EmI naDuganolla - ఏమి గలిగెను

ఏమి గలిగెను (రాగం: ) (తాళం : )

ప|| ఏమి గలిగెను మాకిందువలన | వేమారు బొరలితిమి వెర్రిగొన్నట్లు ||

చ|| తటతటన నీటిమీదట నాలజాలంబు- | లిటునటు జరించవా యీది యీది |
అటువలెనెపో తమకమంది సంసారంపు- | ఘటనకై తిరిగితిమి కడగానలేక ||

చ|| దట్టముగ బారావతములు మిన్నుల మోవ | కొట్టగొన కెక్కెనా కూడికూడి |
వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు | బట్టబయ లీదితిమి పనిలేనిపాట ||

చ|| బెరసి కుమ్మరపురువు పేడలోపలనెల్ల | పొరలదా పలుమారు బోయొపోయి |
వరుస జన్మముల నటువలెనెపో పొరలితిమి | తిరువేంకటాచలాధిపు దలచలేక ||

EmI naDuganolla (Raagam: ) (Taalam: )

pa|| EmI naDuganolla heccukuMdu lananolla | kAmiMci nIviccitivi kaivalyapadamu ||

ca|| puTTugulaku verava BuvilOna hari nIku- | niTTe nIdAsuDa nE naitEjAlu |
veTTiki nEjAtiyaina veruva nInAmamulu | voTTi nAnAlikamIda nuMTE jAlu ||

ca|| duritAlaku verava tuda vEyainA hari nI- | karuNa gaiMkaryamu galigitE jAlu |
nirati niMdriyAlaku nE verava nIvAtma | berarEpakuDavai perigitE jAlu ||

ca|| yElOkamainA verava yeppuDU SrIvEMkaTESa | pAliMci nIkRupa nApai bAritE jAlu |
kAlameTlayinA verava karma mETTayinA verava | yElinanIdAsulu nanniyyakoMTE jAlunu ||


EmIneruganimammu - ఏమీనెరుగనిమమ్ము

ఏమీనెరుగనిమమ్ము (రాగం: ) (తాళం : )

ప|| ఏమీనెరుగనిమమ్ము నెక్కువసేసి | పామరుల దొడ్డజేసె భాష్యకారులు ||

చ|| గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి | ఆతనికరుణచేత నన్నియుగని |
గతిలేకపోయిన కలియుగమున వచ్చి | ప్రతిపాలించగలిగె భాష్యకారులు ||

చ|| లోకమెల్ల వెల్లిబోగ లోననే సురల గాచి | ఆకుమీద దేలినయతనికృప |
కాకరిమతములెల్ల గాలిబుచ్చి పరమిట్టే | పైకొనగ గరుణించె భాష్యకారులు ||

చ|| పంకజపుజేయి చాచి పాదపుబరమిచ్చిన | వేంకటేశుకృపతోడ వెలయు దానే |
తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన | పంకమెల్ల బోగడిగె భాష్యకారులు ||

EmIneruganimammu (Raagam: ) (Taalam: )

pa|| EmIneruganimammu nekkuvasEsi | pAmarula doDDajEse BAShyakArulu ||

ca|| gatacannavEdAlu kamalajunaku nicci | AtanikaruNacEta nanniyugani |
gatilEkapOyina kaliyugamuna vacci | pratipAliMcagalige BAShyakArulu ||

ca|| lOkamella vellibOga lOnanE surala gAci | AkumIda dElinayatanikRupa |
kAkarimatamulella gAlibucci paramiTTE | paikonaga garuNiMce BAShyakArulu ||

ca|| paMkajapujEyi cAci pAdapubaramiccina | vEMkaTESukRupatODa velayu dAnE |
teMkinE voDayavarai tirumaMtradvayAna | paMkamella bOgaDige BAShyakArulu ||


EmI nerxaganinA - ఏమీ నెఱగనినా

ఏమీ నెఱగనినా (రాగం: ) (తాళం : )

ప|| ఏమీ నెఱగనినా కేడపుణ్యము | తామసుండజుమ్మీ ముందరనున్న దైవమా ||

చ|| పాతకపుజేతలనే పట్టి నిన్ను బూజించు- | ఘాతకుడ నాకు నెక్కడిపుణ్యము |
చేతనము బోదిసేయుచిత్తము నీదేకాన | రాతిబొమ్మజుమ్మీ భారము నీది దైవమా ||

చ|| పూనినయెంగిలినోర నొప్పగునిన్ను బొగడు- | హీనజంతువునకు నా కేటిపుణ్యము |
తేనెపూసి నీవిట్లా దిప్పగానే తిరిగేటి- | మానిబొమ్మజుమ్మీ నామతిలోని దైవమా ||

చ|| జాలిబడి సంసారజలధిలో మునిగేటి- | కూళడ నాకేటితేకువపుణ్యము |
పాలువోసి పెంచిన నాపాలివేంకటేశ నే | తోలిబొమ్మజుమ్మీ కాతువుగాని దైవమా ||

EmI nerxaganinA (Raagam: ) (Taalam: )

pa|| EmI nerxaganinA kEDapuNyamu | tAmasuMDajummI muMdaranunna daivamA ||

ca|| pAtakapujEtalanE paTTi ninnu bUjiMcu- | GAtakuDa nAku nekkaDipuNyamu |
cEtanamu bOdisEyucittamu nIdEkAna | rAtibommajummI BAramu nIdi daivamA ||

ca|| pUninayeMgilinOra noppaguninnu bogaDu- | hInajaMtuvunaku nA kETipuNyamu |
tEnepUsi nIviTlA dippagAnE tirigETi- | mAnibommajummI nAmatilOni daivamA ||

ca|| jAlibaDi saMsArajaladhilO munigETi- | kULaDa nAkETitEkuvapuNyamu |
pAluvOsi peMcina nApAlivEMkaTESa nE | tOlibommajummI kAtuvugAni daivamA ||


EmisEsina nIruNa - ఏమిసేసిన నీరుణ

ఏమిసేసిన నీరుణ (రాగం: ) (తాళం : )

ప|| ఏమిసేసిన నీరుణ మెట్టు వాసును | కామితఫలద వోకరుణానిధి ||

చ|| చేరి కర్మములు నన్ను చెఱువట్టకుండగాను | పేరువాడి వచ్చి విడిపించుకొంటివి |
సారె తగవట్టె కాదా శక్తిగలవారెల్లా | నారయదీనుల గంటే నడ్డమై కాతురు ||

చ|| అరులు పంచేంద్రియము లందు నిందు దియ్యగాను | వెరవుతోడ వెనక వేసుకొంటివి |
పరగ నట్టేకాదా బలుపులైనవారు | అరయ బేదలకైన ఆపద మానుతురు ||

చ|| పలుజన్మములే నన్ను పరి అరికొట్టుకోగా | తొలగదోసి నాకు దోడైతివి |
యెలమి శ్రీవేంకటేశ యిల శూరులైనవారు | బలుభయ మిందరికి బాపుచుందురు ||

EmisEsina nIruNa (Raagam: ) (Taalam: )

pa|| EmisEsina nIruNa meTTu vAsunu | kAmitaPalada vOkaruNAnidhi ||

ca|| cEri karmamulu nannu cerxuvaTTakuMDagAnu | pEruvADi vacci viDipiMcukoMTivi |
sAre tagavaTTe kAdA SaktigalavArellA | nArayadInula gaMTE naDDamai kAturu ||

ca|| arulu paMcEMdriyamu laMdu niMdu diyyagAnu | veravutODa venaka vEsukoMTivi |
paraga naTTEkAdA balupulainavAru | araya bEdalakaina Apada mAnuturu ||

ca|| palujanmamulE nannu pari arikoTTukOgA | tolagadOsi nAku dODaitivi |
yelami SrIvEMkaTESa yila SUrulainavAru | baluBaya miMdariki bApucuMduru ||


EmisEtunayya nIvu - ఏమిసేతునయ్య నీవు

ఏమిసేతునయ్య నీవు (రాగం: ) (తాళం : )

ఏమిసేతునయ్య నీవు యింతటి నాయఖుండవు
మోముచూచి తొలినీకు మొహించిన దానను ||

వలపించవలె నొండె వశముగాకుండితేను
చెలరేగి ప్రియమైనం జెప్పవనిను
పిలువనంపంగవలె బిగిసి రాకుందితేను
కొలువుకు వచ్చి కొంత కొసరగావలెను ||

మెప్పించుకోవలె నొండె మించి కరగకుడితే
వుప్పతించ నోర్పుతోడ నుండవలెను
చిప్పిలబెనగంగ చేతికీ లోగాకుండతే
చెప్పినట్టిపూడిగాలు సేయంగవలెను ||

పంచుకొనవలె నొండె నవమానమున నుంటె
కొంచక పంతములిచ్చి కూడవలెను
యెంచంగ శ్రీ వేంకటేశ యేనలమేల్మంగను
పొంచి నన్నేలితివి పొగడంగవలెను ||

EmisEtunayya nIvu (Raagam: ) (Taalam: )

EmisEtunayya nIvu yiMtaTi nAyaKuMDavu
mOmuchUchi tolinIku mohiMchina dAnanu ||

valapiMchavale noMDe vaSamugAkuMDitEnu
chelarEgi priyamainaM jeppavaninu
piluvanaMpaMgavale bigisi rAkuMditEnu
koluvuku vachchi koMta kosaragAvalenu ||

meppiMchukOvale noMDe miMchi karagakuDitE
vuppatiMcha nOrputODa nuMDavalenu
chippilabenagaMga chEtikI lOgAkuMDatE
cheppinaTTipUDigAlu sEyaMgavalenu ||

paMchukonavale noMDe navamAnamuna nuMTe
koMchaka paMtamulichchi kUDavalenu
yeMchaMga SrI vEMkaTESa yEnalamElmaMganu
poMchi nannElitivi pogaDaMgavalenu ||


EmisEtu nammalAla - ఏమిసేతు నమ్మలాల

ఏమిసేతు నమ్మలాల (రాగం: ) (తాళం : )

ఏమిసేతు నమ్మలాల యెందుకౌను నాయకుడు
భూమిలో జెప్ప గొత్త యీ పురుష విరహము ||

తొయ్యలి రాకకు బతి తొంగిచూడ బోతేను
దయ్యమువలె జంద్రుడు తలచూపెను
చయ్యన నందు కతడు జడసి తలవంతే
నుయ్యివలెనే తోచె నూలుకొని మనసు ||

మగువ యెలుగు విన మతి నాలకించితేను
పగవాని వలనే పల్కెగోవిల
వెగటై యందు కతడు వీనులు మూసుకొంటే
మొగులు వలెనే కప్ప ముంచుక విరహము ||

నలినాక్షి రూపు మనసున దలచబోతే
చిలుకుగాలమై తోచెనుమరుడు
అలసె శ్రీవేంకటేశుడంతలోన సతిగూడె
నెలకొని కొండవలె నిలిచె సంతోసము ||

EmisEtu nammalAla (Raagam: ) (Taalam: )

EmisEtu nammalAla yeMdukounu nAyakuDu
bhUmilO jeppa gotta yI puruSha virahamu ||

toyyali rAkaku bati toMgichUDa bOtEnu
dayyamuvale jaMdruDu talachUpenu
chayyana naMdu kataDu jaDasi talavaMtE
nuyyivalenE tOche nUlukoni manasu ||

maguva yelugu vina mati nAlakiMchitEnu
pagavAni valanE palkegOvila
vegaTai yaMdu kataDu vInulu mUsukoMTE
mogulu valenE kappa muMchuka virahamu ||

nalinAkShi rUpu manasuna dalachabOtE
chilukugAlamai tOchenumaruDu
alase SrIvEMkaTESuDaMtalOna satigUDe
nelakoni koMDavale niliche saMtOsamu ||


EmisEtu niMduku - ఏమిసేతు నిందుకు

ఏమిసేతు నిందుకు (రాగం: ) (తాళం : )

ప|| ఏమిసేతు నిందుకు మందేమైన బోయరాదా | సామజ గరుడ నీతో సంగమొల్లదేటికి ||

చ|| మాయల సంసారము మరిగిన కర్మము | యీయెడ నిను మరుగ దేటికో హరి |
కాయజ కేలిపై దమి గలిగిన మనసు | కాయజుతండ్రి నీపై గలుగదేటికి ||

చ|| నాటకపు గనకము నమ్మినట్టి బదుకు | యేటికి నీ భక్తి నమ్మేదేల
గూట బడే పదవులు గోరేటి జీవుడు | కూటువైన నిజముక్తి గోరెడిది యేటికీ ||

చ|| పాప పుణ్యములకె పాలుపడ్డ నేను | యేపున నీపాల జిక్కనేలకో హరి |
శ్రీపతి నాలోని శ్రీ వేంకటేశుడ | నేపేరి వాడ నాకు నిండు మాయలేటికి ||

EmisEtu niMduku (Raagam: ) (Taalam: )

pa|| EmisEtu niMduku maMdEmaina bOyarAdA | sAmaja garuDa nItO saMgamolladETiki ||

ca|| mAyala saMsAramu marigina karmamu | yIyeDa ninu maruga dETikO hari |
kAyaja kElipai dami galigina manasu | kAyajutaMDri nIpai galugadETiki ||

ca|| nATakapu ganakamu namminaTTi baduku | yETiki nI Bakti nammEdEla
gUTa baDE padavulu gOrETi jIvuDu | kUTuvaina nijamukti gOreDidi yETikI ||

ca|| pApa puNyamulake pAlupaDDa nEnu | yEpuna nIpAla jikkanElakO hari |
SrIpati nAlOni SrI vEMkaTESuDa | nEpEri vADa nAku niMDu mAyalETiki ||