sEviMturE yitani - సేవింతురే యితని

సేవింతురే యితని (రాగం: ) (తాళం : )

ప|| సేవింతురే యితని జెలగి పరులిట్లనే | కావించి మమ్ము నెక్కడిదైవ మితడు ||

చ|| పాఅలచవి యితడెరుగు పాల బవళింప గో- | పాలుడని నే మితని భజియించగా |
పాలుపడి తల్లిచనుబాలు సహితంబు నే- | కాలమును బాపె నెక్కడిదైవ మితడు ||

చ|| పుట్టింప దానె మరి పురుషోత్తముడు మంచి- | పుట్టు వొసగిననుచు బూజించగా |
పట్టుకొని మము దెచ్చి బలిమి బుట్టువులెల్ల | గట్టిపెట్టించె నెక్కడిదైవ మితడు ||

చ|| కర్మకర్తారుడని కడలేని పుణ్యముల- | కర్మఫలములు దనకు గైకొలువగా |
కర్మగతి దెచ్చి వేంకటవిభుడు మావుభయ- | కర్మముల జెరిచె నెక్కడిదైవ మితడు ||

sEviMturE yitani (Raagam: ) (Taalam: )

pa|| sEviMturE yitani jelagi paruliTlanE | kAviMci mammu nekkaDidaiva mitaDu ||

ca|| pAalacavi yitaDerugu pAla bavaLiMpa gO- | pAluDani nE mitani BajiyiMcagA |
pAlupaDi tallicanubAlu sahitaMbu nE- | kAlamunu bApe nekkaDidaiva mitaDu ||

ca|| puTTiMpa dAne mari puruShOttamuDu maMci- | puTTu vosaginanucu bUjiMcagA |
paTTukoni mamu decci balimi buTTuvulella | gaTTipeTTiMce nekkaDidaiva mitaDu ||

ca|| karmakartAruDani kaDalEni puNyamula- | karmaPalamulu danaku gaikoluvagA |
karmagati decci vEMkaTaviBuDu mAvuBaya- | karmamula jerice nekkaDidaiva mitaDu ||


sEvE bhaavE SrI - సేవే భావే శ్రీ

సేవే భావే శ్రీ (రాగం:సావేరి) (తాళం :ఆది )

సేవే భావే శ్రీ బృందం
శ్రీ వల్లభ చింతానందం

పటుకు తర్కనగు భంజన దీక్షం
కుటిల దురిత హర గుణ దక్షం
ఘటిత మహాఫల కల్పక వృక్షం
చటుల రామానుజ శమదమభిక్షం

కృధ్ధ మృషామత కుంఠన కుంతం
బౌధ్ధాంధకార భాస్వంతం
శుధ్ధ చేదమణి సుసరస్వంతం
సిధ్ధాంతీ కృత చిన్మయ కాంతం

చార్వాక గహన చండకుఠారం
సర్వాప శాస్త్ర శతధారం
నిర్వికార గుణ నిబడ శ్రీ వేంక
టోర్వీధర సంయోగ గభీరం

sEvE bhaavE SrI (Raagam:saavEri ) (Taalam:aadi )

sEvE bhaavE SrI bRmdam
SrI vallabha chintaanandam

paTuku tarkanagu bhanjana deeksham
kuTila durita hara guNa daksham
ghaTita mahaaphala kalpaka vRksham
chaTula raamaanuja Samadamabhiksham

kRdhdha mRshaamata kunThana kuntam
boudhdhaaandhakaara bhaaswamtam
Sudhdha chEdamaNi susaraswantam
sidhdhaantI kRta chinmaya kaamtam

chaarvaaka gahana chanDakuThaaram
sarvaapa Saastra Satadhaaram
nirvikaara guNa nibaDa SrI vEnka
TOrvIdhara saMyOga gabhIram


sEviMcarO janulAla - సేవించరో జనులాల

సేవించరో జనులాల (రాగం: ) (తాళం : )

ప|| సేవించరో జనులాల చేతులెత్తిమొక్కరో | వావిరి ప్రహ్లదునికి వరదుడు వీడే ||

చ|| జగన్నాథుడు వీడే సర్వరక్షకుడు వీడే | నిగమవేద్యుడైన నిత్యుడు వీడే |
సుగుణవంతుడు వీడే సర్వకాముడు వీడే | నగుమొగము సుగ్రీవనరసింహుడు వీడే ||

చ|| మరుజనకుడు వీడే మహిమాధికుడు వీడే | పరగ శ్రీలక్ష్మీపతియు వీడే |
సురులకేలిక వీడే శుభమూరుతి వీడే | నరసఖుడు సుగ్రీవనరసింహుడు వీడే ||

చ|| భువనాధిపతి వీడే పురుషోత్తముడు వీడే | వివిధప్రతాప కోవిదుడు వీడే |
ఇవల శ్రీవేంకటాద్రి నిరవైనతడు వీడే | సవమూర్తి సుగ్రీవనరసింహుడు వీడే ||

sEviMcarO janulAla (Raagam: ) (Taalam: )

pa|| sEviMcarO janulAla cEtulettimokkarO | vAviri prahladuniki varaduDu vIDE ||

ca|| jagannAthuDu vIDE sarvarakShakuDu vIDE | nigamavEdyuDaina nityuDu vIDE |
suguNavaMtuDu vIDE sarvakAmuDu vIDE | nagumogamu sugrIvanarasiMhuDu vIDE ||

ca|| marujanakuDu vIDE mahimAdhikuDu vIDE | paraga SrIlakShmIpatiyu vIDE |
surulakElika vIDE SuBamUruti vIDE | narasaKuDu sugrIvanarasiMhuDu vIDE ||

ca|| BuvanAdhipati vIDE puruShOttamuDu vIDE | vividhapratApa kOviduDu vIDE |
ivala SrIvEMkaTAdri niravainataDu vIDE | savamUrti sugrIvanarasiMhuDu vIDE ||


sEsa peTTavayyA - సేస పెట్టవయ్యా

సేస పెట్టవయ్యా (రాగం: ) (తాళం : )

ప|| సేస పెట్టవయ్యా యిట్టి చెలిమీదను | ఆసలమీకిద్దరికి నన్నిటా నమరును ||

చ|| గ్రక్కన జెట్టవట్టితే కంకణము వంటిదాపె | దక్కి వురమెక్కితేను తాళి వంటిది |
మొక్కలాన దొడ దొక్కితే మొలనూలు వంటిది | అక్కజమై నీకు నాపె నన్నిటా నమరును ||

చ|| చేరి విన్నవించితే చెవి పోగుల వంటిది | నీరతికి వద్దనుంటే నీడవంటిది |
కోరి పానుపుపై పెండ్లి కూతురు వంటిదేపొద్దు | ఆరీతి ఆపెకు నీకు నన్నిటా నమరును ||

చ|| పాదాల సేవ సేసితే పావకోళ్ళ వంటిది | సోదించి చూచితేను సొమ్ము వంటిది |
యీదెస శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి | ఆదిగొని నీకు నాపె కన్నిటా నమరును ||

sEsa peTTavayyA (Raagam: ) (Taalam: )

pa|| sEsa peTTavayyA yiTTi celimIdanu | AsalamIkiddariki nanniTA namarunu ||

ca|| grakkana jeTTavaTTitE kaMkaNamu vaMTidApe | dakki vuramekkitEnu tALi vaMTidi |
mokkalAna doDa dokkitE molanUlu vaMTidi | akkajamai nIku nApe nanniTA namarunu ||

ca|| cEri vinnaviMcitE cevi pOgula vaMTidi | nIratiki vaddanuMTE nIDavaMTidi |
kOri pAnupupai peMDli kUturu vaMTidEpoddu | ArIti Apeku nIku nanniTA namarunu ||

ca|| pAdAla sEva sEsitE pAvakOLLa vaMTidi | sOdiMci cUcitEnu sommu vaMTidi |
yIdesa SrIvEMkaTESa yiMti nIvu gUDitivi | Adigoni nIku nApe kanniTA namarunu ||


Saeyanivaa devvadu - సేయనివా డెవ్వడు

సేయనివా డెవ్వడు (రాగం: ) (తాళం : )

సేయనివా డెవ్వడు చిల్లరదోషాలు
యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే

దేవునినమ్మినయట్టిదేహియట యాతనికి
యీవల నెంతటిపాప మేమినేసును
భావించి యన్ని నేరాలు పరిహరించు నతడే
ఆవటించుసూర్యునికి నందకార మెదురా

పూజింపించుకొనువాడు భువనరక్షకుడట
తేజముతో దురితాలు తెంచగలేడా
రాజు సేసినయాణాజ్ఞ రాజుకంటే నెక్కుడా
వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు

చేతనాత్మకుడట శ్రీవేంకటేశ్వరుడు
జాతిలేనుజీవునికి స్వతంత్ర మేది
కాతరపుజన్మానకు గార్య కారణమేది
యేతున గరుడనికి ఎదురా పాములు

Saeyanivaa devvadu (Raagam: ) (Taalam: )

Saeyanivaa devvadu chillaradoshaalu
Yaeyeda jeevulajaada leesvarakalpitamae

Daevuninamminayattidaehiyata yaataniki
Yeevala nemtatipaapa maeminaesunu
Bhaavimchi yanni naeraalu pariharimchu natadae
Aavatimchusooryuniki namdakaara meduraa

Poojimpimchukonuvaadu bhuvanarakshakudata
Taejamuto duritaalu temchagalaedaa
Raaju saesinayaanaaj~na raajukamtae nekkudaa
Vojato vajraayudhaana kopunaa parvataalu

Chaetanaatmakudata sreevaemkataesvarudu
Jaatilaenujeevuniki svatamtra maedi
Kaatarapujanmaanaku gaarya kaaranamaedi
Yaetuna garudaniki eduraa paamulu


sAsamuKA naDe - సాసముఖా నడె

సాసముఖా నడె (రాగం: ) (తాళం : )

ప|| సాసముఖా నడె సాసముఖా | ఆసలసరివారము అవధారు దేవా ||

చ|| మత్తిల్లి జీవుడనేటి మహిమగలుగురాజు | చిత్తమనియెడి పెద్దసింహాసనంబెక్కి |
బత్తితో బంచేంద్రియపుపరివారము గొలువ | చిత్తజుపారుపత్యము సేసీ నిదివో ||

చ|| కడుమదించి నహంకారమనేయేనుగపై | యెడనెడ నెక్కి తోలీ నిదె జీవుడనురాజు |
బడిబడి గర్మముల పౌజులు దీర్చరో | వెడమాయపట్టపువీధుల నేగీని ||

చ|| మించినసంసారమనేమేడలో నేకాంతమున | పొంచి జీవుడనేరాజు భోగము భోగించగా |
అంచెల శ్రీవేంకటేశుడనేదేవుడు వచ్చి | మంచితనమున దానె మన్నించె నదివో ||

sAsamuKA naDe (Raagam: ) (Taalam: )

pa|| sAsamuKA naDe sAsamuKA | AsalasarivAramu avadhAru dEvA ||

ca|| mattilli jIvuDanETi mahimagalugurAju | cittamaniyeDi peddasiMhAsanaMbekki |
battitO baMcEMdriyapuparivAramu goluva | cittajupArupatyamu sEsI nidivO ||

ca|| kaDumadiMci nahaMkAramanEyEnugapai | yeDaneDa nekki tOlI nide jIvuDanurAju |
baDibaDi garmamula paujulu dIrcarO | veDamAyapaTTapuvIdhula nEgIni ||

ca|| miMcinasaMsAramanEmEDalO nEkAMtamuna | poMci jIvuDanErAju BOgamu BOgiMcagA |
aMcela SrIvEMkaTESuDanEdEvuDu vacci | maMcitanamuna dAne manniMce nadivO ||


sAre ninnalamElmaMga - సారె నిన్నలమేల్మంగ

సారె నిన్నలమేల్మంగ (రాగం: ) (తాళం : )

ప|| సారె నిన్నలమేల్మంగ జవ్వనమునను | చేరి యవధరింతు విచ్చేవయ్య జాజర ||

చ|| వసంతకాలము వచ్చె వనితమోవి ఇగిర్చె | కొనరె యెలుగులను కోవిలగూసె |
ముసరీ జూపుల తేంట్లు మోతుగై వలపు పూచె | రసికత నాడుదువు రావయ్య జాజర ||

చ|| పున్నమ వెన్నెలగాసె కన్నుగలువలు విచ్చె | పిన్నలై జెమటలను జాలువారె బన్నీరు ||
సన్నపు జెమటలను జలువారె బన్నీరు | చెన్నుమీర నాడుదు విచ్చేయవయ్య జాజర ||

చ|| మరుడు విల్లందుకొనె మచ్చికలు గూడజేసె | పొరిపొరి సిగ్గులచే పుప్పొడిరాలె |
ఇరవై శ్రీవేంకటేశ యీకె నిట్టె గూడుతివి | సరుగ మీమీద మీరె చల్లరయ్య జాజర ||

sAre ninnalamElmaMga (Raagam: ) (Taalam: )

pa|| sAre ninnalamElmaMga javvanamunanu | cEri yavadhariMtu viccEvayya jAjara ||

ca|| vasaMtakAlamu vacce vanitamOvi igirce | konare yelugulanu kOvilagUse |
musarI jUpula tEMTlu mOtugai valapu pUce | rasikata nADuduvu rAvayya jAjara ||

ca|| punnama vennelagAse kannugaluvalu vicce | pinnalai jemaTalanu jAluvAre bannIru ||
sannapu jemaTalanu jaluvAre bannIru | cennumIra nADudu viccEyavayya jAjara ||

ca|| maruDu villaMdukone maccikalu gUDajEse | poripori siggulacE puppoDirAle |
iravai SrIvEMkaTESa yIke niTTe gUDutivi | saruga mImIda mIre callarayya jAjara ||