Kadunaj~naanapukarapukaala - కడునజ్ఞానపుకరపుకాల

కడునజ్ఞానపుకరపుకాల (రాగం: లలిత) (తాళం : )

కడునజ్ఞానపుకరపుకాల మిదె
వెడలదొబ్బి మావెరపు దీర్చవె

పాపపుపొఅసురము బందెలు మేయగ
పోపులపుణ్యము పొలివోయ
శ్రీపతి నీకే చేయి చాచెదము
యేపున మమ్మిక నీడేర్చవె

యిల గలియగమనుయెండలు గాయగ
చెలగి ధర్మమనుచెరు వింకె
పొలసి మీకృపాంబుధి చేరితి మిదె
తెలిసి నాదాహము తీర్చవె

వడిగొని మనసిజవాయువు విసరగ
పొడవగు నెఱకలు పుటమొగసె
బడి శ్రీవేంకటపతి నీశరణము
విడువక చొచ్చితి వెసగావగదే

Kadunaj~naanapukarapukaala (Raagam:Lalita ) (Taalam: )

Kadunaj~naanapukarapukaala mide
Vedaladobbi maaverapu deerchave

Paapapupoasuramu bamdelu maeyaga
Populapunyamu polivoya
Sreepati neekae chaeyi chaachedamu
Yaepuna mammika needaerchave

Yila galiyagamanuyemdalu gaayaga
Chelagi dharmamanucheru vimke
Polasi meekrpaambudhi chaeriti mide
Telisi naadaahamu teerchave

Vadigoni manasijavaayuvu visaraga
Podavagu ne~rakalu putamogase
Badi sreevaemkatapati neesaranamu
Viduvaka chochchiti vesagaavagadae


kaMdarpajanaka garuDagamana - కందర్పజనక గరుడగమన

కందర్పజనక గరుడగమన (రాగం:వలజి)(తాళం :ఆది )

కందర్ప జనక గరుడ గమన
నంద గోపాత్మజ నకో నమో

వారధి శయన వామన శ్రీధర
నారసింహ కృష్ణ నమో నమో
నీరజనాభ నిగమ గోచర
నారాయణ హరి నమో నమో

పరమ పురుషా భవ విమోచన
వరద వసుధా వధూవర
కరుణా కాంతా కాళిందీ రమణ
నరసఖ శౌరీ నమో నమో

దానవ దమన దామోదర శశి
భాను నయన బల భద్రానుజ
దీన రక్షక శ్రీ తిరు వేంకటేశ
నా నా గుణమయ నమో నమో

kaMdarpajanaka garuDagamana (Raagam:valaji ) (Taalam:aadi )

kamdarpa janaka garuDa gamana
namda gOpaatmaja nakO namO

vaaradhi Sayana vaamana SrIdhara
naarasiMha kRshNa namO namO
neerajanaabha nigama gOchara
naaraayaNa hari namO namO

parama purushaa bhava vimOchana
varada vasudhaa vadhUvara
karuNaa kaamtaa kaaLimdI ramaNa
narasakha SourI namO namO

daanava damana daamOdara SaSi
bhaanu nayana bala bhadraanuja
deena rakshaka SrI tiru vEmkaTESa
naa naa guNamaya namO namO

Get this widget | Track details | eSnips Social DNA

kaMcUgAdu peMcUgAdu - కంచూగాదు పెంచూగాదు

కంచూగాదు పెంచూగాదు (రాగం: ) (తాళం : )

ప|| కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు | యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు ||

చ|| పట్ట బసలేదు చూడ బయలుగా దీమనసు | నెట్టన బారుచునుండు నీరుగా దీమనసు |
చుట్టి చుట్టి పాయకుండు జుటమూగా దీమనసు | యెట్టనెదుటనే వుండు నేటిదో యీమనసు ||

చ|| రుచులెల్లా గానుపించు రూపు లేదు మనసు | పచరించు నాసలెల్లా బసిడిగా దీమనసు |
యెచటా గరగదు రాయీగాదు మనసు | యిచటా నచటా దానే యేటిదో యీమనసు ||

చ|| తప్పక నాలో నుండు దైవము గాదు మనసు | కప్పి మూటగట్టరాదు గాలీ గాదు మనసు |
చెప్పరానిమహిమలశ్రీవేంకటేశు దలచి | యిప్పుడిన్నిటా గెలిచె నేటిదో యీమనసు ||

kaMcUgAdu peMcUgAdu (Raagam: ) (Taalam: )

pa|| kaMcUgAdu peMcUgAdu kaDubelucu manasu | yeMcarAdu paMcarAdu yeTTidO yImanasu ||

ca|| paTTa basalEdu cUDa bayalugA dImanasu | neTTana bArucunuMDu nIrugA dImanasu |
cuTTi cuTTi pAyakuMDu juTamUgA dImanasu | yeTTaneduTanE vuMDu nETidO yImanasu ||

ca|| ruculellA gAnupiMcu rUpu lEdu manasu | pacariMcu nAsalellA basiDigA dImanasu |
yecaTA garagadu rAyIgAdu manasu | yicaTA nacaTA dAnE yETidO yImanasu ||

ca|| tappaka nAlO nuMDu daivamu gAdu manasu | kappi mUTagaTTarAdu gAlI gAdu manasu |
cepparAnimahimalaSrIvEMkaTESu dalaci | yippuDinniTA gelice nETidO yImanasu ||


kaMbamuna veDali - కంబమున వెడలి

కంబమున వెడలి (రాగం: ) (తాళం : )

ప|| కంబమున వెడలి ఘన నరసింహము | కుంభిని హిరణ్యు గూలిచెను ||

చ|| తొడికి దైత్యు తన తొడపైకి దిగిచి | కడుపు చించి రక్తము చల్లి |
జడియక పేగులు జందెంబులుగా | మెడ దగిలించుక మెరసీ వాడె ||

చ|| పెదవులు చింపుచు పెనుగోళ్ళ నదిమి |వుదుటుబునుక కొరి కుమియుచును |
సదరపు గుండెలు చప్పరించుచును | మెదడు గుండముగ మెత్తీవాడే ||

చ|| దేవతల భయము దీర్చి అంకమున | శ్రీవనితను కృపసేయుచును |
పావనపు టహోబల గిరిదైవము | శ్రీవేంకటగిరి చెలగీ వాడే ||

kaMbamuna veDali (Raagam: ) (Taalam: )

pa|| kaMbamuna veDali Gana narasiMhamu | kuMBini hiraNyu gUlicenu ||

ca|| toDiki daityu tana toDapaiki digici | kaDupu ciMci raktamu calli |
jaDiyaka pEgulu jaMdeMbulugA | meDa dagiliMcuka merasI vADe ||

ca|| pedavulu ciMpucu penugOLLa nadimi |vuduTubunuka kori kumiyucunu |
sadarapu guMDelu cappariMcucunu | medaDu guMDamuga mettIvADE ||

ca|| dEvatala Bayamu dIrci aMkamuna | SrIvanitanu kRupasEyucunu |
pAvanapu TahObala giridaivamu | SrIvEMkaTagiri celagI vADE ||


kaMTimi reMTiki - కంటిమి రెంటికి

కంటిమి రెంటికి (రాగం: ) (తాళం : )

ప|| కంటిమి రెంటికి భూమి గలుగుదృష్టాంతరము | గొంటరిరావణునందు గుహునియందు ||

చ|| నీదాస్యము గలనీచజన్మమైన మేలు | యేదియునెఱగనట్టియెక్కువజన్మానకంటే |
వాదపుగర్వము లేదు వట్టియాచారము లేదు | సాధించి నైచాన్యుసంధానమేకాని ||

చ|| మిమ్ము దలపుచు జేయుమృగయానమైన మేలు | సొమ్ముపోక మీకుగని సుకృతము సేయుకంటె |
దిమ్మరిజన్మము లేదు తెగనికోరిక లేదు | పమ్మి నీపై బెట్టినట్టిభారమేకాని ||

చ|| దిక్కులు సాధించుకంటె తెలిసి శ్రీవేంకటేశు- | దిక్కు నీనామమే కా సాధించుటే మేలు |
యెక్కువ తక్కువ లేదు యెఱు కెఱుగమి లేదు | చక్కజాడతో నీకు శరణంటేగాని ||

kaMTimi reMTiki (Raagam: ) (Taalam: )

pa|| kaMTimi reMTiki BUmi galugudRuShTAMtaramu | goMTarirAvaNunaMdu guhuniyaMdu ||

ca|| nIdAsyamu galanIcajanmamaina mElu | yEdiyunerxaganaTTiyekkuvajanmAnakaMTE |
vAdapugarvamu lEdu vaTTiyAcAramu lEdu | sAdhiMci naicAnyusaMdhAnamEkAni ||

ca|| mimmu dalapucu jEyumRugayAnamaina mElu | sommupOka mIkugani sukRutamu sEyukaMTe |
dimmarijanmamu lEdu teganikOrika lEdu | pammi nIpai beTTinaTTiBAramEkAni ||

ca|| dikkulu sAdhiMcukaMTe telisi SrIvEMkaTESu- | dikku nInAmamE kA sAdhiMcuTE mElu |
yekkuva takkuva lEdu yerxu kerxugami lEdu | cakkajADatO nIku SaraNaMTEgAni ||


kaMTimi nEDide - కంటిమి నేడిదె

కంటిమి నేడిదె (రాగం: ) (తాళం : )

ప|| కంటిమి నేడిదె గరుడాచలపతి | ఇంటి వేలుపగు యీశ్వరుండు ||

చ|| శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు | దానవాంతకుడు దయానిధి |
నానా మహిమల నమ్మిన వారిని | పూనుకు కాచె పోషకుడితడు ||

చ|| దేవాది దేవుడు దినకర తేజుడు | జీవాంత రంగుడు శ్రీవిభుడు |
దైవ శిఖామణి తలచిన వారిని | సేవలు గొనికాచె విభుడితడు ||

చ|| పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు | కరుణానిధి బుధకల్పకము |
పరగు శ్రీవేంకట పతి తనదాసుల | నరదుగ గాచేయన ఘనుండితండు ||

kaMTimi nEDide (Raagam: ) (Taalam: )

pa|| kaMTimi nEDide garuDAcalapati | iMTi vElupagu yISvaruMDu ||

ca|| SrInarasiMhuDu cinmayakAMtuDu | dAnavAMtakuDu dayAnidhi |
nAnA mahimala nammina vArini | pUnuku kAce pOShakuDitaDu ||

ca|| dEvAdi dEvuDu dinakara tEjuDu | jIvAMta raMguDu SrIviBuDu |
daiva SiKAmaNi talacina vArini | sEvalu gonikAce viBuDitaDu ||

ca|| paramamUrti hari prahlAda varaduDu | karuNAnidhi budhakalpakamu |
paragu SrIvEMkaTa pati tanadAsula | naraduga gAcEyana GanuMDitaMDu ||


kaMTirA viMTirA - కంటిరా వింటిరా

కంటిరా వింటిరా (రాగం: ) (తాళం : )

కంటిరా వింటిరా కమలనాభుని శక్తి
వొంటి నితనిశరణ మొకటే వుపాయము

యీతనినాభి పొడమె యెక్కువైనబ్రహ్మయు
యీతడే రక్షించినాడు యింద్రాదుల
యీతడాకుమీద( దేలె నేకార్ణవమునాడు
యీతడే పో హరి మనకిందరికి దైవము

యీతడే యసురబాధ లిన్నియు( బరి హరించె-
నీతనిమూడడుగులే యీలోకాలు
యీతడే మూలమంటే నేతెంచి కరి(గాచె
నీతనికంటే వేల్పు లిక మరి కలరా

యీతడే వైకుంఠనాథు( డీతడే రమానాథు(-
డీతడే వేదోక్తదైవ మిన్నిటా తానె
యీతడే అంతర్యామి యీ చరాచరములకు
నీతడే శ్రీవేంకటేశు( డీహపరధనము

kaMTirA viMTirA (Raagam: ) (Taalam: )

kaMTirA viMTirA kamalanAbhuni Sakti
voMTi nitaniSaraNa mokaTE vupAyamu

yItaninAbhi poDame yekkuvainabrahmayu
yItaDE rakshiMchinADu yiMdrAdula
yItaDAkumIda( dEle nEkArNavamunADu
yItaDE pO hari manakiMdariki daivamu

yItaDE yasurabAdha linniyu( bari hariMche-
nItanimUDaDugulE yIlOkAlu
yItaDE mUlamaMTE nEteMchi kari(gAche
nItanikaMTE vElpu lika mari kalarA

yItaDE vaikuMThanAthu( DItaDE ramAnAthu(-
DItaDE vEdOktadaiva minniTA tAne
yItaDE aMtaryAmi yI charAcharamulaku
nItaDE SrIVEMkaTESu( DIhaparadhanamu

Sung by:Mangalamplalli Balamuralikrishna

Get this widget | Track details | eSnips Social DNA