Posts

Showing posts from July, 2009

ninnu gUDina vibhuni niluvella

Image
నిన్ను గూడిన విభుని నిలువెల్ల సొంపాయ నిన్నియును నొనగూడె నింతలోపలనె సొలపు నీ కడగంటి చూపు హృదయము గాడి లలినితడు శ్రీవత్సలాంఛనుండాయ వెలది నిను బెడ బాసి విరహంపు మెయికాక వలన నీతడు నీల వర్ణుడై నాడు అదన నీ చనుగుబ్బలను చక్రముల చేత పదిల పరపుచు చక్రపాణియైనాడు సుదతి నీ దేహమున సొబగు కుంకుమపుత- లెదిగి పీతాంబరంబీతనికి నాయ ఆలింగనాపేక్ష ననయంబు నినుగూడ లోలుడటుగాన నాలుగు చేతులాయ శ్రీలలిత మూర్తియగు శ్రీవేంకటేశ్వరుడు పాలించె నిను నీకె బరితోషమాయ ninnu gUDina vibhuni niluvella soMpAya ninniyunu nonagUDe niMtalOpalane solapu nI kaDagaMTi chUpu hRdayamu gADi lalinitaDu SrIvatsalAMChanuMDAya veladi ninu beDa bAsi virahaMpu meyikAka valana nItaDu nIla varNuDai nADu adana nI chanugubbalanu chakramula chEta padila parapuchu chakrapANiyainADu sudati nI dEhamuna sobagu kuMkumaputa- ledigi pItAMbaraMbItaniki nAya AliMganApEksha nanayaMbu ninugUDa lOluDaTugAna nAlugu chEtulAya SrIlalita mUrtiyagu SrIvEMkaTESwaruDu pAliMche ninu nIke baritOshamAya Sung by:Balakrishna Prasad Get this widget | Track details | ...

nAnAdikkula narulellA

Image
ప|| నానాదిక్కుల నరులెల్లా | వానలలోననె వత్తురు గదలి || చ|| సతులు సుతులు బరుసరులు బాంధవులు | హితులు గొలువగా నిందరును | శతసహస్రయోజనవాసులు సు- | వ్రతములతోడనె వత్తురు గదలి || చ|| ముడుపులు జాళెలు మొగి దలమూటలు | కడలేనిధనము గాంతలును | కడుమంచిమణులు కరులు దురగములు | వడిగొని చెలగుచు వత్తురు గదలి || చ|| మగుటవర్ధనులు మండలేశ్వరులు | జగదేకపతులు జతురులును | తగువేంకటపతి దరుశింపగ బహు- | వగలసంపదల వత్తురు గదలి || pa|| nAnAdikkula narulellA | vAnalalOnane vatturu gadali || ca|| satulu sutulu barusarulu bAMdhavulu | hitulu goluvagA niMdarunu | SatasahasrayOjanavAsulu su- | vratamulatODane vatturu gadali || ca|| muDupulu jALelu mogi dalamUTalu | kaDalEnidhanamu gAMtalunu | kaDumaMcimaNulu karulu duragamulu | vaDigoni celagucu vatturu gadali || ca|| maguTavardhanulu maMDalESvarulu | jagadEkapatulu jaturulunu | taguvEMkaTapati daruSiMpaga bahu- | vagalasaMpadala vatturu gadali || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

namO nArAyaNAya namaH

ప|| నమో నారాయణాయ నమః | సమధికానందాయ సర్వేశ్వరాయ || చ|| ధరణీసతీఘన స్తనశైలపరిరంభ- | పరిమళ శ్రమజల ప్రమదాయ | సరసిజ నివాసినీ సరసప్రణామయుత- | చరణాయతే నమో సకలాత్మకాయ || చ|| సత్యభామాముఖాంచన పత్రవల్లికా- | నిత్య రచనక్రియా నిపుణాయ | కాత్యాయనీ స్తోత్రకామాయ తే నమో | ప్రత్యక్ష నిజపరబ్రహ్మ రూపాయ || చ|| దేవతాధిప మకుటదివ్య రత్నాంశుసం- | భావితామల పాదపంకజాయ | కైవల్య కామినీకాంతాయ తే నమో | శ్రీవేంకటాచల శ్రీనివాసాయ || pa|| namO nArAyaNAya namaH | samadhikAnaMdAya sarvESvarAya || ca|| dharaNIsatIGana stanaSailapariraMBa- | parimaLa Sramajala pramadAya | sarasija nivAsinI sarasapraNAmayuta- | caraNAyatE namO sakalAtmakAya || ca|| satyaBAmAmuKAMcana patravallikA- | nitya racanakriyA nipuNAya | kAtyAyanI stOtrakAmAya tE namO | pratyakSha nijaparabrahma rUpAya || ca|| dEvatAdhipa makuTadivya ratnAMSusaM- | BAvitAmala pAdapaMkajAya | kaivalya kAminIkAMtAya tE namO | SrIvEMkaTAcala SrInivAsAya || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

nIvEmi sEtuvayya nIvu dayAnidhi vaMduvu

ప|| నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు | భావించలేనివారి పాపమింతే కాని || చ|| పరమపద మొసగి పాపమడచేనని | చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె | నిరతిని భూమిలోన నీవల్ల దప్పులేదు | పరగ నమ్మనివారి పాపమింతే కాని || చ|| నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని | యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత | దాపుగా నీవల్ల నింక దప్పులేదు యెంచిచూచి | పైపై నమ్మినవారి పాపమింతే కాని || చ|| బంతి బురాణములను భక్తసులభుడ నని | అంతరాత్మ నీమాట ఆడితివి తొలుతనే | ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు | పంతాన నమ్మినవారి పాపమింతే కాని || pa|| nIvEmi sEtuvayya nIvu dayAnidhi vaMduvu | BAviMcalEnivAri pApamiMtE kAni || ca|| paramapada mosagi pApamaDacEnani | caramaSlOkamunaMdu cATitivi tolutane | niratini BUmilOna nIvalla dappulEdu | paraga nammanivAri pApamiMtE kAni || ca|| nIpAdamulaku nAku neyyamaina laMkeni | yEpuna dvayArthamuna niyyakoMTivi toluta | dApugA nIvalla niMka dappulEdu yeMcicUci | paipai namminavAri pApamiMtE kAni || ca|| baMti burANamulanu BaktasulaBuDa nani | aMtarAtma nImATa ADitivi tolutanE | iMtaTa SrIvEMkaTESa y...

namO namO daSarathanaMdana rAma

Image
నమో నమో దశరథనందన రామ కమనీయయాగభాగకర్త రామ కాకుత్థ్సకుల రామ కౌసల్యాసుత రామ శ్రీకరగుణోన్నత శ్రీరామ కాకాసురవైరి రామ కౌశికవత్సల రామ భీకర తాటకాంతకబిరుద రామ వారిధిబంధన రామ వాలిహరణ రామ చారుహరకోదండభంజన రామ ధారుణీజపతి రామ దశకంఠహర రామ సారవిభీషణాభీషేచన రామ అమరపాలిత రామ అయోధ్యాపతి రామ సమరకోవిద రామ సర్వజ్ఞ రామ విమల రామ శ్రీవేంకటగిరి రామ రమణ శరణాగతరక్షక రామ namO namO daSarathanaMdana rAma kamanIyayAgabhAgakarta rAma kAkutthsakula rAma kausalyAsuta rAma SrIkaraguNOnnata SrIrAma kAkAsuravairi rAma kauSikavatsala rAma bhIkara tATakAMtakabiruda rAma vAridhibaMdhana rAma vAliharaNa rAma chAruharakOdaMDabhaMjana rAma dhAruNIjapati rAma daSakaMThahara rAma sAravibhIshaNAbhIshEchana rAma amarapAlita rAma ayOdhyApati rAma samarakOvida rAma sarwaj~na rAma vimala rAma SrIvEMkaTagiri rAma ramaNa SaraNAgatarakshaka rAma Sung by:Vani Jayaram Get this widget | Track details | eSnips Social DNA

nArAyaNA ninu nammina nAkunu

Image
నారాయణా నిను నమ్మిన నాకును మేరతో నీపాదమే గతి గలిగె చింతా జలధుల జిక్కిన దాటించ నంతట నీపాద మదె తేప కాంతల మోహపు కట్లు తెంచగ పంతపు నీపాద పరశువు గలిగె అతిదురితపంక మందిన కడుగగ మితి నీపాదమే మిన్నేరు రతి కర్మజ్ఞులు రాజిన నార్చగ వ్రతము నీపాదమే వానయై నలిచె జిగినజ్ఞానపు చీకటి వాయగ తగు నీపాదము దయపు రవి నగు శ్రీవేంకటనాథ నన్నేలగ మిగులగ నీపాదమే శరణంబు nArAyaNA ninu nammina nAkunu mEratO nIpAdamE gati galige chiMtA jaladhula jikkina dATiMcha naMtaTa nIpAda made tEpa kAMtala mOhapu kaTlu teMchaga paMtapu nIpAda paraSuvu galige atiduritapaMka maMdina kaDugaga miti nIpAdamE minnEru rati karmaj~nulu rAjina nArchaga vratamu nIpAdamE vAnayai naliche jiginaj~nAnapu chIkaTi vAyaga tagu nIpAdamu dayapu ravi nagu SrIvEMkaTanAtha nannElaga migulaga nIpAdamE SaraNaMbu Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA Syng by:Dr Pasupati Get this widget | Track details | eSnips Social DNA

nelata sobagulivi nI sommu

Image
నెలత సొబగులివి నీ సొమ్ము కలసి మెలసి యిటు గైకొనవయ్యా వేమరు నవ్వుల వెన్నెల గాసీ రామ కడకు నిటు రావయ్యా దోమటిపలుకుల తొరిగీ తేనెలు ఆమని కాలము అవధరించవయ్యా వలపుల చెమటల వానలు గురిసి సొలవక యీకెను జూడవయ్యా పెలుచు కుచంబుల పిందెలు వొడమెను అలరిన కానుక లందుకోవయ్యా గములై మెయి మరుకళలు దొల(కీ తమితో కౌగిట తగులవయ్యా జమళి శ్రీవేంకటేశ్వర సతి గూడితివి అమరె నీకు మేలౌనయ్యా nelata sobagulivi nI sommu kalasi melasi yiTu gaikonavayyA vEmaru navvula vennela gAsI rAma kaDaku niTu rAvayyA dOmaTipalukula torigI tEnelu Amani kAlamu avadhariMchavayyA valapula chemaTala vAnalu gurisi solavaka yIkenu jUDavayyA peluchu kuchaMbula piMdelu voDamenu alarina kAnuka laMdukOvayyA gamulai meyi marukaLalu dola(kI tamitO kaugiTa tagulavayyA jamaLi SrIvEMkaTESwara sati gUDitivi amare nIku mElavunayyA Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

nIvE mAkudiku ninnE talatumu

Image
నీవే మాకుదికు నిన్నే తలతుము | కావుమా నేరమెంచక కరుణానిధీ || నెట్టన సూర్యు లోని నెలకొన్న తేజమా | గట్టిగా చంద్రుని లోని కాంతి పుంజమా | పుట్టి రక్ష్మించే యజ్ఞపురుషుని ప్రకాశమా | వొట్టుక దేవతలలో నుండిన శక్తి || సిరులు మించినయట్టి జీవులలో ప్రాణమా | గరిమ వేదములలో గల అర్థమా | పరమపదమునందు పాదుకొన్న బ్రహ్మమా |చరాచరములలో సర్వాధారమా || జగములో వెలసేటి సంసారసుఖమా | నిగిడిన మంత్రముల నిజమహిమా | మిగుల శ్రీవేంకటాద్రి మీద దైవమా |ముగురు వెల్పుల లోని మూలకందమా || nIvE mAkudiku ninnE talatumu - kAvumA nErameMchaka karuNAnidhI neTTana sUryu lOni nelakonna tEjamA - gaTTigA chaMdruni lOni kAMti puMjamA puTTi rakshmiMchE yaj~napurushuni prakASamA - voTTuka dEvatalalO nuMDina Sakti sirulu miMchinayaTTi jIvulalO prANamA- garima vEdamulalO gala arthamA paramapadamunaMdu pAdukonna brahmamA - charAcharamulalO sarwAdhAramA jagamulO velasETi saMsArasukhamA- nigiDina maMtramula nijamahimA migula SrIvEMkaTAdri mIda daivamA -muguru velpula lOni mUlakaMdamA Sung by:Balakrishna Prasad Get this widget | Track detai...

nIvaMTi daivAlu vErI nikhilalOkamulaMdu

Image
నీవంటి దైవాలు వేరీ నిఖిలలోకములందు యీవల నావల ఎందు నెంచి చూడ మాకును తగిలి నీమోము చక్కదనమెంచి చూచితిమా తగిన మరుని గన్న తండ్రివి నీవు అగపడ్డ నీగుణములవి యెంచి చూచితిమా నిగిడి కళ్యాణగుణనిధివనీ శ్రుతులు గుట్టు నీ పెద్దతనము కులమెంఛి చూచితిమా అట్టె బ్రహ్మ కులము నీయందు బుట్టెను దట్టపు నీ పనులవర్తన మెంచి చూచితిమా ముట్టి సర్వరక్షకత్వమున వెలసితివి బెడిదమైన నీబిరుదెంచి చీచితిమా వడి శరణాగతవత్సలు(డవు కడగి శ్రీ వేంకటేశ కంటిమి నీ మహిమలు బడి నిన్నే సేవించి బ్రతికిమిదివో nIvaMTi daivAlu vErI nikhilalOkamulaMdu yIvala nAvala eMdu neMchi chUDa mAkunu tagili nImOmu chakkadanameMchi chUchitimA tagina maruni ganna taMDrivi nIvu agapaDDa nIguNamulavi yeMchi chUchitimA nigiDi kaLyANaguNanidhivanI Srutulu guTTu nI peddatanamu kulameMChi chUchitimA aTTe brahma kulamu nIyaMdu buTTenu daTTapu nI panulavartana meMchi chUchitimA muTTi sarwarakshakatwamuna velasitivi beDidamaina nIbirudeMchi chIchitimA vaDi SaraNAgatavatsalu(Davu kaDagi SrI vEMkaTESa kaMTimi nI mahimalu baDi ninnE sEviMchi bratikimidivO Sung by:Balakri...

nIkathAmRtamu niratasEvana nAku

ప|| నీకథామృతము నిరతసేవన నాకు | చేకొనుట సకల సంసేవనంబటుగాన | చ|| ఇదియే మంత్రరాజము నాకు నే ప్రొద్దు | ఇదియే వేద సంహిత పాఠము | ఇదియె బహుశాస్త్ర మెల్ల చదువుటనాకు | ఇదియె సంధ్య నాకిదియె జపమటుగాన || చ|| ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు | ఇదియె దుఃఖవిరహిత మార్గము | ఇదియె భవ రోగరహిత భేషజమునాకు | ఇదియె ఉపనిషద్వ్యాక్య పద్ధతి || చ|| ఇదియె దాన ఫలమీ జాలినది నాకు | ఇదియె తలప పరహిత మార్గము | ఇదియె తిరువేంకటేశ నీసంస్మరణ- | మిదియె ఇదియె యిన్నియును నటుగాన || pa|| nIkathAmRtamu niratasEvana nAku | cEkonuTa sakala saMsEvanaMbaTugAna | ca|| idiyE maMtrarAjamu nAku nE proddu | idiyE vEda saMhita pAThamu | idiye bahuSAstra mella caduvuTanAku | idiye saMdhya nAkidiye japamaTugAna || ca|| idiye brahmavidyOpadESamu nAku | idiye du@hKavirahita mArgamu | idiye Bava rOgarahita BEShajamunAku | idiye upaniShadvyAkya paddhati || ca|| idiye dAna PalamI jAlinadi nAku | idiye talapa parahita mArgamu | idiye tiruvEMkaTESa nIsaMsmaraNa- | midiye idiye yinniyunu naTugAna || Sung by:Balakrishna Prasad

nammitijummI vO manasA

నమ్మితిజుమ్మీ వో మనసా నాకే హితవయి మెలంగుమీ ముమ్మాటికి నే( జెప్పితి(జుమ్మీ మురహరునామమే జపించుమీ తలచకుమీ యితరధర్మములు తత్వజ్ఞానము మరువకుమీ కలగకుమీ యేపనికైనను కడుశాంతంబుననుండుమీ వలవకుమీ వనితలకెప్పుడు వైరాగ్యంబున నుండుమీ కొలువకుమీ యితరదేవతల గోవిందునే భజించుమీ కోరకుమీ దేహభోగములు గొనకొని తపమే చేకొనుమీ మీరకుమీ గురువులయానతి మెఱయ పురాణములే వినుమీ చేరకుమీ దుర్జనసంగతి జితేంద్రియుడవై నిలువుమీ దూరకుమీ కర్మఫలంబును ధ్రువవరదునినే నుతించుమీ వెఱవకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుడవగుమీ మఱవకుమీ యలమేల్మంగకుమగడగు శ్రీవేంకటపతిని కెఱలకుమీ మాయారతులను కేవలసాత్వికుడవుగమ్మీ తొఱలకుమీ నేరములను సింధు రక్షకునినే సేవించుమీ nammitijummI vO manasA nAkE hitavayi melaMgumI mummATiki nE( jeppiti(jummI muraharunAmamE japiMchumI talachakumI yitaradharmamulu tatwaj~nAnamu maruvakumI kalagakumI yEpanikainanu kaDuSAMtaMbunanuMDumI valavakumI vanitalakeppuDu vairAgyaMbuna nuMDumI koluvakumI yitaradEvatala gOviMdunE bhajiMchumI kOrakumI dEhabhOgamulu gonakoni tapamE chEkonumI mIrakumI guruvulayAnati me~raya purANamulE vinumI c...

nityasukhAnaMda mide nI dAsyamu

Image
నిత్యసుఖానంద మిదె నీ దాస్యము సత్యములేని సుఖాలు చాలు చాలు నయ్యా కన్ను చూపుల సుఖము కడు నీ చక్కని రూపె యెన్నగ వీనులసుఖమిదె నీపేరు పన్ని నాలుకసుఖము పాదపు నీతులసి వున్న సుఖముల తెరు వొడబడమయ్యా తనువుతోడి సుఖము తగు నీకైంకర్యము మనసులో సుఖము నీ మంచి ధ్యానము పనివి యూర్పుసుఖము పాదపద్మమువాసన యెనయనిపెర సుఖమేమి సేసేనయ్యా పుట్టుగు కెల్ల సుఖము పొల్లులేని నీభక్తి తొట్టి కాళ్ళ సుఖము పాతురలాడుట జట్టి శ్రీవేంకటేశ మాచనవోలిచెన్నుడవై వొట్టుకొని మమ్మేలితివోహో మేలయ్యా nityasukhAnaMda mide nI dAsyamu satyamulEni sukhAlu chAlu chAlu nayyA kannu chUpula sukhamu kaDu nI chakkani rUpe yennaga vInulasukhamide nIpEru panni nAlukasukhamu pAdapu nItulasi vunna sukhamula teru voDabaDamayyA tanuvutODi sukhamu tagu nIkaiMkaryamu manasulO sukhamu nI maMchi dhyAnamu panivi yUrpusukhamu pAdapadmamuvAsana yenayanipera sukhamEmi sEsEnayyA puTTugu kella sukhamu pollulEni nIbhakti toTTi kALLa sukhamu pAturalADuTa jaTTi SrIvEMkaTESa mAchanavOlichennuDavai voTTukoni mammElitivOhO mElayyA Sung by:Dwaram Lakshmi

nAkunAkE siggayyIni nannu

నాకునాకే సిగ్గయ్యీని నన్ను జూచుకుంటేను చేకొని నీవే మన్నించ చెయ్యొగ్గేగాని సేయరాని పాపములు సేసివచ్చి యేనోర నాయెడ నిన్ను వరములడిగేను కాయముతో యింద్రియకింకరుడనై యేమని చేయూర నీబంటనని చెప్పుకొనేను వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి యేగతి కొసరి నీపై నేట వేసేము ఆగడపు బంగారుకాతుమనేన (య) మ్ముకొని భోగపు మోక్షము నెట్టు వొందించు మనేము కలుపుట్టుగుబతుకు కాంతలకు వెచ్చపెట్టి వలసి నేడెట్టు నీవార మయ్యేము నెలవై శ్రీవేంకటేశ నీవే కరుణించితివి బలిమి సేసి నీకెట్టు భారము వేసేము nAkunAkE siggayyIni nannu jUchukuMTEnu chEkoni nIvE manniMcha cheyyoggEgAni sEyarAni pApamulu sEsivachchi yEnOra nAyeDa ninnu varamulaDigEnu kAyamutO yiMdriyakiMkaruDanai yEmani chEyUra nIbaMTanani cheppukonEnu vEgilEchi saMsAravidhulakE voDigaTTi yEgati kosari nIpai nETa vEsEmu AgaDapu baMgArukAtumanEna (ya) mmukoni bhOgapu mOkshamu neTTu voMdiMchu manEmu kalupuTTugubatuku kAMtalaku vechchapeTTi valasi nEDeTTu nIvAra mayyEmu nelavai SrIvEMkaTESa nIvE karuNiMchitivi balimi sEsi nIkeTTu bhAramu vEsEmu Sung by:Dwaram Lakshmi

nIvunna chOTanE vaikuMThamu

నీవున్న చోటనే వైకుంఠము నెరసులు మరి చొరరాదు పావన మది చెప్పేది వేదము పాటింపగవలెను దేవుడా నా దేహమె నీకు తిరుమలగిరి పట్టణము భావింప హృదయకమలమె బంగారపు మేడ వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు శ్రీవల్లభా యిందులో నితరచింతలు వెట్టకువే పరమాత్మ నా మనసే బహురత్నంబుల మంచము గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పఱపు తిరముగ నుజ్ఞానదీప మున్నది దివ్యభోగమె ఆనందము మరిగితి నీవున్నయెడల నిక మాయల గప్పకువే ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకు పతివి ఘనుడవు నన్నేలితి విక కర్మము లెంచకువే nIvunna chOTanE vaikuMThamu nerasulu mari chorarAdu pAvana madi cheppEdi vEdamu pATiMpagavalenu dEvuDA nA dEhame nIku tirumalagiri paTTaNamu bhAviMpa hRdayakamalame baMgArapu mEDa vEvElu nA vij~nAnAdulu vEDukaparichArakulu SrIvallabhA yiMdulO nitarachiMtalu veTTakuvE paramAtma nA manasE bahuratnaMbula maMchamu garimala nA yAtmE nIku kaDu mettani pa~rapu tiramuga nuj~nAnadIpa munnadi divyabhOgame AnaMdamu marigiti nIvunnayeDala nika mAyala gappakuvE nanich...

nIvanaga nokachOTa nilichivuMDuTalEdu

నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు నీవనుచు కనుగొన్న నిజమెల్లనీవే తనయాత్మవలెనె భూతముల యాతుమలెల్ల - ననయంబు కనుగొన్న యతడే నీవు తనుగన్నతల్లిగా తగని తర కాంతలను అనఘుడై మదిజూచు నతడే నీవు సతత సత్య వ్రతాచార సంపన్నుడై అతిశయంబుగ మెలగునతడే నీవు ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు హత కాముకుడైన యతడే నీవు మోదమున సుఃదుఃఖముల నొక్కరీతిగా నాదరింపుచునున్న యతడే నీవు వేదోక్తమతియైన వేంకటాచలనాథ ఆదియును నంత్యంబు నంతయును నీవే nIvanaga nokachOTa nilichivuMDuTalEdu nIvanuchu kanugonna nijamellanIvE tanayAtmavalene bhUtamula yAtumalella - nanayaMbu kanugonna yataDE nIvu tanugannatalligA tagani tara kAMtalanu anaghuDai madijUchu nataDE nIvu satata satya vratAchAra saMpannuDai atiSayaMbuga melagunataDE nIvu dhRtidUli dravyaMbu tRNamugA bhAviMchu hata kAmukuDaina yataDE nIvu mOdamuna su@hdu@hkhamula nokkarItigA nAdariMpuchununna yataDE nIvu vEdOktamatiyaina vEMkaTAchalanAtha Adiyunu naMtyaMbu naMtayunu nIvE

naMdakadhara naMdagOpanaMdana

Image
నందకధర నందగోపనందన కందర్పజనక కరుణాత్మన్ ముకుంద కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ శుకవరద సవితృ సుధాంసులోచన ప్రకటవిభవ నమో పరమాత్మన్ ధ్రువపాంచాలీ స్తుతివత్సల మా ధవ మధుసూదన ధరణిధరా భువనత్రయపరితోషనతత్పర నవనీతప్రియ నాదాత్మన్ శ్రీమన్ వేంకట శిఖర నివాస మ హామహిమన్ నిఖిలాండపతే కామిత ఫల భోగప్రదతే నమో స్వామిన్ భూమన్ సర్వాత్మన్ naMdakadhara naMdagOpanaMdana kaMdarpajanaka karuNAtman mukuMda kESava murahara sakalAdhipa paramESwara dEvESa Sukavarada savitR sudhAMsulOchana prakaTavibhava namO paramAtman dhruvapAMchAlI stutivatsala mA dhava madhusUdana dharaNidharA bhuvanatrayaparitOShanatatpara navanItapriya nAdAtman SrIman vEMkaTa Sikhara nivAsa ma hAmahiman nikhilAMDapatE kAmita phala bhOgapradatE namO swAmin bhUman sarwAtman

nannu ninnu neMchukOvO nArAyaNA

Image
నన్ను నిన్ను నెంచుకోవో నారాయణా అన్నియు నీ చేతినే అదివో నారాయణా నా మన సెరుగవా నారాయణా నేడు నాములాయె వయసులు నారాయణా నామధారికపు మొక్కు నారాయణా ఆముకొని నీ ప్రియము లందునే నారాయణా నగుతా నే నంటినింతే నారాయణా యిదె నగ రెఱిగిన పని నారాయణా నగవులు మాకు చాలు నారాయణా అగడు సేయకు మికను అప్పటి నారాయణా ననలు నీ వినయాలు నారాయణా , మంచి ననుపంటి మిదివో నారాయణా ఘనుడ శ్రీవేంకటాద్రిఁ గలసితి విట్లైనను అనుమాన మెల్లా బాసెను అందు నారాయణా nannu ninnu neMchukOvO nArAyaNA anniyu nI chEtinE adivO nArAyaNA nA mana serugavA nArAyaNA nEDu nAmulAye vayasulu nArAyaNA nAmadhArikapu mokku nArAyaNA Amukoni nI priyamu laMdunE nArAyaNA nagutA nE naMTiniMtE nArAyaNA yide naga re~rigina pani nArAyaNA nagavulu mAku chAlu nArAyaNA agaDu sEyaku mikanu appaTi nArAyaNA nanalu nI vinayAlu nArAyaNA , maMchi nanupaMTi midivO nArAyaNA ghanuDa SrIvEMkaTAdri@M galasiti viTlainanu anumAna mellA bAsenu aMdu nArAyaNA

namAmyahaM mAnavasiMhaM

Image
ప|| నమామ్యహం మానవసింహం | ప్రమదాంక మహోబల నరసింహం || చ|| దానవదైత్య విదారణ సింహం | నానాయుధకర నరసింహం | భూనభోంతరాళ పూరిత సింహం | ఆనన వహ్నిలయాంతక సింహం || చ|| ప్రళయ నృసింహం బహుముఖ సింహం | సలలిత గరుడాచల సింహం | కులిశ నఖరముఖ ఘోషిత సింహం | తిలకిత బహు రవిదీపిత సింహం || చ|| శాంత నృసింహం శౌర్య నృసింహం | సంతత కరుణా జయసింహం | కాంతం శ్రీవేంకటగిరి సింహం | చింతిత ఘన సంసిద్ధ నృసింహం || pa|| namAmyahaM mAnavasiMhaM | pramadAMka mahObala narasiMhaM || ca|| dAnavadaitya vidAraNa siMhaM | nAnAyudhakara narasiMhaM | BUnaBOMtarALa pUrita siMhaM | Anana vahnilayAMtaka siMhaM || ca|| praLaya nRusiMhaM bahumuKa siMhaM | salalita garuDAcala siMhaM | kuliSa naKaramuKa GOShita siMhaM | tilakita bahu ravidIpita siMhaM || ca|| SAMta nRusiMhaM Saurya nRusiMhaM | saMtata karuNA jayasiMhaM | kAMtaM SrIvEMkaTagiri siMhaM | ciMtita Gana saMsiddha nRusiMhaM || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

nIdusEtalaku nEvE dishTamu

Image
నీదుసేతలకు నీవే దిష్టము మేదిని నేమెల్లా మెచ్చితిమయ్యా యీడగు కాంతలు యింటనే వుండగ వాడల సతులకు వలచితివి వోడక క్షీరాబ్ధినుండి రేపల్లెను తోడనే వెన్నలు దొంగిలినట్టు వుంగిటి వాసన లొడలనే వుండగ అంగడిగందము లడిగితివి బంగారుపీతాంబరము నీకుండగ చెంగటి కోకలు చేకొన్నట్టు ఆస కౌస్తుభము అక్కున నుండగ శ్రీసతి నురమున జేర్చితివి సేస శ్రీవేంకటశిఖరము(?) యుండగ రాసికుచగిరుల రమించినట్లు nIdusEtalaku nEvE dishTamu mEdini nEmellA mechchitimayyA yIDagu kAMtalu yiMTanE vuMDaga vADala satulaku valachitivi vODaka kshIrAbdhinuMDi rEpallenu tODanE vennalu doMgilinaTTu vuMgiTi vAsana loDalanE vuMDaga aMgaDigaMdamu laDigitivi baMgArupItAMbaramu nIkuMDaga cheMgaTi kOkalu chEkonnaTTu Asa kaustubhamu akkuna nuMDaga SrIsati nuramuna jErchitivi sEsa SrIvEMkaTaSikharamu(?) yuMDaga rAsikuchagirula ramiMchinaTlu Sung by:TP Chakrapani Get this widget | Track details | eSnips Social DNA

nAnArUpadharuDu nArAyaNuDu vIDE

Image
నానారూపధరుడు నారాయణుడు వీడే పూనినవుపములెల్లా బొసగెనితనికి గరిమ నేరులు వానకాలమునఁ బెనగొని సొరిది సముద్రము చొచ్చినయట్లు పురుషసూక్తమున విప్రులు సేసేమజ్జనము అరుదుగ పన్నీరెల్లా నమరే నీ హరికి అట్టే వెల్లమొయిళ్ళు ఆకసాన నిండినట్టు గట్టిగా మేన నిండెను కప్పురకాపు వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు తట్టుపుణుగమరెను దైవాలరాయనికి నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు తెలివి సొమ్ములపెట్టె దెరచినట్టు అలమేలుమంగ వురమున నెలకొనెనిదె చెలరేగి శృంగారాల శ్రీవేంకుటేశునికి nAnArUpadharuDu nArAyaNuDu vIDE pUninavupamulellA bosagenitaniki garima nErulu vAnakAlamuna@M benagoni soridi samudramu chochchinayaTlu purushasUktamuna viprulu sEsEmajjanamu aruduga pannIrellA namarE nI hariki aTTE vellamoyiLLu AkasAna niMDinaTTu gaTTigA mEna niMDenu kappurakApu voTTi tana vishNumAya voDalipai vAlinaTTu taTTupuNugamarenu daivAlarAyaniki niluvuna saMpadalu nilichi rUpainaTTu telivi sommulapeTTe derachinaTTu alamElumaMga vuramuna nelakonenide chelarEgi SRMgArAla SrIvEMkuTESuniki Sung by:Vedavati Prabhakar

muddugaarae yaSOda muMgiTa

Image
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మితి గోవర్థనపు గోమేధికము సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము గతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము బాలుని వలె తిరిగే పద్మనాభుడు muddugaarae yaSOda muMgiTa mutyamu veeDu tiddaraani mahimala daevakee sutuDu aMtaniMta golletala arachaeti maaNikyamu paMtamaaDae kaMsuni paali vajramu kaaMtula mooDu lOkaala garuDa pachcha poosa cheMtala maalOnunna chinni kRshnuDu ratikaeLi rukmiNiki raMgumOvi pagaDamu miti gOvarthanapu gOmaedhikamu satamai SaMkhuchakraala saMdula vaiDhooryamu gatiyai mammu gaachae(Ti)kamalaakshuDu kaaLiMguni talalapai kappina pushyaraagamu aelaeTi SreevaeMkaTaadri yiMdraneelamu paalajalanidhilOna paayani divya ratnamu baaluni vale tirigae padmanaabhuDu Sung by: Nedunur...

mottakurae ammalaala

Image
మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు ... చక్కని యశోద తన్ను సలిగతో మొత్తరాగా మొక్కబోయీ గాళ్ళకు ముద్దులాడు వెక్కసాన రేపల్లె వెన్నెలెల్ల మాపుదాక ముక్కున వయ్యగ దిన్న ముద్దులాడు ... రువ్వెడి రాళ్ళ దల్లి రోలదన్ను గట్టెనంట మువ్వల గంటలతోడి ముద్దులాడు నవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె మువ్వరిలో నెక్కుడైన ముద్దులాడు ... వేల సంఖ్యల సతుల వెంటబెట్టుకొని రాగా మూల జన్ను గుడిచీని ముద్దులాడు మేలిమి వేంక ట గిరి మీదనున్నాడిదెవచ్చి మూలభూతి దానైన ముద్దులాడు mottakurae ammalaala muddulaaDu veeDe muttemuvale nunnaaDu muddulaaDu ... chakkani yaSOda tannu saligatO mottaraagaa mokkabOyee gaaLLaku muddulaaDu vekkasaana raepalle vennelella maapudaaka mukkuna vayyaga dinna muddulaaDu ... ruvveDi raaLLa dalli rOladannu gaTTenaMTa muvvala gaMTalatODi muddulaaDu navveDi jekkula niMDa nammika baalunivale muvvarilO nekkuDaina muddulaaDu ... vaela saMkhyala satula veMTabeTTukoni raagaa moola jannu guDicheeni muddulaaDu maelimi vaeMkaTagiri meedanunnaaDidevachchi moolabhooti daanaina mudd...

manujuDai puTTi

మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా ... జుట్టెదుగడుపుకై చొరనిచోట్లు చొచ్చి పట్టెడుగూటికై బతిమాలి పుట్టినచోటికే పొరలి మనసు పెట్టి వట్టిలంపటము వదలనేరడుగాన ... అందరిలో బుట్టి అందరిలో బెరిగి అందరి రూపము లటుదానై అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి అందరానిపదమందెనటుగాన manujuDai puTTi manujuni saeviMchi anudinamunu du@hkhamaMdanaelaa ... juTTedugaDupukai choranichOTlu chochchi paTTeDugooTikai batimaali puTTinachOTikae porali manasu peTTi vaTTilaMpaTamu vadalanaeraDugaana ... aMdarilO buTTi aMdarilO berigi aMdari roopamu laTudaanai aMdamaina SreevaeMkaTaadreeSu saeviMchi aMdaraanipadamaMdenaTugaana Sung by:MS Subbalakshmi

maadhava kaeSava madhusoodana

Image
మాధవ కేశవ మధుసూదన - విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్ .... వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న - రామరామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుధ్ధ దైవ పుండరీకాక్ష - నామత్రయాధీశ నమోనమో ... పురుషోత్త మ పుండరీకాక్ష - దివ్యహరి సంకర్షణ అధోక్షజ నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ - శరణాగత రక్ష జయజయ సేవే ... మగిత జనార్దన మత్స్యకూర్మ వరాహా - సహజ భార్గవ బుధ్ధ జయతురగ కల్కి విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం - అహమిహ తవపద దాస్యం అనిశం భజామి maadhava kaeSava madhusoodana - vishNuSreedharaa padanakham^ chiMtayaami yooyam^ .... vaamana gOviMda vaasudaeva pradyumna - raamaraama kRshNa naaraayaNaachyuta daamOdaraanirudhdha daiva puMDareekaaksha - naamatrayaadheeSa namOnamO ... purushOtta ma puMDareekaaksha - divyahari saMkarshaNa adhOkshaja narasiMha hRsheekaeSa nagadhara trivikrama - SaraNaagata raksha jayajaya saevae ... magita janaardana matsyakoorma varaahaa - sahaja bhaargava budhdha jayaturaga kalki vihita vij~naana SreevaeMkaTaeSa SubhakaraM - ahamiha tavapada daasyaM aniSaM bhajaami Sung by:Balakrishna Prasad ...

maelukO SRMgaara raaya

Image
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవె నాపాల ముంచిన నిధానమా సందడించే గోపికల జవ్వనవనములోన కందువదిరిగే మదగజమవు యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని గంధము మరిగినట్టి గండు తుమ్మెద గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో రతిముద్దు గురిసేటి రాచిలుకా సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు కితమై పొదిమిన నా యిందు బింబమ వరుసంగొలనిలోని వారి చన్నుఁగొండలపై నిరతివాలిన నా నీలమేఘమా శిరనురమున మోచి శ్రీవేంకటాద్రి మీద గరిమ వరాలిచ్చే కల్పతరువా maelukO SRMgaara raaya maeTi madana gOpaala maelukOve naapaala muMchina nidhaanamaa saMdaDiMchae gOpikala javvanavanamulOna kaMduvadirigae madagajamavu yiMdumukhi satyabhaama hRdayapadmamulOni gaMdhamu mariginaTTi gaMDu tummeda gatigooDi rukmiNikaugiTa paMjaramulO ratimuddu gurisaeTi raachilukaa satula padaaruvaela jaMTa kannula@M galuvalu kitamai podimina naa yiMdu biMbama varusaMgolanilOni vaari channu@MgoMDalapai nirativaalina naa neelamaeghamaa Siranuramuna mOchi SreevaeMkaTaadri meeda garima varaalichchae kalpataruvaa Sung by:Balakrishna Prasad Get this widget | Trac...

mokkaeTi gOpaaMganala

Image
మొక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వీ శ్రీ వేంకటేశ్వరుడు సత్యభామ ఉరముపై చల్లని కస్తూ రి పూత తత్త రించె రుక్మిణి చే తామర పూవు హత్తి న భూకాంతకు యంగపు పయ్యెద కొంగు చిత్తగించరమ్మా వీడె శ్రీ వేంకటేశ్వరుడు పంతపు పదారువేల బంగారు ఉంగరము బంతినే కుట్టబడిన పసిడి తాళి వింతగా రాధాదేవి వేసిన కలువదండ చెంతలను వీడె అమ్మ శ్రీ వేంకటేశ్వరుడు ఆసల తులసీదేవి అరచేతిలో అద్దము భాసురపు నీళాదేవి పట్టుగొమ్మ శ్రీ సతి ఎక్కిన యట్టి సింహాసనపు గద్దె mokkaeTi gOpaaMganala mOhanaakaaramu chikkani navvulu navvee Sree vaeMkaTaeSvaruDu satyabhaama uramupai challani kastoo ri poota tatta riMche rukmiNi chae taamara poovu hatti na bhookaaMtaku yaMgapu payyeda koMgu chittagiMcharammaa veeDe Sree vaeMkaTaeSvaruDu paMtapu padaaruvaela baMgaaru uMgaramu baMtinae kuTTabaDina pasiDi taaLi viMtagaa raadhaadaevi vaesina kaluvadaMDa cheMtalanu veeDe amma Sree vaeMkaTaeSvaruDu aasala tulaseedaevi arachaetilO addamu bhaasurapu neeLaadaevi paTTugomma Sree sati ekkina yaTTi siMhaasanapu gadde saesa peTTiMchukonnaaDu SreevaeMk...

moosina mutyaala kaele mo~ragulu

మూసిన ముత్యాల కేలె మొఱగులు - ఆసల చిత్తాన కేలే అలవోకలు కందులేని మోముకేలే కస్తూరి - చిందు నీకొప్పున కేలే సీమంతులు మందయానమున కేలే మట్టెల మోత -గందమేలే పైపై కమ్మని నీమేనికి భారపు గుబ్బల కేలే పయ్యద నీ -బీరపు జూపుల కేలే పెడామోము జీరల బుజాల కేలే చెమటల నీ -గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ముద్దుల మాటల కేలే ముదములు నీ -యద్దపు జెక్కుల కేలే అరవిరులు వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు -నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి moosina mutyaala kaele mo~ragulu - aasala chittaana kaelae alavOkalu kaMdulaeni mOmukaelae kastoori - chiMdu neekoppuna kaelae seemaMtulu maMdayaanamuna kaelae maTTela mOta -gaMdamaelae paipai kammani neemaeniki bhaarapu gubbala kaelae payyada nee -beerapu joopula kaelae peDaamOmu jeerala bujaala kaelae chemaTala nee -gOraMTa gOLLa kaelae konavaaMDlu muddula maaTala kaelae mudamulu nee -yaddapu jekkula kaelae aravirulu voddika maaTala kaelae voorpulu neeku -naddamaelae tiruvaeMkaTaadreeSu gooDi Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA ...

medini jeevula gaava

Image
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా - నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా తగు గోపికల కన్ను దామరలు వికసించె - మిగులు సూర్యనేత్రుడ మేలుకోవయ్యా తెగువ రాక్షసులనే తిమిరము విరియగ - నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ఘనదురితపు గలువలు వికసించె - మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ - జనక ! యాశ్రితపారిజాతమేలుకోవయ్యా వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ - మెరయుదోషరహిత మేలుకోవయ్యా పొరసి నీవు నిత్యభోగములు భోగించ - నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా maedini jeevula gaava maelukOvayyaa - needayae maakella raksha nidra maelukOvayyaa tagu gOpikala kannu daamaralu vikasiMche - migulu sooryanaetruDa maelukOvayyaa teguva raakshasulanae timiramu viriyaga - negaDina paraMjyOti nidra maelukOvayyaa ghanaduritapu galuvalu vikasiMche - minuku SaSinaetruDa maelukOvayyaa panivaDi vaedaalanae pakshulellaa balukaga - janaka ! yaaSritapaarijaatamaelukOvayyaa varalakshmee kuchachakravaakamu loMDoMTi raaya - merayudOsharahita maelukOvayyaa porasi neevu nityabhOgamulu bhOgiMcha - nirati SreevaeMkaTa...