EmisEtuvu dEvadEva - ఏమిసేతువు దేవదేవ

ఏమిసేతువు దేవదేవ (రాగం: ) (తాళం : )

ప|| ఏమిసేతువు దేవదేవ యింతయును నీమాయ | కామినుల జూచిచూచి కామించె భవము ||

చ|| చంచలపు గనుదోయి సతులబారికి జిక్కి | చంచలమందెను నాదిచ్చరిమనసు |
కంచుగుత్తికలవారి గానములజొక్కిచొక్కి | కంచుబెంచునాయబో నాకడలేనిగుణము ||

చ|| తీపులమాటల మించి తెరవలభ్రమ దరి- | తీపులపాలాయబో నాతెలివెల్లాను |
పూపలనవ్వులతోడి పొలతుల జూచిచూచి | పూపలుబిందెలునై పొల్లువోయ దపము ||

చ|| కూటమి సతులపొందు కోరికోరి కూడికూడి | కూటువ నావిరతెందో కొల్లబోయను |
నీటున శ్రీవేంకటేశ నినుగని యింతలోనె | జూటరినై యింతలోనె సుజ్ఞానినైతి ||

EmisEtuvu dEvadEva (Raagam: ) (Taalam: )

pa|| EmisEtuvu dEvadEva yiMtayunu nImAya | kAminula jUcicUci kAmiMce Bavamu ||

ca|| caMcalapu ganudOyi satulabAriki jikki | caMcalamaMdenu nAdiccarimanasu |
kaMcuguttikalavAri gAnamulajokkicokki | kaMcubeMcunAyabO nAkaDalEniguNamu ||

ca|| tIpulamATala miMci teravalaBrama dari- | tIpulapAlAyabO nAtelivellAnu |
pUpalanavvulatODi polatula jUcicUci | pUpalubiMdelunai polluvOya dapamu ||

ca|| kUTami satulapoMdu kOrikOri kUDikUDi | kUTuva nAvirateMdO kollabOyanu |
nITuna SrIvEMkaTESa ninugani yiMtalOne | jUTarinai yiMtalOne suj~jAninaiti ||


EmisEyuvAra mikanu - ఏమిసేయువార మికను

ఏమిసేయువార మికను (రాగం: ) (తాళం : )

ప|| ఏమిసేయువార మికను | ఆమనిచేలపచ్చలాయ బ్రదుకు ||

చ|| దీపనమనియెడి తీరనియాస | రేపుమాపు బెడరేచగా |
తోపుసేయగరాక దురితపుతరవుల- | కాపదలకు లోనాయ బ్రదుకు ||

చ|| వేడుకనెడి పెద్దవిడువనితరవు | వోడ కెపుడు వొద్దనుండగా |
జోడు విడువరాక చులుకదనంబున- | కాడికెలకు లోనాయ బ్రదుకు ||

చ|| మమకారమనియెడి మాయతరవు | తిమిర మెక్కించుక తియ్యగా |
విమలమూరితియైన వేంకటగిరిపతి | అమర జేరక యెరువాయ బ్రదుకు ||

EmisEyuvAra mikanu (Raagam: ) (Taalam: )

pa|| EmisEyuvAra mikanu | AmanicElapaccalAya braduku ||

ca|| dIpanamaniyeDi tIraniyAsa | rEpumApu beDarEcagA |
tOpusEyagarAka duritaputaravula- | kApadalaku lOnAya braduku ||

ca|| vEDukaneDi peddaviDuvanitaravu | vODa kepuDu voddanuMDagA |
jODu viDuvarAka culukadanaMbuna- | kADikelaku lOnAya braduku ||

ca|| mamakAramaniyeDi mAyataravu | timira mekkiMcuka tiyyagA |
vimalamUritiyaina vEMkaTagiripati | amara jEraka yeruvAya braduku ||


Emi seyudu ninka - ఏమి సేయుదు నింక

ఏమి సేయుదు (రాగం: ) (తాళం : )

ప|| ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుడా | నీమఱగు చొచ్చితిని నెరవేర్తుగాక ||

చ|| కడి వోనిజవ్వనము కలిమిలేమెఱుగునా | బడినుండి మిగుల ఋణపరచుగాక |
అడియాసలెల్లా బుణ్యముబాప మెఱుగునా | వెడగుదనలో దయ విడిపించుగాక ||

చ|| వలపువెఱ పెఱుగునా వాడిమొనలకు నైన | బలిమి దూరించ జలపట్టుగాక |
చలనమందినమనసు జాతి నీ తెఱుగునా | కలిసి హేయమున కొడిగట్టించుగాక ||

చ|| యెలమి రతివశము యెగ్గుసిగ్గెఱుగునా | బలిమి దిట్లకు నొడబఱచుగాక |
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి | తలగించి యేలితివి దయసేతుగాక ||

Emi sEyudu (Raagam: ) (Taalam: )

pa|| Emi sEyudu niMka niMdirAdhISvaruDA | nImarxagu coccitini neravErtugAka ||

ca|| kaDi vOnijavvanamu kalimilEmerxugunA | baDinuMDi migula RuNaparacugAka |
aDiyAsalellA buNyamubApa merxugunA | veDagudanalO daya viDipiMcugAka ||

ca|| valapuverxa perxugunA vADimonalaku naina | balimi dUriMca jalapaTTugAka |
calanamaMdinamanasu jAti nI terxugunA | kalisi hEyamuna koDigaTTiMcugAka ||

ca|| yelami rativaSamu yeggusiggerxugunA | balimi diTlaku noDabarxacugAka |
yilalOna SrIvEMkaTESa nImAya livi | talagiMci yElitivi dayasEtugAka ||


Emi sEyavachchu - ఏమి సేయవచ్చు

ఏమి సేయవచ్చు (రాగం:సామంతం ) (తాళం : )

ఏమి సేయవచ్చు గర్మమిచ్చినంతేకాని లేదు
తాము సేసినంత వట్టు తమకు బోరాదు ||

ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు,వీపు
బట్టగట్ట మోపు మోచి పాటువడ్డా లేదు
తట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదు
తెట్టదెరువున నోరుదెరచినా లేదు ||

అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతి
విడిచి నెత్తుటదోగి వీరుడైనా లేదు
అడవులెల్లాదిరిగి అలమటించిన లేదు
యిడుమపాటుకు జొచ్చి యియ్యకొన్నా లేదు ||

వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదు
మెచ్చులగుఋఋఅము నెక్కి మెరసినా లేదు
యెచ్చరిక దిరువేంకటేశు గొలువక వుంటే
యిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు ||

Emi sEyavachchu (Raagam:sAmaMtaM ) (Taalam: )

Emi sEyavachchu garmamichchinaMtEkAni lEdu
tAmu sEsinaMta vaTTu tamaku bOrAdu ||

iTTunaTTu miTTipaDDa yiMchukaMtA lEdu,vIpu
baTTagaTTa mOpu mOchi pATuvaDDA lEdu
taTTuvaDa lOkamella davvukoninA lEdu
teTTaderuvuna nOruderachinA lEdu ||

aDigi parulabadu kAsapaDDA lEdu, bhIti
viDichi nettuTadOgi vIruDainA lEdu
aDavulellAdirigi alamaTiMchina lEdu
yiDumapATuku jochchi yiyyakonnA lEdu ||

vachchivachchi vanitala valapiMchukonnA lEdu
mechchulaguRRamu nekki merasinA lEdu
yechcharika diruvEMkaTESu goluvaka vuMTE
yichchaTanachchaTa sukha miMchukaMtA lEdu ||



Emi sEyagavaccu - ఏమి సేయగవచ్చు

ఏమి సేయగవచ్చు (రాగం: ) (తాళం : )

ప|| ఏమి సేయగవచ్చు నీశ్వరాధీనంబు | తామసపుబుద్ధి కంతలు దూరవలనె ||

చ|| తెగి దురాపేక్షబడ తివియు గతిలేదుగన | పగగొన్న వగలకూపముల బడవలసె |
తగుమోహసలిలంబు దాట మతిలేదుగన | మగుడబడి భవముతో మల్లాడవలసె ||

చ|| పాపకర్మముల జంపగ శక్తిలేదుగన | కోపబుద్ధులచేత కొరమాలవలసె |
రూపములు బొడగాంచి రోయ దరిలేదుగన | తాపములచే బొరలి తగులుగావలసె ||

చ|| తిరువేంకటాచలాధిపు గొలువలేదుగన | గరిమిచెడి విషయకింకరుడు గావలనె |
పరతత్త్వమూర్తి దలపగ బ్రొద్దులేదుగన | దొరతనం బుడిగి యాతురుడు గావలసె ||

Emi sEyagavaccu (Raagam: ) (Taalam: )

pa|| Emi sEyagavaccu nISvarAdhInaMbu | tAmasapubuddhi kaMtalu dUravalane ||

ca|| tegi durApEkShabaDa tiviyu gatilEdugana | pagagonna vagalakUpamula baDavalase |
tagumOhasalilaMbu dATa matilEdugana | maguDabaDi BavamutO mallADavalase ||

ca|| pApakarmamula jaMpaga SaktilEdugana | kOpabuddhulacEta koramAlavalase |
rUpamulu boDagAMci rOya darilEdugana | tApamulacE borali tagulugAvalase ||

ca|| tiruvEMkaTAcalAdhipu goluvalEdugana | garimiceDi viShayakiMkaruDu gAvalane |
paratattvamUrti dalapaga broddulEdugana | doratanaM buDigi yAturuDu gAvalase ||


Emi sEsEmika - ఏమి సేసేమిక

ఏమి సేసేమిక (రాగం: ) (తాళం : )

ప|| ఏమి సేసేమిక నేము యెంతని దాచుకొందుము | నీమహిమ యింతింతననేరము నేమయ్యా ||

చ|| అందు నిన్ను నొకమాటు హరి యను నుడిగితె | పొందినపాతకమెల్లా బొలిసిపోయ |
మందలించి మఱి యొకమాటు నుడిగినఫల- | మందె నీకప్పగించితి మదిగోవయ్యా ||

చ|| యిట్టె మీకు రెండుచేతులె త్తొకమాటు మొక్కితే | గట్టిగా నిహపరాలు గలిగె మాకు |
దట్టముగ సాష్టాంగదండము వెట్టినఫల- | మట్టె నీమీద నున్నది అదిగోవయ్యా ||

చ|| సరుగ నీకొకమాటు శరణన్నమాత్రమున | సిరుల బుణ్యుడ నైతి శ్రీవేంకటేశ |
ధరలోన నే నీకు దాసుడనైనఫల- | మరయ నీమీద నున్న దదిగోవయ్యా ||

Emi sEsEmika (Raagam: ) (Taalam: )

pa|| Emi sEsEmika nEmu yeMtani dAcukoMdumu | nImahima yiMtiMtananEramu nEmayyA ||

ca|| aMdu ninnu nokamATu hari yanu nuDigite | poMdinapAtakamellA bolisipOya |
maMdaliMci marxi yokamATu nuDiginaPala- | maMde nIkappagiMciti madigOvayyA ||

ca|| yiTTe mIku reMDucEtule ttokamATu mokkitE | gaTTigA nihaparAlu galige mAku |
daTTamuga sAShTAMgadaMDamu veTTinaPala- | maTTe nImIda nunnadi adigOvayyA ||

ca|| saruga nIkokamATu SaraNannamAtramuna | sirula buNyuDa naiti SrIvEMkaTESa |
dharalOna nE nIku dAsuDanainaPala- | maraya nImIda nunna dadigOvayyA ||


Emi bAti nEDide - ఏమి బాతి నేడిదె

ఏమి బాతి నేడిదె (రాగం: ) (తాళం : )

ఏమి బాతి నేడిదె నీకు మము
గామించు సిరులింతే కదవయ్యా ||

వెనక ముందర వెలయగ ముందర
వెనక లింతే విభవాలు
వనితల పిఋదులు వాడి కుచములు కొప్పు
కనుగొన భ్రమలింతె కదవయ్యా ||

వెలుగు చీకటి నిరసాలు విభవాలు
కలిమి లే ములే కదవయ్యా
పలు వన్నె మాటలు పసని తేటలు నివి
కలవెంత కలలింతె కదవయ్యా ||

Emi bAti nEDide (Raagam: ) (Taalam: )

Emi bAti nEDide nIku mamu
gAmiMchu siruliMtE kadavayyA ||

venaka muMdara velayaga muMdara
venaka liMtE vibhavAlu
vanitala piRudulu vADi kuchamulu koppu
kanugona bhramaliMte kadavayyA ||

velugu chIkaTi nirasAlu vibhavAlu
kalimi lE mulE kadavayyA
palu vanne mATalu pasani tETalu nivi
kalaveMta kalaliMte kadavayyA ||