vanitalaku batiki - వనితలకు బతికి

వనితలకు బతికి (రాగం: ) (తాళం : )

ప|| వనితలకు బతికి వలపే కీలు | ననువు గలిగితేను నాను బ్రియములా ||

చ|| చిత్తమువచ్చినచోట సెవలెల్లా నీడేరు | అత్తుగ డయితే మాట లనువు లౌను |
పొత్తులు గలిగితేను భోజనాలు రుచులౌను | బత్తి గలిగితేను యేపనులైనానౌను ||

చ|| చెలిమి సేసినచోట చెలగు మంచితనాలు | తలపు గలిగితేను తమిరేగును |
బలిమి బొగడితేను భావములు గరగును | నెలవై పాయకుండితే నిలుచు మచ్చికలూ ||

ప|| కందువ గలుగుచోట కాపురాలు వేడుకలౌ | చందముగా బెనగితే సరసమౌను |
యిందునే శ్రీ వేంకటేశయే నలమేలుమంగను | పొందితివి నిట్టే పొసగుమన్ననలూ ||

vanitalaku batiki (Raagam: ) (Taalam: )

pa|| vanitalaku batiki valapE kIlu | nanuvu galigitEnu nAnu briyamulA ||

ca|| cittamuvaccinacOTa sevalellA nIDEru | attuga DayitE mATa lanuvu launu |
pottulu galigitEnu BOjanAlu ruculaunu | batti galigitEnu yEpanulainAnaunu ||

ca|| celimi sEsinacOTa celagu maMcitanAlu | talapu galigitEnu tamirEgunu |
balimi bogaDitEnu BAvamulu garagunu | nelavai pAyakuMDitE nilucu maccikalU ||

pa|| kaMduva galugucOTa kApurAlu vEDukalau | caMdamugA benagitE sarasamaunu |
yiMdunE SrI vEMkaTESayE nalamElumaMganu | poMditivi niTTE posagumannanalU ||


vanita pAlikini - వనిత పాలికిని

వనిత పాలికిని (రాగం: ) (తాళం : )

ప|| వనిత పాలికిని దేవరవు నీవు | వనమె జవ్వనమిందె వరమియ్యవలెను ||

చ|| ముదితకు నీతోపాటు మోహన మంత్రము | చదరపు నీపురము జపశాల |
మదిలోన నీరూపు మరవని ధ్యానము | వదల రా దిక నీవు వరమియ్యవలెను ||

చ|| పడతికి నీశయ్య బలు పుణ్యక్షేత్రము | వడలి చెమట నీపై హోమకృత్యము |
అడరు మోవితేనలు ఆరగింపు నైవేద్యాలు | వడి జేకొనిక నీవు వరమియ్యవలెను ||

చ|| కామినికి నీకూటమి ఘన దివ్యయోగము | నేమపు బరవశము నిజానందము |
ఆముక శ్రీవేంకటేశ ఆపె నీవు గూడితిరి | వాములుగా నిట్టె వరమియ్యవలెను ||

vanita pAlikini (Raagam: ) (Taalam: )

pa|| vanita pAlikini dEvaravu nIvu | vaname javvanamiMde varamiyyavalenu ||

ca|| muditaku nItOpATu mOhana maMtramu | cadarapu nIpuramu japaSAla |
madilOna nIrUpu maravani dhyAnamu | vadala rA dika nIvu varamiyyavalenu ||

ca|| paDatiki nISayya balu puNyakShEtramu | vaDali cemaTa nIpai hOmakRutyamu |
aDaru mOvitEnalu AragiMpu naivEdyAlu | vaDi jEkonika nIvu varamiyyavalenu ||

ca|| kAminiki nIkUTami Gana divyayOgamu | nEmapu baravaSamu nijAnaMdamu |
Amuka SrIvEMkaTESa Ape nIvu gUDitiri | vAmulugA niTTe varamiyyavalenu ||


vanita BAgyaMbu - వనిత భాగ్యంబు

వనిత భాగ్యంబు (రాగం: ) (తాళం : )

ప|| వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకుం- | బనిగాదు యింక నీ పాదంబులాన ||

చ|| అడబాల సతి బోనమారగించు మటంచు | బడి బడి నీ కడు విన్నపము సేయంగ |
వుడుగని పరాకున వుండి నెచ్చెలి మీద | బడలి వొరగినది నీ పాదంబులాన ||

చ|| అడపంబు సతి వీడె మవధరింపు మటంచు | అడరి కప్పురపుం బలుకందియ్యగా |
కడు కంటం జూడదిదే కాంతాళమో మరపో | పడతి యిప్పుడు నీ పాదంబులాన ||

చ|| ఆలవట్టము విసరు అతివలను వలదనదు | పాలిండ్లపై కొంగు సవరించదు |
యేలాగౌనో వేంకటేశ నీవిపుడిట్టె | పాలించకున్న నీ పాదంబులాన ||

vanita BAgyaMbu (Raagam: ) (Taalam: )

pa|| vanita BAgyaMbu dEvara cittamu mAkuM- | banigAdu yiMka nI pAdaMbulAna ||

ca|| aDabAla sati bOnamAragiMcu maTaMcu | baDi baDi nI kaDu vinnapamu sEyaMga |
vuDugani parAkuna vuMDi necceli mIda | baDali voraginadi nI pAdaMbulAna ||

ca|| aDapaMbu sati vIDe mavadhariMpu maTaMcu | aDari kappurapuM balukaMdiyyagA |
kaDu kaMTaM jUDadidE kAMtALamO marapO | paDati yippuDu nI pAdaMbulAna ||

ca|| AlavaTTamu visaru ativalanu valadanadu | pAliMDlapai koMgu savariMcadu |
yElAgaunO vEMkaTESa nIvipuDiTTe | pAliMcakunna nI pAdaMbulAna ||


vananidhi gurisinavAna - వననిధి గురిసినవాన

వననిధి గురిసినవాన (రాగం: ) (తాళం : )

ప|| వననిధి గురిసినవాన లివి మతి- | పనిలేని పనులభారములు ||

చ|| అడవులవెన్నెల లారిడిబదుకులు | తడతాకులపరితాపములు |
వొడలొసగినహరి నొల్లక యితరుల | బడిబడి దిరిగిన బంధములు ||

చ|| కొండలనునుపులు కొనకొనమమతులు | అండలకేగిన నదవదలు |
పండినపంటలు పరమాత్ము విడిచి | బండయితిరిగిన బడలికలు ||

చ|| బచ్చనరూపులు పచ్చలకొలపులు | నిచ్చలనిచ్చల నెయ్యములు |
రచ్చల వేంకటరమణుని గొలువక | చచ్చియు జావని జన్మములు ||

vananidhi gurisinavAna (Raagam: ) (Taalam: )

pa|| vananidhi gurisinavAna livi mati- | panilEni panulaBAramulu ||

ca|| aDavulavennela lAriDibadukulu | taDatAkulaparitApamulu |
voDalosaginahari nollaka yitarula | baDibaDi dirigina baMdhamulu ||

ca|| koMDalanunupulu konakonamamatulu | aMDalakEgina nadavadalu |
paMDinapaMTalu paramAtmu viDici | baMDayitirigina baDalikalu ||

ca|| baccanarUpulu paccalakolapulu | niccalaniccala neyyamulu |
raccala vEMkaTaramaNuni goluvaka | cacciyu jAvani janmamulu ||


vaMdEhaM jagadvallaBaM - వందేహం జగద్వల్లభం

వందేహం జగద్వల్లభం (రాగం: ) (తాళం : )

ప|| వందేహం జగద్వల్లభం దుర్లభం | మందర ధరం గురుం మాధవం భూధవం ||

చ|| నరహరిం మురహరం నారాయణం పరం | హరిం అచ్యుతం ఘనవిహంగ వాహనం |
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం | కరుణాభరణం కలయామి శరణం ||

చ|| నంద నిజనందనం నందక గదాధరం | ఇందిరానాథ మరవిందనాభం |
ఇందురవి లోచనం హితదాసపదం ము- | కుందం యదుకులం గోపగోవిందం ||

చ|| రామానామం యజ్ఞరక్షణం లక్షణం | వామనం కామితం వాసుదేవం |
శ్రీమదావాసినం శ్రీవేంకటేశ్వరం | శ్యామలం కోమలం శాంతమూర్తిం ||

vaMdEhaM jagadvallaBaM (Raagam: ) (Taalam: )

pa|| vaMdEhaM jagadvallaBaM durlaBaM | maMdara dharaM guruM mAdhavaM BUdhavaM ||

ca|| narahariM muraharaM nArAyaNaM paraM | hariM acyutaM GanavihaMga vAhanaM |
puruShOttamaM paraM puMDarIkEkShaNaM | karuNABaraNaM kalayAmi SaraNaM ||

ca|| naMda nijanaMdanaM naMdaka gadAdharaM | iMdirAnAtha maraviMdanABaM |
iMduravi lOcanaM hitadAsapadaM mu- | kuMdaM yadukulaM gOpagOviMdaM ||

ca|| rAmAnAmaM yaj~jarakShaNaM lakShaNaM | vAmanaM kAmitaM vAsudEvaM |
SrImadAvAsinaM SrIvEMkaTESvaraM | SyAmalaM kOmalaM SAMtamUrtiM ||

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

vaMdE vAsudEvaM - వందే వాసుదేవం

వందే వాసుదేవం (రాగం: ) (తాళం : )

ప|| వందే వాసుదేవం | బృందారకాధీశ వందిత పదాబ్జం ||

చ|| ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- | చందనాంకిత లసత్చారు దేహం |
మందార మాలికామకుట సంశోభితం | కందర్పజనక మరవిందనాభం ||

చ|| ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం | ఖగరాజ వాహనం కమలనయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప- | న్నగరాజ శాయినం ఘననివాసం ||

చ|| కరిపురనాథసంరక్షణే తత్పరం | కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం | తిరు వేంకటాచలాధీశం భజే ||

vaMdE vAsudEvaM (Raagam: ) (Taalam: )

pa|| vaMdE vAsudEvaM | bRuMdArakAdhISa vaMdita padAbjaM ||

ca|| iMdIvaraSyAma miMdirAkucataTI- | caMdanAMkita lasatcAru dEhaM |
maMdAra mAlikAmakuTa saMSOBitaM | kaMdarpajanaka maraviMdanABaM ||

ca|| dhagadhaga kaustuBa dharaNa vakShasthalaM | KagarAja vAhanaM kamalanayanaM |
nigamAdisEvitaM nijarUpaSEShapa- | nnagarAja SAyinaM GananivAsaM ||

ca|| karipuranAthasaMrakShaNE tatparaM | karirAjavarada saMgatakarAbjaM |
sarasIruhAnanaM cakraviBrAjitaM | tiru vEMkaTAcalAdhISaM BajE ||

Sung by:Mambalam Sisters

Get this widget | Track details | eSnips Social DNA

Sung by:Bombay Sisters

Get this widget | Track details | eSnips Social DNA

vaiShNavulugAnivAra - వైష్ణవులుగానివార

వైష్ణవులుగానివార (రాగం: ) (తాళం : )

ప|| వైష్ణవులుగానివార లెవ్వరు లేరు | విష్ణుప్రభావ మీవిశ్వమంతయు గాన ||

చ|| అంతయు విష్ణుమయంబట మరి దేవ- | తాంతరములు గలవనేలా |
భ్రాంతి బొంది యీభావము భావించి- | నంతనే పుణ్యులౌట దప్పదుగాన ||

చ|| యెవ్వరి గొలిచిన నేమిగొరత మరి | యెవ్వరి దలచిన నేమి |
ఆవ్వలివ్వల శ్రీహరిరూపు గానివా- | రెవ్వరు లేరని యెరుకదోచిన జాలు ||

చ|| అతిచంచలంబై నయాతును గలిగించు- | కతమున బహుచిత్తగతులై |
యితరుల గొలిచైన యెదాయక యనాథ- | పతివేంకటపతి చేకొనుగాక ||

vaiShNavulugAnivAra (Raagam: ) (Taalam: )

pa|| vaiShNavulugAnivAra levvaru lEru | viShNupraBAva mIviSvamaMtayu gAna ||

ca|| aMtayu viShNumayaMbaTa mari dEva- | tAMtaramulu galavanElA |
BrAMti boMdi yIBAvamu BAviMci- | naMtanE puNyulauTa dappadugAna ||

ca|| yevvari golicina nEmigorata mari | yevvari dalacina nEmi |
Avvalivvala SrIharirUpu gAnivA- | revvaru lErani yerukadOcina jAlu ||

ca|| aticaMcalaMbai nayAtunu galigiMcu- | katamuna bahucittagatulai |
Yitarula golicaina yedAyaka yanAtha- | pativEMkaTapati cEkonugAka ||