vEMkaTAdri vibhunibAsi - వేంకటాద్రి విభునిబాసి

వేంకటాద్రి విభునిబాసి (రాగం: ) (తాళం : )

వేంకటాద్రి విభునిబాసి విరహియైన రమణిజూచి
రంకెలు వేయనేటికమ్మ రాజసమునను ||

విసపుకోర సోకినపుదె వేడిలేని చందమామ
మిసిమిగలుగు వేడి చూపుమింట మలయునే
నొసలికంటి కాకనణగి నొగిలినడెడె తొడుగలేక
కుసుమ శరము మదనుడతివకొరకు దాచెనే ||

vEMkaTAdri vibhunibAsi (Raagam: ) (Taalam: )

vEMkaTAdri vibhunibAsi virahiyaina ramaNijUchi
raMkelu vEyanETikamma rAjasamunanu ||

visapukOra sOkinapude vEDilEni chaMdamAma
misimigalugu vEDi chUpumiMTa malayunE
nosalikaMTi kAkanaNagi nogilinaDeDe toDugalEka
kusuma Saramu madanuDativakoraku dAchenE ||


vedakina nidiyE - వెదకిన నిదియే

వెదకిన నిదియే (రాగం: ) (తాళం : )

ప|| వెదకిన నిదియే వేదార్థము | మొదలు తుదలు హరి మూలము ||

చ|| యెరవగు గుణములు యెన్ని కలిగిన | పరమ జ్ఞానము ప్రధానము |
యిరవుగ శ్రీ వేంకటేశ్వర నామము | సరవి మంత్రముల సారము ||

చ|| మునుకొని అవయవములు యెన్నైనా | పనిపడి శిరసే ప్రధానము |
యెనలేని సురలు యెందరు గలిగిన | మునుపటి హరియే మూలంబు ||

చ|| మోవని ఇంద్రియములు యెన్నైనా | భావపు మనసే ప్రధానము ||
యీవల మతములు యెన్ని కలిగినా | మూవురలో హరి మూలంబు ||

vedakina nidiyE (Raagam: ) (Taalam: )

pa|| vedakina nidiyE vEdArthamu | modalu tudalu hari mUlamu ||

ca|| yeravagu guNamulu yenni kaligina | parama j~jAnamu pradhAnamu |
yiravuga SrI vEMkaTESvara nAmamu | saravi maMtramula sAramu ||

ca|| munukoni avayavamulu yennainA | panipaDi SirasE pradhAnamu |
yenalEni suralu yeMdaru galigina | munupaTi hariyE mUlaMbu ||

ca|| mOvani iMdriyamulu yennainA | BAvapu manasE pradhAnamu ||
yIvala matamulu yenni kaliginA | mUvuralO hari mUlaMbu ||


vINa vAyiMchanE - వీణ వాయించనే

వీణ వాయించనే (రాగం: ) (తాళం : )

వీణ వాయించనే అలమేలుమంగమ్మ
వేణుగాన విలోలుడైన వేంకటేశునోద్ద ||

కురులు మెల్లన జారగా
సన్నజాజివిరులూ
కరకంకణంబులు ఘల్లని మ్రోయగ
మరువైన వజ్రాల మెరుగుతులాడగా ||

సందటి దండలు కదలగాను
ఆణిముత్యాల సరులు వుయ్యాలలూగగాను
అందమై పాలిండ్లను అలదిన కుంకుమ
గంధము చెమటచే కరిగే ఘుమఘుమమనగా ||


ఘనన యనములూ మెరయగా
వింతరాగమును ముద్దులు కులుకగా
ఘననిభవేని జంత్రగాత్రము మెరయగ
వినెడి శ్రీవేంకటేశుల వీనులవిందుగా ||

vINa vAyiMchanE (Raagam: ) (Taalam: )

vINa vAyiMchanE alamElumaMgamma
vENugAna vilOluDaina vEMkaTESunOdda ||

kurulu mellana jAragA
sannajAjivirulU
karakaMkaNaMbulu ghallani mrOyaga
maruvaina vajrAla merugutulADagA ||

saMdaTi daMDalu kadalagAnu
ANimutyAla sarulu vuyyAlalUgagAnu
aMdamai pAliMDlanu aladina kuMkuma
gaMdhamu chemaTachE karigE ghumaghumamanagA ||


ghanana yanamulU merayagA
viMtarAgamunu muddulu kulukagA
ghananibhavEni jaMtragAtramu merayaga
vineDi SrIvEMkaTESula vInulaviMdugA ||


vivEkame~rugani - వివేకమెఱుగని

వివేకమెఱుగనివెఱ్ఱులముగాక (రాగం: ) (తాళం : )

ప|| వివేకమెఱుగని వెఱ్ఱులముగాక నేము | దివారాత్రము నిన్నే ద్రిష్టించవలదా ||

చ|| మానివోడ నమ్మి వొక్కమనుజుడు వార్ధి దాటి | నానార్థములు గూర్చి నటించగాను |
దానవారికృప నమ్మి తగినసంసారవార్ధి- | లోను చొచ్చి దాటి గెల్వ లోకులకు జెల్లదా ||

చ|| జుట్టెడుయినుము నమ్మి సొరిది నొక్కడు భూమి | గట్టడిభయములెల్ల గడవగాను |
నెట్టన జక్రాయుధుని నిజనామ మిటు నమ్మి | తట్టి భవభయములు తరి దాటజెల్లదా ||

చ|| వేలెడుదీపము నమ్మి వెడగుజీకటి బాసి | పోలిమి నొక్కనరుడు పొదలగాను |
ఆలించి శ్రీవేంకటేశు డాత్మలో వెలుగగాను | మేలి మాతని గొలిచి మెరయంగవలదా ||

vivEkame~rugani ve~r~rulamugAka (Raagam: ) (Taalam: )

pa|| vivEkame~rugani ve~r~rulamugAka nEmu | divArAtramu ninnE driShTiMcavaladA ||

ca|| mAnivODa nammi vokkamanujuDu vArdhi dATi | nAnArthamulu gUrci naTiMcagAnu |
dAnavArikRupa nammi taginasaMsAravArdhi- | lOnu cocci dATi gelva lOkulaku jelladA ||

ca|| juTTeDuyinumu nammi soridi nokkaDu BUmi | gaTTaDiBayamulella gaDavagAnu |
neTTana jakrAyudhuni nijanAma miTu nammi | taTTi BavaBayamulu tari dATajelladA ||

ca|| vEleDudIpamu nammi veDagujIkaTi bAsi | pOlimi nokkanaruDu podalagAnu |
AliMci SrIvEMkaTESu DAtmalO velugagAnu | mEli mAtani golici merayaMgavaladA ||


vinnaviMchitimi - విన్నవించితిమి

విన్నవించితిమి (రాగం: ) (తాళం : )

విన్నవించితిమి నీకు వేడుకవేళ
కన్నెను నీవు దయ గాచేటివేళ ||

మచ్చికలు దయివారె మనసెల్ల జైవారె
వచ్చె జవ్వనానకు వసంతవేళ
చొచ్చి నిన్నుబాసి తాపసూర్యుడెండగాయగా
విచ్చన విడిగా దోచె వేసగి వేళ ||

సిగ్గులు మొలవజొచ్చె చెమటలేరులు హెచ్చె
కగ్గు లేకమించె భానకాలపు వేళ
వెగ్గళించి సెలవు వెన్నెలలు చూపట్టె
వొగ్గి శరత్కాలము వొదిగె నీవేళ ||

తత్తరపు చలి పొందె తలపోతమంచు మించె
యెత్తి యలమేల్మంగకు హేమంత వేళ
బత్తితో శ్రీవేంకటేశ పైకొని కూడితి విట్టె
చిత్తజు కాకలు దేరె సిసిర వేళ ||

vinnaviMchitimi (Raagam: ) (Taalam: )

vinnaviMchitimi nIku vEDukavELa
kannenu nIvu daya gAchETivELa ||

machchikalu dayivAre manasella jaivAre
vachche javvanAnaku vasaMtavELa
chochchi ninnubAsi tApasUryuDeMDagAyagA
vichchana viDigA dOche vEsagi vELa ||

siggulu molavajochche chemaTalErulu hechche
kaggu lEkamiMche bhAnakAlapu vELa
veggaLiMchi selavu vennelalu chUpaTTe
voggi SaratkAlamu vodige nIvELa ||

tattarapu chali poMde talapOtamaMchu miMche
yetti yalamElmaMgaku hEmaMta vELa
battitO SrIvEMkaTESa paikoni kUDiti viTTe
chittaju kAkalu dEre sisira vELa ||


vIni jUciyaina nEmu - వీని జూచియైన నేము

వీని జూచియైన (రాగం: ) (తాళం : )

ప|| వీని జూచియైన నేము విరతిబొందగలేము | పూని మాబ్రదు కిందుబోలదాయగా ||

చ|| వరుల వేడగబోవు పరనిందకు జొరవు | పరపురుషార్థమే ఫలవృక్షతతులెల్ల |
నరులమై ఘనులమై నానాబుద్ధు లెఱిగి | పొరి మాబ్రదుకు లిందుబోలదాయగా ||

చ|| కామక్రోధాలు లేవు కామతత్త్వ మెఱగవు | కామించినట్లవు నెక్కడనైనా శిల లివి |
దీమసము గలిగియు దెలివి గలిగియును | భూమిలో మాబ్రదుకు కిందుబోలదాయగా ||

చ|| వొకరి గొలువబోవు వొకపంట సేయబోవు | వొకమానిగూడు చేరివుండు పక్షు లాడనాడ |
వొకశ్రీవేంకటపతి నమ్మియుండలేము | మొకెమో మాబ్రదు కిందుబోలదాయగా ||

vIni jUciyaina (Raagam: ) (Taalam: )

pa|| vIni jUciyaina nEmu viratiboMdagalEmu | pUni mAbradu kiMdubOladAyagA ||

ca|| varula vEDagabOvu paraniMdaku joravu | parapuruShArthamE PalavRukShatatulella |
narulamai Ganulamai nAnAbuddhu lerxigi | pori mAbraduku liMdubOladAyagA ||

ca|| kAmakrOdhAlu lEvu kAmatattva merxagavu | kAmiMcinaTlavu nekkaDanainA Sila livi |
dImasamu galigiyu delivi galigiyunu | BUmilO mAbraduku kiMdubOladAyagA ||

ca|| vokari goluvabOvu vokapaMTa sEyabOvu | vokamAnigUDu cErivuMDu pakShu lADanADa |
vokaSrIvEMkaTapati nammiyuMDalEmu | mokemO mAbradu kiMdubOladAyagA ||


vIDivO yide - వీడివో యిదె

వీడివో యిదె (రాగం: ) (తాళం : )

ప|| వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ ||

చ|| వెలయ నీట జోప్పువేసేటి దొంగ | తలగాననీక దాగుదొంగ |
తలకక నేలదవ్వేటిదొంగ | తెలిసి సందెకాడ దిరిగేటి దొంగ ||

చ|| అడుగుకింద లోకమడచేటి దొంగ | అడరి తల్లికినైన నలుగుదొంగ |
అడవిలో నెలవైయున్న దొంగ | తొడరి నీలికాసెతో నుండుదొంగ ||

చ|| మోస మింతుల జేయుమునిముచ్చుదొంగ | రాసికెక్కినగుఱ్ఱంపుదొంగ |
వేసాల కిటు వచ్చి వెంకటగిరిమీద | మూసినముత్యమై ముదమందుదొంగ ||

vIDivO yide (Raagam: ) (Taalam: )

pa|| vIDivO yide viMtadoMga | vEDipAlu venna verajinadoMga ||

ca|| velaya nITa jOppuvEsETi doMga | talagAnanIka dAgudoMga |
talakaka nEladavvETidoMga | telisi saMdekADa dirigETi doMga ||

ca|| aDugukiMda lOkamaDacETi doMga | aDari tallikinaina nalugudoMga |
aDavilO nelavaiyunna doMga | toDari nIlikAsetO nuMDudoMga ||

ca|| mOsa miMtula jEyumunimuccudoMga | rAsikekkinagurxrxaMpudoMga |
vEsAla kiTu vacci veMkaTagirimIda | mUsinamutyamai mudamaMdudoMga ||