vAdulEla caduvulu - వాదులేల చదువులు

వాదులేల చదువులు (రాగం: లలిత) (తాళం : )

వాదులేల చదువులు వారు చెప్పినవేకావా
వాదులేల మీమాట వారికంటే నెక్కుడా!!

నాలుగువేదాలబ్రహ్మ నలి నెవ్వనిసుతుడు
వాలినపురాణాలవ్యాసుడెవ్వని దాసుడు
లీల రామాయణపువాల్మీకివసిష్టులు
ఆలకిం చెవ్వని గొల్చి రాతడే పోదేవుడు !!వాదు!!

భారత మెవ్వనికధ భాగవతము చెప్పిన
ధీరుదైన శుకుడు యేదేవుని కింకరుడు
సారపుశాస్త్రాలు చూచిసన్యసించి నుడిగేటి
నారాయణనామపునాధుడేపో దేవుడు !!వాదు!!

విష్ణువాగ్యయని చెప్పేవిది సంకల్ప మేడది
విష్ణుమాయయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది
"విష్ణుమయం సర్వ" నునేవేవేదవాక్య మెవ్వనిది
విష్ణువు శ్రీవేంకటాద్రి విభుడే ఆదేవుడు !!వాదు!!

vAdulEla caduvulu (Raagam: lalita) (Taalam: )

vAdulEla caduvulu vAru ceppinavEkAvA
vAdulEla mImATa vArikaMTE nekkuDA!!

nAluguvEdAlabrahma nali nevvanisutuDu
vAlinapurANAlavyAsuDevvani dAsuDu
lIla rAmAyaNapuvAlmIkivasishTulu
AlakiM cevvani golchi rAtaDE pOdEvuDu !!vAdu!!

bhArata mevvanikadha bhAgavatamu ceppina
dhIrudaina SukuDu yEdEvuni kiMkaruDu
sArapuSAstrAlu cUcisanyasiMci nuDigETi
nArAyaNanAmapunAdhuDEpO dEvuDu !!vAdu!!

vishNuvAgyayani ceppEvidi saMkalpa mEDadi
vishNumAyayani ceppE viSvamaMtA nevvanidi
"vishNumayaM sarva" nunEvEvEdavAkya mevvanidi
vishNuvu SrIvEMkaTAdri vibhuDE AdEvuDu !!vAdu!!


valenanuvAride - వలెననువారిదె

వలెననువారిదె (రాగం: ) (తాళం : )

ప|| వలెననువారిదె వైష్ణవము యిది | వలపుదేనెవో వైష్ణవము ||

చ|| కోరికలుడుగుచు గురి నిన్నిటిపై | వైరాగ్యమెపో వైష్ణవము |
సారెకు గోపము జలమును దనలో | వారించుటవో వైష్ణవము ||

చ|| సుడిగొను దేహపు సుఖదుఃఖములో | వడి జొరవిదెపో వైష్ణవము |
ముడివడి యింద్రియములకింకరుడై | వడబడనిదెపో వైష్ణవము ||

చ|| వుదుటున దనసకలోపాయంబులు | వదలుటపో వైష్ణవము |
యెదుటను శ్రీవేంకటేశ్వరునామము | వదనము చేర్చుట వైష్ణవము ||

valenanuvAride (Raagam: ) (Taalam: )

pa|| valenanuvAride vaiShNavamu yidi | valapudEnevO vaiShNavamu ||

ca|| kOrikaluDugucu guri ninniTipai | vairAgyamepO vaiShNavamu |
sAreku gOpamu jalamunu danalO | vAriMcuTavO vaiShNavamu ||

ca|| suDigonu dEhapu suKaduHKamulO | vaDi joravidepO vaiShNavamu |
muDivaDi yiMdriyamulakiMkaruDai | vaDabaDanidepO vaiShNavamu ||

ca|| vuduTuna danasakalOpAyaMbulu | vadaluTapO vaiShNavamu |
yeduTanu SrIvEMkaTESvarunAmamu | vadanamu cErcuTa vaiShNavamu ||

Get this widget | Track details | eSnips Social DNA

valavani mOhAvasthala - వలవని మోహావస్థల

వలవని మోహావస్థల (రాగం: ) (తాళం : )

ప|| వలవని మోహావస్థల బొరలెడి- | మలినం బెన్నడు మానును ||

చ|| ఘోర దురితంబుల- | కారణ మెన్నడు దీరును |
వైరముగొని తనువదలని బంధపు- | భారంబెన్నడు వాయును ||

చ|| జడమగు జిహ్వ చాపల్యముగల- | పెడమతి యెన్నడు వీడును |
చెడని జీవునకు శ్రీవేంకటపతి- | కడ చూపెన్నడు గలుగును ||

valavani mOhAvasthala (Raagam: ) (Taalam: )

pa|| valavani mOhAvasthala boraleDi- | malinaM bennaDu mAnunu ||

ca|| GOra duritaMbula- | kAraNa mennaDu dIrunu |
vairamugoni tanuvadalani baMdhapu- | BAraMbennaDu vAyunu ||

ca|| jaDamagu jihva cApalyamugala- | peDamati yennaDu vIDunu |
ceDani jIvunaku SrIvEMkaTapati- | kaDa cUpennaDu galugunu ||


valadana norulaku - వలదన నొరులకు

వలదన నొరులకు (రాగం: ) (తాళం : )

ప|| వలదన నొరులకు వశమటనే | తలచినట్లనిది దైవమెచేసె ||

చ|| తరుణికుచములను తామరమొగుడలు | విరిసెనోయని వెరపునను |
సరగున పతిసఖ చంద్రశకలములు | దరులుగలుగనిది దైవమెచేసె ||

చ|| పొలతివదనమను పున్నమచంద్రుడు | బలిమినెగయునని భయమునను |
మెలుతచికురధ మ్మిల్లపురాహువు | తలచెదరగనిది దైవమెచేసె ||

చ|| వనితకువాడునొ వలపుతాపమున | తనులతికయనుచు తమకమున |
ఘనవేంకటపతి కౌగిటచమటల | తనివి దీర్చనిది దైవమెచేసె ||

valadana norulaku (Raagam: ) (Taalam: )

pa|| valadana norulaku vaSamaTanE | talacinaTlanidi daivamecEse ||

ca|| taruNikucamulanu tAmaramoguDalu | virisenOyani verapunanu |
saraguna patisaKa caMdraSakalamulu | darulugaluganidi daivamecEse ||

ca|| polativadanamanu punnamacaMdruDu | baliminegayunani Bayamunanu |
melutacikuradha mmillapurAhuvu | talacedaraganidi daivamecEse ||

ca|| vanitakuvADuno valaputApamuna | tanulatikayanucu tamakamuna |
GanavEMkaTapati kaugiTacamaTala | tanivi dIrcanidi daivamecEse ||


valapu tolakariMche - వలపు తొలకరించె

వలపు తొలకరించె (రాగం: ) (తాళం : )

వలపు తొలకరించె వనితపైనిదె నేడు
చెలువుడ వింతట విచ్చేయవయ్యా ||

పడతి విరహవేళ పానుపైదెగి రా లే
వడిముత్యపుసరులే వడగండ్లు
చిడుముడి మేని మీదచిప్పి లేటి చెమటలు
జడివాన గురిసీ విచారించవయ్యా ||

నిరతి దురుము మెయిలి మిలువెల్లా ముంచుకొనె
గరిమ నిట్టూర్పు పెనుగాలివంకను
నిరతపు బులకల్ నీరు బుగ్గలవి మించె

valapu tolakariMche (Raagam: ) (Taalam: )

valapu tolakariMche vanitapainide nEDu
cheluvuDa viMtaTa vichchEyavayyA ||

paDati virahavELa pAnupaidegi rA lE
vaDimutyapusarulE vaDagaMDlu
chiDumuDi mEni mIdachippi lETi chemaTalu
jaDivAna gurisI vichAriMchavayyA ||

nirati durumu meyili miluvellA muMchukone
garima niTTUrpu penugAlivaMkanu
niratapu bulakal nIru buggalavi miMche


valapu ladhikamu - వలపు లధికము

వలపు లధికము (రాగం: ) (తాళం : )

ప|| వలపు లధికము సేయు వైభవములు | తలపు లధికము సేయు దలపోతలు ||

చ|| కోప మధికముసేయు గోరికలు | తాప మధికముసేయు దమకంబులు |
కోపంబు దాపంబు గూడ నధికముసేయు | యేపయినమోహముల నేమందమే ||

చ|| మచ్చి కధికముసేయు మన్ననలు | యిచ్చ లధికముసేయు నీరసములు |
మచ్చికలు నిచ్చలును మగుడ నధికముసేయు- | నెచ్చరికకూటముల నేమందమే ||

చ|| అందమధికముసేయు నైక్యములు | పొందు లధికముసేయు బొలయలుకలు |
అందములు బొందులును నలర నధికము సేయు- | నెందు నరుదగువేంకటేశుకృపలు ||

valapu ladhikamu (Raagam: ) (Taalam: )

pa|| valapu ladhikamu sEyu vaiBavamulu | talapu ladhikamu sEyu dalapOtalu ||

ca|| kOpa madhikamusEyu gOrikalu | tApa madhikamusEyu damakaMbulu |
kOpaMbu dApaMbu gUDa nadhikamusEyu | yEpayinamOhamula nEmaMdamE ||

ca|| macci kadhikamusEyu mannanalu | yicca ladhikamusEyu nIrasamulu |
maccikalu niccalunu maguDa nadhikamusEyu- | neccarikakUTamula nEmaMdamE ||

ca|| aMdamadhikamusEyu naikyamulu | poMdu ladhikamusEyu bolayalukalu |
aMdamulu boMdulunu nalara nadhikamu sEyu- | neMdu narudaguvEMkaTESukRupalu ||


valapEDa galigene - వలపేడ గలిగెనె

వలపేడ గలిగెనె (రాగం: ) (తాళం : )

వలపేడ గలిగెనె వామలోచనకు దీని
వలపించినటువంటి వాడింకనెవ్వదో ||

సిరులు గల మోమెల్ల చిరునవ్వుగనుదోయి
విరిపైన వురమెల్ల వేకమైన గుబ్బలు
తరుణికి వెనకెల్ల దురుము పిఋదులను మంచి
నిరతంబునడవెల్ల నిండుమురిపెములు ||

జలజాక్శి నిలువెల్ల చక్కదనముల పోగు
కలికి తనమెల్ల గన్నులపండువు
కకంటి వయసెల్ల గడుగోములము దీని
పలుకుదేనియలెల్ల పంచదార కుప్పలు ||

చెలుపైన మోమెల్ల చిలుక వోట్లు దీని
కలదేహ మింతయును గస్తూరి వాసనలు
అలరించె దిరువేంకటాధీశ్వరుడు దీని
తలపెల్ల విభునిలో దాగున్న కరువు ||

valapEDa galigene (Raagam: ) (Taalam: )

valapEDa galigene vAmalOchanaku dIni
valapiMchinaTuvaMTi vADiMkanevvadO ||

sirulu gala mOmella chirunavvuganudOyi
viripaina vuramella vEkamaina gubbalu
taruNiki venakella durumu piRudulanu maMchi
nirataMbunaDavella niMDumuripemulu ||

jalajAkshi niluvella chakkadanamula pOgu
kaliki tanamella gannulapaMDuvu
kakaMTi vayasella gaDugOmulamu dIni
palukudEniyalella paMchadAra kuppalu ||

chelupaina mOmella chiluka vOTlu dIni
kaladEha miMtayunu gastUri vAsanalu
alariMche diruvEMkaTAdhISvaruDu dIni
talapella vibhunilO dAgunna karuvu ||