Edi cUcina tamaku - ఏది చూచిన తమకు

ఏది చూచిన (రాగం: ) (తాళం : )

ప|| ఏది చూచిన తమకు యిన్నియును నిటువలెనె | వేదు విడిచిన కూడు వెదికినను లేదు ||

చ|| ఏకాంత సౌఖ్యములు ఎక్కడివి ప్రాణులకు | పై కొన్న దుఃఖముల పాలుపడి గాకా |
ఏకమగు పుణ్యంబు లేడగల విందరికి | గై కొన్న దురితములు కలపాటి గాక ||

చ|| హితవైన మమకార మెందుగల దిందరికి | ప్రతిలేని విరహ తాపము కొలది గాకా |
మతిలోని వేడుకలు మరియేవి మనుజులకు | జితమైన దైవ మిచ్చిన పాటిగాక ||

చ|| ఇరవైన దైవ కృప ఏల దొరకును తమకు | పరమైన కర్మంబు పరిపాటి గాక |
ఎరవైన పెను బంధమేల వీడును నాత్మ | తిరు వేంకటేశు కృప తిరమైన గాక ||

Edi cUcina (Raagam: ) (Taalam: )


pa|| Edi cUcina tamaku yinniyunu niTuvalene | vEdu viDicina kUDu vedikinanu lEdu ||

ca|| EkAMta sauKyamulu ekkaDivi prANulaku | pai konna duHKamula pAlupaDi gAkA |
Ekamagu puNyaMbu lEDagala viMdariki | gai konna duritamulu kalapATi gAka ||

ca|| hitavaina mamakAra meMdugala diMdariki | pratilEni viraha tApamu koladi gAkA |
matilOni vEDukalu mariyEvi manujulaku | jitamaina daiva miccina pATigAka ||

ca|| iravaina daiva kRupa Ela dorakunu tamaku | paramaina karmaMbu paripATi gAka |
eravaina penu baMdhamEla vIDunu nAtma | tiru vEMkaTESu kRupa tiramaina gAka ||


Aedi nijambani - ఏది నిజంబని యెటువల

ఏది నిజంబని యెటువల (రాగం: బౌళి) (తాళం : )

ఏది నిజంబని యెటువలె నమ్ముదు
పోది తోడ నను బోధింపవే

సత్తు నసత్తని సర్వము నీవని
చిత్తగించి శ్రుతి చెప్పెడిని
వుత్తమమధ్యమ మొగి గలదని మరి
యిత్తల శాస్త్రము లేర్పరచీని ||ఏది||

నానారూపులు నరహరి నీపని
పూనినవిధు లిటు పొగడెడిని
మానక హేయము మరి వుపాధేయము
కానవచ్చి యిల గలిగియున్నవి ||ఏది||

భావాభావము పరమము నీవని
దైవజ్ఞులు నిను దలచెదరు
శ్రీవేంకటగిరి జెలగిననీవే
తావుగ మదిలో దగిలితివి ||ఏది||

Aedi nijambani (Raagam: Bauli) (Taalam: )

Aedi nijambani yetuvale nammudu
Podi toda nanu bodhimpavae

Sattu nasattani sarvamu neevani
Chittagimchi Sruti cheppedini
Vuttamamadhyama mogi galadani mari
Yittala Saastramu laerparacheeni ||Aedi||

Naanaaroopulu narahari neepani
Pooninavidhu litu pogadedini
Maanaka haeyamu mari vupaadhaeyamu
Kaanavachchi yila galigiyunnavi ||Aedi||

Bhaavaabhaavamu paramamu neevani
Daivaj~nulu ninu dalachedaru
Sreevaemkatagiri jelaginaneevae
Taavuga madilo dagilitivi ||Aedi||


ETivij~jAna mETicaduvu - ఏటివిజ్ఞాన మేటిచదువు

ఏటివిజ్ఞాన మేటిచదువు (రాగం: ) (తాళం : )

ప|| ఏటివిజ్ఞాన మేటిచదువు | గూటబడి వెడలుగతిరుగుచు గనలేడు ||

చ|| ఏడుమడుకలచర్మ మింతయును దూంట్లై | గాడబెట్టుచు జీము గారగను |
పాడైనయిందులో బ్రదుకుగోరే బ్రాణి | వీడదన్నుక చనెడివెరవు గనలేడు ||

చ|| కడుపునిండిన మహాకష్టంబు నలుగడల | వెడలుచును బెనుకురికి వేయగాను |
యిడుమ బొందుచు సుఖంబిందుకే వెదికీని | వొడలు మోపగ జీవు డోపనలేడు ||

చ|| వుదయమగుకన్నులురికి యేమైన గని | మదవికారము మతికి మరుపగాను |
యిది యెరిగి తిరువేంకటేశు గని జీవుడా- |సదమలానందంబు చవిగానలేడు ||

ETivij~jAna mETicaduvu (Raagam: ) (Taalam: )

pa|| ETivij~jAna mETicaduvu | gUTabaDi veDalugatirugucu ganalEDu ||

ca|| EDumaDukalacarma miMtayunu dUMTlai | gADabeTTucu jImu gAraganu |
pADainayiMdulO bradukugOrE brANi | vIDadannuka caneDiveravu ganalEDu ||

ca|| kaDupuniMDina mahAkaShTaMbu nalugaDala | veDalucunu benukuriki vEyagAnu |
yiDuma boMducu suKaMbiMdukE vedikIni | voDalu mOpaga jIvu DOpanalEDu ||

ca|| vudayamagukannuluriki yEmaina gani | madavikAramu matiki marupagAnu |
yidi yerigi tiruvEMkaTESu gani jIvuDA- |sadamalAnaMdaMbu cavigAnalEDu ||


ETiki nevvaripoMdu - ఏటికి నెవ్వరిపొందు

ఏటికి నెవ్వరిపొందు (రాగం: ) (తాళం : )

ప|| ఏటికి నెవ్వరిపొందు యిస్సిరో చీచీ | నాటకములాల చీచీ నమ్మితిగా మిమ్మును ||

చ|| జవ్వనమదమ చీచీ చక్కదనమరో చీచీ | రవ్వైన రాజసగర్వమరో చీచీ |
కొవ్వినమదమ చీచీ కూరిమియాసరో చీచీ | నవ్వులదేహమ చీచీ నమ్మితిగా మిమ్మును ||

చ|| ముచ్చటమమత చీచీ ముచ్చుమురిపెమ చీచీ | బచ్చురవణములోనిబచ్చన చీచీ |
తెచ్చుకోలు తాలిములదిట్టతనమరో చీచీ | పుచ్చినపోకరో చీచీ పోయగా మీకాలము ||

చ|| సిరులచీకటి చీచీ సిలుగుసంపద చీచీ | పరవిభవమ చీచీ వాసిరో చీచీ |
కరుణించె దిరువేంకటగిరిపతి నన్ను | విరసవర్తన చీచీ వీడెగా మీభారము ||

ETiki nevvaripoMdu (Raagam: ) (Taalam: )

pa|| ETiki nevvaripoMdu yissirO cIcI | nATakamulAla cIcI nammitigA mimmunu ||

ca|| javvanamadama cIcI cakkadanamarO cIcI | ravvaina rAjasagarvamarO cIcI |
kovvinamadama cIcI kUrimiyAsarO cIcI | navvuladEhama cIcI nammitigA mimmunu ||

ca|| muccaTamamata cIcI muccumuripema cIcI | baccuravaNamulOnibaccana cIcI |
teccukOlu tAlimuladiTTatanamarO cIcI | puccinapOkarO cIcI pOyagA mIkAlamu ||

ca|| sirulacIkaTi cIcI silugusaMpada cIcI | paraviBavama cIcI vAsirO cIcI |
karuNiMce diruvEMkaTagiripati nannu | virasavartana cIcI vIDegA mIBAramu ||

ETiki dalakeda - ఏటికి దలకెద

ఏటికి దలకెద (రాగం: ) (తాళం : )

ప|| ఏటికి దలకెద రిందరును | గాటపుసిరులివి కానరొ ప్రజలు ||

చ|| ఎండల బొరలక యేచినచలిలో- | నుండక చరిలో నుడుకక |
అండనున్నహరి నాత్మదలచిన | పండినపసిడే బ్రతుకరొ ప్రజలు ||

చ|| అడవుల నలయక ఆకునలము దిని | కడుపులు గాలగ గరగక |
బడిబడి లక్ష్మీపతికి దాసులై | పొడవగుపదవుల బొందరొ ప్రజలు ||

చ|| పొక్కేటికాళ్ళ పుండ్లు రేగగ | దిక్కులనంతట దిరుగక |
గక్కన తిరువేంకటగిరిపతి గని | వొక్కమనసుతో నుండరొ ప్రజలు ||

ETiki dalakeda (Raagam: ) (Taalam: )

pa|| ETiki dalakeda riMdarunu | gATapusirulivi kAnaro prajalu ||

ca|| eMDala boralaka yEcinacalilO- | nuMDaka carilO nuDukaka |
aMDanunnahari nAtmadalacina | paMDinapasiDE bratukaro prajalu ||

ca|| aDavula nalayaka Akunalamu dini | kaDupulu gAlaga garagaka |
baDibaDi lakShmIpatiki dAsulai | poDavagupadavula boMdaro prajalu ||

ca|| pokkETikALLa puMDlu rEgaga | dikkulanaMtaTa dirugaka |
gakkana tiruvEMkaTagiripati gani | vokkamanasutO nuMDaro prajalu ||

ETikE yI dOsamu - ఏటికే యీ దోసము

ఏటికే యీ (రాగం: ) (తాళం : )

ప|| ఏటికే యీ దోసము మీ రెఱుగరటే | ఆట దాననింతే నన్ను ఆఱడిబెట్టకురే ||

చ|| తామర మొగ్గలవంటి తగిన నా చన్నులివి | కాముని యమ్ములనేరు కాంతలదేమే |
నా మగని కౌగిటలో ననిచే జక్క వలవి | ప్రేమమున మారుబేరు పెట్టుదురటే ||

చ|| చందురుని బోలేటి సరసపు నా మోము | అందపు బూబంతియంటా నాడు కోకురే |
ముందు నా రమణునికి మోము చూచేటద్దమిది | కందువలేని నిందలు గడింతురటే ||

చ|| తీగెవంటి నామేను దిక్కుల మెఱుగనుచు | పోగులుగా సారె సారె బొగడకురే |
బాగుగ శ్రీ వేంకటేశు పానుపుపై చిగురిది | మోగము గూడెను వేరే వుప్పటించ నేటికే ||

ETikE yI (Raagam: ) (Taalam: )

pa|| ETikE yI dOsamu mI rerxugaraTE | ATa dAnaniMtE nannu ArxaDibeTTakurE ||

ca|| tAmara moggalavaMTi tagina nA cannulivi | kAmuni yammulanEru kAMtaladEmE |
nA magani kaugiTalO nanicE jakka valavi | prEmamuna mArubEru peTTuduraTE ||

ca|| caMduruni bOlETi sarasapu nA mOmu | aMdapu bUbaMtiyaMTA nADu kOkurE |
muMdu nA ramaNuniki mOmu cUcETaddamidi | kaMduvalEni niMdalu gaDiMturaTE ||

ca|| tIgevaMTi nAmEnu dikkula merxuganucu | pOgulugA sAre sAre bogaDakurE |
bAguga SrI vEMkaTESu pAnupupai ciguridi | mOgamu gUDenu vErE vuppaTiMca nETikE ||


ETibraduku yETibraduku - ఏటిబ్రదుకు యేటిబ్రదుకు

ఏటిబ్రదుకు యేటిబ్రదుకు (రాగం: ) (తాళం : )

ప|| ఏటిబ్రదుకు యేటిబ్రదుకు వొక్క- | మాటలోనే యటమటమైనబ్రదుకు ||

చ|| సంతకూటములే చవులయినబ్రతుకు | దొంతిభయములతోడిబ్రదుకు |
ముంతనీళ్ళనే మునిగేటిబ్రదుకు | వంత బొరలి కడవల లేనిబ్రదుకు ||

చ|| మనసుచంచలమే మనువయినబ్రదుకు | దినదినగండాల దీరుబ్రదుకు |
తనియ కాసలనె తగిలేటిబ్రదుకు | వెనకముందర చూడ వెరపయినబ్రదుకు ||

చ|| తెగి చేదె తీపయి తినియేటిబ్రదుకు | పగవారిపంచలపాలైన బ్రదుకు |
తగువేంకటేశ్వరు దలచనిబ్రదుకు | పొగకు నోపక మంట బొగిలేటి బ్రదుకు ||

ETibraduku yETibraduku (Raagam: ) (Taalam: )

pa|| ETibraduku yETibraduku vokka- | mATalOnE yaTamaTamainabraduku ||

ca|| saMtakUTamulE cavulayinabratuku | doMtiBayamulatODibraduku |
muMtanILLanE munigETibraduku | vaMta borali kaDavala lEnibraduku ||

ca|| manasucaMcalamE manuvayinabraduku | dinadinagaMDAla dIrubraduku |
taniya kAsalane tagilETibraduku | venakamuMdara cUDa verapayinabraduku ||

ca|| tegi cEde tIpayi tiniyETibraduku | pagavAripaMcalapAlaina braduku |
taguvEMkaTESvaru dalacanibraduku | pogaku nOpaka maMTa bogilETi braduku ||