sakala saMgrahamu - సకల సంగ్రహము

సకల సంగ్రహము (రాగం: ) (తాళం : )

ప|| సకల సంగ్రహము సకల సంచయము | అకృతసుకృత మిది హరినామం ||

చ|| సకలవేదశాస్త్రములసార మిది | సకలమంత్రరాజంబు నిది |
సకలపురాణ రసములమధుర మిది | అకుటిలపావనం హరినామం ||

చ|| సకలతత్త్వ సంశయఖండన మిది | సకలకర్మ నిశ్చయము నిది |
సకలవిధి రహస్యప్రధాన మిది | అకారణహితం హరినామం ||

చ|| సకలదేవతా స్వామిప్రియం బిది | సకలలోక రక్షణము నిది |
ప్రకటం వేంకటపతి నామాంకిత- | మకించనధనం హరినామం ||

sakala saMgrahamu (Raagam: ) (Taalam: )

pa|| sakala saMgrahamu sakala saMcayamu | akRutasukRuta midi harinAmaM ||

ca|| sakalavEdaSAstramulasAra midi | sakalamaMtrarAjaMbu nidi |
sakalapurANa rasamulamadhura midi | akuTilapAvanaM harinAmaM ||

ca|| sakalatattva saMSayaKaMDana midi | sakalakarma niScayamu nidi |
sakalavidhi rahasyapradhAna midi | akAraNahitaM harinAmaM ||

ca|| sakaladEvatA svAmipriyaM bidi | sakalalOka rakShaNamu nidi |
prakaTaM vEMkaTapati nAmAMkita- | makiMcanadhanaM harinAmaM ||


sakala jIvulakella - సకల జీవులకెల్ల

సకల జీవులకెల్ల (రాగం: ) (తాళం : )

ప|| సకల జీవులకెల్ల సంజీవి యీమందు | వెకలులై యిందరు సేవించరో యీమందు ||

చ|| మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది | పోడిమి నల్లని కాంతి బొదలినది |
పీడుక కొమ్ములు నాల్గు పెనచి చేయువారినది | వాడే శేషగిరిమీద నాటుకొన్న మందు ||

చ|| పడిగెలు వేయింటి పాము గాచుకున్నది | కడు వేదశాస్త్రముల గబ్బు వేసీది |
యెడయక వొకకాంత యెక్కుక వుండినది | కడలేని యంజనాద్రి గారుడపు మందు ||

చ|| బలు శంఖు జక్రముల బదనికెలున్నది | తలచిన వారికెల్ల దత్త్వమైనది |
అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది | వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు ||

sakala jIvulakella (Raagam: ) (Taalam: )

pa|| sakala jIvulakella saMjIvi yImaMdu | vekalulai yiMdaru sEviMcarO yImaMdu ||

ca|| mUDu lOkamu lokkaTa muMci periginadi | pODimi nallani kAMti bodalinadi |
pIDuka kommulu nAlgu penaci cEyuvArinadi | vADE SEShagirimIda nATukonna maMdu ||

ca|| paDigelu vEyiMTi pAmu gAcukunnadi | kaDu vEdaSAstramula gabbu vEsIdi |
yeDayaka vokakAMta yekkuka vuMDinadi | kaDalEni yaMjanAdri gAruDapu maMdu ||

ca|| balu SaMKu jakramula badanikelunnadi | talacina vArikella dattvamainadi |
alarina brahmarudrAdula buTTiMcinadi | velugu tODuta SrIvEMkaTAdri maMdu ||


sakalaloka nadhudu - సకలలోక నాధుడు

సకలలోక నాధుడు (రాగం: ) (తాళం : )

సకలలోక నాధుడు జనార్థునుడితడు
శుకయొగి వంద్యుని సుగ్నానమెంత

మరుని తండ్రికిని మరి చక్కదనమెంత
సిరి మగని భాగ్యము చెప్పనెంత
పురుషొత్తము ఘనత పొగడగ నికనెంత
అరిమ జలధి సాయి గంభీరమెంత

అమిత వరదునకు ఔదర్యగుణమెంత
విమత దురవైరి విక్రమమెంత
మమతల అలమెలుమంగాపతి సొబగెంత
అమర శ్రీవేంకటేశు ఆధిక్యమెంత

sakalaloka nadhudu (Raagam: ) (Taalam: )

sakalaloka nadhudu janarthanuditady
sukayogi vandyuni sugnaanamenta

maruni tandrikini mari chakkadanamenta
siri magani bhagyamu cheppanenta
purushottamu ghanata pogadaga nikanenta
arima jaladhi sai gambheeramenta

amita varadunaku audaryagunamenta
vimata duravairi vikramamenta
mamatala alamelumangapati sobagenta
amara srivenkatesu aadityamenta


sakalabalaMbulu - సకలబలంబులు

సకలబలంబులు (రాగం: ) (తాళం : )

సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు
అకలంకమగుసుఖమే అన్నిటనిదే నాకు

పొందుగ( జక్రాంకితమే బుజబల మిదే నాకు
అందినహరి నీచింతే ఆత్మబలము నాకు
సందడి( బేరుబలము కేశవనామము నాకు
యిందును నందును భవభయ మిక లేదిదే నాకు

అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు
సంగతి నీపై పాటలె సర్వబలి మిదే నాకు
రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు
యింగితముగ నిహపరముల కెదురే దిదే నాకు

కనుగొను నీవిగ్రహమే గ్రహబలి మిదే నాకు
విను నీదాసులసేవే వెనుబలిమిదె నాకు
తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు
ఘనమే చెప్పగ నింతటా కలిగెబో యిదే నాకు

sakalabalaMbulu (Raagam: ) (Taalam: )

sakalabalaMbulu nIvE sarwESwarA nAku
akalaMkamagusukhamE anniTanidE nAku

poMduga( jakrAMkitamE bujabala midE nAku
aMdinahari nIchiMtE Atmabalamu nAku
saMdaDi( bErubalamu kESavanAmamu nAku
yiMdunu naMdunu bhavabhaya mika lEdidE nAku

aMgapu tirumaNulivi paMchAMgabalamu nAku
saMgati nIpai pATale sarwabali midE nAku
raMguga nIguNarAsulE rAsibalamu nAku
yiMgitamuga nihaparamula kedurE didE nAku

kanugonu nIvigrahamE grahabali midE nAku
vinu nIdAsulasEvE venubalimide nAku
tanarina SrIvEMkaTapati daivabalamu nAku
ghanamE cheppaga niMtaTA kaligebO yidE nAku

Sung by:Nayanatara

Sakalabalambu_Nayanatara
Sakalabalambu_Naya...
Hosted by eSnips

Sakalasaamtikaramu - సకలశాంతికరము

సకలశాంతికరము (రాగం: ) (తాళం : )

సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ
ప్రకటమై మాకు నబ్బె బతికించు నిదియె సర్వేశ

మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన
నినుదలచినంతనే నీఱౌను
కనుగొన్న పాపములు కడలేనివైనాను
ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును

చేతనంటి పాతకాలు సేనగానే జేసినాను
ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు
ఘాతలజెవుల వినగా నంటిన పాపము
నీతితో నీ కథ వింటే నిమిషానబాయును

కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల
కాయపునీ ముద్రలచే గ్రక్కున వీడు
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా
అయమైన నీ శరణాగతిచే నణగు

Sakalasaamtikaramu (Raagam: ) (Taalam: )

Sakalasaamtikaramu sarvaesa neepai bhakti sarvaesa
Prakatamai maaku nabbe batikimchu nidiye sarvaesa

Manasulo paapabuddhi mariyemta dalachina
Ninudalachinamtanae nee~raunu
Kanugonna paapamulu kadalaenivainaanu
Ghanudaninnu joochitae kadaku dolagunu

Chaetanamti paatakaalu saenagaanae jaesinaanu
Aatala neeku mrokkitae nanniyu baayu
Ghaatalajevula vinagaa namtina paapamu
Neetito nee katha vimtae nimishaanabaayunu

Kaayamuna jaesaeti karmapu paapamulella
Kaayapunee mudralachae grakkuna veedu
Yaeyeda vaemkataesa yaeyaepaatakamainaa
Ayamaina nee saranaagatichae nanagu


saDibeTTe gaTakaTA - సడిబెట్టె గటకటా

సడిబెట్టె గటకటా (రాగం: ) (తాళం : )

ప|| సడిబెట్టె గటకటా సంసారము చూడ | జలధిలోపలియీత సంసారము ||

చ|| జమునోరిలో బ్రదుకు సంసారము చూడ | చమురుదీసినదివ్వె సంసారము |
సమయించుబెనుదెవులు సంసారము చూడ | సమరంబులో నునికి సంసారము ||

చ|| సందిగట్టినతాడు సంసారము చూడ | సందికంతలతోవ సంసారము |
చందురునిజీవనము సంసారము చూడ | చంద మేవలెనుండు సంసారము ||

చ|| చలువలోపలివేడి సంసారము చూడ | జలపూతబంగారు సంసారము |
యిలలోన దిరువేంకటేశ నీదాసులకు | చలువలకు గడుచలువ సంసారము ||

saDibeTTe gaTakaTA (Raagam: ) (Taalam: )

pa|| saDibeTTe gaTakaTA saMsAramu cUDa | jaladhilOpaliyIta saMsAramu ||

ca|| jamunOrilO braduku saMsAramu cUDa | camurudIsinadivve saMsAramu |
samayiMcubenudevulu saMsAramu cUDa | samaraMbulO nuniki saMsAramu ||

ca|| saMdigaTTinatADu saMsAramu cUDa | saMdikaMtalatOva saMsAramu |
caMdurunijIvanamu saMsAramu cUDa | caMda mEvalenuMDu saMsAramu ||

ca|| caluvalOpalivEDi saMsAramu cUDa | jalapUtabaMgAru saMsAramu |
yilalOna diruvEMkaTESa nIdAsulaku | caluvalaku gaDucaluva saMsAramu ||


sagamu mAnisi rUpu - సగము మానిసి రూపు

సగము మానిసి రూపు (రాగం: ) (తాళం : )

సగము మానిసి రూపు సగము మెగము రూపు
అగణిత ప్రతాపుడు అహోబలేశుడు

గద్దెమీద గూచున్నాడు కంబములో బుట్టినాడు
కొద్దిమీర గడునవ్వుకొంటా నున్నాడు
వొద్దనె శ్రీసతిచన్నులొరయచు నున్నవాడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుడు

పెనుమీసాలవాడు పెదపెదగోళ్ళవాడు
ఘనునిగా ప్రహ్లాదుని గాచుకున్నాడు
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు
అనుపమతేజుడమ్మ అహోబలేశుడు

వేవేలు చేతులవాడు వెన్నెలచాయలవాడు
భావించి కొల్చినవారి పాలిటివాడు
శ్రీవేంకటగిరిమీద జేరి భవనాశిదండ-
నావల నీవల మించె నహోబలేశుడు

sagamu mAnisi rUpu (Raagam: ) (Taalam: )

sagamu mAnisi rUpu sagamu megamu rUpu
agaNita pratApuDu ahObalESuDu

gaddemIda gUchunnADu kaMbamulO buTTinADu
koddimIra gaDunavvukoMTA nunnADu
voddane SrIsatichannulorayuchu nunnavADu
addivO chUDaramma ahObalESuDu

penumIsAlavADu pedapedagOLLavADu
ghanunigA prahlAduni gAchukunnADu
manasichchina suralatO mATalADuchunnavADu
anupamatEjuDamma ahObalESuDu

vEvElu chEtulavADu vennelachAyalavADu
bhAviMchi kolchinavAri pAliTivADu
SrIvEMkaTagirimIda jEri bhavanASidaMDa-
nAvala nIvala miMche nahObalESuDu