celulAla yImElu - చెలులాల యీమేలు

చెలులాల యీమేలు (రాగం: ) (తాళం : )

ప|| చెలులాల యీమేలు చెలువుడే చూచుగాని | యెలమి తోడుత మొక్కి యెరిగించరే ||

చ|| వనిత జవ్వనపు వసంతకాలములోనే | వెనుకొని విరహపు వేసవి మించె |
ననిచె బెంజెమట వానకాలము నంతలోనె | వినయముతో బతికి విన్నవించరే ||

చ|| కాంత పులకల శరత్కాలము నదె తోచె | చింతల మంచులతో హేమంతము ముంచె |
చెంత గోర్కులెన్నులెత్తి శిశిరవేళ యేతెంచె | యింతకు నీకె విభుని దోడి తేరె ||

చ|| చెలియకు గొప్పువీడె చీఅటికాలము నందె | నెలకొన సిగ్గుల వెన్నెలకాలము |
అలమె శ్రీవేంకటేశుడంతలోనె తానెవచ్చె | పిలిచి సారెకునిట్టె ప్రేమరేచరే ||

celulAla yImElu (Raagam: ) (Taalam: )

pa|| celulAla yImElu celuvuDE cUcugAni | yelami tODuta mokki yerigiMcarE ||

ca|| vanita javvanapu vasaMtakAlamulOnE | venukoni virahapu vEsavi miMce |
nanice beMjemaTa vAnakAlamu naMtalOne | vinayamutO batiki vinnaviMcarE ||

ca|| kAMta pulakala SaratkAlamu nade tOce | ciMtala maMculatO hEmaMtamu muMce |
ceMta gOrkulennuletti SiSiravELa yEteMce | yiMtaku nIke viBuni dODi tEre ||

ca|| celiyaku goppuvIDe cIaTikAlamu naMde | nelakona siggula vennelakAlamu |
alame SrIvEMkaTESuDaMtalOne tAnevacce | pilici sArekuniTTe prEmarEcarE ||


cellunaMTA vaccivacci - చెల్లునంటా వచ్చివచ్చి

చెల్లునంటా వచ్చివచ్చి (రాగం: ) (తాళం : )

ప|| చెల్లునంటా వచ్చివచ్చి చెట్టా పట్టేవు | తొల్లియు నెందరి నిట్టే దొమ్ముల బెట్టితివో ||

చ|| ఆపరాని తమకాన నానచేసేగాక యింత | మాపుదాణ నీ తోడి మాటలేలరా- |
దాపరాని మదన ముద్రలు మేననవే నీకు | నేపుచు భ్రమల బెట్టి యెవ్వతె సేసినవో ||

చ|| ఉండలేక నీవద్దనే వుసురంటి గాక యింత | బండు బండు సేసిన యీప్రాణమేలరా |
వుండుగాగ జిత్తమెల్లా ఒక్కజేసితివి నా | యండనుండే యెవ్వతెకు నమ్ముడు వోయితివో ||

చ|| తనివొక నిన్నింత దగ్గర నిచ్చితి గాక | చనువున నిన్నుజేయి చాచనిత్తునా |
ఘనుడు వేంకటరాయ కమ్మని యీవిరులు | మునుప నెచ్చతో నీపైముడిచి వేసినవో ||

cellunaMTA vaccivacci (Raagam: ) (Taalam: )

pa|| cellunaMTA vaccivacci ceTTA paTTEvu | tolliyu neMdari niTTE dommula beTTitivO ||

ca|| AparAni tamakAna nAnacEsEgAka yiMta | mApudANa nI tODi mATalElarA- |
dAparAni madana mudralu mEnanavE nIku | nEpucu Bramala beTTi yevvate sEsinavO ||

ca|| uMDalEka nIvaddanE vusuraMTi gAka yiMta | baMDu baMDu sEsina yIprANamElarA |
vuMDugAga jittamellA okkajEsitivi nA | yaMDanuMDE yevvateku nammuDu vOyitivO ||

ca|| tanivoka ninniMta daggara nicciti gAka | canuvuna ninnujEyi cAcanittunA |
GanuDu vEMkaTarAya kammani yIvirulu | munupa neccatO nIpaimuDici vEsinavO ||


cellugA kiTTu nIkE - చెల్లుగా కిట్టు నీకే

చెల్లుగా కిట్టు (రాగం: ) (తాళం : )

ప|| చెల్లుగా కిట్టు నీకే చింతింపగా పూరి- | పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు ||

చ|| చెలగి నే మునుసేసినచేత లుండగా | మలసి నే తిరుగుతిమ్మట లుండగా |
తొలగదోసి తుప్పుడుతోడనే లోహంబు | వెలయ బంగారుగావించినగతిని ||

చ|| బిగిసి నామైనున్న పెనుకట్లుండగా | జగడగాండ్లు పగచాటగను |
జిగిగలచేతి ముసిడికాయయగు నన్ను | మొగి గల్పకముఫలముగ జేయవసమా ||

చ|| పొదలిన యింద్రియంబులు వెంట రాగా | మదవికారము నే మరుగగానే |
వదలక వేంకటేశ్వర నన్ను నిదే నీ- | పదపంకజములు చేర్పగ నిది వసమా ||

cellugA kiTTu (Raagam: ) (Taalam: )

pa|| cellugA kiTTu nIkE ciMtiMpagA pUri- | pulla mEruvusEya BUmilO nipuDu ||

ca|| celagi nE munusEsinacEta luMDagA | malasi nE tirugutimmaTa luMDagA |
tolagadOsi tuppuDutODanE lOhaMbu | velaya baMgArugAviMcinagatini ||

ca|| bigisi nAmainunna penukaTluMDagA | jagaDagAMDlu pagacATaganu |
jigigalacEti musiDikAyayagu nannu | mogi galpakamuPalamuga jEyavasamA ||

ca|| podalina yiMdriyaMbulu veMTa rAgA | madavikAramu nE marugagAnE |
vadalaka vEMkaTESvara nannu nidE nI- | padapaMkajamulu cErpaga nidi vasamA ||


celulArA cUDarE - చెలులారా చూడరే

చెలులారా చూడరే (రాగం: ) (తాళం : )

ప|| చెలులారా చూడరే యీ చెలి భాగ్యము | అలమేలుమంగ యీకె కబ్బెను యీ భాగ్యము ||

చ|| పతిదయ కలిగిన పడతిదీ భాగ్యము | అతడు మాట మీరనీదది భాగ్యము |
సతతముబాయక జంటై వుండేది భాగ్యము | అతివలందరు గల్లా నది యేమి చెప్పరే ||

చ|| మగడు మన్నించిన మగువది భాగ్యము | సొగసి యాతడు మోహించుట భాగ్యము |
వెగటులేని రతుల వేసర నిది భాగ్యము | మగువల వలపుల మరి యేమి భాగ్యము ||

చ|| శ్రీ వేంకటేశుడేలే మచ్చిక నీ సతిది భాగ్య- | మావేళ నాతడు మెచ్చినది భాగ్యము |
తావుకొని యెప్పుడూ దనవాడౌటే భాగ్యము | యేవనితల నేరుపులిక నేమి చెప్పరే ||

celulArA cUDarE (Raagam: ) (Taalam: )

pa|| celulArA cUDarE yI celi BAgyamu | alamElumaMga yIke kabbenu yI BAgyamu ||

ca|| patidaya kaligina paDatidI BAgyamu | ataDu mATa mIranIdadi BAgyamu |
satatamubAyaka jaMTai vuMDEdi BAgyamu | ativalaMdaru gallA nadi yEmi cepparE ||

ca|| magaDu manniMcina maguvadi BAgyamu | sogasi yAtaDu mOhiMcuTa BAgyamu |
vegaTulEni ratula vEsara nidi BAgyamu | maguvala valapula mari yEmi BAgyamu ||

ca|| SrI vEMkaTESuDElE maccika nI satidi BAgya- | mAvELa nAtaDu meccinadi BAgyamu |
tAvukoni yeppuDU danavADauTE BAgyamu | yEvanitala nErupulika nEmi cepparE ||


cella nekkikoMTivigA - చెల్ల నెక్కికొంటివిగా

చెల్ల నెక్కికొంటివిగా (రాగం: ) (తాళం : )

ప|| చెల్ల నెక్కికొంటివిగా జీవుడ యీబలుకోటా | బల్లిదుడ నీకు నేడు పట్టమాయ గోటా ||

చ|| తొమ్మిదిగవనులై న దొడ్డతోలు గోటా | కొమ్మలచవులమూలకొత్తళాలకోటా |
వమ్ములేనిమెడవంపువంకదారకోటా | పమ్మి పగవారినెల్లా పట్టుకొన్న కోటా ||

చ|| తలవాకిలిదంతపుతలపులకోటా | తలిరుజేతుల పెద్దదంతెనాలకోటా |
వెలియాసలనేదండువిడిసినకోటా | గులుగై యింద్రియములు కొల్లగొన్న కోటా ||

చ|| నడచప్పరములనేనలువైనకోటా | జడిసినచెవుల మించుసవరణకోటా |
పడనిపాట్ల బడి ఫలియించె గోటా | యెడమిచ్చి శ్రీవేంకటేశు డేలె గోటా ||

cella nekkikoMTivigA (Raagam: ) (Taalam: )

pa|| cella nekkikoMTivigA jIvuDa yIbalukOTA | balliduDa nIku nEDu paTTamAya gOTA ||

ca|| tommidigavanulai na doDDatOlu gOTA | kommalacavulamUlakottaLAlakOTA |
vammulEnimeDavaMpuvaMkadArakOTA | pammi pagavArinellA paTTukonna kOTA ||

ca|| talavAkilidaMtaputalapulakOTA | talirujEtula peddadaMtenAlakOTA |
veliyAsalanEdaMDuviDisinakOTA | gulugai yiMdriyamulu kollagonna kOTA ||

ca|| naDacapparamulanEnaluvainakOTA | jaDisinacevula miMcusavaraNakOTA |
paDanipATla baDi PaliyiMce gOTA | yeDamicci SrIvEMkaTESu DEle gOTA ||

Chellabo yeejeevu - చెల్లబో యీజీవు

చెల్లబో యీజీవు (రాగం:శ్రీ ) (తాళం : )

చెల్లబో యీజీవు లిల జేసినపాప మెంతో
వుల్లమున నున్నహరి వూరకే దవ్వాయ

కన్నచోటనే హరి కలడన్నవారికి
విన్నచోటనే విష్ణుడు వివేకులకు
వున్నతి గొలువలేక వొద్దనుండగా గొందరు
మిన్ను మీద వెదకేరు మితిమీఱ జదివి

పట్టినదే బ్రహ్మము పరమార్థవేత్తలకు
తిట్టులోనా దైవము దివ్యులకును
ముట్టి చేత మొక్క లేరు ముందటనే వుండగాను
బట్టబయలు పాకేరు బహుకర్మవిదుల

ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు
దాపున నున్నాడు హరిదాసులకును
యేపున శ్రీవేంకటేశు నేచి శరణనలేక
చాపలాన చెదకేరు సకలదేవతల

Chellabo yeejeevu (Raagam:Sree ) (Taalam: )

Chellabo yeejeevu lila jaesinapaapa memto
Vullamuna nunnahari voorakae davvaaya

Kannachotanae hari kaladannavaariki
Vinnachotanae vishnudu vivaekulaku
Vunnati goluvalaeka voddanumdagaa gomdaru
Minnu meeda vedakaeru mitimee~ra jadivi

Pattinadae brahmamu paramaarthavaettalaku
Tittulonaa daivamu divyulakunu
Mutti chaeta mokka laeru mumdatanae vumdagaanu
Battabayalu paakaeru bahukarmavidula

Oopirilo daevudunnaadu yogeemdrulaku
Daapuna nunnaadu haridaasulakunu
Yaepuna sreevaemkataesu naechi sarananalaeka
Chaapalaana chedakaeru sakaladaevatala


Chellabo tiyyaninora - చెల్లబో తియ్యనినోర

చెల్లబో తియ్యనినోర (రాగం: సామంతం) (తాళం : )

చెల్లబో తియ్యనినోర జే దేటికి యి
పల్లదపుగొరికలపాలు సేయవలెనా

అసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట
దాసునిగా నాపాలిదైవమా నీవు
పోసరించి భూమిలోన బుట్టించి రక్షించి
యీసులేక భంగపెట్టు టిది గొంత వలెనా

పామరపుటింద్రియాలబారి దోసితివి నన్ను
దామెనకట్టుగా గట్టి తత్వమా నివు
దోమటి నామతిలోన దొడునీడవై యుండి
పామేటిసుఖములనే భ్రమయించాలెనా

గక్కన నింతట నన్ను గరుణించితివి నేడు
మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు
దిక్కు దెసవై నాకు దేవుడవై యేలికవు
చొక్కి నామన సింత సోదించవలెనా

Chellabo tiyyaninora (Raagam: Saamamtam) (Taalam: )

Chellabo tiyyaninora jae daetiki yi
Palladapugorikalapaalu saeyavalenaa

Asalaku naadaeha mammukomti vimtimta
Daasunigaa naapaalidaivamaa neevu
Posarimchi bhoomilona buttimchi rakshimchi
Yeesulaeka bhamgapettu Tidi gomta valenaa

Paamaraputimdriyaalabaari dositivi nannu
Daamenakattugaa gatti tatvamaa nivu
Domati naamatilona doduneedavai yumdi
Paamaetisukhamulanae bhramayimchaalenaa

Gakkana nimtata nannu garunimchitivi naedu
Mokkiti sreevaemkataadrimoolamaa neeku
Dikku desavai naaku daevudavai yaelikavu
Chokki naamana simta sodimchavalenaa