ennagaluguBUtakOTinella - ఎన్నగలుగుభూతకోటినెల్ల

ఎన్నగలుగుభూతకోటినెల్ల (రాగం: ) (తాళం : )

ప|| ఎన్నగలుగుభూతకోటినెల్ల జేసినట్టిచేత | నిన్ను జేసుకొనుటగాక నీకు దొలగవచ్చునా ||

చ|| గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందు | కట్టివేసినట్టిపాపకర్మ మేలతీరును |
పట్టితెచ్చి నిన్ను రోలగట్టివేసి లోకమెఱగ | రట్టుసేసుగాక నిన్ను రాజనన్న విడుచునా ||

చ|| మిఱ్ఱుపల్లములకు దెచ్చి మెరసి భూతజాలములకు | దొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయును |
అఱ్ఱుసాచి గోపసతుల నలమి వెంటవెంట దిరుగ | వెఱ్ఱి జేయుగాక నీవు విభుడనన్న విడుచునా ||

చ|| పరుల ఇంటికేగు పరులపరుల వేడజేసినట్టి- | యెఱికమాలినట్టిచేత లేలనిన్ను విడుచును |
వెరవుమిగిలి వేంకటాద్రివిభుడననుచు జనులచేత- | నరులుగొనగ జేయుగాక ఆస నిన్ను విడుచునా ||

ennagaluguBUtakOTinella (Raagam: ) (Taalam: )

pa|| ennagaluguBUtakOTinella jEsinaTTicEta | ninnu jEsukonuTagAka nIku dolagavaccunA ||

ca|| guTTucerici lOkamella GOrasaMsAramaMdu | kaTTivEsinaTTipApakarma mElatIrunu |
paTTitecci ninnu rOlagaTTivEsi lOkamerxaga | raTTusEsugAka ninnu rAjananna viDucunA ||

ca|| mirxrxupallamulaku decci merasi BUtajAlamulaku | dorxrxapesalu golacinaTTi dOsamEla pAyunu |
arxrxusAci gOpasatula nalami veMTaveMTa diruga | verxrxi jEyugAka nIvu viBuDananna viDucunA ||

ca|| parula iMTikEgu parulaparula vEDajEsinaTTi- | yerxikamAlinaTTicEta lElaninnu viDucunu |
veravumigili vEMkaTAdriviBuDananucu janulacEta- | narulugonaga jEyugAka Asa ninnu viDucunA ||


enupOtutO neddu - ఎనుపోతుతో నెద్దు

ఎనుపోతుతో నెద్దు (రాగం: ) (తాళం : )

ప|| ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లు | యెనసి ముందర సాగదేటిబ్రదుకు ||

చ|| కడలేనియాసతో కరగికరగి చిత్త- | మెడమవంకకు వచ్చె నేటిబ్రదుకు |
పొడవైనమమతతో బొదల బొదల మాన- | మిడుమపాట్ల బడె నేటిబ్రదుకు ||

చ|| తెగదెంపులేని భ్రాంతికి జిక్కి యాచార- | మెగసి గొందులు దూరె నేటిబ్రదుకు |
పగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞాన- | మిగురువెట్టక మానె నేటిబ్రదుకు ||

చ|| భావింప రోతలోబడి పొరలెడిసౌఖ్య- | మేవగింపడు జీవుడేటిబ్రదుకు |
శ్రీవేంకటేశుపై చిత్తమొక్కటె కాని | యేవంక సుఖము లేదేటిబ్రదుకు ||

enupOtutO neddu (Raagam: ) (Taalam: )

pa|| enupOtutO neddu nErugaTTinayaTlu | yenasi muMdara sAgadETibraduku ||

ca|| kaDalEniyAsatO karagikaragi citta- | meDamavaMkaku vacce nETibraduku |
poDavainamamatatO bodala bodala mAna- | miDumapATla baDe nETibraduku ||

ca|| tegadeMpulEni BrAMtiki jikki yAcAra- | megasi goMdulu dUre nETibraduku |
pagagonna mOhatApamu vEruga vij~jAna- | miguruveTTaka mAne nETibraduku ||

ca|| BAviMpa rOtalObaDi poraleDisauKya- | mEvagiMpaDu jIvuDETibraduku |
SrIvEMkaTESupai cittamokkaTe kAni | yEvaMka suKamu lEdETibraduku ||


enu pOtutO - ఎను పోతుతో

ఎను పోతుతో (రాగం: ) (తాళం : )

ఎను పోతుతో నెద్దు నేరుగట్టిన యత్లు
యెనసి ముందర సాగదేటి బ్రదుకు ||

కడలేని యాసచే కరగి కరగి చిత్త
మెడమ వంకకు వచ్చె నేటి బ్రదుకు
పొడవైన సమతతో బొదల బొదల మాస
మిడుమపాట్లు బడనేటి బ్రదుకు ||

తెగదెంపులేని భ్రాంతికిజిక్కి యాచార
మెగసి గొందులు దూరె నేటి బ్రదుకు
వగగొన్న మోహతాపము వేరుగ విజ్గ్యాన
మిగురువెట్టక మానె నేటి బ్రదుకు ||

భావింప రోత లోబడి పొరలెడి సొఊఖ్హ్య
మేవగింపడు జీవుడేటి బ్రదుకు
శ్రీవేంకటేశుపై చిత్త మొక్కటెకాని
యేవంక సుఖ్హము లే దేటిబ్రదుకు ||

enu pOtutO (Raagam: ) (Taalam: )

enu pOtutO neddu nErugaTTina yatlu
yenasi muMdara sAgadETi braduku ||

kaDalEni yAsachE karagi karagi chitta
meDama vaMkaku vachche nETi braduku
poDavaina samatatO bodala bodala mAsa
miDumapATlu baDanETi braduku ||

tegadeMpulEni bhrAMtikijikki yAchAra
megasi goMdulu dUre nETi braduku
vagagonna mOhatApamu vEruga vijgyAna
miguruveTTaka mAne nETi braduku ||

bhAviMpa rOta lObaDi poraleDi soUKhya
mEvagiMpaDu jIvuDETi braduku
SrIvEMkaTESupai chitta mokkaTekAni
yEvaMka suKhamu lE dETibraduku ||


Eduraedi yemchichooda - ఎదురేది యెంచిచూడ

ఎదురేది యెంచిచూడ (రాగం:పాడి ) (తాళం : )

ఎదురేది యెంచిచూడ నితని ప్రతాపానకు
పదిదిక్కులను భంగపడిరి దానవులు

యెక్కువగా వినోదాన కితడు తేరెక్కితేను
యెక్కిరిదైత్యులు కొర్రు లిందరు గూడి
చక్కగా నితడు చేత చక్రమెత్తినమాత్రాన
దిక్కుల బరువెత్తిరి దిమ్మరిఅసురలు

దట్టమై యీతనిభేరి దగ నాదుపుట్టితేను
పుట్టె నుత్పాతాలు వైరిపురములందు
అట్టె గరుడధ్వజ మటు మిన్నుముట్టితేను
కిట్టిదనుజుల కపకీర్తి తుదముట్టెను

అలిమేలుమంగవిభు డటు వీధు లేగితేమ
ఖలు లేగిర యమునికట్టెదిరికి
యెలమి శ్రీ వేంకటేశు డేపుమీర జొచ్చితేను
ములిగి దైత్యసతులు మూలమూల చొచ్చిరి

Eduraedi yemchichooda (Raagam: Paadi ) (Taalam: )

Eduraedi yemchichooda nitani prataapaanaku
Padidikkulanu bhamgapadiri daanavulu

Yekkuvagaa vinodaana kitadu taerekkitaenu
Yekkiridaityulu korru limdaru goodi
Chakkagaa nitadu chaeta chakramettinamaatraana
Dikkula baruvettiri dimmariasuralu

Dattamai yeetanibhaeri daga naaduputtitaenu
Putte nutpaataalu vairipuramulamdu
Atte garudadhvaja matu minnumuttitaenu
Kittidanujula kapakeerti tudamuttenu

Alimaelumamgavibhu datu veedhu laegitaema
Khalu laegira yamunikattediriki
Yelami Sree vaemkataesu Daepumeera jochchitaenu
Muligi daityasatulu moolamoola chochchiri


edurubaDi kAgiLLu - ఎదురుబడి కాగిళ్ళు

ఎదురుబడి కాగిళ్ళు (రాగం: ) (తాళం : )

ప|| ఎదురుబడి కాగిళ్ళు యేరులాయ మీ వలపు | అదను బదనుగూడి అడుసాయె వలపు ||

చ|| చిక్కని చెమటలను చిప్పిలీని వలపు | చొక్కపు కరగులను జొబ్బిలీని వలపు |
చక్కని సరసముల జాలు వాలీ వలపు | తెక్కుల మచ్చికలచే దీగె వారీ వలపు ||

చ|| జవ్వనము కళల రసములబ్బీ వలపు | నివ్వటిట్లు కోరికల నీరుకమ్మీ వలపు |
రవ్వల తమకముల వువ్విళ్ళూరీ వలపు | చివ్వన దరితీపుల జిడ్డుకట్టీ వలపు ||

చ|| పంతపు రతులనే పాలుగారీ వలపు | బంతి మోవులనే కడు బచ్చిదేరీ వలపు |
ఇంతలో శ్రీ వేంకటేశ యెనసి మీరుండగాను | దొంతరచుట్టరికాన దొప్పదోగీ వలపు ||

edurubaDi kAgiLLu (Raagam: ) (Taalam: )

pa|| edurubaDi kAgiLLu yErulAya mI valapu | adanu badanugUDi aDusAye valapu ||

ca|| cikkani cemaTalanu cippilIni valapu | cokkapu karagulanu jobbilIni valapu |
cakkani sarasamula jAlu vAlI valapu | tekkula maccikalacE dIge vArI valapu ||

ca|| javvanamu kaLala rasamulabbI valapu | nivvaTiTlu kOrikala nIrukammI valapu |
ravvala tamakamula vuvviLLUrI valapu | civvana daritIpula jiDDukaTTI valapu ||

ca|| paMtapu ratulanE pAlugArI valapu | baMti mOvulanE kaDu baccidErI valapu |
iMtalO SrI vEMkaTESa yenasi mIruMDagAnu | doMtaracuTTarikAna doppadOgI valapu ||


eduru gudurugAnu - ఎదురు గుదురుగాను

ఎదురు గుదురుగాను (రాగం: ) (తాళం : )

ప|| ఎదురు గుదురుగాను మేల నవ్వీనే | యెదుగా తడవునుండి యేల నవ్వీనే ||

చ|| వరుసలు వంతులును వనితల మాదుకోగా | యిరవైన విభుడు తానేల నవ్వీనే |
తరమిడి నిద్దరము తన్ను దగ వడిగితే | యెరవులు సేసుకొని యేల నవ్వీనే ||

చ|| వొక్కరొక్కరము సొమ్ములొనరగ సిరిచూడగ | యిక్కువైన రమణుడు యేల నవ్వీనీ |
చకగామాలోనే మమ్ము సంతసముసేయమంటాను | యిక్కడా మామోము చూచి యేల నవ్వీనే ||

చ|| మోవిమీద గుఱుతులు మూసుకొనే మమ్ముజూచి | యీవేళ శ్రీవేంకటేశుడేల నవ్వీనే |
భావించి మమ్మేలితివి పాడి దిద్దుమంటేను | యే వెలదులతోనైన నేల నవ్వీనే ||

eduru gudurugAnu (Raagam: ) (Taalam: )

pa|| eduru gudurugAnu mEla navvInE | yedugA taDavunuMDi yEla navvInE ||

ca|| varusalu vaMtulunu vanitala mAdukOgA | yiravaina viBuDu tAnEla navvInE |
taramiDi niddaramu tannu daga vaDigitE | yeravulu sEsukoni yEla navvInE ||

ca|| vokkarokkaramu sommulonaraga siricUDaga | yikkuvaina ramaNuDu yEla navvInI |
cakagAmAlOnE mammu saMtasamusEyamaMTAnu | yikkaDA mAmOmu cUci yEla navvInE ||

ca|| mOvimIda gurxutulu mUsukonE mammujUci | yIvELa SrIvEMkaTESuDEla navvInE |
BAviMci mammElitivi pADi diddumaMTEnu | yE veladulatOnaina nEla navvInE ||


eduTinidhAnama - ఎదుటినిధానమ

ఎదుటినిధానమ (రాగం: ) (తాళం : )

ప|| ఎదుటినిధానమ వెటుజూచిన నీ- | వదె వేంకటగిరియనంతుడా ||

చ|| సొగిసి భాద్రపదశుద్ధచతుర్దశి | తగువేడుక నిందరు గొలువ |
పగటుసంపదలు బహుళమొసగు నీ- | వగు వేంకటగిరియనంతుడా ||

చ|| తొలుత సుశీలకు దుశ్శీలవలన | వెలయు సంపదల విముఖుడవై |
వలెనని కొలిచిన వడి గాచినమా- | యలవేంకటగిరియనంతుడా ||

చ|| కరుణ గాచితివి కౌండిన్యుని మును | పరగినవృద్ధబ్రాహ్మడవై |
దొరవులు మావులు ధృవముగ గాచిన- | హరి వేంకటగిరియనంతుడా ||

eduTinidhAnama (Raagam: ) (Taalam: )

pa|| eduTinidhAnama veTujUcina nI- | vade vEMkaTagiriyanaMtuDA ||

ca|| sogisi BAdrapadaSuddhacaturdaSi | taguvEDuka niMdaru goluva |
pagaTusaMpadalu bahuLamosagu nI- | vagu vEMkaTagiriyanaMtuDA ||

ca|| toluta suSIlaku duSSIlavalana | velayu saMpadala vimuKuDavai |
valenani kolicina vaDi gAcinamA- | yalavEMkaTagiriyanaMtuDA ||

ca|| karuNa gAcitivi kauMDinyuni munu | paraginavRuddhabrAhmaDavai |
doravulu mAvulu dhRuvamuga gAcina- | hari vEMkaTagiriyanaMtuDA ||