bhaaavamulona baahyamunandunu - భావములోన బాహ్యమునందును

భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
...
హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
...
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
...
అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా


Sung by:Nedunuri Krishna Murthy
Get this widget | Track details | eSnips Social DNA


Get this widget | Track details | eSnips Social DNA