీని
వీడేమడుగునోయని వెఱవకుమీ
నాడే నాయాచార్యుడు నాకు నన్నీ యిచ్చినాడు
నే డి దేలంటే నతని నేమము నే మానను

ప్రేమతో వీడు నన్నింట బెట్టుక పూజించీని
యేమిగారణమోయని యెంచుకోకుమీ
కామించి యాచార్యుడే కారణము నీకు నాకు
యీ మరులేలంటే నాతడిచ్చిన సొమ్మే నేను
పలుమారు వీడు నాపై వత్తిచేసీ నేటికని
వెలయ శ్రీవేంకటేశ వేసరతుమీ
యెలమి నాచార్యు డిదేపని చేసినాడు
నిలిచె గలకాలము నీకు నాకు బోదు

Ettayinaa jaesuko (Raagam: Aahiri) (Taalam: )

Ettayinaa jaesuko ika nee chittamu nannu
Pattichche maagurudu neepaadaalu viduvanu

Podimi naa naamamulu podduvoddu nudigeeni
Veedaemadugunoyani ve~ravakumee
Naadae naayaachaaryudu naaku nannee yichchinaadu
Nae di daelamtae natani naemamu nae maananu

Praemato veedu nannimta bettuka poojimcheeni
Yaemigaaranamoyani yemchukokumee
Kaamimchi yaachaaryudae kaaranamu neeku naaku
Yee marulaelamtae naatadichchina sommae naenu
Palumaaru veedu naapai vattichaesee naetikani
Velaya sreevaemkataesa vaesaratumee
Yelami naachaaryu didaepani chaesinaadu
Niliche galakaalamu neeku naaku bodu


eTTayinA jEyumu - ఎట్టయినా జేయుము

ఎట్టయినా జేయుము (రాగం: ) (తాళం : )

ప|| ఎట్టయినా జేయుము యిక నీచిత్తము | కిట్టిన నీ సంకీర్తనపరుడ ||

చ|| కొందరు జ్ఞానులు కొందరు భక్తులు | కొందరు వైరాగ్య కోవిదులు |
యిందరిలో నే నెవ్వడ గానిదె | సందడి హరి నీశరణాగతుడ ||

చ|| జపితలు గొందరు శాస్త్రులు గొందరు | ప్రపత్తి గొందరు బలువులు |
వుపమించగ నిన్నొకడా గానిందు | కపురుల నీడింగరీడ నేను ||

చ|| ఆచార్యపురుషులు అవ్వల గొందరు | యేచినసమయులై యేర్పడిరి |
కాచేటి శ్రీవేంకటపతి నేనైతే | తాచి నీదాసుల దాసుడను ||

eTTayinA jEyumu (Raagam: ) (Taalam: )

pa|| eTTayinA jEyumu yika nIcittamu | kiTTina nI saMkIrtanaparuDa ||

ca|| koMdaru j~jAnulu koMdaru Baktulu | koMdaru vairAgya kOvidulu |
yiMdarilO nE nevvaDa gAnide | saMdaDi hari nISaraNAgatuDa ||

ca|| japitalu goMdaru SAstrulu goMdaru | prapatti goMdaru baluvulu |
vupamiMcaga ninnokaDA gAniMdu | kapurula nIDiMgarIDa nEnu ||

ca|| AcAryapuruShulu avvala goMdaru | yEcinasamayulai yErpaDiri |
kAcETi SrIvEMkaTapati nEnaitE | tAci nIdAsula dAsuDanu ||


eTuvaMTi vilAsini - ఎటువంటి విలాసిని

ఎటువంటి విలాసిని (రాగం: ) (తాళం : )

ఎటువంటి విలాసిని యెంతజాణ యీ చెలువ
తటుకన నీకు దక్క దైవార జూడవయ్యా ||

మగువ మాటాడితేను మాణికాలు నిండుకొనీ
పగడాలు పెదవుల బచ్చిదేరీని
మగడి చూచితేను మంచినీలాలుప్పతిలీ
తగు నీకు నీ పెదిక్కు తప్పకచూడవయ్యా ||

పడతి జవ్వనమున బచ్చలు గమ్ముకొనీని
నడచితే వైడూర్యా లెడలీ గోళ్ళ
తొడిబడ నవ్వితేను తొరిగీని వజ్రాలు
వొడికమైనది యీపె వొరపు చూడవయ్యా ||

కొమ్మ ప్రియాల తేనెల గురిసీ బుశ్యరాగాలు
కుమ్మరించీ జెనకుల గోమేధికాలు
మమ్మరపు జెమటల ముత్తెపుసరాలి నిండీ
నెమ్మది శ్రీవేంకటేశ నీదేవి జూడవయ్యా ||

eTuvaMTi vilAsini (Raagam: ) (Taalam: )

eTuvaMTi vilAsini yeMtajANa yI cheluva
taTukana nIku dakka daivAra jUDavayyA ||

maguva mATADitEnu mANikAlu niMDukonI
pagaDAlu pedavula bachchidErIni
magaDi chUchitEnu maMchinIlAluppatilI
tagu nIku nI pedikku tappakachUDavayyA ||

paDati javvanamuna bachchalu gammukonIni
naDachitE vaiDUryA leDalI gOLLa
toDibaDa navvitEnu torigIni vajrAlu
voDikamainadi yIpe vorapu chUDavayyA ||

komma priyAla tEnela gurisI bushyarAgAlu
kummariMchI jenakula gOmEdhikAlu
mammarapu jemaTala muttepusarAli niMDI
nemmadi SrIvEMkaTESa nIdEvi jUDavayyA ||


eTuvaMTi valapO - ఎటువంటి వలపో

ఎటువంటి వలపో (రాగం: ) (తాళం : )

ప|| ఎటువంటి వలపో యెవ్వరి కొలది గాదు | ఘటనతో దమకించి గనుగొనవయ్యా ||

చ|| తళుకున నిన్నుజూచి తలవంచుకొని యింతి | తలపోసి నీరూపు తనలోననె |
నిలువు జెమటతోడ నిట్టూరుపులతోడ | చెలరేగి గుబ్బతిలీ జిత్తగించవయ్యా ||

చ|| కోరినీపై నాసపడి గొబ్బునను సిగ్గుపడి | పెర బెట్టి మాటలాడీ బెదవులనె |
సారపు తురుముతోడ జవ్వనభారము తోడ | ఆరీతి నివ్వెరగందీ నాదరించవయ్యా ||

చ|| కౌగిటికి జెయ్యి చాచి కన్నులనే నీకుమొక్కి | మాగినమోవి యిచ్చీ మతకాననె |
చేగదేర నిన్నుగూడె శ్రీవేంకటేశుడ | వీగదలమేలు మంగ వినోదించవయ్యా ||

eTuvaMTi valapO (Raagam: ) (Taalam: )

pa|| eTuvaMTi valapO yevvari koladi gAdu | GaTanatO damakiMci ganugonavayyA ||

ca|| taLukuna ninnujUci talavaMcukoni yiMti | talapOsi nIrUpu tanalOnane |
niluvu jemaTatODa niTTUrupulatODa | celarEgi gubbatilI jittagiMcavayyA ||

ca|| kOrinIpai nAsapaDi gobbunanu siggupaDi | pera beTTi mATalADI bedavulane |
sArapu turumutODa javvanaBAramu tODa | ArIti nivveragaMdI nAdariMcavayyA ||

ca|| kaugiTiki jeyyi cAci kannulanE nIkumokki | mAginamOvi yiccI matakAnane |
cEgadEra ninnugUDe SrIvEMkaTESuDa | vIgadalamElu maMga vinOdiMcavayyA ||