Posts

Showing posts from March, 2010

kAnIvE aMdukEmI kanukonE- Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
కానీవే అందుకేమీ కనుకొనే పను లెల్ల యీ నాటకములు నేనెఱగనివా పంతము లాడిన తానే భ్రమసీ గాక నాకు యింతలోనే యేమి దప్పె నెందు వోయీని వింత యడవుల వెంట వెదకడా సీతఁదొల్లి యెంత లేదు తనగుండె యెఱగనిదా బిగియుచున్న వాడే బిలిచీగాక నన్ను తగవులే నెరపేను దాని కేమే వెగటయి రాధాదేవివెంట తిరుగడా యెగువనె తనగుట్టు యెఱగనిదా కడలనున్న వాడే కలసీగాక నన్ను తడవకు వాని నిట్టె తతి రానీవే అడరి శ్రీవేంకటేశ్వరుడట్టె నన్ను గలసె యెడయకున్నాడు నే నిది యెఱగనిదా ca||kAnIvE aMdukEmI kanukonE panu lella yI nATakamulu nEne~raganivA pa||Mtamu lADina tAnE bhramasI gAka nAku yiMtalOnE yEmi dappe neMdu vOyIni viMta yaDavula veMTa vedakaDA sIta@Mdolli yeMta lEdu tanaguMDe ye~raganidA bigiyuchunna vADE bilichIgAka nannu tagavulE nerapEnu dAni kEmE vegaTayi rAdhAdEviveMTa tirugaDA yeguvane tanaguTTu ye~raganidA kaDalanunna vADE kalasIgAka nannu taDavaku vAni niTTe tati rAnIvE aDari SrIvEMkaTESwaruDaTTe nannu galase yeDayakunnADu nE nidi ye~raganidA Get this widget | Track details | eSnips Social DNA

adiyepO SrIhari nAmamu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
అదియెపో శ్రీహరి నామము తుదిపదమిదియె ధృవమై కలిగె తొడరి చిత్రకేతు డే నామము తడవి లోకమంతయు గెలిచె విడువక బ్రహ్మయు వెస నే నామము బడిబడి నుడుగుచు ప్రభుడై నిలిచె హరుడే నామము అదె తారకముగ నిరతిఁదడవి యెన్నిక మీరె ధర నే నామము దలచి నారదుడు సురమునియై సంస్తుతులకు నెక్కె ధృవుడే నామము దొరకొని నుతియించి ధృవ పట్టంబున తుద బ్రదికె జవళి శ్రీ వేంకటేశ్వరుదాసులెల్లాను భువి నేనామము భోగించి మనిరి adiyepO SrIhari nAmamu tudipadamidiye dhRvamai kalige toDari chitrakEtu DE nAmamu taDavi lOkamaMtayu geliche viDuvaka brahmayu vesa nE nAmamu baDibaDi nuDuguchu prabhuDai niliche haruDE nAmamu ade tArakamuga nirati@MdaDavi yennika mIre dhara nE nAmamu dalachi nAraduDu suramuniyai saMstutulaku nekke dhRvuDE nAmamu dorakoni nutiyiMchi dhRva paTTaMbuna tuda bradike javaLi SrI vEMkaTESwarudAsulellAnu bhuvi nEnAmamu bhOgiMchi maniri Sung by:SriNukalaChinaSatyanarayana Get this widget | Track details | eSnips Social DNA

nApAli ghana nidhAnamuvu nIvE nannu- Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
నాపాలి ఘన నిధానమువు నీవే నన్ను నీపాల నిడుకొంటి నీవే నీవే ఒలిసి నన్నేలే దేవుడవు నీవే యెందు తొలగని నిజబంధుడవు నీవే పలుసుఖమిచ్చే సంపదవు నీవే యిట్టే వెలయ నిన్నియును నీవే నివే పొదిగి పాయని ఆప్తుడవు నివే నాకు నదన తోడగు దేహమవు నీవే మదమువాపెడినా మతియు నీవే నాకు వెదక నన్నియును నీవే నీవే యింకా లోకములకు నెప్పుడు నీవే యీ పంకజభవాది దేవపతి నీవే అంకిలి వాపగ నంతకు నీవే తిరు వేంకటేశ్వరుడవు నీవే నీవే nApAli ghana nidhAnamuvu nIvE nannu nIpAla niDukomTi nIvE nIvE olisi nannElE dEvuDavu nIvE yemdu tolagani nijabamdhuDavu nIvE palusukhamiccE sampadavu nIvE yiTTE velaya ninniyunu nIvE nivE podigi pAyani AptuDavu nivE nAku nadana tODagu dEhamavu nIvE madamuvApeDinA matiyu nIvE nAku vedaka nanniyunu nIvE nIvE yimkA lOkamulaku neppuDu nIvE yI pamkajabhavAdi dEvapati nIvE amkili vApaga namtaku nIvE tiru vEmkaTESvaruDavu nIvE nIvE Sung by:Sri Parupalli Ranganath Get this widget | Track details | eSnips Social DNA

vEvElu bandhamulu viDuvamuDuvambaTTe- Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
వేవేలు బంధములు విడువముడువంబట్టె దైవమా నిన్నెట్టు తగిలేమయ్య పారేముందటి భవపాశములు తీరీదొల్లిటి తిత్తి లో పుణ్యము కోరీ కోరికలొకటొకటే ఏ రీతి సుజ్ఞాన విరిగేనయ్య పట్టినాకొంగు పంచేంద్రియములు తొట్టీ పాపము తోడుతనే పెట్టీ భ్రమల పెరిగెనీ మాయలు అట్టే మోక్షము ఎన్నడందేమయ్య విందై ఇహము వెనకకూతీసి అందీ వైరాగ్యం అరచేతికి కందువా శ్రీవేంకటపతి ఈ రెండు బంధించి తివేది భోగింతునయ్యా vEvElu bandhamulu viDuvamuDuvambaTTe daivamA ninneTTu tagilEmayya pArEmumdaTi bhavapASamulu tIrIdolliTi titti lO puNyamu kOrI kOrikalokaTokaTE E rIti suj~nAna virigEnayya paTTinAkongu panchEndriyamulu toTTI pApamu tODutanE peTTI bhramala perigenI mAyalu aTTE mOkshamu ennaDandEmayya vindai ihamu venakakUtIsi amdI vairAgyam aracEtiki kanduvA SrIvEmkaTapati I remDu bamdhimci tivEdi bhOgimtunayyA Sung by:Smt Vedavati Prabhakar Get this widget | Track details | eSnips Social DNA

soridi saMsAraMbu suKamA yiMdariki - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ప|| సొరిది సంసారంబు సుఖమా యిందరికి | వెరవెఱంగక వగల వేగేరుగా || చ|| దేహములు దలప సుస్థిరములా ప్రాణులకు- | నూహింప లోభ మట్లుండుగాక | మోహంబుచే వెనుకముందెఱుగలేక తమ- | దేహసుఖములు మరిగి తిరిగేరుగాక || చ|| నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికి | అలవి నిలుపగరాని యాసగాక | బలువైనవట్టిభ్రాంతిచే దగులువడి | తెలిసియును దెలియకిటు తిరిగేరుగాక || చ|| నెఱయువిభవములెల్ల నిజములా యిందరికి | కొఱమాలినట్టి తమగుణముగక | యెఱుకతో దిరువేంకటేశు గొలువగలేక | తెఱగుమాలినబుద్ధి దిరిగేరుగాక || pa|| soridi saMsAraMbu suKamA yiMdariki | veraverxaMgaka vagala vEgErugA || ca|| dEhamulu dalapa susthiramulA prANulaku- | nUhiMpa lOBa maTluMDugAka | mOhaMbucE venukamuMderxugalEka tama- | dEhasuKamulu marigi tirigErugAka || ca|| nelakonnadravyamulu nilucunA yevvariki | alavi nilupagarAni yAsagAka | baluvainavaTTiBrAMticE daguluvaDi | telisiyunu deliyakiTu tirigErugAka || ca|| nerxayuviBavamulella nijamulA yiMdariki | korxamAlinaTTi tamaguNamugaka | yerxukatO diruvEMkaTESu goluvagalEka | terxagumAlinabuddhi dirigErugAka || Sung by:Sr...

ennaDu tIravu Ipanulu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
ఎన్నడు తీరవు ఈపనులు పన్నిన నీమాయ బహుళంబాయె పెక్కుమతంబుల పెద్దలునడచిరి ఒక్కసమ్మతై ఒడబడరు పెక్కుదేవతలు పేరు ఆడెదరు తక్కక ఘనులము తామేఅనుచు పలికెడి చదువులు బహుమార్గంబులు కలసి ఏకవాక్యత కాదు చలవాదంబులు జనులు మానరు పలు తర్కంబులె పచరించేరు శరణాగతులకు శ్రీవేంకటేశ్వర తిరముగ నీవే తీర్చితివీ పరమవైష్ణవులు పట్టిరివ్రతము ఇరవుగ నాచార్యులెరుగుదురూ ennaDu tIravu Ipanulu pannina nImAya bahuLambAye pekkumatambula peddalunaDaciri okkasammatai ODabaDaru pekkudEvatalu pEru ADedaru takkaka ghanulamu tAmEanucu palikeDi caduvulu bahumArgambulu kalasi EkavAkyata kAdu calavAdambulu janulu mAnaru palu tarkambule pacarimcEru SaraNAgatulaku SrIvEmkaTESwara tiramuga nIvE tIrcitivI paramavaishNavulu paTTirivratamu iravuga nAchAryulerugudurU Sung by:Sri Mangalampalli Balamuralikrishna Get this widget | Track details | eSnips Social DNA