sagamu mAnisi rUpu - సగము మానిసి రూపు

సగము మానిసి రూపు (రాగం: ) (తాళం : )

సగము మానిసి రూపు సగము మెగము రూపు
అగణిత ప్రతాపుడు అహోబలేశుడు

గద్దెమీద గూచున్నాడు కంబములో బుట్టినాడు
కొద్దిమీర గడునవ్వుకొంటా నున్నాడు
వొద్దనె శ్రీసతిచన్నులొరయచు నున్నవాడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుడు

పెనుమీసాలవాడు పెదపెదగోళ్ళవాడు
ఘనునిగా ప్రహ్లాదుని గాచుకున్నాడు
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు
అనుపమతేజుడమ్మ అహోబలేశుడు

వేవేలు చేతులవాడు వెన్నెలచాయలవాడు
భావించి కొల్చినవారి పాలిటివాడు
శ్రీవేంకటగిరిమీద జేరి భవనాశిదండ-
నావల నీవల మించె నహోబలేశుడు

sagamu mAnisi rUpu (Raagam: ) (Taalam: )

sagamu mAnisi rUpu sagamu megamu rUpu
agaNita pratApuDu ahObalESuDu

gaddemIda gUchunnADu kaMbamulO buTTinADu
koddimIra gaDunavvukoMTA nunnADu
voddane SrIsatichannulorayuchu nunnavADu
addivO chUDaramma ahObalESuDu

penumIsAlavADu pedapedagOLLavADu
ghanunigA prahlAduni gAchukunnADu
manasichchina suralatO mATalADuchunnavADu
anupamatEjuDamma ahObalESuDu

vEvElu chEtulavADu vennelachAyalavADu
bhAviMchi kolchinavAri pAliTivADu
SrIvEMkaTagirimIda jEri bhavanASidaMDa-
nAvala nIvala miMche nahObalESuDu


sadA sakalamu - సదా సకలము

సదా సకలము (రాగం: ) (తాళం : )

ప|| సదా సకలము సంపదలే | తుద దెలియగవలె దొలగగవలయు ||

చ|| అహర్నిశలు నాపదలే | సహించిన నవి సౌఖ్యములే |
ఇహముననవి యిందరికిని | మహిమ దెలియవలె మానగవలెను ||

చ|| దురంతము లివి దోషములే | పరంపర లివి బంధములు |
విరసములౌ నరవిభవములౌ- | సిరులే మరులౌ చిరసుఖ మవును ||

చ|| గతి యలమేల్మంగ నాంచారికి | బతియగువేంకటపతి దలచి |
గతు లెరుగగవలె రవణము వలెను | హిత మెరుగగవలె నిదె తనకు ||

sadA sakalamu (Raagam: ) (Taalam: )

pa|| sadA sakalamu saMpadalE | tuda deliyagavale dolagagavalayu ||

ca|| aharniSalu nApadalE | sahiMcina navi sauKyamulE |
ihamunanavi yiMdarikini | mahima deliyavale mAnagavalenu ||

ca|| duraMtamu livi dOShamulE | paraMpara livi baMdhamulu |
virasamulau naraviBavamulau- | sirulE marulau cirasuKa mavunu ||

ca|| gati yalamElmaMga nAMcAriki | batiyaguvEMkaTapati dalaci |
gatu lerugagavale ravaNamu valenu | hita merugagavale nide tanaku ||


Shodasakalaanidhiki - షోడసకళానిధికి

షోడసకళానిధికి (రాగం: ) (తాళం : )

షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి

అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ
నిలయున కాసనము నెమ్మి నిదే
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో

Shodasakalaanidhiki (Raagam: ) (Taalam: )

Shodasakalaanidhiki shodasopachaaramulu
Jaadatoda nichchalunu samarpayaami

Alaru visvaatmakuna kaavaahana mide sarva
Nilayuna kaasanamu nemmi nidae
Alagamgaa janakuna karghyapaadyaachamanaalu
Jaladhi Saayikini majjanamidae

Varapeetaambarunaku vastraalamkaaramide
Sari sreemamtunaku bhooshanamu livae
Dharaneedharunaku gamdhapushpa dhoopamulu
Tira mide kotisooryataejunaku deepamu

Amrtamathanunaku nadivo naivaedyamu
Gami(ravi)jamdrunaetrunaku kappuravidemu
Amarina sreevaemkataadri meedi daevuniki
Tamito pradakshinaalu damdamulu nivigo


Sung by:Balakrishna Prasad

SrISOyaM susthirOyaM - శ్రీశోయం సుస్థిరోయం

శ్రీశో2యం (రాగం: ) (తాళం : )

ప|| శ్రీశో2యం సుస్థిరో2యం | కౌశికమఖరక్షకో2యం ||

చ|| నిగమనిధినిర్మలో2యం | జగన్మోహనసతీపతి- |
విగత భయో2యం విజయసఖో2యం | భృగుముని సంప్రీతో2యం ||

చ|| సకలపతి శ్శాశ్వతో2యం | శుకముకమునిజనసులభో2యం |
ప్రకటబహుళశోభనాధికో2యం | వికచరుక్మిణీవీక్షణో2యం ||

చ|| సరసో2యం | పరిసరప్రియో2యం | తిరువేంకటాధిపో2యం |
చిరంతనో2యం చిదాత్మకో2యం | శరణాగతవత్సలో2యం ||

SrISO2yaM (Raagam: ) (Taalam: )

pa|| SrISO2yaM susthirO2yaM | kauSikamaKarakShakO2yaM ||

ca|| nigamanidhinirmalO2yaM | jaganmOhanasatIpati- |
vigata BayO2yaM vijayasaKO2yaM | BRugumuni saMprItO2yaM ||

ca|| sakalapati SSASvatO2yaM | SukamukamunijanasulaBO2yaM |
prakaTabahuLaSOBanAdhikO2yaM | vikacarukmiNIvIkShaNO2yaM ||

ca|| sarasO2yaM | parisarapriyO2yaM | tiruvEMkaTAdhipO2yaM |
ciraMtanO2yaM cidAtmakO2yaM | SaraNAgatavatsalO2yaM ||

SrImannArAyaNa - శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ (రాగం: ) (తాళం : )

ప|| శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||

చ|| కమలాసతీ ముఖకమల కమలహిత | కమలప్రియ కమలేక్షణ |
కమలాసనహిత గరుడగమన శ్రీ | కమలనాభ నీపదకమలమే శరణు ||

చ|| పరమయోగిజన భాగధేయ శ్రీ | పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ | తిరువేంకటగిరి దేవ శరణు ||

SrImannArAyaNa (Raagam: ) (Taalam: )

pa|| SrImannArAyaNa SrImannArAyaNa | SrImannArAyaNa nI SrIpAdamE SaraNu ||

ca|| kamalAsatI muKakamala kamalahita | kamalapriya kamalEkShaNa |
kamalAsanahita garuDagamana SrI | kamalanABa nIpadakamalamE SaraNu ||

ca|| paramayOgijana BAgadhEya SrI | paramapUruSha parAtpara
paramAtma paramANurUpa SrI | tiruvEMkaTagiri dEva SaraNu ||


SrIhari nityaSEshagirISa - శ్రీహరి నిత్యశేషగిరీశ

శ్రీహరి నిత్యశేషగిరీశ (రాగం: ) (తాళం : )

శ్రీహరి నిత్యశేషగిరీశ
మోహనాకార ముకుంద నమో ||

దేవకీ సుత దేవ వామన
గోవిందా గోప గోపీనాథా
గోవర్ధనధర గోకులపాలక
దేవేశాధిక తే నమో నమో ||

సామాజావన శార్ణపాణి
వామనా కృష్ణ వాసుదేవ
రామనామ నారాయణ విష్ణో
దామోదర శ్రీధర నమో నమో ||

పురుషోత్తమ పుండరీకాక్ష
గరుడధ్వజ కరుణానిధి
చిరంతన అచ్యుత శ్రీవేంకటేశ్వర
నరమృగ తే నమో నమో ||

SrIhari nityaSEshagirISa (Raagam: ) (Taalam: )

SrIhari nityaSEshagirISa
mOhanAkAra mukuMda namO ||

dEvakI suta dEva vAmana
gOviMdA gOpa gOpInAthA
gOvardhanadhara gOkulapAlaka
dEvESAdhika tE namO namO ||

sAmaajAvana SArNapANi
vAmanA kRshNa vAsudEva
rAmanAma nArAyaNa vishNO
dAmOdara SrIdhara namO namO ||

purushOttama puMDarIkAksha
garuDadhwaja karuNAnidhi
chiraMtana achyuta SrIvEMkaTESwara
naramRga tE namO namO ||

Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

SrIharisEsinacihnalivi - శ్రీహరిసేసినచిహ్నలివి

శ్రీహరిసేసినచిహ్నలివి (రాగం: ) (తాళం : )

ప|| శ్రీహరిసేసినచిహ్నలివి యీ- | మోహము విడుచుట మోక్షమది ||

చ|| మలినంబేది మణుగననేది | కలుషపుమలముల కాయమిది |
కలిగినదేది కడులేందేది | చలనపుమాయల జన్మమిది ||

చ|| తనిసినదేది తనియనిదేది | దినదినమాకలి దీరదిది |
కొనయిందేది గురిమొదలేది | పనిగొనుకర్మపు బంధమిది ||

చ|| నిండినదేది నిండనిదేది | కొండలపొడపుల కోరికది |
అండనే శ్రీ వేంకటాధిపు శరణని | వుండుటె యిహపర యోగమది ||

SrIharisEsinacihnalivi (Raagam: ) (Taalam: )

pa|| SrIharisEsinacihnalivi yI- | mOhamu viDucuTa mOkShamadi ||

ca|| malinaMbEdi maNugananEdi | kaluShapumalamula kAyamidi |
kaliginadEdi kaDulEMdEdi | calanapumAyala janmamidi ||

ca|| tanisinadEdi taniyanidEdi | dinadinamAkali dIradidi |
konayiMdEdi gurimodalEdi | panigonukarmapu baMdhamidi ||

ca|| niMDinadEdi niMDanidEdi | koMDalapoDapula kOrikadi |
aMDanE SrI vEMkaTAdhipu SaraNani | vuMDuTe yihapara yOgamadi ||