Ela mOsapOyirokO - ఏల మోసపోయిరొకో

ఏల మోసపోయిరొకో (రాగం: ) (తాళం : )

ప|| ఏల మోసపోయిరొకో యెంచి యాకాలపువారు | బాలకృష్ణునిబంట్లై బ్రదుకవద్దా ||

చ|| పసులగాచేవాని బ్రహ్మ నుతించెనంటేను | దెసలదేవుడేయని తెలియవద్దా |
సిసువు గోవర్ధనాద్రి చేతబట్టి యెత్తెనంటే | కొసరీతని పాదాలే కొలువవద్దా ||

చ|| నరునికి విశ్వరూ పున్నతి జూపెనంటేను | నరహరి యితడని నమ్మవద్దా |
పరగ జక్రముచేత బాణుని నఱకెనంటే | సొరి దీతని శరణుచొఱవద్దా ||

చ|| అందరుసురలలోన నగ్రపూజ గొన్నప్పుడే| చెంది యీతనికృపకు జేరవద్దా |
అంది శ్రీవేంకటేశు డట్టె ద్రిష్టదైవమంటే | విందుల బరులసేవ విడువవద్దా ||

Ela mOsapOyirokO (Raagam: ) (Taalam: )

pa|| Ela mOsapOyirokO yeMci yAkAlapuvAru | bAlakRuShNunibaMTlai bradukavaddA ||

ca|| pasulagAcEvAni brahma nutiMcenaMTEnu | desaladEvuDEyani teliyavaddA |
sisuvu gOvardhanAdri cEtabaTTi yettenaMTE | kosarItani pAdAlE koluvavaddA ||

ca|| naruniki viSvarU punnati jUpenaMTEnu | narahari yitaDani nammavaddA |
paraga jakramucEta bANuni narxakenaMTE | sori dItani SaraNucorxavaddA ||

ca|| aMdarusuralalOna nagrapUja gonnappuDE| ceMdi yItanikRupaku jEravaddA |
aMdi SrIvEMkaTESu DaTTe driShTadaivamaMTE | viMdula barulasEva viDuvavaddA ||


Emiyu jEyagavaddu - ఏమియు జేయగవద్దు

ఏమియు జేయగవద్దు (రాగం: ) (తాళం : )

ప|| ఏమియు జేయగవద్దు యింతలోనె మోక్షము | దీమపువిజ్ఞానమే దివ్వెత్తుఫలము ||

చ|| పాపచింత మదిలోన బారకుండా నిలిపితే | చేపట్టి దానములెల్లా జేసినంతఫలము |
కోపానలములోన కోరికలు వేల్చితేనే | యేపున యజ్ఞాలు సేసి యేచినంతఫలము ||

చ|| కనకముపై యాస కాదని పోదొబ్బితేనే | తనకు వేవేలు ఘోరతపములఫలము |
వనితలమోహములవల బడకుండితేనే | దినము గోటితీర్థాలు దిరిగినఫలము ||

చ|| శ్రీవేంకటేశ్వరు జేరి కొలుచుటే | ధావతిలేనియట్టితనజన్మఫలము |
భావించి యాచార్యపాదపద్మమూలమే | సావదానమున సర్వశాస్త్రఫలము ||

Emiyu jEyagavaddu (Raagam: ) (Taalam: )

pa|| Emiyu jEyagavaddu yiMtalOne mOkShamu | dImapuvij~jAnamE divvettuPalamu ||

ca|| pApaciMta madilOna bArakuMDA nilipitE | cEpaTTi dAnamulellA jEsinaMtaPalamu |
kOpAnalamulOna kOrikalu vElcitEnE | yEpuna yaj~jAlu sEsi yEcinaMtaPalamu ||

ca|| kanakamupai yAsa kAdani pOdobbitEnE | tanaku vEvElu GOratapamulaPalamu |
vanitalamOhamulavala baDakuMDitEnE | dinamu gOTitIrthAlu diriginaPalamu ||

ca|| SrIvEMkaTESvaru jEri kolucuTE | dhAvatilEniyaTTitanajanmaPalamu |
BAviMci yAcAryapAdapadmamUlamE | sAvadAnamuna sarvaSAstraPalamu ||


Emivalasina niccu - ఏమివలసిన నిచ్చు

ఏమివలసిన నిచ్చు (రాగం: ) (తాళం : )

ప|| ఏమివలసిన నిచ్చు నెప్పుడైనను | యేమరిక కొలిచిన నీతడే దైవము ||

చ|| ఘనముగా నిందరికి గన్నులిచ్చు గాళ్ళిచ్చు | పనిసేయ జేతులిచ్చు బలియుడై |
తనుగొలువుమని చిత్తములిచ్చు గరుణించి | వొనర లోకానకెల్ల నొక్కడే దైవము ||

చ|| మచ్చిక తనుగొలువ మనసిచ్చు మాటలిచ్చు | కుచ్చితములేని కొడుకుల నిచ్చును |
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు | నిచ్చలు లోకానకెల్ల నిజమైనదైవము ||

చ|| పంతమాడి కొలిచిన బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు | యెంతటిపదవులైన నిట్టె యిచ్చు |
వింతవింతవిభవాల వేంకటేశుడిదె మా- | యంతరంగమున నుండే అరచేతిదైవము ||

Emivalasina niccu (Raagam: ) (Taalam: )

pa|| Emivalasina niccu neppuDainanu | yEmarika kolicina nItaDE daivamu ||

ca|| GanamugA niMdariki gannuliccu gALLiccu | panisEya jEtuliccu baliyuDai |
tanugoluvumani cittamuliccu garuNiMci | vonara lOkAnakella nokkaDE daivamu ||

ca|| maccika tanugoluva manasiccu mATaliccu | kuccitamulEni koDukula niccunu |
coccinacOTE cocci SuBamiccu suKamiccu | niccalu lOkAnakella nijamainadaivamu ||

ca|| paMtamADi kolicina brANamiccu prAyamiccu | yeMtaTipadavulaina niTTe yiccu |
viMtaviMtaviBavAla vEMkaTESuDide mA- | yaMtaraMgamuna nuMDE aracEtidaivamu ||


Emi voralEdu yEmi - ఏమి వొరలేదు యేమి

ఏమి వొరలేదు (రాగం: ) (తాళం : )

ప|| ఏమి వొరలేదు యేమి మరలేదు | యీమాయలంపటం బీదమోదనేకాని |

చ|| సతులుగల దా సడిబొరలనేకాని | సతమైసౌఖ్యస్వస్థానంబు లేదు |
హితులుగల మేలు తా నిడుమబొరలనెకాని | హితవివేకము నరుల కెంతైన లేదు ||

చ|| తనువులెత్తినమేలు తగులాయమేకాని | కనుగొనగ యోగభోగము గొంత లేదు ||
ఘనముగలమేలు తా గంధర్వమేకాని | ఘనుడైనశ్రీనాథు గనుగొనగ లేదు ||

చ|| చింతగలిగినమేలు చివుకబట్టనెకాని | చింత వేంకటవిభుని జింతించ లేదు |
సంతుగలిగినమేలు సంసారమేకాని | సంతతము జెడనిసద్గతి జేర లేదు ||

Emi voralEdu (Raagam: ) (Taalam: )

pa|| Emi voralEdu yEmi maralEdu | yImAyalaMpaTaM bIdamOdanEkAni |

ca|| satulugala dA saDiboralanEkAni | satamaisauKyasvasthAnaMbu lEdu |
hitulugala mElu tA niDumaboralanekAni | hitavivEkamu narula keMtaina lEdu ||

ca|| tanuvulettinamElu tagulAyamEkAni | kanugonaga yOgaBOgamu goMta lEdu ||
GanamugalamElu tA gaMdharvamEkAni | GanuDainaSrInAthu ganugonaga lEdu ||

ca|| ciMtagaliginamElu civukabaTTanekAni | ciMta vEMkaTaviBuni jiMtiMca lEdu |
saMtugaliginamElu saMsAramEkAni | saMtatamu jeDanisadgati jEra lEdu ||


Emi valasina - ఏమి వలసిన నిచ్చు

ఏమి వలసిన (రాగం: ) (తాళం : )

ప|| ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను | ఏమరుక కొలచిన నితడే దైవము ||

చ|| ఘనముగా నిందరికి గన్నులిచ్చు గాళ్ళిచ్చు | పనిసేయ జేతులిచ్చు బలియుడై |
తనుగొలువమని చిత్తము లిచ్చు గరుణించి | వొనర లోకానకెల్ల నొక్కడే దైవము ||

చ|| మచ్చిక తనుగొలువ మనసిచ్చు మాటలిచ్చు | కుచ్చితములేని కొడుకుల నిచ్చును |
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు | నిచ్చలు లోకానకెల్ల నిజమైన దైవము ||

చ|| పంతమాడి కొలచిన బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు | యెంతటి పదవులైన నిట్టె యిచ్చు |
వింతవింత విభవాల వేంకటేశుడిదే మా- | యంతరంగమున నుండే అరచేతిదైవము||

Emi valasina (Raagam: ) (Taalam: )

pa|| Emi valasina niccu neppuDainanu | Emaruka kolacina nitaDE daivamu ||

ca|| GanamugA niMdariki gannuliccu gALLiccu | panisEya jEtuliccu baliyuDai |
tanugoluvamani cittamu liccu garuNiMci | vonara lOkAnakella nokkaDE daivamu ||

ca|| maccika tanugoluva manasiccu mATaliccu | kuccitamulEni koDukula niccunu |
coccinacOTE cocci SuBamiccu suKamiccu | niccalu lOkAnakella nijamaina daivamu ||

ca|| paMtamADi kolacina brANamiccu prAyamiccu | yeMtaTi padavulaina niTTe yiccu |
viMtaviMta viBavAla vEMkaTESuDidE mA- | yaMtaraMgamuna nuMDE aracEtidaivamu||


EmiTiki calamu - ఏమిటికి చలము యెందాక

ఏమిటికి చలము (రాగం: ) (తాళం : )

ప|| ఏమిటికి చలము యెందాక | నాముల తోడుత నగవే యికను ||

చ|| బలుము లేమిటికి బచరించేవే | వలచిన దానవు వనితవు |
సొలయుచు రమణుని సోదింతురటే | అలరి ఇచ్చకములాడుట గాక ||

చ|| తగవులబెట్టగ తగునటవే యిక | మగనితోడ పలుమరు నిపుడు |
అగడుసేతురా అతని నింతేసి | చిగురు మోవొసగి చెలగుట గాక ||

చ|| కూడిన వేళను గుట్టు సేతురా | యీడనె శ్రీ వేంకటేశునెడ |
ఆడకు వెంగెము లలమేల్మంగవు | వీడెములందుక వెలయుట గాక ||

EmiTiki calamu (Raagam: ) (Taalam: )

pa|| EmiTiki calamu yeMdAka | nAmula tODuta nagavE yikanu ||

ca|| balumu lEmiTiki bacariMcEvE | valacina dAnavu vanitavu |
solayucu ramaNuni sOdiMturaTE | alari iccakamulADuTa gAka ||

ca|| tagavulabeTTaga tagunaTavE yika | maganitODa palumaru nipuDu |
agaDusEturA atani niMtEsi | ciguru mOvosagi celaguTa gAka ||

ca|| kUDina vELanu guTTu sEturA | yIDane SrI vEMkaTESuneDa |
ADaku veMgemu lalamElmaMgavu | vIDemulaMduka velayuTa gAka ||


EmiPalamu dAninniyunu - ఏమిఫలము దానిన్నియును

ఏమిఫలము దానిన్నియును (రాగం: ) (తాళం : )

ప|| ఏమిఫలము దానిన్నియును దెలిసినను | సాముచేసినఫలము జయశీలుడౌటగాక ||

చ|| తానుగలిగినఫలము దయ సేయగలుగుట | మేనుగలిగినఫలము మేలెల్ల గనుట |
మానుషముగలఫలము మంచివాడౌట తను- | దానె తెలిసినఫలము తత్త్వపరుడౌటగాక ||

చ|| పదిలమగుకులముగలఫలము తాజదువుట | చదివినఫలం బర్థసారంబు గనుట |
పొదలి శాస్త్రార్థంబు పొడగన్నఫలము మతి- | దలకకిటు వేంకటేశుదాసుడౌటగాక ||

EmiPalamu dAninniyunu (Raagam: ) (Taalam: )

pa|| EmiPalamu dAninniyunu delisinanu | sAmucEsinaPalamu jayaSIluDauTagAka ||

ca|| tAnugaliginaPalamu daya sEyagaluguTa | mEnugaliginaPalamu mElella ganuTa |
mAnuShamugalaPalamu maMcivADauTa tanu- | dAne telisinaPalamu tattvaparuDauTagAka ||

ca|| padilamagukulamugalaPalamu tAjaduvuTa | cadivinaPalaM barthasAraMbu ganuTa |
podali SAstrArthaMbu poDagannaPalamu mati- | dalakakiTu vEMkaTESudAsuDauTagAka ||