saMsAramE mElu - సంసారమే మేలు

సంసారమే మేలు (రాగం: ) (తాళం : )

ప|| సంసారమే మేలు సకల జనులకును | కంసాంతకుని భక్తిగలిగితే మేలు ||

చ|| వినయంపు మాటల విద్య సాధించితే మేలు | తనిసి యప్పులలోన దాగకుంటే మేలు |
మునుపనే భుమి దన్నుమోచి దించకుంటే మేలు | వెనుకొన్నకోపము విడచితే మేలు ||

చ|| కొరివొకరి నడిగి కొంచపడకుంటే మేలు | సారె సారె జీవులను చంపకుంటే మేలు |
భరపుటిడుమలను పడకుండితే మేలు | కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు ||

చ|| పరకాంతల భంగపరచకుంటే మేలు | దొరకని కెళవులు దొక్కకుంటే మేలు |
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి | యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు ||

saMsAramE mElu (Raagam: ) (Taalam: )

pa|| saMsAramE mElu sakala janulakunu | kaMsAMtakuni BaktigaligitE mElu ||

ca|| vinayaMpu mATala vidya sAdhiMcitE mElu | tanisi yappulalOna dAgakuMTE mElu |
munupanE Bumi dannumOci diMcakuMTE mElu | venukonnakOpamu viDacitE mElu ||

ca|| korivokari naDigi koMcapaDakuMTE mElu | sAre sAre jIvulanu caMpakuMTE mElu |
BarapuTiDumalanu paDakuMDitE mElu | kAriMci tiTla koDigaTTakuMTE mElu ||

ca|| parakAMtala BaMgaparacakuMTE mElu | dorakani keLavulu dokkakuMTE mElu |
arudaina SrI vEMkaTAdri viBuni golci | yiravai niSciMtuDaitE ninniTAnu mElu ||


saMdaDi viDuvumu - సందడి విడువుము

సందడి విడువుము (రాగం: ) (తాళం : )

ప|| సందడి విడువుము సాసముఖా | మందరధరునకు మజ్జనవేళా ||

చ|| అమరాధిపులిడు డాలవట్టములు | కమలజ పట్టుము కాళాంజి |
జమలి చామరలు చంద్రుడ సూర్యుడ | అమర నిడుడు పరమాత్మునకు ||

చ|| అణిమాది సిరులనలరెడు శేషుడ | మణిపాదుకలిడు మతి చెలగా |
ప్రణుతింపు కదిసి భారతీరమణ | గుణాధిపు మరుగురు బలుమరును ||

చ|| వేదఘోషణము విడువక సేయుడు | ఆదిమునులు నిత్యాధికులు |
శ్రీదేవుండగు శ్రీవేంకటపతి | ఆదరమున సిరు లందీ వాడె ||

saMdaDi viDuvumu (Raagam: ) (Taalam: )

pa|| saMdaDi viDuvumu sAsamuKA | maMdaradharunaku majjanavELA ||

ca|| amarAdhipuliDu DAlavaTTamulu | kamalaja paTTumu kALAMji |
jamali cAmaralu caMdruDa sUryuDa | amara niDuDu paramAtmunaku ||

ca|| aNimAdi sirulanalareDu SEShuDa | maNipAdukaliDu mati celagA |
praNutiMpu kadisi BAratIramaNa | guNAdhipu maruguru balumarunu ||

ca|| vEdaGOShaNamu viDuvaka sEyuDu | Adimunulu nityAdhikulu |
SrIdEvuMDagu SrIvEMkaTapati | Adaramuna siru laMdI vADe ||


Samdekaada buttinatti - సందెకాడ బుట్టినట్టి

సందెకాడ బుట్టినట్టి (రాగం: ) (తాళం : )

సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత-
చందమాయ చూడరమ్మ చందమామ పంట॥

మునుప పాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్ను గొనచూపులపంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట॥

వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జాజరపంట
కలిమి కామిని తోడ కారుకమ్మినపంట
మలయుచు తమలోని మర్రిమాని పంట॥

విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగచుక్కలరాసి భగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండినపంట
యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥

Samdekaada buttinatti (Raagam: ) (Taalam: )

Samdekaada buttinatti chaayala pamta yemta-
Chamdamaaya choodaramma chamdamaama pamta

Munupa paalavelli molachi pamdinapamta
Ninupai daevatalaku nichchapamta
Gonakoni harikannu gonachoopulapamta
Vinuveedhi negadina vennelala pamta

Valaraaju pampuna valapu vittina pamta
Chaluvai punnamanaati jaajarapamta
Kalimi kaamini toda kaarukamminapamta
Malayuchu tamaloni marrimaani pamta

Virahula gumdelaku vekkasamaina pamta
Paragachukkalaraasi bhagyamu pamta
Arudai toorupukomda naaragabamdinapamta
Yiravai Sree vaemkataesunimtiloni pamta


sakalaSAstrasaMpannuDaTa - సకలశాస్త్రసంపన్నుడట

సకలశాస్త్రసంపన్నుడట (రాగం: ) (తాళం : )

ప|| సకలశాస్త్రసంపన్నుడట చిత్త- | మొకటికిని జొరదు విధియోగమౌగాదో ||

చ|| దొరతనంబట కలిమి దోడుగాదట మంచి- | తరుణులట మోహమట దైన్యంబట |
విరహమట దారిద్ర్యవివశుడౌనట చూడ- | నరయ నిది కర్మఫలమౌనో కాదో ||

చ|| రాజసన్మానమట రవణహీనత్వమట | తేజమట నలువంక దిరిపెంబట |
వాజివాహనములట వాడిలేదట తొంటి- | పూజఫలమిది వెలితిభోగమౌగాదో ||

చ|| యిలయెల్ల నేలునట ఇంటలేదట మిగుల | బలిమిగలదట సడా పరిభవమట |
చెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరుని | గొలువనేరనివెనక గొరతలౌగాదో ||

sakalaSAstrasaMpannuDaTa (Raagam: ) (Taalam: )

pa|| sakalaSAstrasaMpannuDaTa citta- | mokaTikini joradu vidhiyOgamaugAdO ||

ca|| doratanaMbaTa kalimi dODugAdaTa maMci- | taruNulaTa mOhamaTa dainyaMbaTa |
virahamaTa dAridryavivaSuDaunaTa cUDa- | naraya nidi karmaPalamaunO kAdO ||

ca|| rAjasanmAnamaTa ravaNahInatvamaTa | tEjamaTa naluvaMka diripeMbaTa |
vAjivAhanamulaTa vADilEdaTa toMTi- | pUjaPalamidi velitiBOgamaugAdO ||

ca|| yilayella nElunaTa iMTalEdaTa migula | balimigaladaTa saDA pariBavamaTa |
celuvalara vEDukala SrIvEMkaTESvaruni | goluvanEranivenaka goratalaugAdO ||


sakalasaMdEhamai - సకలసందేహమై

సకలసందేహమై (రాగం: ) (తాళం : )

ప|| సకలసందేహమై జరుగుచున్నది యొకటి | ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని ||

చ|| వసుదేవజఠరమనువననిధికి జంద్రుడై | అసమానగతి బొడమినా డితడు |
వసుధ జంద్రుడు నీలవర్ణు డేటికినాయ | కసరెత్తి నునుగందు గలయగొనుబోలు ||

చ|| ఇనవంశమున లోకహితకల్పభూజమై | అనఘుడై జనియించినా డితడు |
నను పై నసురతరువు నల్లనేటికినాయ | పెనుగొమ్మలో చేగ పెరిగిరాబోలు ||

చ|| తిరువేంకటాద్రిపై దెలియ జింతామణై | అరిదివలె బొడచూపినా డితడు |
గరిమె నది యిపుడు చీకటివర్ణమేలాయ | హరినీలమణులప్రభ లలమికొనబోలు ||

sakalasaMdEhamai (Raagam: ) (Taalam: )

pa|| sakalasaMdEhamai jarugucunnadi yokaTi | prakaTiMpa jIvamO brahmamO kAni ||

ca|| vasudEvajaTharamanuvananidhiki jaMdruDai | asamAnagati boDaminA DitaDu |
vasudha jaMdruDu nIlavarNu DETikinAya | kasaretti nunugaMdu galayagonubOlu ||

ca|| inavaMSamuna lOkahitakalpaBUjamai | anaGuDai janiyiMcinA DitaDu |
nanu pai nasurataruvu nallanETikinAya | penugommalO cEga perigirAbOlu ||

ca|| tiruvEMkaTAdripai deliya jiMtAmaNai | aridivale boDacUpinA DitaDu |
garime nadi yipuDu cIkaTivarNamElAya | harinIlamaNulapraBa lalamikonabOlu ||


sakalam hesakhi janame - సకలం హేసఖి జానామె

సకలం హే (రాగం: ) (తాళం : )

సకలం హేసఖి జానామె తత్ ప్రకత విలాసం పరమం దధసే

అలిక మౄగ మద మయ మషి కలనౌ జ్వలతాహే సఖి జానామే
లలితం తవ పల్లవి తమనసి నిస్చలతర మేఘ శ్యామం దధసే


చారుకపొల స్థల కరాంకిత విచారం హే సఖి జానామే
నారయణ మహినాయక శయనం శ్రి రమనం తవ చిత్తే దధసే


ఘన కుచ శైల క్రస్చిత విభుమని జననం హే సఖి జానామే
కనతురస వేంకట గిరిపతి వినుత భొగ సుఖ విభవం దధసే..

sakalaM hE (Raagam: ) (Taalam: )

sakalam hesakhi janame tat prakata vilasam paramam daddhase

alika mruga mada maya mashi kalanou jwalatahein sakhi jaaname
lalitam tava pallavi tamanasi nishchalatara megha shyamam dadhase


charukapola sthala karankita vichaaram he sakhi jaaname
naaryana mahinaayaka sayanam sri ramanam tava chitte dadhase


ghana kucha saila kraschita vibhumani jananm he sakhi jaaname
kanaturasa venkata giripati vinuta bhoga sukha vibhavam dadhase..

sakalaBUtadaya - సకలభూతదయ చాలగ

సకలభూతదయ చాలగ (రాగం: ) (తాళం : )

ప|| సకలభూతదయ చాలగ గలుగుట | ప్రకటించి దేహసంభవమైనఫలము ||

చ|| తలకొన్న ఫలవాంఛ దిగులకుండగ జిత్త- | మలవరించుట కర్మియైనఫలము |
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి | గలుగుట హరికృపగలిగినఫలము ||

చ|| ఎప్పుడు దిరువేంకటేశు సేవకుడౌట | తప్పక జీవుడు దానైన ఫలము |
కప్పినసౌఖ్యదుఃఖమ్ములు సమముగా | నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము ||

sakalaBUtadaya (Raagam: ) (Taalam: )

pa|| sakalaBUtadaya cAlaga galuguTa | prakaTiMci dEhasaMBavamainaPalamu ||

ca|| talakonna PalavAMCa digulakuMDaga jitta- | malavariMcuTa karmiyainaPalamu |
palukarmamulalOna brahmArpaNapubuddhi | galuguTa harikRupagaliginaPalamu ||

ca|| eppuDu diruvEMkaTESu sEvakuDauTa | tappaka jIvuDu dAnaina Palamu |
kappinasauKyaduHKammulu samamugA | noppuTa vij~jAnamodavina Palamu ||