Posts

Showing posts from April, 2010

challani choopulavaani chakkanivaani - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

Image
చల్లని చూపులవాని చక్కనివాని | పీలి | చొల్లెపుఁ జుట్లవానిఁ జూపరమ్మ చెలులు వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు | చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు యేడుగడయునుఁ దానై యెలయించె నన్నును |వానిఁ| జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు | సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని| పొందులు మానగ లేను పోనీకురే చెలు(లు?) ఇంటింటి యింతుల నెల్లా యెలయించి వచ్చెనే | వాడు| దంటవాడు కవి(లి?) కిఁచేతలకృష్ణుడు నంటునను శ్రీవెంకటనాథుఁడై నన్నుఁ గూడెనే | వాని | వొంటిఁ బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు . challani choopulavaani chakkanivaani | peeli | chollepu@M juTlavaani@M jooparamma chelulu VaaDalOni chelulanu valapinchi vacchenE | vaaDu | chEDela manasu donga chinnikRshNuDu yEDugaDayunu@M daanai yelayinche nannunu |vaani@M| jooDaka vunDaga lEnu chooparamma chelulu mandalOni golletala maraginchi vacchenE | vaaDu | sandaDipenDlikoDuku jaaNakRShNuDu mundu venakaa nalami mohimpinche nannunu | vaani| pondulu maanaga lEnu pOneekurE chelu(lu?) inTinTi yintu...

echchaTa@MjUchina - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

Image
ఎచ్చటఁజూచిన నితడై కృష్ణుడుమచ్చిక నలమేలుమంగతో వెలసీ కొట్టరో వుట్ట్లు గోపాలబాలులు యిట్టె కృష్ణుని యెదుటను పట్టరో వారలు పాలునేతికిని గట్టిగ జోరున గారీనవిగో కూడరో మూకలు కోలలవారలు వేడుక కృష్ణుని వెంటవెంట ఆడుచు మెసగరో అడుకులు చక్కిలాల్లు వాడల వాడల వరుసతోను నిక్కితీసుకోరో నెలవాదికాండ్లు మక్కువ కృష్ణుని మఱగునను యెక్కరో శ్రీవేంకటేశు కొండమీద పెక్కు నురుగులు పెరుగులు నివిగో echchaTa@MjUchina nitaDai kRshNuDu machchika nalamElumaMgatO velasI koTTarO vuTTlu gOpAlabAlulu yiTTe kRshNuni yeduTanu paTTarO VAralu pAlunEtikini gaTTiga jOruna gArInavigO kUDarO mUkalu kOlalavAralu vEDuka kRshNuni veMTaveMTa ADuchu mesagarO aDukulu chakkilAllu vADala vADala varusatOnu nikkitIsukOrO nelavAdikAMDlu makkuva kRshNuni ma~ragunanu yekkarO SrIvEMkaTESu koMDamIda pekku nurugulu perugulu nivigO Sung by:Sri Balakrishna Prasad & Bullemma

nIvokkaDavE nAkucAlu - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

Image
నీవొక్కడవే నాకుచాలు నీరజాక్ష నారాయణ నీవే నాకు గతి అని తెలిసితి నెక్కొని ఇతరము వృథా వృథా నీనామోచ్ఛరణమే నెరసిన దుఖ నివారణము నీనామోచ్చరణమే నెలగూ శుభకరము నా నా వేదశస్త్రములు నవపురాణ ఇతిహాసములు నీ నామములోనే వున్నవి మిగిలిన వన్నియు వృథా వృథా నీ పాదమూలము నింగియు భువియు రాసాతలము నీ పాదమూలము నిఖిల జీవ పరినామములు దీపించిన చరాచరంబులు దివ్యులు మునులు సర్వమును ఈ పాదమూలమే మరి మిగిలిన వన్నియు వృథా వృథా దేవా మీ తిరుమేను దిక్కును బ్రహ్మాండాధారము దేవా మీ తిరుమేను ఉత్పత్తిస్థితిలయములకును ఆకరము శ్రీ వేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ దేవా నీ శరణమును జొచ్చితి దిక్కులన్నియు వృథా వృథా nIvokkaDavE nAkucAlu nIrajAksha nArAyaNa nIvE nAku gati ani telisiti nekkoni itaramu vRdhA vRdhA nInAmOccaraNamE nerasina dukha nivAraNamu nInAmOccaraNamE nelagU Subhakaramu nA nA vEdaSastramulu navapurANa itihAsamulu nI nAmamulOnE vunnavi migilina vanniyu vRdhA vRdhA nI pAdamUlamu nimgiyu bhuviyu rAsAtalamu nI pAdamUlamu nikhila jIva parinAmamulu dIpimcina carAcarambulu divyulu munulu sarvamunu I pAdamUlamE mari mig...

ayanAya vyaMgamElE ativA nI - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

Image
అయనాయ వ్యంగమేలే అతివా ! నీ - ఆయమే తాకీ మాట లందుకేమీ సేతురా కప్పురమిందవే వోకలికీ ! మాకు - నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా తప్పనాడే వదియేమే తరుణీ ! వోరి తప్పులెవ్వరెందున్నవో తలచుకో నీవు నిమ్మ పండిందవే వీ నెలతా ! ఆ - నిమ్మపండే పాపరవును నే నొల్లరా చిమ్మేవు సట లిదేమే చెలియ మేన చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు కుంకుమపూ నిందవే వో కోమలీ ! నీ - కుంకుమలే పుప్పుడౌను కూడుకుంటేను యింకనేలే కలసితి నింతీ ! వోరి యింకపు శ్రీవేంకటేశ యిద్దరి చెమటలు a yanAya vyaMgamElE ativA ! nI - AyamE tAkI mATa laMdukEmI sEturA kappuramiMdavE vOkalikI ! mAku - nuppulavu nIkappurA lollamu pOrA tappanADE vadiyEmE taruNI ! vOri tappulevvareMdunnavO talachukO nIvu nimma paMDiMdavE vI nelatA ! A - nimmapaMDE pAparavunu nE nollarA chimmEvu saTa lidEmE cheliya mEna chimmurEkha levvaraMdO chittagiMchu nIvu kuMkumapU niMdavE vO kOmalI ! nI - kuMkumalE puppuDaunu kIDukuMTEnu yiMkanElE kalasiti niMtI ! vOri yiMkapu SrIvEMkaTESa yiddari chemaTalu Sung by:Sri Ramya. S Audio Link: http://old.musicindiaonline.com/music...

evvari mechchadagavu - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

Image
ఎవ్వరి మెచ్చదగవు యిద్దరిలో రామరామ రవ్వగా సురలు విచారము సేసేరిందుకే దశరథు యజ్ఞములో తగ నీవు జనియింప దశకంఠు మేన బుట్టె దావాగ్ని వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు దశకంఠు డంటి(ది?) నట్టిధర్మ మందె సమసె నెఱిదొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను చెఱకు విల్లెత్తె నీపె జేరి మరుడు విఱిగె నీవెత్తినట్టి విల్లయితే నెంతైన విఱుగ కాతనివిల్లు వెసఁ బెండ్లి సేసేను శ్రీవేంకటాద్రిమీదఁ జేరి యెక్కితివి నీవు ఆవెలది నీవుర మట్టె యెక్కెను దేవుడవై ఇందరిలోన తిరుగాడుదువు గాని నోవల నాకైతే (ఆకె + ఐతే) నీపై వున్నచోనే వున్నది evvari mechchadagavu yiddarilO rAmarAma ravvagA suralu vichAramu sEsEriMdukE daSarathu yaj~namulO taga nIvu janiyiMpa daSakaMThu mEna buTTe dAvAgni vaSamaina SAMtitO varNanakekkiti nIvu daSakaMThu DaMTi(di?) naTTidharma maMde samase ne~ridolli sItakugA nIvu villettagAnu che~raku villette nIpe jEri maruDu vi~rige nIvettinaTTi villayitE neMtaina vi~ruga kAtanivillu vesa@M beMDli sEsEnu SrIvEMkaTAdrimIda@M jEri yekkitivi nIvu Aveladi nIvura maTTe yekkenu dEvuDavai iMdarilOna tirugADuduvu gAni nOvala nAkait...

kOrinaTTE AyanIku gOviMduDA - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

Image
కోరినట్టే ఆయనీకు గోవిందుడా మా కూరిమి మరవకుమీ గోవిందుడా క్రొమ్మెఱుగు చూపు గోవిందుడా కుమ్మరించేవు వలపు గోవిందుడా కుమ్మెవో గోర నొత్తకు గోవిందుడా నీ కొమ్మలెల్లా నవ్వేరు గోవిందుడా కొలనిలోని వారము గోవిందుడా నీకు గొలువు సేసేము గోవిందుడా కొలముగొల్లెతలము గోవిందుడా కొలకొల నవ్వుదురా గోవిందుడా కుందణపు చాయమేని గోవిందుడా గొందినేల పవ్వళించ గోవిందుడా చెందె నిన్నలమేల్ మంగ శ్రీవేంకటేశ నిన్నాడు - కొందుము సుమ్మీ నేము గోవిందుడా kOrinaTTE AyanIku gOviMduDA mA kUrimi maravakumI gOviMduDA kromme~rugu chUpu gOviMduDA kummariMchEvu valapu gOviMduDA kummevO gOra nottaku gOviMduDA nI kommalellA navvEru gOviMduDA kolanilOni vAramu gOviMduDA nIku goluvu sEsEmu gOviMduDA kolamugolletalamu gOviMduDA kolakola navvudurA gOviMduDA kuMdaNapu chAyamEni gOviMduDA goMdinEla pavvaLiMcha gOviMduDA cheMde ninnalamEl maMga SrIvEMkaTESa ninnADu - koMdumu summI nEmu gOviMduDA Sung by: Ramya. S

muddugAraganide muMgiTa - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

Image
ముద్దుగారగనిదె ముంగిట నిలుచున్నాడు వొద్దికేగి చెలులెల్ల వూరడించరే వేకువజామున లేచి వేడుక కృష్ణుడు తల్లి ఆకలయ్యీ ననుచు వొయ్యనె మంచము దిగి కాకలతో పసివాడి కన్నులు పులుముకొంటా యేకరుచు నున్నవాడు యెత్తుకోరే బిడ్డని బాలులతో వూరనెల్ల బరువులు వెట్టి వెట్టి చాలుకొని యాడి యాడి జామెక్కగా వచ్చి కేలుచాచి వెన్నడిగి కిందుపడీ యంతలో బేలులై వుండగనేల పెట్టరే బిడ్డనికి మట్టమద్యాన్నపువేళ మలయుచు నింటిలోనే చట్టల పెరుగు వేడీ చాలఁబెట్టరే మీరు పట్టపు శ్రీవేంకటాద్రిపై కీలుకొనె నిదె అట్టిట్టనక వీని నాదరించరే ---Painting by Sri Raja Ravivarma------ muddugAraganide muMgiTa niluchunnADu voddikEgi chelulella vUraDiMcharE vEkuvajAmuna lEchi vEDuka kRshNuDu talli AkalayyI nanuchu voyyane maMchamu digi kAkalatO pasivADi kannulu pulumukoMTA yEkaruchu nunnavADu yettukOrE biDDani bAlulatO vUranella baruvulu veTTi veTTi chAlukoni yADi yADi jAmekkagA vachchi kEluchAchi vennaDigi kiMdupaDI yaMtalO bElulai vuMDaganEla peTTArE biDDaniki maTTAmadyAnnapuvELa malayuchu niMTilOnE chaTTala perugu vEDI chAla@MbeTTarE mIru paTTapu SrIvE...

kaladu tirumaMtramu kaladihamu - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

Image
ప|| కలదు తిరుమంత్రము కలదిహము బరము | కలిమి గలుగు మాకు గడమే లేదు || చ|| కమలాక్షు నీవు మాకు గలిగియుండగ భూమి | నమరలేని దొకటి నవ్వలలేదు | నెమకి నాలుకమీద నీనామము మెలగగ | తమితో బరుల వేడ దా జోటులేదు || చ|| శౌరి నీ చక్రము నాభుజము మీదనుండగాను | బూరవపు బగ లేదు యెదురూ లేదు | చేరువ నీ సేవ నాచేతులపై నుండగాను | తీరని కర్మపు వెట్టిదినమూ లేదు || చ|| అచ్చుత నీపై భక్తి యాతుమలో నుండగాను | రచ్చల బుట్టిన యపరాధమూ లేదు | నిచ్చలు శ్రీ వేంకటేశ నీశరణాగతుండగా | విచ్చిన విడే కాని విచారమే లేదు || pa|| kaladu tirumaMtramu kaladihamu baramu | kalimi galugu mAku gaDamE lEdu || ca|| kamalAkShu nIvu mAku galigiyuMDaga BUmi | namaralEni dokaTi navvalalEdu | nemaki nAlukamIda nInAmamu melagaga | tamitO barula vEDa dA jOTulEdu || ca|| Sauri nI cakramu nABujamu mIdanuMDagAnu | bUravapu baga lEdu yedurU lEdu | cEruva nI sEva nAcEtulapai nuMDagAnu | tIrani karmapu veTTidinamU lEdu || ca|| accuta nIpai Bakti yAtumalO nuMDagAnu | raccala buTTina yaparAdhamU lEdu | niccalu SrI vEMkaTESa nISaraNAgatuMDagA | viccina viDE kAni vicA...

atisulaBaM bidi yaMdaripAliki - Top/popular/Annamayya/annamacarya spiritual/devotional/traditional/telugu/english/songs/ lyrics/Audio/videos

ప|| అతిసులభం బిది యందరిపాలికి | గతియిది శ్రీపతి కైంకర్యంబు || చ|| పాలసముద్రము బలిమి దచ్చి కొని- | రాలరి దేవత లమృతమును | నాలుక నిదె హరినామపుటమృతము | యేల కానరో యిహపరసుఖము || చ|| అడరి బాతిపడి యవని దేవతలు | బడివాయరు యజ్ఞ భాగాలకు | విడువక చేతిలో విష్ణుప్రసాదము | కడిగడియైనది కానరుగాని || చ|| యెక్కుదురు దిగుదు రేడులోకములు | పక్కన దపముల బడలుచును | చిక్కినాడు మతి స్రీవేంకటేశ్వరు- | డిక్కడితుదిపద మెఱగరుగాని || pa|| atisulaBaM bidi yaMdaripAliki | gatiyidi SrIpati kaiMkaryaMbu || ca|| pAlasamudramu balimi dacci koni- | rAlari dEvata lamRtamunu | nAluka nide harinAmapuTamRtamu | yEla kAnarO yihaparasuKamu || ca|| aDari bAtipaDi yavani dEvatalu | baDivAyaru yaj~na BAgAlaku | viDuvaka cEtilO viShNuprasAdamu | kaDigaDiyainadi kAnarugAni || ca|| yekkuduru digudu rEDulOkamulu | pakkana dapamula baDalucunu | cikkinADu mati srIvEMkaTESvaru- | DikkaDitudipada me~ragarugAni || Sung by:Sri Mangalampalli Balamurali Krishna Get this widget | Track details | eSnips Social DNA

eMta puNyamO yiTu mAku - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular//telugu/english/songs/ lyrics/Audio/videos

Image
Sung by : Sri Mangalampalli Balamuralikrishna ఎంత పుణ్యమో యిటు మాకు కలిగె చెంతనే నీకృప సిధ్ధించబోలు శ్రీపతి మీకథ చెవులను వింటిమి పాపము లణగెను భయముడిగె తీపుగ తులసితీర్థము గొంటిమి శాపము దీరెను సఫలంబాయ గోవింద మిము కనుగోంటి మిప్పుడే పావనమైతిమి బ్రతికితిమి తావుల మీపాదములకు మ్రొక్కితి వేవేలు కలిగెను వేడుకలాయ శ్రీవేంకటేశ్వర సేవించితి మిము ధావతి దీరెను తనిసితిమి వావిరి ముమ్మారు వలగొని వచ్చితి నీవారమైతిమి నిలిచితి మిపుడు eMta puNyamO yiTu mAku kalige cheMtanE nIkRpa sidhdhiMchabOlu SrIpati mIkatha chevulanu viMTimi pApamu laNagenu bhayamuDige tIpuga tulasitIrthamu goMTimi SApamu dIrenu saphalaMbAya gOviMda mimu kanugOMTi mippuDE pAvanamaitimi bratikitimi tAvula mIpAdamulaku mrokkiti vEvElu kaligenu vEDukalAya SrIvEMkaTESwara sEviMchiti mimu dhAvati dIrenu tanisitimi vAviri mummAru valagoni vachchiti nIvAramaitimi nilichiti mipuDu

sEyanivADevvaDu chEri - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular//telugu/english/songs/ lyrics/Audio/videos

Image
సేయనివాడెవ్వడు చేరి చిల్లర దోషాలు యేయెడ జీవుల జాడ లీశ్వరకల్పితమే దేవుని నమ్మినయట్టి దేహియట ఆతనికి యీవల యెంతట పాప మేమి సేసును భావించి యన్ని నేరాలు పరిహరించు నతడే ఆవటించు సూర్యునికి అంధకారమెదురా పూజింపించుకొనువాడు భువనరక్షకుడట తేజముతో దురితాలు తెంచగలేడా రాజు సేసిన యాజ్ఞ రాజుకంటెనెక్కుడా వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు చేతనాత్మకుడట శ్రీవేంకటేశ్వరుడు జాతిలేని జీవునికి స్వతంత్రమేది కాతరపు జన్మానకు కార్యకారణమేది యేతున గరుడనికి నెదురా పాములు sEyanivADevvaDu chEri chillara dOshAlu yEyeDa jIvula jADa lISwarakalpitamE dEvuni namminayaTTi dEhiyaTa Ataniki yIvala yeMtaTa pApa mEmi sEsunu bhAviMchi yanni nErAlu parihariMchu nataDE AvaTiMchu sUryuniki aMdhakAramedurA pUjiMpiMchukonuvADu bhuvanarakshakuDaTa tEjamutO duritAlu teMchagalEDA rAju sEsina yAj~na rAjukaMTenekkuDA vOjatO vajrAyudhAna kOpunA parwatAlu chEtanAtmakuDaTa SrIvEMkaTESwaruDu jAtilEni jIvuniki swataMtramEdi kAtarapu janmAnaku kAryakAraNamEdi yEtuna garuDaniki nedurA pAmulu Sung by:Sri Mangalampalli Balamurali Krishna Get this ...

balavaMtuDitani - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

Image
బలవంతుడితని బంట్లమై బ్రతుకుదుము కిలకిల నవ్వీ సుగ్రీవ నరసింహుడు దేవదేవుడితడు తేజోరాశి యితడు భావించ నలవిగాని బ్రహ్మ మితడు శ్రీవల్లభుడితడు జీవరక్షకుడితడు కేవలమయిన సుగ్రీవనరసింహుడు పరమాత్ముడితడు భయహరుడితడు నిరుపమగుణముల నిత్యుడితడు వరదుడితడు సర్వవంద్యుడు నీతడు గిరిగుహలోని సుగ్రీవ నరసింహుడు లరూపుడితడు కరుణానిధియితడు మేలిమి జగత్తులకు మేటి యీతడు మూలమై శ్రీవేంకటశైల నిలయుడితడు కీలకమిన్నిటికి సుగ్రీవ నరసింహుడు balavaMtuDitani baMTlamai bratukudumu kilakila navvI sugrIva narasiMhuDu dEvadEvuDitaDu tEjOrASi yitaDu bhAviMcha nalavigAni brahma mitaDu SrIvallabhuDitaDu jIvarakshakuDitaDu kEvalamayina sugrIvanarasiMhuDu paramAtmuDitaDu bhayaharuDitaDu nirupamaguNamula nityuDitaDu varaduDitaDu sarvavaMdyuDu nItaDu giriguhalOni sugrIva narasiMhuDu larUpuDitaDu karuNAnidhiyitaDu mElimi jagattulaku mETi yItaDu mUlamai SrIvEMkaTaSaila nilayuDitaDu kIlakaminniTiki sugrIva narasiMhuDu Sung by:Sri Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA