okapari kokapari koyyaramai


ఒకపరి కొకపరి కొయ్యరమై మొకమున కళలెల్ల మొలసినట్లుండె

జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి -జిగిగొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాను - పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు - కరిగి యిరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహ మదము - తొరిగి సామజ సిరి తొలకి నట్లుండె

నెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను - తరచైన సొమ్ములు ధరియించగా
మెఱుగు బోడీ అలమేలు మంగయు తాను - మెఱుపు మేఘము గూడి మెఱసినట్టుండె

okapari kokapari koyyaramai mokamuna kaLalella molasinaTluMDe

jagadaeka patimaena challina karpoora dhooLi -jigigoni naluvaMka

chiMdagaanu

mogi chaMdramukhi nuramuna nilipe gaanu - pogaru vennela

digipOsinaTluMDe

porimerugu chekkula poosina taTTu punugu - karigi yirudesala

kaaragaanu

karigamana vibhuDu ganuka mOha madamu - torigi saamaja siri tolaki

naTluMDe

neraya SreevaeMkaTaeSu maena siMgaaramugaanu - tarachaina sommulu

dhariyiMchagaa

me~rugu bODee alamaelu maMgayu taanu - me~rupu maeghamu gooDi

me~rasinaTTuMDe


Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

Sung by:SP Sailaja

Get this widget | Track details | eSnips Social DNA