eTTu vEgiMcE diMdukE - ఎట్టు వేగించే దిందుకే

ఎట్టు వేగించే దిందుకే (రాగం: ) (తాళం : )

ప|| ఎట్టు వేగించే దిందుకేగురే సితరకాండ్లు | వెట్టివేమి సేయుమంటా వెన్నడించే

చ|| వొంటికాల గుంటికుంటి వూరిబందెలకు జిక్కి | పంటదాక దున్నె నొక్కపసురము |
గంటుగంటులాక లొత్తి కల్లలనడిమిపంట | కుంటివాడు గావలుండి కుప్ప లేరుపరచె

చ|| కలది కుక్కిమంచము కన్నవారెల్లా బండేరు | తలెతో దొగ్గినంబలి దావకూళ్ళు |
వెలిగంతలకొంపలు వీడుబట్లు చూపేరు | తలవరులెందులోనా దప్పు వెదకేరు ||

చ|| వొళ్ళుచెడ్డవా డొకడు వుభయమార్గము గొని | కల్లదొరపుట్టుబడి కడుగట్టీని
చల్లనిశ్రీ వేంకటేశ సకలలోకపతివి | యిల్లిదె నీశరణంటి మిందరిని గావవే ||

eTTu vEgiMcE diMdukE (Raagam: ) (Taalam: )

pa|| eTTu vEgiMcE diMdukEgurE sitarakAMDlu | veTTivEmi sEyumaMTA vennaDiMcE

ca|| voMTikAla guMTikuMTi vUribaMdelaku jikki | paMTadAka dunne nokkapasuramu |
gaMTugaMTulAka lotti kallalanaDimipaMTa | kuMTivADu gAvaluMDi kuppa lEruparace

ca|| kaladi kukkimaMcamu kannavArellA baMDEru | taletO dogginaMbali dAvakULLu |
veligaMtalakoMpalu vIDubaTlu cUpEru | talavaruleMdulOnA dappu vedakEru ||

ca|| voLLuceDDavA DokaDu vuBayamArgamu goni | kalladorapuTTubaDi kaDugaTTIni
callaniSrI vEMkaTESa sakalalOkapativi | yillide nISaraNaMTi miMdarini gAvavE ||


Ettu valasinaa - ఎట్టు వలసినా

ఎట్టు వలసినా (రాగం: మాళవిగౌళ) (తాళం : )

ఎట్టు వలసినా జేయు మేటి విన్నపము లిక
కట్టుకో పుణ్యమైనాగాక మరేమైనాను

నన్ను నెంచి కాచెనంటేనా యవగుణి నేను
నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్ష్మీపతివి
యిన్నిటా నాకంటే హీనుడిక మరెవ్వడూ లేడు
వున్నతి నీకంటే ఘను లొకరూ లేరు

నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను
బలువుడ నీవైతే బ్రహ్మాండము
యెలమి నే నుపకార మెవ్వరికి జేయలేను
మెలగి నీవే తృణము మేరువు సేయుదువు

భావించ నీ వేలికవు బంటుమాత్రమింతే నేను
నీవు సర్వాంతరాత్మవు నే నొకడను
సావధానమున నేను సర్వభక్షకుండ నింతే
శ్రీవేంకటేశ నీవు జీవరక్షకుడవు

Ettu valasinaa (Raagam:Maalavigaula ) (Taalam: )

Ettu valasinaa jaeyu maeti vinnapamu lika
Kattuko punyamainaagaaka maraemainaanu

Nannu nemchi kaachenamtaenaa yavaguni naenu
Ninnu nemchi kaachaenamtae neevu lakshmeepativi
Yinnitaa naakamtae heenudika marevvadoo laedu
Vunnati neekamtae ghanu lokaroo laeru

Niluvellaa nemchukomtae nivvarimullamta laenu
Baluvuda neevaitae brahmaamdamu
Yelami nae nupakaara mevvariki jaeyalaenu
Melagi neevae trnamu maeruvu saeyuduvu

Bhaavimcha nee vaelikavu bamtumaatramimtae naenu
Neevu sarvaamtaraatmavu nae nokadanu
Saavadhaanamuna naenu sarvabhakshakumda nimtae
Sreevaemkataesa neevu jeevarakshakudavu


Ettu mosapoti - ఎట్టు మోసపోతి

ఎట్టు మోసపోతి (రాగం: శంకరాభరణం) (తాళం : )

ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
నెట్టాన హరినే నమ్మనేర నయితిగా

దేహమిది నాదని తెలిసి నమ్మివుండితే
ఆహా నే నొల్లనన్నా నటే ముదిసె
వూహల నాభోగమెల్లా వొళ్ళబట్టెనంటా నుంటే
దాహముతోడ నినుముదాగిననీరాయగా

మనసు నాదని నమ్మి మది మది నే పెంచితి__
ననుగుబంచేంద్రియములందు గూడెను
యెనసి ప్రాణవాయువు లివి సొమ్మని నమ్మితి
మెనసి లోను వెలినై ముక్కు వాత నున్నవి

ఇందుకొరకె నేను ఇన్నాళ్ళు పాటువడితి
ముందు వెనకెంచక నే మూఢుడ నైతి
అంది శ్రీవేంకటేశ్వరు డంతటా నుండి నా_
చందము చూచి కావగ జన్మమే యీడేరె

Ettu mosapoti (Raagam:Samkaraabharanam ) (Taalam: )

Ettu mosapoti naenu yiviyella nijamani
Nettaana harinae nammanaera nayitigaa

Daehamidi naadani telisi nammivumditae
Aahaa nae nollanannaa natae mudise
Voohala naabhogamellaa vollabattenamtaa numtae
Daahamutoda ninumudaaginaneeraayagaa

Manasu naadani nammi madi madi nae pemchiti__
Nanugubamchaemdriyamulamdu goodenu
Yenasi praanavaayuvu livi sommani nammiti
Menasi lonu velinai mukku vaata nunnavi

Imdukorake naenu innaallu paatuvaditi
Mumdu venakemchaka nae moodhuda naiti
Amdi sreevaemkataesvaru damtataa numdi naa_
Chamdamu choochi kaavaga janmamae yeedaere


eTTu niddiriMchenO - ఎట్టు నిద్దిరించెనో

ఎట్టు నిద్దిరించెనో (రాగం: ) (తాళం : )

ఎట్టు నిద్దిరించెనో యీ రేతిరెల్లాను
పట్టి చుట్టుక పయ్యద పడ దీసీ క్రిశ్ణుడూ ||

కడు వే కువనే లేచి కన్నులు పులుము కొంటా
కడు పక్కలించి నూక లయ్యానని
కుడుకోకచే బట్టి నా కొంగొకచేత బట్టి
అడిగీ నన్నము క్రుశ్ణుడప్పుడే చూడరే ||

పెరుగు దరువనన్ను దిరిగి రా జుట్టి చుట్టి
కురుచ మాటల ముద్దు గునియుచును
తిరిగి కవ్వపు గొల దిక్క గా గిలించి పట్టి
తరి వెన్న వెట్టుమనీ తగునే యీ క్రిశ్ణుడు ||

తనకు బెట్టినది యా తలి పడుచుల కిచ్చి
కినిసి ముచ్చిలి యార గించీ దాను
అనయము శ్రీవేంకటాద్రి క్రిశ్ణుడు నేడు
తనిసి తన యెంగిలి తగ నాకు నిచ్చెనే ||

eTTu niddiriMchenO (Raagam: ) (Taalam: )

eTTu niddiriMchenO yI rEtirellAnu
paTTi chuTTuka payyada paDa dIsI krishNuDU ||

kaDu vE kuvanE lEchi kannulu pulumu koMTA
kaDu pakkaliMchi nUka layyAnani
kuDukOkachE baTTi nA koMgokachEta baTTi
aDigI nannamu krushNuDappuDE chUDarE ||

perugu daruvanannu dirigi rA juTTi chuTTi
kurucha mATala muddu guniyuchunu
tirigi kavvapu gola dikka gA giliMchi paTTi
tari venna veTTumanI tagunE yI krishNuDu ||

tanaku beTTinadi yA tali paDuchula kichchi
kinisi muchchili yAra giMchI dAnu
anayamu SrIvEMkaTAdri krishNuDu nEDu
tanisi tana yeMgili taga nAku nichchenE ||


eTTu nammavaccunE - ఎట్టు నమ్మవచ్చునే

ఎట్టు నమ్మవచ్చునే (రాగం: ) (తాళం : )

ప|| ఎట్టు నమ్మవచ్చునే ఇంతి మనసు నేడు | వొట్టి యొక వేళ బుద్ధి యొకవేళా వచ్చునా ||

చ|| వెన్నెల బయట నుండి వేడి బడి యిందాకా | సన్నల నీ పతి గూడి చల్లనైతివి |
వున్నతపు జందురు డొక్కడే వెన్నెలొక్కటే | కన్నె భావాలు రెండుగతులాయ నివిగో ||

చ|| కోయిల కూతలకే గుండె బెదరి యిందాకా | యీ యెడ నీ పతి గూడి యిచ్చగించేవు |
ఆ యెడా బలు కొక్కటే అప్పటి నీవు నీవే | రాయడి నీ గుణములే రెండుదెఱుగులాయ ||

చ|| వేడుక చల్లగాలి విసిగితి విందాకా | కూడి శ్రీ వేంకటేశుతో కోరే వదియే |
ఆడనే యాల వట్ట మదియును నొకటే | యీడా నాడా దలపోత లివియే వేరు ||

eTTu nammavaccunE (Raagam: ) (Taalam: )

pa|| eTTu nammavaccunE iMti manasu nEDu | voTTi yoka vELa buddhi yokavELA vaccunA ||

ca|| vennela bayaTa nuMDi vEDi baDi yiMdAkA | sannala nI pati gUDi callanaitivi |
vunnatapu jaMduru DokkaDE vennelokkaTE | kanne BAvAlu reMDugatulAya nivigO ||

ca|| kOyila kUtalakE guMDe bedari yiMdAkA | yI yeDa nI pati gUDi yiccagiMcEvu |
A yeDA balu kokkaTE appaTi nIvu nIvE | rAyaDi nI guNamulE reMDuderxugulAya ||

ca|| vEDuka callagAli visigiti viMdAkA | kUDi SrI vEMkaTESutO kOrE vadiyE |
ADanE yAla vaTTa madiyunu nokaTE | yIDA nADA dalapOta liviyE vEru ||


eTTu dorikene - ఎట్టు దొరికెనె

ఎట్టు దొరికెనె (రాగం: ) (తాళం : )

ప|| ఎట్టు దొరికెనె చెలియ యిద్దరికి నిటువంటి | పట్టి నిలుపగరాని బరువైన వలపు ||

చ|| నిడివి తమకములచే నిట్టూర్పులివె నీకు | అడియాస తమకంబు లాతనికిని |
కడలేని వేదనల కన్నీళ్ళివే నీకు | అడలు బరితాపంబు లాతనికిని ||

చ|| గుఱుతైన యతనిపై గోరాట లదె నీకు | అరుదైన ప్రియమాన మాతనికిని |
పురిగొన్న విరహమున బొరలాటలవె నీకు | అరమరపు బరవశము లాతనికిని ||

చ|| ఎనసి యాతనిరాక కెదురు చూచుట నీకు | అనుకూలుడై కలయు టాతనికిని |
అనయంబు తిరువేంకటాధీశుడిదె నీకు | అనుభవము కెల్ల నీ వాతనికిని ||

eTTu dorikene (Raagam: ) (Taalam: )

pa|| eTTu dorikene celiya yiddariki niTuvaMTi | paTTi nilupagarAni baruvaina valapu ||

ca|| niDivi tamakamulacE niTTUrpulive nIku | aDiyAsa tamakaMbu lAtanikini |
kaDalEni vEdanala kannILLivE nIku | aDalu baritApaMbu lAtanikini ||

ca|| gurxutaina yatanipai gOrATa lade nIku | arudaina priyamAna mAtanikini |
purigonna virahamuna boralATalave nIku | aramarapu baravaSamu lAtanikini ||

ca|| enasi yAtanirAka keduru cUcuTa nIku | anukUluDai kalayu TAtanikini |
anayaMbu tiruvEMkaTAdhISuDide nIku | anuBavamu kella nI vAtanikini ||


eTTu dariMcI nide - ఎట్టు దరించీ నిదె

ఎట్టు దరించీ నిదె (రాగం: ) (తాళం : )

ప|| ఎట్టు దరించీ నిదె యీజీవుడు | బట్టబయలుగా బరచీ నొకటి ||

చ|| చెడనిమట్టిలో జేసినముద్దే | నడుమ ముంచుకొన్నది నొకటి |
తడియనినీరై తడివొడమింపుచు | పడిసీని వేవుర వడితో నొకటి ||

చ|| పాయనితనుదీపనములుగా నటు | చేయుచు మది వేచీ నొకటి |
కాయపుచుట్టరికమ్ములు చేయుచు | రేయిబగలు విహరించీ నొకటి ||

చ|| ఇన్నియు దానే యేచి కపటములు | పన్నీ నిదె లోపల నొకటి |
వెన్నెలచూపుల వేంకటేశ నిను | యెన్నికతో గడు నెదిరీ నొకటి ||

eTTu dariMcI nide (Raagam: ) (Taalam: )

pa|| eTTu dariMcI nide yIjIvuDu | baTTabayalugA baracI nokaTi ||

ca|| ceDanimaTTilO jEsinamuddE | naDuma muMcukonnadi nokaTi |
taDiyaninIrai taDivoDamiMpucu | paDisIni vEvura vaDitO nokaTi ||

ca|| pAyanitanudIpanamulugA naTu | cEyucu madi vEcI nokaTi |
kAyapucuTTarikammulu cEyucu | rEyibagalu vihariMcI nokaTi ||

ca|| inniyu dAnE yEci kapaTamulu | pannI nide lOpala nokaTi |
vennelacUpula vEMkaTESa ninu | yennikatO gaDu nedirI nokaTi ||