ElavaccI yElapOyI - ఏలవచ్చీ యేలపోయీ

ఏలవచ్చీ యేలపోయీ (రాగం: ) (తాళం : )

ప|| ఏలవచ్చీ యేలపోయీ నెందుండీ బ్రాణి | తోలుతిత్తిలోన జొచ్చి దుంక దూరనా ||

చ|| పుట్టులేక నరకాలపుంగుడై తానుండక యీ- | పుట్టుగున కేల వచ్చీ పోయీ బ్రాణి |
పుట్టుచునే కన్నవారి బుట్టినవారి నాసల | బెట్టిపెట్టి దుఃఖముల బెడరేచనా ||

చ|| భూతమై యడవిలో బొక్కుచు దానుండక యీ- | బూతుజన్మమేల మోచె బుచ్చినప్రాణి |
రాతిరిబగలు ఘొరపుబాటు వడిపడి | పాతకాలు చేసి యమబాధబడనా ||

చ|| కీటమై వేంకటగిరి కిందనైన నుండక యీ- | చేటువాటుకేల నోచె చెల్లబో ప్రాణి |
గాటమైనసంపదల కడలేనిపుణ్యాల- | కోటికి బడగెత్తక కొంచెపడనా ||

ElavaccI yElapOyI (Raagam: ) (Taalam: )

pa|| ElavaccI yElapOyI neMduMDI brANi | tOlutittilOna jocci duMka dUranA ||

ca|| puTTulEka narakAlapuMguDai tAnuMDaka yI- | puTTuguna kEla vaccI pOyI brANi |
puTTucunE kannavAri buTTinavAri nAsala | beTTipeTTi duHKamula beDarEcanA ||

ca|| BUtamai yaDavilO bokkucu dAnuMDaka yI- | bUtujanmamEla mOce buccinaprANi |
rAtiribagalu GorapubATu vaDipaDi | pAtakAlu cEsi yamabAdhabaDanA ||

ca|| kITamai vEMkaTagiri kiMdanaina nuMDaka yI- | cETuvATukEla nOce cellabO prANi |
gATamainasaMpadala kaDalEnipuNyAla- | kOTiki baDagettaka koMcepaDanA ||


Ela siggulu vaDEvu - ఏల సిగ్గులు వడేవు

ఏల సిగ్గులు (రాగం: ) (తాళం : )

ఏల సిగ్గులు వడేవు యెదుటికి రాగదవే
సోలిగా నీసింగారాలు చూచుగాని యీతడు ||

కొప్పువెట్టుకొంటివిగా కుప్పెసవరము తోడ
కప్పితివిగా పయ్యద కడు బోలుగా
చిప్పిలబూసితివిగా చెంపలునిండా జవ్వాది
యిప్పుడె గక్కన బతినిక వలపించవే ||

కట్టుకొంటివిగా చీరకళబెళ మనగాను
వొట్టుకొంటివిగా సొమ్ములొళ్ళొ నిండాను
గట్టిగా నిడుకొంటివిగా కన్నులనుగాటుక
దట్టముగా నీతనికి తమిరేచగదవే ||

సేసితివిగా విడేలు చెంగావి మోవెల్లాగప్ప
వేసితివిగా మెడను విరిదండలు
వేసర కలమేల్మంగ విభుడు శ్రీవేంకటేశు
డసతో నన్నేల నీవూ నంటనే యీతని ||

Ela siggulu (Raagam: ) (Taalam: )

Ela siggulu vaDEvu yeduTiki rAgadavE
sOligA nIsiMgArAlu chUchugAni yItaDu ||

koppuveTTukoMTivigA kuppesavaramu tODa
kappitivigA payyada kaDu bOlugA
chippilabUsitivigA cheMpaluniMDA javvAdi
yippuDe gakkana batinika valapiMchavE ||

kaTTukoMTivigA chIrakaLabeLa managAnu
voTTukoMTivigA sommuloLLo niMDAnu
gaTTigA niDukoMTivigA kannulanugATuka
daTTamugA nItaniki tamirEchagadavE ||

sEsitivigA viDElu cheMgAvi mOvellAgappa
vEsitivigA meDanu viridaMDalu
vEsara kalamElmaMga vibhuDu SrIvEMkaTESu
DasatO nannEla nIvU naMTanE yItani ||

Ela poddulu gaDipE - ఏల పొద్దులు గడిపే

ఏల పొద్దులు గడిపే (రాగం: ) (తాళం : )

ఏల పొద్దులు గడిపే వింతికడకు రావయ్యా
నాలిసేయ నిక వద్దు నమ్మియాపె వున్నది ||

చక్కని సతిమోమున చంద్రోదయంబాయ
వెక్కసపు నవ్వుల వెన్నెలగాసె
చొక్కపు కొప్పు విరుల చుక్కలుగానుపించె
పక్కన పెంచితే పట్టపగలు రేయొఊను ||

సతి కుచగిరులనే జిక్కవలు జోడుగూదె
తతి వికసించె గన్నుల దామరలు
మితిలేని రత్నకాంతి మించె సూర్యోదయము
మతి నెంచుకొంటేను మా పేరేపౌను ||

కలికి మెయి చెమటల గడియారపు నీరెక్కె
తెలిసిగ్గులనే పెండ్లి తెర వేసెను
అలమె శ్రీవేంకటేశ అంతలో నీవురాగాను
నెలవై యిట్టె వుండితే నిచ్చకళ్యాణమవును ||

Ela poddulu gaDipE (Raagam: ) (Taalam: )

Ela poddulu gaDipE viMtikaDaku rAvayyA
nAlisEya nika vaddu nammiyApe vunnadi ||

chakkani satimOmuna chaMdrOdayaMbAya
vekkasapu navvula vennelagAse
chokkapu koppu virula chukkalugAnupiMche
pakkana peMchitE paTTapagalu rEyoUnu ||

sati kuchagirulanE jikkavalu jODugUde
tati vikasiMche gannula dAmaralu
mitilEni ratnakAMti miMche sUryOdayamu
mati neMchukoMTEnu mA pErEpounu ||

kaliki meyi chemaTala gaDiyArapu nIrekke
telisiggulanE peMDli tera vEsenu
alame SrIvEMkaTESa aMtalO nIvurAgAnu
nelavai yiTTe vuMDitE nichchakaLyANamavunu ||

Ela samakonu sukRuta - ఏల సమకొను సుకృత

ఏల సమకొను (రాగం: ) (తాళం : )

ప|| ఏల సమకొను సుకృత మెల్లవారికి మహా- | మాలిన్యమున నాత్మ మాసినదిగాన ||

చ|| కలికాలదోషంబు కడావరానిదిగాన | తలపుదురితముల కాధారంబుగాన |
బలుపూర్వకర్మములు పట్టరానివిగాన | మలమూత్రజన్మంబు మదకరముగాన ||

చ|| రాపైనగుణ వికారములు బహుళముగాన | ఆపరానివి యింద్రియంబు లటుగాన |
దాపరంబగుమమత దయదలంపదుగాన | కాపురముచే నాస కప్పుకొనుగాన ||

చ|| హృదయంబు చంచలం బిరవుగానదుగాన | చదువు బహుమార్గముల జాటు నటుగాన |
యెదరనుండెడు వేంకటేశ్వరుని నిజమైన- | పదముపై కోరికలు పైకొనవుగాన ||

Ela samakonu (Raagam: ) (Taalam: )

pa|| Ela samakonu sukRuta mellavAriki mahA- | mAlinyamuna nAtma mAsinadigAna ||

ca|| kalikAladOShaMbu kaDAvarAnidigAna | talapuduritamula kAdhAraMbugAna |
balupUrvakarmamulu paTTarAnivigAna | malamUtrajanmaMbu madakaramugAna ||

ca|| rApainaguNa vikAramulu bahuLamugAna | AparAnivi yiMdriyaMbu laTugAna |
dAparaMbagumamata dayadalaMpadugAna | kApuramucE nAsa kappukonugAna ||

ca|| hRudayaMbu caMcalaM biravugAnadugAna | caduvu bahumArgamula jATu naTugAna |
yedaranuMDeDu vEMkaTESvaruni nijamaina- | padamupai kOrikalu paikonavugAna ||


Ela rADammA yiMtirO - ఏల రాడమ్మా యింతిరో

ఏల రాడమ్మా (రాగం: ) (తాళం : )

ప|| ఏల రాడమ్మా యింతిరో వా- | డేలరాడమ్మా నన్నేలినవాడు ||

చ|| పచ్చని పులుగుల బండిమీద నుండు | పచ్చవింటి పిన్నబాలుని తండ్రి |
పచ్చని చాయల బాయని బంగారు | పచ్చడముగట్టిన బాగైనవాడు ||

చ|| తెల్లని పులుగుపై తిరుగ మరిగినట్టి | తెల్లని సతిపాలి దేవరతండ్రి |
తెల్లని పరపుపై తేలి పొరలువెట్టు | తెల్లని కన్నుల దెలివైనవాడు ||

చ|| కొండవింటివాని గుత్తగొనినయట్టి | కొండుకప్రాయపు గూతురుతండ్రి |
కొండలరాయడు కోనేటి తిమ్మయ్య | కొండ తల నెత్తి గురుతైన వాడు ||

Ela rADammA (Raagam: ) (Taalam: )

pa|| Ela rADammA yiMtirO vA- | DElarADammA nannElinavADu ||

ca|| paccani pulugula baMDimIda nuMDu | paccaviMTi pinnabAluni taMDri |
paccani cAyala bAyani baMgAru | paccaDamugaTTina bAgainavADu ||

ca|| tellani pulugupai tiruga mariginaTTi | tellani satipAli dEvarataMDri |
tellani parapupai tEli poraluveTTu | tellani kannula delivainavADu ||

ca|| koMDaviMTivAni guttagoninayaTTi | koMDukaprAyapu gUturutaMDri |
koMDalarAyaDu kOnETi timmayya | koMDa tala netti gurutaina vADu ||


Ela poralEvulEvE - ఏల పొరలేవులేవ

ఏల పొరలేవులేవ (రాగం: ) (తాళం : )

ప|| ఏల పొరలేవులేవే యింత లోనిపనికి | మాలయింటి తోలుకప్పు మాయ లిటువంటివి ||

చ|| చిక్కులతమకముల చీకటిగప్పిననాడు | యెక్కువ వాసనలౌ హేయపుమేను |
వెక్కసపు ప్రియమది విరిగితే రోతలౌ | లక్కపూతకపురు లీలాగు లిటువంటివి ||

చ|| మించినచిత్తములో మేలుగలిగిననాడు | యెంచరానిచవులౌ నెంగిలిమోవి |
పెంచుకొంటే కష్టమౌ ప్రియముదీరిననాడు | చంచలపు చిత్తములచంద మిటువంటిది ||

చ|| వెల్లిగొనుసురతపువేళ మరపులయింపు | కొల్లలాడుటౌ కొనగోరితాకులు |
నల్లితిండౌ మరి మీద మరగితే రోతలౌ | వుల్లమిచ్చేవేంకటేశువొద్ది కిటువంటిది ||

Ela poralEvulEvE (Raagam: ) (Taalam: )

pa|| Ela poralEvulEvE yiMta lOnipaniki | mAlayiMTi tOlukappu mAya liTuvaMTivi ||

ca|| cikkulatamakamula cIkaTigappinanADu | yekkuva vAsanalau hEyapumEnu |
vekkasapu priyamadi virigitE rOtalau | lakkapUtakapuru lIlAgu liTuvaMTivi ||

ca|| miMcinacittamulO mElugaliginanADu | yeMcarAnicavulau neMgilimOvi |
peMcukoMTE kaShTamau priyamudIrinanADu | caMcalapu cittamulacaMda miTuvaMTidi ||

ca|| velligonusuratapuvELa marapulayiMpu | kollalADuTau konagOritAkulu |
nallitiMDau mari mIda maragitE rOtalau | vullamiccEvEMkaTESuvoddi kiTuvaMTidi ||


Ela mOsapOyirokO - ఏల మోసపోయిరొకో

ఏల మోసపోయిరొకో (రాగం: ) (తాళం : )

ప|| ఏల మోసపోయిరొకో యెంచి యాకాలపువారు | బాలకృష్ణునిబంట్లై బ్రదుకవద్దా ||

చ|| పసులగాచేవాని బ్రహ్మ నుతించెనంటేను | దెసలదేవుడేయని తెలియవద్దా |
సిసువు గోవర్ధనాద్రి చేతబట్టి యెత్తెనంటే | కొసరీతని పాదాలే కొలువవద్దా ||

చ|| నరునికి విశ్వరూ పున్నతి జూపెనంటేను | నరహరి యితడని నమ్మవద్దా |
పరగ జక్రముచేత బాణుని నఱకెనంటే | సొరి దీతని శరణుచొఱవద్దా ||

చ|| అందరుసురలలోన నగ్రపూజ గొన్నప్పుడే| చెంది యీతనికృపకు జేరవద్దా |
అంది శ్రీవేంకటేశు డట్టె ద్రిష్టదైవమంటే | విందుల బరులసేవ విడువవద్దా ||

Ela mOsapOyirokO (Raagam: ) (Taalam: )

pa|| Ela mOsapOyirokO yeMci yAkAlapuvAru | bAlakRuShNunibaMTlai bradukavaddA ||

ca|| pasulagAcEvAni brahma nutiMcenaMTEnu | desaladEvuDEyani teliyavaddA |
sisuvu gOvardhanAdri cEtabaTTi yettenaMTE | kosarItani pAdAlE koluvavaddA ||

ca|| naruniki viSvarU punnati jUpenaMTEnu | narahari yitaDani nammavaddA |
paraga jakramucEta bANuni narxakenaMTE | sori dItani SaraNucorxavaddA ||

ca|| aMdarusuralalOna nagrapUja gonnappuDE| ceMdi yItanikRupaku jEravaddA |
aMdi SrIvEMkaTESu DaTTe driShTadaivamaMTE | viMdula barulasEva viDuvavaddA ||