EmO telisegAni - ఏమో తెలిసెగాని

ఏమో తెలిసెగాని (రాగం: ) (తాళం : )

ప|| ఏమో తెలిసెగాని యీజీవుడు | నేమంపునెరవిద్య నేరడాయ ||

చ|| కపటాలె నేరిచెగానీ జీవుడు | యెపుడైనా నిజసుఖ మెరుగడాయ |
కపురులే చవిగొనెగానీ జీవుడు | అపరిమితామృత మానడాయ ||

చ|| కడలనే తిరిగీగానీ జీవుడు | నడుమ మొదలు జూచి నడవడాయ |
కడుపుకూటికే పోయీగానీ జీవుడు | చెడనిజీతముపొంత జేరడాయ ||

చ|| కనియు గానకపోయగానీ జీవుడు | దివము వేంకటపతి దెలియడాయ |
కనుమాయలనె చొక్కెగానీ జీవుడు | తనియ నిట్టే మంచిదరి జేరడాయ ||

EmO telisegAni (Raagam: ) (Taalam: )

pa|| EmO telisegAni yIjIvuDu | nEmaMpuneravidya nEraDAya ||

ca|| kapaTAle nEricegAnI jIvuDu | yepuDainA nijasuKa merugaDAya |
kapurulE cavigonegAnI jIvuDu | aparimitAmRuta mAnaDAya ||

ca|| kaDalanE tirigIgAnI jIvuDu | naDuma modalu jUci naDavaDAya |
kaDupukUTikE pOyIgAnI jIvuDu | ceDanijItamupoMta jEraDAya ||

ca|| kaniyu gAnakapOyagAnI jIvuDu | divamu vEMkaTapati deliyaDAya |
kanumAyalane cokkegAnI jIvuDu | taniya niTTE maMcidari jEraDAya ||


EmainA nADEvAri - ఏమైనా నాడేవారి

ఏమైనా నాడేవారి (రాగం: ) (తాళం : )

ప|| ఏమైనా నాడేవారి నేమందును | మోము చూచితే చెరువుముయ్య మూకుడున్నదా ||

చ|| అడియాలముగ నీవు ఆడేవి సత్యాలేకాక | కడు మావంటి వారితో గల్ల లాడేవా |
అడిసి తొల్లి అసురసతులతో నేమోకాక | తడవితే నేటి వేళ తప్పు నీయందున్నదా ||

చ|| చిమ్మిరేగ నీ విన్నిటా జేసేవి పుణ్యాలేకాక | పమ్ము నీ వొళ్ళ నెంచితే పాపమున్నదా |
కుమ్మరించి యీ సుద్దులు గొల్లతలందేమో కాక | నెమ్మది నీ పొద్దుకు నింద నీయందున్నదా ||

చ|| దగ్గరితే నీ వల్లను దయ దాక్షిణ్యాలేకాక | కగ్గిన నిష్టూర మించుకంత గలదా |
వెగ్గళించి నన్నును శ్రీవేంకటేశ కూడితివి | వొగ్గి నిన్ను దూరబోతే వొచ్చము నీకున్నదా ||

EmainA nADEvAri (Raagam: ) (Taalam: )

pa|| EmainA nADEvAri nEmaMdunu | mOmu cUcitE ceruvumuyya mUkuDunnadA ||

ca|| aDiyAlamuga nIvu ADEvi satyAlEkAka | kaDu mAvaMTi vAritO galla lADEvA |
aDisi tolli asurasatulatO nEmOkAka | taDavitE nETi vELa tappu nIyaMdunnadA ||

ca|| cimmirEga nI vinniTA jEsEvi puNyAlEkAka | pammu nI voLLa neMcitE pApamunnadA |
kummariMci yI suddulu gollatalaMdEmO kAka | nemmadi nI podduku niMda nIyaMdunnadA ||

ca|| daggaritE nI vallanu daya dAkShiNyAlEkAka | kaggina niShTUra miMcukaMta galadA |
veggaLiMci nannunu SrIvEMkaTESa kUDitivi | voggi ninnu dUrabOtE voccamu nIkunnadA ||


Emi sEsEvichchaTanu - ఏమి సేసేవిచ్చటను

ఏమి సేసేవిచ్చటను (రాగం: ) (తాళం : )

ఏమి సేసేవిచ్చటను ఇంతి నిన్ను బిలిచీని
ప్రేమములు కణజాల బెట్టుకొందువు రావయ్యా ||

చెలియ చెమటలను చిత్తడివాన గురిసె
బలువుగా వలపుల పంటలు వండి
కలిమి మీరి చన్నులు కనకపురాసులాయ
కొంచికోరుగొందువు కొటారుకు రావయ్యా ||

వుడివోని తమనిపుతూర్పులనే తూరుపెత్తె
కడలేని యాసలగాదెలబోసె
యెడయని పయ్యెదనే ఇల్లారుగా బెట్టె
కడలేని రతుల కంగాణింతువు రావయ్యా ||

పొలప సిగ్గుల పాలపొంగలెగా బెట్టె
వెలియ గాగిలి నీకు విడిదిసెసె
అలమేలు మంగ పతివైన శ్రీవేంకటేశ్వర
కలిసితి విట్టె వచ్చి కాణాచాయ రావయ్యా ||

Emi sEsEvichchaTanu (Raagam: ) (Taalam: )

Emi sEsEvichchaTanu iMti ninnu bilichIni
prEmamulu kaNajAla beTTukoMduvu rAvayyA ||

cheliya chemaTalanu chittaDivAna gurise
baluvugA valapula paMTalu vaMDi
kalimi mIri channulu kanakapurAsulAya
koMchikOrugoMduvu koTAruku rAvayyA ||

vuDivOni tamaniputUrpulanE tUrupette
kaDalEni yAsalagAdelabOse
yeDayani payyedanE illArugA beTTe
kaDalEni ratula kaMgANiMtuvu rAvayyA ||

polapa siggula pAlapoMgalegA beTTe
veliya gAgili nIku viDidisese
alamElu maMga pativaina SrIvEMkaTESvara
kalisiti viTTe vachchi kANAchAya rAvayyA ||


Aemamduru yeemaataku - ఏమందురు యీమాటకు

ఏమందురు యీమాటకు(రాగం: వరాళి) (తాళం : )

ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను
నీమాయ యెంతైనా నిన్ను మించవచ్చునా

నేను నిన్ను గొలిచితి నీవు నన్ను నేలితివి
పాని పంచేంద్రియాలేల పనిగొనీవి
కానిలేనిబంట్ల దేరకాండ్లు వెట్టిగొనగ
దానికి నీ కూరకుండ ధర్మమా సర్వేశ్వరా

పుట్టించినాడవు నీవు పుట్టినవాడను నేను
వట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని
వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాచితే
తట్టి నీవు వహించుకోదగదా సర్వేశ్వరా

యెదుట నీవు గలవు యిహములో నే గలను
చెదరినచిత్తమేల చిమ్మిరేచీని
అదన శ్రీవేంకటేశ ఆరితేరినట్టినన్ను
వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వరా

Aemamduru yeemaataku (Raagam: ) (Taalam: )

Aemamduru yeemaataku nimdaroo ninnu
Neemaaya yemtainaa ninnu mimchavachchunaa

Naenu ninnu golichiti neevu nannu naelitivi
Paani pamchaemdriyaalaela panigoneevi
Kaanilaenibamtla daerakaamdlu vettigonaga
Daaniki nee koorakumda dharmamaa sarvaesvaraa

Puttimchinaadavu neevu puttinavaadanu naenu
Vatti karmamaela nannu baadhapetteeni
Vottinasommuku vaerokaru chaeyichaachitae
Tatti neevu vahimchukodagadaa sarvaesvaraa

Yeduta neevu galavu yihamulo nae galanu
Chedarinachittamaela chimmiraecheeni
Adana sreevaemkataesa aaritaerinattinannu
Vadalaka rakshimchuko vannegaa sarvaesvaraa

Emaraka talacarO - ఏమరక తలచరో

ఏమరక తలచరో (రాగం: ) (తాళం : )

ప|| ఏమరక తలచరో యిదే చాలు | కామించినవియెల్ల గక్కున కలుగు ||

చ|| దురితములెల్ల దీరు దుఃఖములెల్ల నణుగు | హరియని వొకమాటు అన్నాజాలు |
సురలు పూజింతురు సిరులెల్ల జేరును | మరుగురుని నామమటు పేరుకొన్నజాలు ||

చ|| భవములన్నియుబాయు పరము నిహముజేరు | ఆవల నారాయణ యన్నాజాలు |
భువి యెల్లా దానేలు పుణ్యములన్నియు జేరు | తవిలి గోవిందునాత్మ దరచిన జాలు ||

చ|| ఆనందము గలుగు నజ్ఞానమెల్లబాయు | ఆనుక శ్రీ వేంకటేశ యన్నాజాలు |
యీనెపాన నారదాదులిందరు నిందకు సాక్షి | దానవారి మంత్ర జపతపమే చాలు ||

Emaraka talacarO (Raagam: ) (Taalam: )

pa|| Emaraka talacarO yidE cAlu | kAmiMcinaviyella gakkuna kalugu ||

ca|| duritamulella dIru duHKamulella naNugu | hariyani vokamATu annAjAlu |
suralu pUjiMturu sirulella jErunu | maruguruni nAmamaTu pErukonnajAlu ||

ca|| BavamulanniyubAyu paramu nihamujEru | Avala nArAyaNa yannAjAlu |
Buvi yellA dAnElu puNyamulanniyu jEru | tavili gOviMdunAtma daracina jAlu ||

ca|| AnaMdamu galugu naj~jAnamellabAyu | Anuka SrI vEMkaTESa yannAjAlu |
yInepAna nAradAduliMdaru niMdaku sAkShi | dAnavAri maMtra japatapamE cAlu ||

EmaMTi vEmaMTi - ఏమంటి వేమంటి

ఏమంటి వేమంటి (రాగం: ) (తాళం : )

ప : ఏమంటి వేమంటి వెరగనేను - ఓ
కామిని నీకిప్పుడైన కానవచ్చెగా

చ : వేలతలుపు మీటిన విటుడెవ్వడే - ఓ
తాలిమి నేనే మాధవుడను
వాలిన మాధవుడవంటే వసంతుడవా - కాదే
గాలింపు చక్రముచేత కలవాడనే

చ : ధర చక్రివైతే కుమ్మరవాడవా - కాదే
సిరుల భూమి ధరించినవాడనే
శిరసున భూమిమోచే శేషుడవా - కాదే
అరయ నిన్నియునేలే హరినే నేను

చ : వంతులకు హరివైతే వానరమవా - నీ
మంతనపు లక్ష్మీ రమణుడనేను
ఇంతయేల శ్రీవేంకటేశుడ ననగరాదా - తొల్లి
అంతేపో నామారు నీవంటివిగదవే

EmaMTi vEmaMTi (Raagam: ) (Taalam: )

pa : EmaMTi vEmaMTi veraganEnu - O
kAmini nIkippuDaina kAnavaccegA

ca : vElatalupu mITina viTuDevvaDE - O
tAlimi nEnE mAdhavuDanu
vAlina mAdhavuDavaMTE vasaMtuDavA - kAdE
gAliMpu cakramucEta kalavADanE

ca : dhara cakrivaitE kummaravADavA - kAdE
sirula BUmi dhariMcinavADanE
Sirasuna BUmimOcE SEShuDavA - kAdE
araya ninniyunElE harinE nEnu

ca : vaMtulaku harivaitE vAnaramavA - nI
maMtanapu lakShmI ramaNuDanEnu
iMtayEla SrIvEMkaTESuDa nanagarAdA - tolli
aMtEpO nAmAru nIvaMTivigadavE

Get this widget | Track details | eSnips Social DNA

Emani varNimcunukO - ఏమని వర్ణించునుకో

ఏమని వర్ణించునుకో (రాగం: ) (తాళం : )

ప : ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి

చ : పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ

చ : వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ

చ : అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ

Emani varNimcunukO (Raagam: ) (Taalam: )

pa : Emani varNimcunukO inka purANamulella
vEmAru kottalAye viSwalOkapatiki

ca : pAlajalanidhilOna palumAru tElagAnu
nIlavarNamellabOyi nimDu telupainaTTu
mElimi kappurakApu mEnanimDa nimcagAnu
pOlike vErokkaTAye purushOttamunikI

ca : vEDuka kALimdilOna vEmAru nIdagAnu
ADanE kammara nalupainaTTu
tODanE taTTupunugu toppadOga nimcagAnu
jADa vErokkaTAye sarvESwarunikI

ca : alamElumanga nu~ramandunE nilupagAnu
alari bamgAru varNamainaTTu
nalugaDa sommulatO nAnAvarNamulu
nilice SrIvEmkaTanilayamUritikI