Posts

Showing posts from September, 2009

tE SaraNaM tE SaraNa mahaM - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ప|| తే శరణం తే శరణ మహం | శైశవకృష్ణ తే శరణం గతోస్మి || చ|| దశవిధావతార ధర్మరక్షణమూర్తి | దశమస్తకాసురదశన | దశదిశాపరిపూర్ణ తవనీయస్వరూప | దశావరణ లోకతత్త్వాతీత || చ|| సహస్రలోచన సంతతవినుత | సహస్రముఖ శేషశయనా | సహస్రకరకోటిసంపూర్ణతేజా | సహస్రాదిత్య దివ్యచక్రాయుధా || చ|| అనంతచరణ సర్వాధారధేయ | అనంతకరదివ్యాయుధా | అనంతనిజకల్యాణగుణార్ణవ | అనంత శ్రీవేంకటాద్రినివాసా || pa|| tE SaraNaM tE SaraNa mahaM | SaiSavakRShNa tE SaraNaM gatOsmi || ca|| daSavidhAvatAra dharmarakShaNamUrti | daSamastakAsuradaSana | daSadiSAparipUrNa tavanIyasvarUpa | daSAvaraNa lOkatattvAtIta || ca|| sahasralOcana saMtatavinuta | sahasramuKa SEShaSayanA | sahasrakarakOTisaMpUrNatEjA | sahasrAditya divyacakrAyudhA || ca|| anaMtacaraNa sarvAdhAradhEya | anaMtakaradivyAyudhA | anaMtanijakalyANaguNArNava | anaMta SrIvEMkaTAdrinivAsA || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

tolliyunu marraaku - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ప|| తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన | చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు || చ|| కలికి కావేరి తరగల బాహులతలనే | తలగ కిటు రంగ మధ్యపు తొట్టెలను | పలుమారు దనునూచి పాడగా నూగీని | చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు || చ|| అదివో కమలజుని తిరువారాధనం బనగ | అదన గమలభవాండమను తొట్టెలను | ఉదధులు తరంగముల నూచగా నూగీని | చెదరని సిరులతోడ శ్రీరంగశిశువు || చ|| వేదములే చేరులై వెలయంగ శెషుడే | పాదుకొను తొట్టెలై పరగగాను | శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై | సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు || pa|| tolliyunu ma~r~rAku toTTelane yUgegana | cellubaDi nUgIni SrIraMgaSiSuvu || ca|| kaliki kAvEri taragala bAhulatalanE | talaga kiTu raMga madhyapu toTTelanu | palumAru danunUci pADagA nUgIni | cilupAla selavitO SrIraMgaSiSuvu || ca|| adivO kamalajuni tiruvArAdhanaM banaga | adana gamalaBavAMDamanu toTTelanu | udadhulu taraMgamula nUcagA nUgIni | cedarani sirulatODa SrIraMgaSiSuvu || ca|| vEdamulE cErulai velayaMga SeShuDE | pAdukonu toTTelai paragagAnu | SrIdEvitO gUDi SrIvEMkaTESuDai | sEdadIreDi vADe SrIraMgaSiSuvu || Sung by:M...

tanakEDa caduvulu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ప|| తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు | మనసు చంచల బుద్ధి మానీనా చ|| జడ్డు మానవుడు చదువ జదువు నాస | వడ్డివారుగాక వదలీనా | గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన | దుడ్డు పెట్లే కాక దొరకేనా || చ|| దేవదూషకుడై తిరిగేటి వానికి | దేవతాంతరము తెలిసీనా | శ్రీవేంకటేశ్వరు సేవాపరుడుగాక | పావనమతియై పరగీనా || pa|| tanakEDa caduvulu tanakEDa SAstrAlu | manasu caMcala buddhi mAnInA ca|| jaDDu mAnavuDu caduva jaduvu nAsa | vaDDivArugAka vadalInA | guDDikukka saMtakubOyi tirigina | duDDu peTlE kAka dorakEnA || ca|| dEvadUShakuDai tirigETi vAniki | dEvatAMtaramu telisInA | SrIvEMkaTESvaru sEvAparuDugAka | pAvanamatiyai paragInA || Get this widget | Track details | eSnips Social DNA

tAne tAnE yiMdari guruDu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి || చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి| తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి || చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి || ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి || చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై | వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి || pa|| tAne tAnE yiMdari guruDu | sAnabaTTina BOgi j~jAna yOgi || ca|| aparimitamulaina yaj~jAla vaDijEya | brapannulaku buddhi vacariMci| tapamugA PalatyAgamu sEyiMcu | kapurula garimala karmayOgi || ca|| annicEtalanu brahmArpaNavidhi jEya | manniMcu buddhulanu marugajeppi || unnatapadamuna konaraga garuNiMcu | pannagaSayanuDE brahmayOgi || ca|| tanaraga gapiluDai dattAtrEyuDai | Ganamaina mahima SrI vEMkaTarAyaDai | vinaraga saMsAra yOgamu gRupasEyu | animiShagatula naByAsayOgi || Get this widget | Track details | eSnips Social DNA

tAnE kAkevvaru mAku dAtayu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ఈ కీర్తనలో దశావతారాలు ఇమిడిఉన్నాయి, గమనించగలరు. వివరణ-Explanation ప|| తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన- | లోన బెట్టుకొని మాకు లోనైనవాడు || చ|| చదివించి కూడువెట్టి జారకుండ నిల్లుగట్టి | బెదురులేని బుద్ధి పిన్ననాడే చెప్పి | యెదిరి నడిగి ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి | పదిలమై తమ్ము బాలించినవాడు || చ|| మోహవియోగమ్ము మోహానురాగమ్ము | దేహవిభాగంబు దెలిపిన కలికి | ఐహికమున వేంకటాధీశుడై సర్వ- | దేహరక్షకుడై తిరుగుచున్నాడు || pa|| tAnE kAkevvaru mAku dAtayu daivamu tana- | l Ona beTTukoni mAku lOnainavADu || ca|| cadiviMci kUDuveTTi jArakuMDa nillugaTTi | bedurulEni buddhi pinnanADE ceppi | yediri naDigi dravyamidi gommanucu nicci | padilamai tammu bAliMcinavADu || ca|| mOhaviyOgammu mOhAnurAgammu | dEhaviBAgaMbu delipina kaliki | aihikamuna vEMkaTAdhISuDai sarva- | dEharakShakuDai tirugucunnADu || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

trikaraNaSuddhiga jEsinapanulaku - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ప|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును | వొకటి కోటిగుణితంబగుమార్గములుండగ బ్రయాసపడనేలా || చ|| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి | కనకబిందుయమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ | దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు | తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగగ మరి యేలా || చ|| హరి యనురెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు | గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున జదివినపుణ్యములు | పరమతపోయోగంబులు మొదలగుబహుసాధనములసారంబు | పరిపక్వంబై ఫలియించగా బట్టబయలు వెదకనేలా | చ|| మొదల శ్రీవేంకటపతికిని జేయెత్తి మొక్కినమాత్రములోపలనే | పదిలపుషోడశదానయాగములుపంచమహాయజ్ఞంబులును | వదలక సాంగంబులుగా జేసినవాడే కాడా పలుమారు | మదిమదినుండే కాయక్లేశము మాటికి మాటికి దనకేలా || pa|| trikaraNaSuddhiga jEsinapanulaku dEvuDu meccunu lOkamu meccunu | vokaTi kOTiguNitaMbagumArgamuluMDaga brayAsapaDanElA || ca|| tanamanasE paripUrNamaina gOdAvari gaMgA kAvEri | kanakabiMduyamunAgayAdi muKyakShEtraMbula saMtatamun | dinakarasOmagrahaNakAlamula tIrthAcaraNalu sEsinaPalamulu | tanudAnE siddhiMcunu vUr...

taruNinIyaluka keMtaTidi iMti - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ప|| తరుణినీయలుక కెంతటిది ఇంతి నీవేళ | కరుణించగదర వేంకటశైలనాథ || చ|| ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు | ఒకమారు విధిసేతలూహించి పొగడు | ఒకమారు తనుజూచి వూరకే తలవూచు | నొకమారు హర్షమున నొంది మేమరచు || చ|| నినుజూచి నొకమారు నిలువెల్ల పులకించు | తనుజూచి నొకమారు తలపోసి నగును | కనుదెరచి నినుజూచి కడు సిగ్గుపడి నిలిచి | యిన్నియును తలపోసి యింతలో మరచు || చ|| వదలైన మొలనూలు గదియించు నొకమారు | చెదరిన కురులెల్ల చెరగునొకమారు | అదనెరిగి తిరువేంకటాధీశ పొందితివి | చదురుడవునిను బాయ జాలదొకమారు || pa|| taruNinIyaluka keMtaTidi iMti nIvELa | karuNiMcagadara vEMkaTaSailanAtha || ca|| okamAru saMsAramolla bommani talacu | okamAru vidhisEtalUhiMci pogaDu | okamAru tanujUci vUrakE talavUcu | nokamAru harShamuna noMdi mEmaracu || ca|| ninujUci nokamAru niluvella pulakiMcu | tanujUci nokamAru talapOsi nagunu | kanuderaci ninujUci kaDu siggupaDi nilici | yinniyunu talapOsi yiMtalO maracu || ca|| vadalaina molanUlu gadiyiMcu nokamAru | cedarina kurulella ceragunokamAru | adanerigi tiruvEMkaTAdhISa poMditivi | caduruDavuni...

tolliMTi vale gAvu tummedA - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ప|| తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక | వొల్లవుగా మమ్మువో తుమ్మెదా || చ|| తోరంపు రచనల తుమ్మెదా కడు | దూరేవు గొందులే తుమ్మెదా | దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము | వోరగా చూడకు వో తుమ్మెదా || చ|| తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు | తొలిచేవు చేగలే తుమ్మెదా | తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక | ఉలికేవు మముగని వో తుమ్మెదా || చ|| దొరవు వేంకటగిరి తుమ్మెదా మా | తురుమేల చెనకేవు తుమ్మెదా | దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక | ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా || pa|| tolliMTi vale gAvu tummedA yiMka | vollavugA mammuvO tummedA || ca|| tOraMpu racanala tummedA kaDu | dUrEvu goMdulE tummedA | dUrinA nerxugavu tummedA mammu | vOragA cUDaku vO tummedA || ca|| toli prAyapu miMDa tummedA kaDu | tolicEvu cEgalE tummedA | tolakari meruguvE tummedA iMka | ulikEvu mamugani vO tummedA || ca|| doravu vEMkaTagiri tummedA mA | turumEla cenakEvu tummedA | dorakenI canavulu tummedA iMka | orulerxiMgiri gadavO tummedA || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

tagunayya harinIku dAnamu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
తగునయ్య హరినీకు దానము దెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్య లక్ష్మి కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి అమ్ముమొనను జలధి నడచి లంక సాధించి కమ్మర జెకొన్న సీత ఘన వీర లక్ష్మి నరకాసరునడచి నవ్వుతా జేయివేసితివి సరిగా సత్యభామెపో సంగ్రామలక్ష్మి హిరణ్యకశిపు గొట్టి యింద్రాదులకు నీచే వరమిప్పించిన యాకె వరలక్ష్మి నిండిన వురము మీద నిఖిల సంపదలతో అండనుండె యాకెపో ఆదిలక్ష్మి మెండగు శ్రీవేంకటాద్రిమీద నీసరుస నేగే గండుమీరె కళాలతో కల్యాణ లక్ష్మి tagunayya harinIku dAnamu dechchukonina jagamulO bhUkAMta saubhAgya lakshmi kimmula SiSupAluni gelichi chEkoMTivigA sammatiMchi rukmiNi jayalakshmi ammumonanu jaladhi naDachi laMka sAdhiMchi kammara jekonna sIta ghana vIra lakshmi narakAsarunaDachi navvutA jEyivEsitivi sarigA satyabhAmepO saMgrAmalakshmi hiraNyakaSipu goTTi yiMdrAdulaku nIchE varamippiMchina yAke varalakshmi niMDina vuramu mIda nikhila saMpadalatO aMDanuMDe yAkepO Adilakshmi meMDagu SrIvEMkaTAdrimIda nIsarusa nEgE gaMDumIre kaLAlatO kalyANa lakshmi Sung by:Priya Sisters

tiruvIdhu lEgIni dEvatalu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట హరి వాఁడె పెండ్లికొడుకై ప్రతాపమున కనకపుఁగొండవంటిఘనమైనరథముపై దనుజమర్దనుఁడెక్కెఁ దరుణులతో వినువీధిఁ బడెగెలు వేవేలు కుచ్చులతోడఁ బెనగొనఁగఁ గదలె భేరులు మ్రోయఁగను వరుసఁ జంద్రసూర్యులవంటిబండికండ్లతోడ గరుడధ్వజుఁ డొరసీఁ గడు దిక్కులు విరుగువేదరాసులే పగ్గాలు వట్టితియ్యఁగ సరుగ దుష్టులఁ గొట్టి జయము చేకొనెను ఆటలుఁ బాటలు వింటా నలమేల్మంగయుఁ దాను యీటున శ్రీవేంకటేశుఁ డెదురులేక వాటపుసింగారముతో వాకిటవచ్చి నిలిచీ కోటానఁగోటివరాలు కొమ్మని ఇచ్చుచును tiruvIdhu lEgIni dEvatalu jayaveTTa hari vADe peMDlikoDukai pratApamuna kanakapugoMDavaMTighanamainarathamupai danujamardanuDekke daruNulatO vinuvIdhi baDegelu vEvElu kuchchulatODa benagonaga gadale bhErulu mrOyaganu varusa jaMdrasUryulavaMTibaMDikaMDlatODa garuDadhvaju DorasE gaDu dikkulu viruguvEdarAsulE paggAlu vaTTitiyyaga saruga dushTula goTTi jayamu chEkonenu aaTalu bATalu viMTA nalamElmaMgayu( dAnu yITuna SrIvEMkaTaeSu@M DedurulEka vATapusiMgAramutO vAkiTavachchi nilichI kOTAna@MgOTivarAlu kommani ichchuchunu

tanamEla kulamEla - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

తనమేల కులమేల తపమే కారణము యెలమి హరిదాసులు యేజాతి యైన నేమి కాకమువల్ల( బుట్టదా ఘనమైన యశ్వత్ధము దాకొని గుల్లలో( బుట్టదా ముత్తెము చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము యేకడ మహానుభావు లెందు పుట్టి రేమి బిడిపిరాళ్ళా( బుట్టవా చెలువైన వజ్రములు పుడమి నీ(గలవల్ల( బుట్టదా తేనె వెడగు( బిల్లి మేనను వెళ్ళదాయెనా జవ్వాది వుడివోని పుణ్యు లెందు నుదయించి రేమి పంకములో పుట్టదా పరిమళపు( దామెర పొంకపు కీటకములందు పుట్టదా పట్టు కొంకక శ్రీవేంకటేశు కొలిచిన దాసులు సంకలేని జ్ఞాను లెందు జనియించి రేమి t anamEla kulamEla tapamE kAraNamu yelami haridAsulu yEjAti yaina nEmi kAkamuvalla( buTTadA ghanamaina yaSwatdhamu dAkoni gullalO( buTTadA muttemu chaukaina vishalatanE janmiMchadA nirvishamu yEkaDa mahAnubhAvu leMdu puTTi rEmi biDipirALLA( buTTavA cheluvaina vajramulu puDami nI(galavalla( buTTadA tEne veDagu( billi mEnanu veLLadAyenA javvAdi vuDivOni puNyu leMdu nudayiMchi rEmi paMkamulO puTTadA parimaLapu( dAmera poMkapu kITakamulaMdu puTTadA paTTu koMkaka SrIvEMkaTESu kolichina dAsulu saMkalEni j~nAnu leMdu janiyiMchi rEmi...

tegaka paramunaku - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

తెగక పరమునకు తెరువు లేదు పగయెల్లా విడువక భవమూ పోదు కన్నులయెదుటనున్న కాంచనము పై మమత వున్నంతతడవు మోక్షమొనగూడదు అన్నముతోడి రుచుల యలమట గలదాకా పన్నిన సుజ్ఞానము పదిలము గాదు పక్కనున్న కాంతల భ్రమగల కాలము మిక్కిలి శ్రీహరి భక్తి మెరయలేదు వెక్కసపు సంసారవిధి నున్నంతతడవు నిక్కి పరమధర్మము నిలుకడ గాదు చిత్తములోపలి పలు చింతలు మానినదాకా సత్తుగా వైరాగ్యము సమకూడదు యిత్తల శ్రీవేంకటేశు డేలిన దాసులకైతే హత్తి వైకుంఠపదవి అప్పుడే కలదు tegaka paramunaku teruvu lEdu pagayellA viDuvaka bhavamU pOdu kannulayeduTanunna kAMchanamu pai mamata vunnaMtataDavu mOkshamonagUDadu annamutODi ruchula yalamaTa galadAkA pannina suj~nAnamu padilamu gAdu pakkanunna kAMtala bhramagala kAlamu mikkili SrIhari bhakti merayalEdu vekkasapu saMsAravidhi nunnaMtataDavu nikki paramadharmamu nilukaDa gAdu chittamulOpali palu chiMtalu mAninadAkA sattugA vairAgyamu samakUDadu yittala SrIvEMkaTESu DElina dAsulakaitE hatti vaikuMThapadavi appuDE kaladu Sung by:Balakrishna Prasad

talapulOnanE daivamu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
తలపులోననే దైవము వీడివో సులభము సులభము సోధించరో యిదే హరినామము యిదే కొన(స)నాలికె వదలక తలచితే వైకుంఠము వెదకగ నేటికి వెడపుణ్యము లింక సదరము సదరము సాధించరో కలదు దేహమిదె కలవివె ముద్రలు వలెనని చేకొన్న వైకుంఠము వొలసి కర్మములు పొరలగ నేటికి కలిగెను కలిగెను కైకొనరో శ్రీవేంకట మదె శ్రీపతి వీడిగో వావిరి కొలిచిన వైకుంఠము భావించి చూచిన బ్రహ్మాదులకును త్రోవయిదె త్రోవయిదె తొలగకురో talapulOnanE daivamu vIDivO sulabhamu sulabhamu sOdhiMcharO yidE harinAmamu yidE kona(sa)nAlike vadalaka talachitE vaikuMThamu vedakaga nETiki veDapuNyamu liMka sadaramu sadaramu sAdhiMcharO kaladu dEhamide kalavive mudralu valenani chEkonna vaikuMThamu volasi karmamulu poralaga nETiki kaligenu kaligenu kaikonarO SrIvEMkaTa made SrIpati vIDigO vAviri kolichina vaikuMThamu bhAviMchi chUchina brahmAdulakunu trOvayide trOvayide tolagakurO Composer : Nedunuri Krishnamurty, Singers : Malladi brothers

tappuleMchakika darichErchavayyA - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
తప్పులెంచకిక దరిచేర్చవయ్యా చెప్పనేల నీచిత్తమయ్యా కలిదోషహరణ కర్మవిదారణ సులభపు నీదాసులమయ్యా కలిగిన శరణాగత వజ్రపంజర వలనగు నీమరగు వారమయ్యా దురిత నివారణ దుఃఖవిమోచన దొరకొని నీభక్తులమయ్యా కరిరాజవరద కరుణాసముద్ర సరినిను నమ్మిన జంతులమయ్యా శ్రీకాంతప్రియ శ్రీవేంకటేశ్వర కైకొన్న నీకింకరులమయ్యా మాకేల యితరపు మతదైన్యంబులు పైకొన బోజేసి(?) పాలించవయ్యా tappuleMchakika darichErchavayyA cheppanEla nIchittamayyA kalidOshaharaNa karmavidAraNa sulabhapu nIdAsulamayyA kaligina SaraNAgata vajrapaMjara valanagu nImaragu vAramayyA durita nivAraNa du@hkhavimOchana dorakoni nIbhaktulamayyA karirAjavarada karuNAsamudra sarininu nammina jaMtulamayyA SrIkAMtapriya SrIvEMkaTESwara kaikonna nIkiMkarulamayyA mAkEla yitarapu matadainyaMbulu paikona bOjEsi(?) pAliMchavayyA Sung&Tuned by:Mangalamapalli Balamuralikrishna

tammulAla annalAla - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
తమ్ములాల అన్నలాల తల్లులాల నే నెమ్మనపు హరిఁ బాసి నిలువలేనికను కొమ్మలాల మరుకోట కొమ్మలాల వో- యమ్మలాల తొలరె నా యక్కలాల తమ్మిరేకు కన్నుల యాతనిఁబాసినే నుమ్మల సొమ్మల చేత నుండలేకినను చెలులాల కలికి తొయ్యలులాల వో యెల జవ్వనముల మోహినులాల చెలువంపు హరిఁదలచిన నాకు నే (?) నులుకు కన్నీరు ఆపకుండలేనికను బోటులాల జవ్వనపు మేటులాల వో- గాటపు తురుముల చీకటులాల వాటమైన వేంకటేశ్వరుఁ బాసి నే- నాటదాననై జన్మమందలేకినను tammulAla annalAla tallulAla nE nemmanapu hari@M bAsi niluvalEnikanu kommalAla marukOTa kommalAla vO- yammalAla tolare nA yakkalAla tammirEku kannula yAtani@MbAsinE nummala sommala chEta nuMDalEkinanu chelulAla kaliki toyyalulAla vO yela javvanamula mOhinulAla cheluvaMpu hari@Mdalachina nAku nE (?) nuluku kannIru ApakuMDalEnikanu bOTulAla javvanapu mETulAla vO- gATapu turumula chIkaTulAla vATamaina vEMkaTESwaru@M bAsi nE- nATadAnanai janmamaMdalEkinanu

taane yerugunu ramanudu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
Article about this great Composer: The Hindu తానే యెఱుఁగును రమణుడు తనకెదు రాడేనా నానెను జెమటలఁ బులకలు నటనకు పనిలేదే కోపమూ కన్నుల నున్నది కూరిమి మదిలో నున్నది యేపున పతి కింక నుత్తర మేమని చెప్పుదునే తీపులు మాటల నున్నవి తెగువలు కాకల నున్నవి రాపుగ పతివద్దకి నేరాకుండుట మేలే జంకెలూ బొమ్మల నున్నవి చనవులు మొక్కుల నున్నవి బింకముతో బేర్కొని తనుబిలువగ జోటేదే మంకులు వొట్టూల నున్నవి మర్మము పైపై నున్నది యింకా బుద్దులు మీరిక నేమని చెప్పరే వలపులూ కౌగిట నున్నవి వాసులు సిగ్గుల నున్నవి తల దడిసెను చలి వాసెను తానేమనగలడే వలె నని శ్రీవేంకటపతి వడదేరిచి నను గూడెను నిలువున ముంచెను మరపులు నేరము లెంచకురే tAnE ye~ru@Mgunu ramaNuDu tanakedu raDEnA nAnenu jemaTala@M bulakalu naTanaku panilEdE kOpamU kannula nunnadi kUrimi madilO nunnadi yEpuna pati kiMka nuttara mEmani cheppudunE tIpulu mATala nunnavi teguvalu kAkala nunnavi rApuga pativaddaki nErAkuMDuTa mElE jaMkelU bommala nunnavi chanavulu mokkula nunnavi biMkamutO bErkoni tanubiluvaga jOTEdE maMkulu voTTUla nunnavi marmamu paipai nunnadi yiMkA buddulu mIrika nE...

tolli kalavE iviyu tolli - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు కనుదెరచినంతనే కలుగు నీ జగము కనుమూసినంతనే కడుశూన్యమౌను కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును తన మనోభావనలఁ దగిలి తోచీని తలచినంతనె యెంతదవ్వయినఁ గాన్పించు తలపు మరచినమతికి దట్టమౌఁ దమము పొలసి మతిమరగుననె పుట్టుటలుఁ బోవుటలు పలుచంచలవికారభావ మీ గుణము ముందు దాఁ గలిగితే మూడు లోకములుఁ గల- వెందు దా లేకుంటే నేమియును లేదు అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీడె కందువల నితనిసంకల్ప మీపనులు tolli kalavE iviyu tolli tAnu@M galaDE kallayunu@M gAdu idi kaDu nijamu gAdu kanuderachinaMtanE kalugu nI jagamu kanumUsinaMtanE kaDuSUnyamaunu kanureppa mara@Mgunane kalimiyunu lEmiyunu tana manObhAvanala@M dagili tOchIni talachinaMtane yeMtadavvayina@M gAn&piMchu talapu marachinamatiki daTTamau@M damamu polasi matimaragunane puTTuTalu@M bOvuTalu paluchaMchalavikArabhAva mI guNamu muMdu dA@M galigitE mUDu lOkamulu@M gala- veMdu dA lEkuMTE nEmiyunu lEdu aMdi SrIvEMkaTESu@M DAtmalOnane vIDe kaMduvala nitanisaMkalpa mIpanulu Tuned&Sungby:Sri Mangala...

Maanushamu gaadu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

మానుషము గాదు మరి దైవికము గాని రానున్న అది రాకుమన్న బోదు అనుభవనకు బ్రాప్తమైనది తనకు దానె వచ్చి తగిలి కాని పోదు తిరువేంకట దేవుని కరుణ చేత గాని కలుష మింతయు బోదు Maanushamu gaadu mari deivikamu gaani Raanunna adi rakumanna bodu Anubhavanaku braptameinadi Tanku daane vacchi tagili kaani podu Tiruvenkata devuni Karuna cheta gaani kalusha mintayu bodu

Sadaa sakalam sampadale - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

సదా సకలం సంపదలే తుద దెలియగవలె దొలగవలయు ఆహర్నిసమును నా పదలే సహించిన నవి సౌఖ్యములె యిహమున నవి యిందరికిని మహిమ దెలియవలె మానగవలెను దురంతము లివి దోషములె పరంపర లివి బంధములు విరసములౌ నరవిభవములౌ సిరులె మరులౌ చిరసుఖమవును గతి యలమేల్ మంగ నాంచారికి మతియగు వేంకతపతిదలచి రతులెరుగగ వలె రవణము వలెను హితమెరుగగవలె నిదె తనకు Sadaa sakalam sampadale Tuda deliyagavale dolagavalayu Aharnisamunu naa padale Sahinchina navi saukhyamule Yihamuna navi yindarikini Mahima deliyavale maanagavalenu Durantamu livi doshamule Parampara livi bandhamulu Virasamulou naravibhavamulou Sirule marulou chirasukhamavunu Gati yalamel manga naanchaariki Matiyagu venkatapatidalachi Ratulerugaga vale ravanamu valenu Hitamerugagavale nide tanaku

Indiraanaama mindariki - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ఇందిరానామ మిందరికి కుందనపు ముద్ద వో గొవింద ఆచ్చుత నామము అనంత నామము ఇచ్చిన సంపద లిందరికి నచ్చిన సిరులు నాలుక తుదలు కొచ్చి కొచ్చి నో గొవింద వైకుంఠనామము వరద నామము ఈఎకడ నాకడ నిందరికి వాకుదెరుపులు వన్నెలు లొకాల గూకులు వత్తులు నో గొవిందా పండరినామము పరమ నామము ఎండలు వాపెడి దిందరికి నిండునిధానమై నిలిచిన పేరు కొండల కోనెటి వో గొవిందా Indiraanaama mindariki Kundanapu mudda vo govinda Acchuta naamamu ananta naamamu Icchina sampada lindariki Nacchina sirulu naaluka tudalu Kocchi kocchi no govinda Veikunthanaamamu varada naamamu Eekada naakada nindariki Vaakuderupulu vannelu lokaala Gukulu vattulu no govindaa Pandarinaamamu parama naamamu Endalu vaapedi dindariki Nindunidhaanamei nilichina peru Kondala koneti vo govindaa

sahaja vaishNavaachaaravartanula - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మాసంధ్య అతిశయముగ శ్రీహరి సంకీర్తన సతతంబును మాసంధ్య మతి రామానుజమతమే మాకును చతురత మెరసిన సంధ్య పరమభాగవత పదసేవనయే సరవి నెన్న మాసంధ్య సిరివరు మహిమలు చెలువొందగ వేసరక వినుటె మాసంధ్య మంతుకెక్క తిరుమంత్ర పఠనమే సంతతమును మాసంధ్య కంతుగురుడు వేంకటగిరిరాయని సంతర్పణమే మాసంధ్య sahaja vaishNavaachaaravartanula sahavaasamae maasaMdhya atiSayamuga Sreehari saMkeertana satataMbunu maasaMdhya mati raamaanujamatamae maakunu chaturata merasina saMdhya paramabhaagavata padasaevanayae saravi nenna maasaMdhya sirivaru mahimalu cheluvoMdaga vaesaraka vinuTe maasaMdhya maMtukekka tirumaMtra paThanamae saMtatamunu maasaMdhya kaMtuguruDu vaeMkaTagiriraayani saMtarpaNamae maasaMdhya

Indukorake indarunu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

ఇందుకొరకె యిందరును నిట్లయిరి కిందుపడి మరికాని గెలుపెరగరాదు ఆటమటపు వేడుకల నలయించి మరి కదా ఘటియించు బరము తటుకన దైవము ఇటుసేయ నీశ్వరున కీసుగలదా ? లేదు కుటిలమతి గని కాని గుణి గాన రాదు బెండుపడ నవగతుల బెనగించి మరి కదా కొండనుచు బర మొసంగును దైవము బండు సేయగ హరికి బంతమా ? యటు గాదు యెండ దాకక నీడ హిత వెరగరాదు మునుప వేల్పుల కెల్ల మ్రొక్కించి మరి కదా తనభక్తి యొసగు నంతట్ దైవము ఘన వేంకటేశునకు గపటమ ? అటుగాదు తినక చేదును దీపు తెలియనే రాదు Indukorake indarunu nitlayiri Kindupadi marikaani geluperagaraadu Atamatapu vedukalunalayinchi mari kada Ghatiyinchu baramu tatukana deviamu Ituseya neeswaruna kIsugaladaa? Ledu Kutilamati gani kaani guni gaana raadu Bendupada navagatula benaginchi mari kadaaa Kondanuchu bara mosangunu deivamu Bandu seyaga hariki bantama? yaTu gaadu Yenda daakaka nIda hita veragaraadu Munupa velpula kella mrokkinchi mari kada Tanabhakti yosagu nantaTi deivamu Ghana venkatesunaku gapatama ? atugaadu Tinaka ch...

dabbaluveTTuchu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

దబ్బలువెట్టుచు( దేలిన దిదివో ఉబ్బునీటిపై నొక హంసా అనువున( గమలవిహారమె నెలవై వొనరివున్న దిదె వొక హంసా మనియెడిజీవుల మానససరసుల- వునికి నున్న దిదె వొక హంసా పాలునీరు నేర్పరిచి పాలలో- నోలలాడె నిదె నొక హంసా పాలుపడినయీపరమహంసముల- వోలి నున్న దిదె వొక హంసా తడవి రోమరంధ్రంబుల గుడ్ల- నుదుగక పొదిగీ నొకహంసా కడువేడుక వేంకటగిరిమీ(దట- నొడలు వెంచె నిదె యొక హంసా dabbaluveTTuchu( dElina didivO ubbunITipei noka hamsaa anuvuna( gamalavihaarame nelavei vonarivunna dide voka hamsaa maniyeDijIvula maanasasarasula- vuniki nunna dide voka hamsaa paalunIru nErparichi paalalO- nOlalaaDe nide noka hamsaa paalupaDinayIparamahamsamula- vOli nunna dide voka hamsaaa taDavi rOmarandhrambula guDla- nudugaka podigI nokahamsaa kaDuvEDuka vEnkaTagirimI(daTa- noDalu venche nide yoka hamsaa

gaalineipOya gala kaalamu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

గాలినైపోయ గల కాలము తాలిమికి గొంతయు ( బొద్దులేదు అడుసుచొరనే పట్టె నటునిటు(గాళ్ళు గడుగుకొననే పట్టె గలకాలము ఒడలికి జీవుని కొడయ(డైనహరి( దడవ(గా (గొంతయు( బొద్దు లేదు కల(చి చిందనే పట్టె( గడవ నించగ(బట్టె కలుషదేహపుబాధ( గలకాలము తలపోసి తనపాలిదైవమైన హరి దల(చగా( గొంతయు( బొద్దు లేదు శిరసు ముడువ(బట్టె చిక్కుదియ్య(గ( బట్టె గరిమల( గపటాల (గలకాలము తిరువేంకటగిరి దేవుడైన హరి దరిచేరా( గొంతయు బొద్దులేదు gaalineipOya gala kaalamu taalimiki gontayu ( boddulEdu aDusuchoranE paTTe naTuniTu(gaaLLu gaDugukonanE paTTe galakaalamu oDaliki jIvuni koDaya(Deinahari( daDava(gaa (gontayu( boddu lEdu kala(chi chindanE paTTe( gaDava ninchaga(baTTe kalushadEhapubaadha( galakaalamu talapOsi tanapaalideivameina hari dala(chagaa( gontayu( boddu lEdu Sirasu muDuva(baTTe chikkudiyya(ga( baTTe garimala( gapaTaala (galakaalamu tiruvEnkaTagiri dEvuDeina hari darichEraa( gontayu boddulEdu

sandaDi viDuvumu saasamuKhaa - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

సందడి విడువుము సాసముఖా మంధరధరునకు మజ్జనవేళా అమరాధిపు లిడు డాలవట్టములు కమలజ పట్టము కాళాంజి జమలిచామరలు చంద్రుడ సూర్యుడ అమర నిడుడు పరమాత్మనకు ఆణిమాదిసిరులనల రెడు శేషుడ మణిపాదుక లిడు మతి చెలగా ప్రణుతింపు కదసి భారతీరమణ గుణాధిపు మరుగురు బలుమరును వేదఘోషణము విడువక సేయుడు ఆదిమునులు నిత్యాధికులు శ్రీ దేవుండగు శ్రీ వేంకటపతి ఆదరమున సిరు లందీ వాడే sandaDi viDuvumu saasamuKhaa mandharadharunaku majjanavELaa amaraadhipu liDu DaalavaTTamulu kamalaja paTTamu kaaLaanji jamalichaamaralu chandruDa sUryuDa amara niDuDu paramaatmanaku aaNimaadisirulanala reDu SEshuDa maNipaaduka liDu mati chelagaa praNutimpu kadasi bhaaratIramaNa guNaadhipu maruguru balumarunu vEdaghOshaNamu viDuvaka sEyuDu aadimunulu nityaadhikulu SrI dEvunDagu SrI vEnkaTapati aadaramuna siru landI vaaDE

SaraNu SaraNu suraeMdra sannuta - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక కమల ధరుడును, కమల మిత్రుడు కమల శత్రుడు, పుత్రుడు క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినారెచ్చరికయా అనిమిషేంద్రులు మునులు దిక్పతులు అమర కిన్నెర సిధ్ధులు ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగా వచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతివేంకటాచల నాయకా SaraNu SaraNu suraeMdra sannuta SaraNu Sreesati vallabha SaraNu raakshasa garva saMhara SaraNu vaeMkaTa naayaka kamala dharuDunu, kamala mitruDu kamala SatruDu, putruDu kramamutO meekoluvu kippuDu kaachinaarechcharikayaa animishaeMdrulu munulu dikpatulu amara kinnera sidhdhulu ghanatatO raMbhaadi kaaMtalu kaachinaarechcharikayaa ennagala prahlaada mukhyulu ninnu koluvagaa vachchiri vinnapamu vinavayya tirupativaeMkaTaachala naayakaa Sung by:Kanakadurga,srivalli,srividya Get this widget | Track details | eSnips Social DNA

Sandekaada Puttinatti - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత-చందమాయ చూడరమ్మ చందమామ పంట॥ .. మునుప పాలవెల్లి మొలచి పండినపంట నినుపై దేవతలకు నిచ్చపంట గొనకొని హరికన్ను గొనచూపులపంట వినువీధి నెగడిన వెన్నెలల పంట॥ .. వలరాజు పంపున వలపు విత్తిన పంట చలువై పున్నమనాటి జాజరపంట కలిమి కామిని తోడ కారుకమ్మినపంట మలయుచు తమలోని మర్రిమాని పంట॥ .. విరహుల గుండెలకు వెక్కసమైన పంట పరగచుక్కలరాసి భాగ్యము పంట అరుదై తూరుపుకొండ నారగబండినపంట యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥ Get this widget | Track details | eSnips Social DNA Get this widget | Track details | eSnips Social DNA ఐవి. సీతాపతిగారి వ్యాఖ్యానం menaing provided by telugubhatki.com

SreemannaaraayaNa - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు కమలాసతీ ముఖకమల కమల హిత కమలప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడకమనశ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు .. పరమయోగిజన భాగధేయ శ్రీ పరమపూరుష పరాత్పర పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణు SreemannaaraayaNa SreemannaaraayaNa SreemannaaraayaNa nee Sreepaadamae SaraNu kamalaasatee mukhakamala kamala hita kamalapriya kamalaekshaNa kamalaasanahita garuDakamanaSree kamalanaabha nee padakamalamae SaraNu .. paramayOgijana bhaagadhaeya Sree paramapoorusha paraatpara paramaatma paramaaNu roopa Sree tiruvaeMkaTagiri daeva SaraNu Sung by:MS Subbalakshmi Get this widget | Track details | eSnips Social DNA Instrumental: Get this widget | Track details | eSnips Social DNA

siruta navvula vaaDu sinnekkaa - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెక్కా కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్కా ఆటదానిబాసి ఆడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెక్కా బింకపు మోతల పిల్లగోవి వాడు సింక సూపులవాడు సిన్నెక్కా కొంకక కలికియై కొసరి కూడె నన్ను వేంకటేశుడు సూడవే సిన్నెక్కా siruta navvula vaaDu sinnekkaa veeDu veraperugaDu sooDavae sinnekkaa polasu maenivaaDu bOraveepu vaaDu selasu mOravaaDu sinnekkaa kolusula vaMkala kOralatOboomi velasinaaDu sooDavae sinnekkaa maeTi kuruchavaaDu meDameedi goDDali seeTakaalavaaDu sinnekkaa aaTadaanibaasi aaDavilO raakaaSi vaeTalaaDee jooDavae sinnekkaa biMkapu mOtala pillagOvi vaaDu siMka soopulavaaDu sinnekkaa koMkaka kalikiyai kosari kooDe nannu vaeMkaTaeSuDu sooDavae sinnekkaa Sung by:Shobaraj Get this widget | Track details | eSnips Social DNA Sung by:Balakrishna PRasad Get this widget | Track details | eSnips So...