vedakina nidiyE vEdArthamu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

vedakina nidiyE vEdArthamu



ప|| వెదకిన నిదియే వేదార్థము | మొదలు తుదలు హరి మూలము ||

చ|| మునుకొని అవయవములు యెన్నైనా | పనిపడి శిరసే ప్రధానము
యెనలేని సురలు యెందరు గలిగిన | మునుపటి హరియే మూలంబు

చ|| మోవని ఇంద్రియములు యెన్నైనా | భావపు మనసే ప్రధానము
యీవల మతములు యెన్ని కలిగినా | మూవురలో హరి మూలంబు ||

చ|| యెరవగు గుణములు యెన్ని కలిగిన | పరమ జ్ఞానము ప్రధానము
యిరవుగ శ్రీ వేంకటేశ్వర నామము | సరవి మంత్రముల సారము


pa|| vedakina nidiyE vEdArthamu | modalu tudalu hari mUlamu ||

ca|| munukoni avayavamulu yennainA | panipaDi SirasE pradhAnamu
yenalEni suralu yeMdaru galigina | munupaTi hariyE mUlaMbu

ca|| mOvani iMdriyamulu yennainA | BAvapu manasE pradhAnamu
yIvala matamulu yenni kaliginA | mUvuralO hari mUlaMbu ||

ca|| yeravagu guNamulu yenni kaligina | parama j~nAnamu pradhAnamu
yiravuga SrI vEMkaTESvara nAmamu | saravi maMtramula sAramu



Get this widget | Track details | eSnips Social DNA