Posts

Showing posts from June, 2010

ummaDinE yEmaninA - ఉమ్మడినే యేమనినా

ఉమ్మడినే యేమనినా (రాగం: ) (తాళం : ) ప|| ఉమ్మడినే యేమనినా మారకుండను | అమ్మరో యెంతట గబ్బియనకు మీ నన్నను || చ|| మాటలు నీ వాడితేను మంచి తేనెలుగారీని | గాటమై నీ చేతవై తే కారమయ్యీని | యీటు వెట్టితే జవి యిదొకటీ నదొకటీ | కూటమి కాననరాదు కోపగించరాదు || చ|| కన్నుల నీవు చూచితే కడు వెన్నెల గాసీని | యెన్నబోతే నీ సుద్దులు యెండగాసీని | పన్నినవి నీ గుణాలు పచ్చియును వెచ్చియును | అన్నీ జేతబట్టరాదు అటు దోయరాదు || చ|| నీ వాసలు వెట్టితేను నిలువు నూరు వండీని | భావించి నీ సింగారాలు పాలుకొనీని | యీవల శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి | చేవదేరె ననరాదు చిగురనరాదు || ummaDinE yEmaninA (Raagam: ) (Taalam: ) pa|| ummaDinE yEmaninA mArakuMDanu | ammarO yeMtaTa gabbiyanaku mI nannanu || ca|| mATalu nI vADitEnu maMci tEnelugArIni | gATamai nI cEtavai tE kAramayyIni | yITu veTTitE javi yidokaTI nadokaTI | kUTami kAnanarAdu kOpagiMcarAdu || ca|| kannula nIvu cUcitE kaDu vennela gAsIni | yennabOtE nI suddulu yeMDagAsIni | panninavi nI guNAlu pacciyunu vecciyunu | annI jEtabaTTarAdu aTu dOyarAdu || ca|| nI vAsal...

unnavicAramulEla vOhO - ఉన్నవిచారములేల వోహో

ఉన్నవిచారములేల (రాగం: ) (తాళం : ) ప|| ఉన్నవిచారములేల వోహో సంసారులాల | యిన్నిటి కితడే రక్ష యిదే మీకు మనరో || చ|| తక్కక బ్రహ్మలగన్న తండ్రి గొలిచి మీరు | యెక్కువ సంతతిగల్గి యీడేరరో | అక్కున లక్ష్మీనారాయణుల దలచి మీరు | చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో || చ|| భవరోగవైద్యునిపాదములు సేవించి | భువి రోగముల బాసి పొదలరో | తవిలి పదిదిక్కులు తానైనవాని | గవిసి పొగడి దిక్కుగలిగి బ్రదుకరో || చ|| తల్లిదండ్రీ నీతడే తగ జుట్ట మీతడే | యెల్లగా బుట్టించి పెంచేయేలి కీతడే | చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము | కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో || unnavicAramulEla (Raagam: ) (Taalam: ) pa|| unnavicAramulEla vOhO saMsArulAla | yinniTi kitaDE rakSha yidE mIku manarO || ca|| takkaka brahmalaganna taMDri golici mIru | yekkuva saMtatigalgi yIDErarO | akkuna lakShmInArAyaNula dalaci mIru | cokki mImIdaMpatulu suKamuna nuMDarO || ca|| BavarOgavaidyunipAdamulu sEviMci | Buvi rOgamula bAsi podalarO | tavili padidikkulu tAnainavAni | gavisi pogaDi dikkugaligi bradukarO || ca|| tallidaMDrI nItaDE taga j...

Unnachonae moodu - ఉన్నచోనే మూడు

ఉన్నచోనే మూడు (రాగం: శంకరాభరణం) (తాళం : ) ఉన్నచోనే మూడు లోకాలూహించి చూచితే నీవే కన్నచోటనే వెదకి కానడింతే కాక. యెక్కడ వొయ్యెడి జీవుడేది వైకుంఠము యిక్కడ హరి యున్నాడు హృదయమందె ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల_ కక్కసాన జిక్కి తమ్ము గాన డింతే కాక. యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ కామించి యాత డిన్నిటా గలిగుండగా దోమటి సంసారపుదొంతికర్మముల జిక్కి కాముకుడై కిందుమీదు గాన డింతే కాక. యేవిధులు తా జేసీ యెవ్వరి నాడగబోయీ శ్రీవేంకటేశ్వరుసేవ చేతనుడగా భావ మాతడుగాను బ్రతికె నిదవో నేడు కావరాన నిన్నాళ్ళు కాన డింతే కాక Unnachonae moodu (Raagam: Samkaraabharanam) (Taalam: ) Unnachonae moodu lokaaloohimchi choochitae neevae Kannachotanae vedaki kaanadimtae kaaka. Yekkada voyyedi jeevudaedi vaikumthamu Yikkada hari yunnaadu hrdayamamde Mukkuna noorupu mochi mumchi punyapaapaala_ Kakkasaana jikki tammu gaana dimtae kaaka. Yaemi vichaarimchee daehi yemdu daevuni vedakee Kaamimchi yaata dinnitaa galigumdagaa Domati samsaarapudomtikarmamula jikki Kaamukudai kimdumeedu gaana dimtae kaaka. Yaevi...

uMDa bAsInaDavilO - ఉండ బాసీనడవిలో

ఉండ బాసీనడవిలో (రాగం: ) (తాళం : ) ఉండ బాసీనడవిలో నొకతెనేను ఎండలు నీడలు గాసీ నేమి సేతురా || చిన్ని నానడుము చూచి సింహము దగ్గరెనంటా ఉన్నతపు గుచముల కొరసెగరి మున్నిటి వొందులు వైరమునుజేసె మ్రుగపతి యిన్నిటికి నగ్గమైతి నేమిసేతురా || నిండు నానడపుచూచి నెమలి దగ్గరవచ్చె బండు సేసి నారుసూచి పాయదు పాము రెండు జూచి పగయు గూరిమి దోచెనింతలోనే యిండె పట్టె నిన్నిటికి నేమి సేతురా || కోరి నా పలుకువిని కోవిల దగ్గరవచ్చె చేరీ నా మోవికిదె చిలుకనేడు గారవాన నిన్నియు వేంకటగిరి విభుడా యేరా యిట్టె చేకొంటి వేమిసేతురా || uMDa bAsInaDavilO (Raagam: ) (Taalam: ) uMDa bAsInaDavilO nokatenEnu eMDalu nIDalu gAsI nEmi sEturA || chinni nAnaDumu chUchi siMhamu daggarenaMTA unnatapu guchamula korasegari munniTi voMdulu vairamunujEse mrugapati yinniTiki naggamaiti nEmisEturA || niMDu nAnaDapuchUchi nemali daggaravachche baMDu sEsi nArusUchi pAyadu pAmu reMDu jUchi pagayu gUrimi dOcheniMtalOnE yiMDe paTTe ninniTiki nEmi sEturA || kOri nA palukuvini kOvila daggaravachche chErI nA mOvikide chilukanEDu gAravAna ninniyu v...

Eehee sreeharigamtae yimta - ఈహీ శ్రీహరిగంటే యింత

ఈహీ శ్రీహరిగంటే యింత (రాగం: ) (తాళం : ) ఈహీ శ్రీహరిగంటే యింత లేదుగా వట్టి దాహపుటాసల వెఱ్రి దవ్వు టింతేకాకా పలుమారు నిందరిని భంగపడి వేడేది యిలపై దేహమువెంచేయిందు కింతేకా కలికికాంతలచూపుఘాతలకు భ్రమనేది చెలగి మైమఱచేటిచేత కింతేకా పక్కన జన్మాలనెల్లా బాటువడేదెల్లాను యెక్కడో సంసారాన కిందు కింతేకా వొక్కరి గొలిచి తిట్టు కొడిగట్టే దెల్లాను చక్కుముక్కునాలికెపైచవి కింతేకా గారవాన ధనములు గడియించేదెల్లాను ఆరయ నాదని వీగేయందు కింతేకా చేరి శ్రీవేంకటపతి సేవకు జొరనిదెల్లా భారపుగర్మపుభాద బట్టువడికా Eehee sreeharigamtae yimta(Raagam: ) (Taalam: ) Eehee sreeharigamtae yimta laedugaa vatti Daahaputaasala ve~rri davvu timtaekaakaa Palumaaru nimdarini bhamgapadi vaedaedi Yilapai daehamuvemchaeyimdu kimtaekaa Kalikikaamtalachoopughaatalaku bhramanaedi Chelagi maima~rachaetichaeta kimtaekaa Pakkana janmaalanellaa baatuvadaedellaanu Yekkado samsaaraana kimdu kimtaekaa Vokkari golichi tittu kodigattae dellaanu Chakkumukkunaalikepaichavi kimtaekaa Gaaravaana dhanamulu gadiyimchaedellaanu Aaraya naadani...

Isura lImunu - ఈసుర లీమును

ఈసుర లీమును (రాగం: ) (తాళం : ) ప|| ఈసుర లీమును లీచరాచరములు | యిసకలమంతయు నిది యెవ్వరు || చ|| ఎన్నిక నామము లిటు నీవై యుండగ | యిన్ని నామము లిటు నీవై యుండగ | వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి | యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు || చ|| వొక్కరూపై నీవు వుండుచుండగ మరి | తక్కిన యీరూపములు తామెవ్వరు | యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ | మక్కువ నుండువారు మరి యెవ్వరు || చ|| శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా | దైవంబులనువారు తామెవ్వరు | కావలసినచోట కలిగి నీవుండగ | యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు || Isura lImunu (Raagam: ) (Taalam: ) pa|| Isura lImunu lIcarAcaramulu | yisakalamaMtayu nidi yevvaru || ca|| ennika nAmamu liTu nIvai yuMDaga | yinni nAmamu liTu nIvai yuMDaga | vunnacOTanE nIvu vuMDucuMDuga mari | yinniTA diruguvA ridi yevvaru || ca|| vokkarUpai nIvu vuMDucuMDaga mari | takkina yIrUpamulu tAmevvaru | yikkaDanakkaDa nIvu yiTu AtmalalOnuMDa | makkuva nuMDuvAru mari yevvaru || ca|| SrIvEMkaTAdripai celagi nI vuMDagA | daivaMbulanuvAru tAmevvaru | kAvalasinacOTa kaligi nIvuMDaga | yIviSvap...

IrUpamai vunnADu yItaDE - ఈరూపమై వున్నాడు యీతడే

ఈరూపమై వున్నాడు (రాగం: ) (తాళం : ) ప|| ఈరూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము | శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు || చ|| పొదలి మాయాదేవిపట్టిన సముద్రము | అదె పంచభూతాలుండే అశ్వత్థము | గుదిగొన్నబ్రహ్మాండాలగుడ్ల బెట్టెహంస | సదరపుబ్రహ్మలకు జలజమూలకందము || చ|| అనంతవేదాలుండేటిఅక్షయవటపత్రము | ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము | కనలుదానవమత్తగజసంహరసింహము | మొనసి సంసారభారము దాల్చే వృషభము || చ|| సతతము జీవులకు చైతన్యసూత్రము| అతిశయభక్తులజ్ఞానామృతము | వ్రతమై శ్రీవెంకటాద్రి వరములచింతామణి | తతిగొన్న మోక్షపుతత్త్వరహస్యము|| IrUpamai vunnADu (Raagam: ) (Taalam: ) pa|| IrUpamai vunnADu yItaDE parabrahmamu | SrIramAdEvitODa SrIvEMkaTESuDu || ca|| podali mAyAdEvipaTTina samudramu | ade paMcaBUtAluMDE aSvatthamu | gudigonnabrahmAMDAlaguDla beTTehaMsa | sadarapubrahmalaku jalajamUlakaMdamu || ca|| anaMtavEdAluMDETiakShayavaTapatramu | GanadEvatalaku SrIkarayaj~jamu | kanaludAnavamattagajasaMharasiMhamu | monasi saMsAraBAramu dAlcE vRuShaBamu || ca|| satatamu jIvulaku caitanyasUtramu| atiSayaBaktulaj~jAnAmRutamu | vr...

IBavamunaku jUDa - ఈభవమునకు జూడ

ఈభవమునకు జూడ (రాగం: ) (తాళం : ) ప|| ఈభవమునకు జూడ నేది గడపల తనదు- | ప్రాభవం బెడలించి బాధ పెట్టించె || చ|| చెప్పించె బ్రియము వలసినవారలకునెల్ల | రప్పించె నెన్నడును రానిచోట్లకును | నొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను | తిప్పించె కోరికల తిరిగి నలుగడల || చ|| పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల | కట్టించె సంసారకలితబంధముల | పెట్టించె ఆసలను పెడకొడముల దన్ను | తిట్టించె నిజద్రవ్యదీనకులచేత || చ|| బెదరించె దేహంబు పెనువేదనలచేత | చెదరించె శాంతంబు చెలగి చలమునను | విదళించె భవములను వేంకటేశ్వరు గొలిచి | పదిలించె నతనికృప పరమసౌఖ్యములు || IBavamunaku jUDa (Raagam: ) (Taalam: ) pa|| IBavamunaku jUDa nEdi gaDapala tanadu- | prABavaM beDaliMci bAdha peTTiMce || ca|| ceppiMce briyamu valasinavAralakunella | rappiMce nennaDunu rAnicOTlakunu | noppiMce nAsalaku vOraMta proddunanu | tippiMce kOrikala tirigi nalugaDala || ca|| puTTiMce hEyaMpuBOgayOnulanella | kaTTiMce saMsArakalitabaMdhamula | peTTiMce Asalanu peDakoDamula dannu | tiTTiMce nijadravyadInakulacEta || ca|| bedariMce dEhaMbu penuvEdanalacEta ...

Ipeku nitaDu dagu - ఈపెకు నితడు దగు

ఈపెకు నితడు (రాగం: ) (తాళం : ) ఈపెకు నితడు దగు నితనికీపె దగు చూపులకు పండుగాయ శోభనము నేడు || పిలువరె పెండ్లి కూతుబెండ్లిపీటమీదకి చెలగి తానెదురు చూచీ దేవుడు బలువుగా నిద్దరికి బాసికములు గట్టరె కలిమెల్ల మెరసి సింగారించరే || ఆతలదెచ్చి పెట్టరె ఆ పెండ్లి కూతురును యీతడే జంట సోభన మిద్దరికిని కాతరాన బువ్వానకు గక్కన బెట్టరె మీరు రేతిట నుండియు వేగిరించేరు వీరు || పానుపు పరచరె బలునాగవల్లి నేడు పూని తెరవేయరె పోలతులాల ఆనుక శ్రీవేంకటేశుడలమేలుమంగయును లోననె భూకాంతయును లోలువైరి తాము || Ipeku nitaDu (Raagam: ) (Taalam: ) Ipeku nitaDu dagu nitanikIpe dagu chUpulaku paMDugAya SObhanamu nEDu || piluvare peMDli kUtubeMDlipITamIdaki chelagi tAneduru chUchI dEvuDu baluvugA niddariki bAsikamulu gaTTare kalimella merasi siMgAriMcharE || Ataladechchi peTTare A peMDli kUturunu yItaDE jaMTa sObhana middarikini kAtarAna buvvAnaku gakkana beTTare mIru rEtiTa nuMDiyu vEgiriMchEru vIru || pAnupu parachare balunAgavalli nEDu pUni teravEyare pOlatulAla Anuka SrIvEMkaTESuDalamElumaMgayunu lOnane bhUkAMtayunu l...

IdEha vikAramunaku - ఈదేహ వికారమునకు

ఈదేహ వికారమునకు(రాగం: ) (తాళం : ) ప|| ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము | మోదమెరంగని మోహము ముందర గననీదు || చ|| నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు | సత్యాలాపవిచారము జరగదు లోభికిని | హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును | ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు || చ|| సతతానందవికాసము సంధించదు తామసునకు | గతకల్మష భావము దొరకదు వ్యసనికిని | జితకాముడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి | అతులితగంభీర గుణంబలవడ దధమునకు || చ|| శ్రీవేంకటగిరి వల్లభుసేవా తత్పరభావము- | ద్రోవ మహాలంపటులకు తోపదు తలపునకు | దేవోత్తముడగు నీతని దివ్యామృతమగు నామము | సేవింపగ నితరులకును చిత్తంబొడబడదు || IdEha vikAramunaku(Raagam: ) (Taalam: ) pa|| IdEha vikAramunaku nEdiyu gaDapala Ganamu | mOdameraMgani mOhamu muMdara gananIdu || ca|| nityAnityavivEkamu nIrasunaku nonagUDadu | satyAlApavicAramu jaragadu lOBikini | hatyAvirahita karmamu aMTadu krUrAtmunakunu | pratyakShaMbagu pApamu pAyadu kaShTunaku || ca|| satatAnaMdavikAsamu saMdhiMcadu tAmasunaku | gatakalmaSha BAvamu dorakadu vyasanikini | jitakAmuDu dAnavuTaku...

IdigAka soubhAgyamidigAka - ఈదిగాక సౌభాగ్యమిదిగాక

ఈదిగాక సౌభాగ్యమిదిగాక (రాగం:ముఖ్హారి ) (తాళం : ) ఈదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి ఇదిగాక వైభవం బిక నొకతిగలదా? || అతివ జన్మము సఫలమై పరమయొగి వలె నితర మొహోపేక్ష లిన్ని యును విదిచె సతి కోరికలు మహాశాంతమై ఇదెచూడ సతత విగ్నాన వాసనవోలె నుండె || తరుణి హ్రుదయము క్రుతార్ఢత బొంది విభుమీది పరవశానంద సంపదకు నిరవాయ సరసిజానన మనో జయమంది ఇంతలో సరిలేక మనసు నిశ్చల భావమాయ || శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్వ భావంబు నిజముగా బట్టె చెలియాత్మ దేవోత్తముని క్రుపాధీనురాలై ఇపుడు లావణ్యవతికి నుల్లంబు తిరమాయ || IdigAka soubhAgyamidigAka (Raagam:muKhAri ) (Taalam: ) IdigAka soubhAgyamidigAka tapamu maRi idigAka vaibhavaM bika nokatigaladA? || ativa janmamu saphalamai paramayogi vale nitara mohOpEkSha linni yunu vidiche sati kOrikalu mahASAMtamai idechUDa satata vignAna vAsanavOle nuMDe || taruNi hrudayamu krutArDhata boMdi vibhumIdi paravaSAnaMda saMpadaku niravAya sarasijAnana manO jayamaMdi iMtalO sarilEka manasu niSchala bhAvamAya || SrI vEMkaTESvaruni jiMtiMchi paratatva bhAvaMbu nijamugA baTTe cheliyAt...

Itani mahimalu eMtani - ఈతని మహిమలు ఎంతని

ఈతని మహిమలు(రాగం: ) (తాళం : ) ప|| ఈతని మహిమలు ఎంతని చెప్పెద | చేతుల మ్రొక్కెద చెలగుచు నేను || చ|| శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి | నానా విధకర నఖరుడు | దానవ దైత్య విదారుడు విష్ణుడు | తానకమగు మా దైవంబితడు || చ|| అహోబలేశుడు ఆదిమపురుషుడు | బహు దేవతాసార్వ భౌముడు | సహజానందుడు సర్వరక్షకుడు | ఇహపరము లొసగు యేలిక యితడు || చ|| కేవలుడగు సుగ్రీవనృసింహుడు | భావించ సుజన పాలకుడితడు | శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు | వేవేలకు వేల్పు ఇతడు || Itani mahimalu (Raagam: ) (Taalam: ) pa|| Itani mahimalu eMtani ceppeda | cEtula mrokkeda celagucu nEnu || ca|| SrI narasiMhuDu cinmaya mUriti | nAnA vidhakara naKaruDu | dAnava daitya vidAruDu viShNuDu | tAnakamagu mA daivaMbitaDu || ca|| ahObalESuDu AdimapuruShuDu | bahu dEvatAsArva BaumuDu | sahajAnaMduDu sarvarakShakuDu | ihaparamu losagu yElika yitaDu || ca|| kEvaluDagu sugrIvanRusiMhuDu | BAviMca sujana pAlakuDitaDu | SrIvEMkaTESuDu cittaja janakuDu | vEvElaku vElpu itaDu ||

Eetani golichitaenae yinni - ఈతని గొలిచితేనే యిన్ని

ఈతని గొలిచితేనే (రాగం:గౌళ ) (తాళం : ) ఈతని గొలిచితేనే యిన్ని గొలలును దీరు చేతనబెట్టుపుణ్యాలు చేరువనే కలుగు పట్టి కాళింగుని దోలి పాముకొల దీర్చినాడు బట్టబాయిటనే రేపల్లెవారికి అట్టె పూతన జంపి ఆడుగొల దీర్చినాడు గట్టిగా గృష్ణుడు లోకమువారికెల్లను బలురావణు జంపి బాపనకొల దీర్చినాడు యిలమీద గలిగినఋషులకెల్లా కొలదిమీరినయట్టికోతికొల దీర్చినాడు సొలసి రాఘవుడదె సుగ్రీవునికిని వొలిసి పురాలు చొచ్చి పూర గొల దీర్చినాడు అల తనదాసులైన అమరులకు సిలుగుగొలలు దీర్చి సేన వరా లిచ్చినాడు చెలగి పరుషలకు శ్రీవేంకటేశుడు Eetani golichitaenae (Raagam: Gaula) (Taalam: ) Eetani golichitaenae yinni golalunu deeru Chaetanabettupunyaalu chaeruvanae kalugu Patti kaalimguni doli paamukola deerchinaadu Battabaayitanae raepallevaariki Atte pootana jampi aadugola deerchinaadu Gattigaa grshnudu lokamuvaarikellanu Baluraavanu jampi baapanakola deerchinaadu Yilameeda galiginarshulakellaa Koladimeerinayattikotikola deerchinaadu Solasi raaghavudade sugreevunikini Volisi puraalu chochchi poora gola deerchinaadu Ala tanadaa...

ItaDE raghurAmuDItaDEkAMgavIruDu - ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు

ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు (రాగం: ) (తాళం : ) ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు|యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు|| ఖరదూషణాదులను ఖండతుండముల సేసె|అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె సరవి కొండలచేత సముద్రము బంధించె|ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము|| కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల|తోడనే రావణుజంపె దురము గెల్చె వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె|యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన|| పుడమియంతయు( గాచె పొందుగా తనంతలేసి-|కొడుకుల( గాంచెను కుశలవుల యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె|అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె|| ItaDE raghurAmuDItaDEkAMgavIruDu (Raagam: ) (Taalam: ) ItaDE raghurAmuDItaDEkAMgavIruDu|yItaDu chEsina chEta lenniyainA kalavu kharadUshaNAdulanu khaMDatuMDamula sEse|arudugA vAli nokkayammuna nEse saravi koMDalachEta samudramu baMdhiMche|iravai vibhIshaNunikichche laMkArAjyamu|| kUDapeTTe vAnarula, kuMbhakarNAdidaityula|tODanE rAvaNujaMpe duramu gelche vEDukatO sItAdEvi kUDenu pushpakamekke|yIDu jODai siMhAsana mEle nayOdhyalOna puDamiyaMtayu( gAche poMdugA tanaMtalEsi-|koDukula( gAMchen...

ItaDE mukti dOva - ఈతడే ముక్తి దోవ

ఈతడే ముక్తి దోవ (రాగం: ) (తాళం : ) ప|| ఈతడే ముక్తి దోవ యీతడే మాయాచార్యు- | డితడు గలుగబట్టి యిందరు బదికిరి || చ|| అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు | యిది వీడె శ్రీవేంకటేశు నెదుట | వెద వెట్టి లోకములో వేదము లన్నియు మంచి | పదములు సేసి పాడీ పావనము సెసెను || చ|| అలరుచు దాళ్ళపాక అన్నమాచార్యులు | నిలచి శ్రీవేంకట నిధియే తానై | కలిదోషములు వాప ఘన పురాణము లెల్ల | పలుకుల నించి పాడినాడు హరిని || చ|| అంగవించె దాళ్ళపాక అన్నమాచార్యులు | బంగారు శ్రీ వేంకటేశు పాదములందు | రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలు | మంగను యిద్దరిబాడి మమ్ము గరుణించెను || ItaDE mukti dOva (Raagam: ) (Taalam: ) pa|| ItaDE mukti dOva yItaDE mAyAcAryu- | DitaDu galugabaTTi yiMdaru badikiri || ca|| adivO tALLapAka annamAcAryulu | yidi vIDe SrIvEMkaTESu neduTa | veda veTTi lOkamulO vEdamu lanniyu maMci | padamulu sEsi pADI pAvanamu sesenu || ca|| alarucu dALLapAka annamAcAryulu | nilaci SrIvEMkaTa nidhiyE tAnai | kalidOShamulu vApa Gana purANamu lella | palukula niMci pADinADu harini || ca|| aMgaviMce dALLapAka annamAcAryulu |...

ItaDaKilaMbunaku - ఈతడఖిలంబునకు

ఈతడఖిలంబునకు (రాగం: ) (తాళం : ) ప|| ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల- | భూతములలోన దా బొదలువాడితడు || చ|| గోపాంగనలమెరుగు గుబ్బచన్నులమీద | చూపట్టుకమ్మ గస్తురిపూత యితడు | తాపసోత్తముల చింతాసౌధములలోన | దీపించు సుజ్ఞానదీప మితడు || చ|| జలధికన్యాపాంగ లలితేక్షణములతో | కలసి వెలుగుచున్న కజ్జలంబితడు | జలజాసనుని వదనజలధి మధ్యమునందు | అలర వెలువడిన పరమామృతంబితడు || చ|| పరివోని సురతసంపదల నింపులచేత | వరవధూతతికి పరవశమైన యితడు | తిరువేంకటాచలాధిపుడు దానె యుండి | పరిపాలనముసేయు భారకుండితడు || ItaDaKilaMbunaku (Raagam: ) (Taalam: ) pa|| ItaDaKilaMbunaku nISvaruDai sakala- | BUtamulalOna dA bodaluvADitaDu || ca|| gOpAMganalamerugu gubbacannulamIda | cUpaTTukamma gasturipUta yitaDu | tApasOttamula ciMtAsaudhamulalOna | dIpiMcu suj~jAnadIpa mitaDu || ca|| jaladhikanyApAMga lalitEkShaNamulatO | kalasi velugucunna kajjalaMbitaDu | jalajAsanuni vadanajaladhi madhyamunaMdu | alara veluvaDina paramAmRutaMbitaDu || ca|| parivOni suratasaMpadala niMpulacEta | varavadhUtatiki paravaSamaina yitaDu | tiruvEMkaTA...

Eetagavae naaku neeku - ఈతగవే నాకు నీకు

ఈతగవే నాకు (రాగం: సామంతం) (తాళం : ) ఈతగవే నాకు నీకు నెంచి చూచితే కాతరపుజీవులకు గలదా వివేకము భారము నీదిగనక పలుమారు బాపములే చేరి మొక్కలాన నే జేసితిని పేరడి దల్లిదండ్రులు బిడ్డ లేమిసేసినాను వోరుచుక ముద్దుసేసుకుందురు లోకమున కాన నీవుగలవని కడదాకా నేరములే వేవేలు సేసితిని వెఱవక భావించుక యింటిదొర పసురము దెంచుకొని యేవిధి బైరుమేసినా నెగ్గుసేయ డతడు పుట్టించేవాడవు నీవు పొదలేవారము నేము యెట్టుండినా నీకు బోదు యెన్నటికిని వొట్టుక శ్రీవేంకటేశ వోడగట్టినదూలము అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు Eetagavae naaku(Raagam: Saamamtam) (Taalam: ) Eetagavae naaku neeku nemchi choochitae Kaatarapujeevulaku galadaa vivaekamu Bhaaramu neediganaka palumaaru baapamulae Chaeri mokkalaana nae jaesitini Paeradi dallidamdrulu bidda laemisaesinaanu Voruchuka muddusaesukumduru lokamuna Kaana neevugalavani kadadaakaa naeramulae Vaevaelu saesitini ve~ravaka Bhaavimchuka yimtidora pasuramu demchukoni Yaevidhi bairumaesinaa neggusaeya datadu Puttimchaevaadavu neevu podalaevaaramu naemu Yettumdinaa neeku bodu yenna...

Eeda numde nimdaakaa - ఈడ నుండె నిందాకా

ఈడ నుండె నిందాకా (రాగం: లలిత) (తాళం : ) ఈడ నుండె నిందాకా నింటిముంగిట ఆడ నెందు బోడుగద అప్పుడే యీకృష్ణుడు యేడ పూతకి జంపె నింతపిన్నవాడంటా ఆడుకొనే రదే వీధి నందరు గూడి వేడుకతో మనగోవిందుడు గాడుగదా చూడరమ్మ వీడు గడుచుల్లరీడు పాపడు మరలి యపటివాడె మద్దులు విఱిచెనంటా పరువులు పెట్టేరు పడతులెల్లా కరికరించగ రోల గట్టితే నప్పుడు మా హరి గాడుగదా ఆడనున్న బిడ్డడు వింతగాక నొకబండి విఱిచె నప్పటినంటా రంతు సేసే రదివో రచ్చలు నిండి అంత యీశ్రీవేంకటేశు డైనమనకృష్ణుడంట యింతేకాక యెవ్వరున్నా రిటువంటిపాపడు Eeda numde nimdaakaa (Raagam:Lalita ) (Taalam: ) Eeda numde nimdaakaa nimtimumgita Aada nemdu bodugada appudae yeekrshnudu Yaeda pootaki jampe nimtapinnavaadamtaa Aadukonae radae veedhi namdaru goodi Vaedukato managovimdudu gaadugadaa Choodaramma veedu gaduchullareedu paapadu Marali yapativaade maddulu vi~richenamtaa Paruvulu pettaeru padatulellaa Karikarimchaga rola gattitae nappudu maa Hari gaadugadaa aadanunna biddadu Vimtagaaka nokabamdi vi~riche nappatinamtaa Ramtu saesae radivo rachchalu nimdi Am...

Ikeku nIku dagu - ఈకెకు నీకు దగు

ఈకెకు నీకు దగు (రాగం: ) (తాళం : ) ప|| ఈకెకు నీకు దగు నీడు జోడులు | వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు || చ|| జట్టిగొన్న నీదేవులు చంద్రముఖి గనక | అట్టె నిన్ను రామచంద్రుడనదగును | చుట్టమై కృష్ణయ్యవు చూపుల యాపె గనక | చుట్టుకొని నిన్ను కృష్ణుడనదగును || చ|| చందమైన వామలోచని యాపెయౌగనక | అందరు నిన్ను వామనుడనదగును | చెంది యాకె యెప్పటికిని సింహ మధ్య గనక | అంది నిన్ను నరసింహుడని పిల్వదగును || చ|| చెలువమైన యాపె శ్రీదేవి యగుగనక | అల శ్రీవక్షుడవని యాడదగును | అలమేల్మంగ యహిరోమావళి గలదిగన | యిల శేషాద్రి శ్రీవేంకటేశు డనదగును || Ikeku nIku dagu (Raagam: ) (Taalam: ) pa|| Ikeku nIku dagu nIDu jODulu | vAkucci mimmu bogaDa vasamA yorulaku || ca|| jaTTigonna nIdEvulu caMdramuKi ganaka | aTTe ninnu rAmacaMdruDanadagunu | cuTTamai kRuShNayyavu cUpula yApe ganaka | cuTTukoni ninnu kRuShNuDanadagunu || ca|| caMdamaina vAmalOcani yApeyauganaka | aMdaru ninnu vAmanuDanadagunu | ceMdi yAke yeppaTikini siMha madhya ganaka | aMdi ninnu narasiMhuDani pilvadagunu || ca|| celuvamaina yApe SrIdEvi yagugana...

I viSvAsaMbu yevvariki - ఈ విశ్వాసంబు యెవ్వరికి

ఈ విశ్వాసంబు (రాగం:శ్రీరాగం ) (తాళం : ) ప|| ఈ విశ్వాసంబు యెవ్వరికి దోప దిదిది | పావనులహృదయమున బ్రభవించుగాని || చ|| ఇమ్మయినపాపంబు లెన్నివలసిన బ్రాణి | సమ్మతంబున జేయజాలుగాకేమి | కుమ్మరికి నొకయేడు గుదియు కొకనాడవును | నమ్మితలచిన విష్ణునామంబుచేత || చ|| కొదలేనిదురితములు కొండలును గోట్లును | చెదర కెప్పుడు బ్రాణి చేయుగాకేమి | పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను | హృదయంబు హరిమీద నుండినంతటను || చ|| సరిలేనిదుష్కర్మ సంఘములు రాసులై | పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి | బెరసి కొండలమీద బిడుగుపడ్డట్లౌను | తిరువేంకటాచలాధిపుని దలచినను || I viSvAsaMbu (Raagam:SrIrAgaM) (Taalam: ) pa|| I viSvAsaMbu yevvariki dOpa dididi | pAvanulahRudayamuna braBaviMcugAni || ca|| immayinapApaMbu lennivalasina brANi | sammataMbuna jEyajAlugAkEmi | kummariki nokayEDu gudiyu kokanADavunu | nammitalacina viShNunAmaMbucEta || ca|| kodalEniduritamulu koMDalunu gOTlunu | cedara keppuDu brANi cEyugAkEmi | podari goriyalalOna pulicoccinaTlaunu | hRudayaMbu harimIda nuMDinaMtaTanu || ca|| sarilEniduShkarma saMGamulu rAsu...

Ee maata vini ninnu - ఈ మాట విని నిన్ను

ఈ మాట విని (రాగం: సాళంగనాట) (తాళం : ) ఈ మాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను నేమమెంత నేమెంత నీకరుణ యెంత. సకలకర్మముచేత సాధ్యముగానినీవు వొకైంచుకంతభక్తి కొగిలోనైతి ప్రకటించి బహువేదపఠన జిక్కనినీవు మొకరివై తిరుమంత్రమునకు జిక్కితివి. కోటిదానములచేత కోరి లోనుగాని నీవు పాటించి శరణంటేనే పట్టి లోనైతి మేటి వుగ్రతపముల మెచ్చి కైకొననినీవు గాటపుదాసు లైతేనే కైకొని మన్నించితి. పెక్కు తీర్థములాడిన భేదించరానినీవు చొక్కి నీముద్రవారికి సులభుడవు గక్కన దేవతలకు గానరానినీవు మాకు నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి. Ee maata vini (Raagam:Saalamganaata ) (Taalam: ) Ee maata vini ninnu nimdukae navviti naenu Naemamemta naememta neekaruna yemta. Sakalakarmamuchaeta saadhyamugaanineevu Vokaimchukamtabhakti kogilonaiti Prakatimchi bahuvaedapathana jikkanineevu Mokarivai tirumamtramunaku jikkitivi. Kotidaanamulachaeta kori lonugaani neevu Paatimchi saranamtaenae patti lonaiti Maeti vugratapamula mechchi kaikonanineevu Gaatapudaasu laitaenae kaikoni mannimchiti. Pekku teerthamulaadina bhaedimcharaanineevu C...

I jIvunaku nEdi - ఈ జీవునకు నేది

ఈ జీవునకు నేది (రాగం: ) (తాళం : ) ప|| ఈ జీవునకు నేది గడపల తనకు | నేజాతియును లేక యిట్లున్నవాడు || చ|| బహుదేహ కవచముల బారవేసినవాడు | బహుస్వతంత్రముల నాపదనొందినాడు | బహుకాలముల మింగి పరవశంబైనవాడు | బహు యోనికూపములబడి వెడలినాడు || చ|| పెక్కుబాసలు నేర్చి పెంపుమిగిలినవాడు | పెక్కునామములచే బిలువబడినాడు | పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ | పెక్కులాగుల బెనగి చెండుపడినాడు || చ|| ఉండనెన్నడు దనకు ఊరటెన్నడులేక | యెండలకు నీడలకు యెడతాకినాడు | కొండలలో నెలకొన్న కోనేటిరాయని | యండ జేరెదననుచు నాసపడినాడు || I jIvunaku nEdi (Raagam: ) (Taalam: ) pa|| I jIvunaku nEdi gaDapala tanaku | nEjAtiyunu lEka yiTlunnavADu || ca|| bahudEha kavacamula bAravEsinavADu | bahusvataMtramula nApadanoMdinADu | bahukAlamula miMgi paravaSaMbainavADu | bahu yOnikUpamulabaDi veDalinADu || ca|| pekkubAsalu nErci peMpumigilinavADu | pekkunAmamulacE biluvabaDinADu | pekkukAMtalatODa pekkupuruShulatODa | pekkulAgula benagi ceMDupaDinADu || ca|| uMDanennaDu danaku UraTennaDulEka | yeMDalaku nIDalaku yeDatAkinADu | koMDalalO...

ihamEkAni yika - ఇహమేకాని యిక

ఇహమేకాని యిక (రాగం: ) (తాళం : ) ప|| ఇహమేకాని యిక బరమేకాని | బహుళమై హరి నీపైభక్తే చాలు || చ|| యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి | కందువనీదాస్యము గలిగితే జాలు | అంది స్వర్గమేకాని అలనరకమేకాని | అందపునీనామము నాకబ్బుటే చాలు || చ|| దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు | కరగి నిన్నుదలచగలితే జాలు | పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు | హరినీసేవాపరుడౌటే చాలు || చ|| యిల జదువులురానీ యిటు రాకమాననీ | తలపు నీపాదములతగులే చాలు | యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె | చలపట్టి నాకు నీశరణమేచాలు || ihamEkAni yika (Raagam: ) (Taalam: ) pa|| ihamEkAni yika baramEkAni | bahuLamai hari nIpaiBaktE cAlu || ca|| yeMdu janiMcina nEmi yeccOTanunnanEmi | kaMduvanIdAsyamu galigitE jAlu | aMdi svargamEkAni alanarakamEkAni | aMdapunInAmamu nAkabbuTE cAlu || ca|| dorayainajAlu gaDu ducCapubaMTaina jAlu | karagi ninnudalacagalitE jAlu | parulumeccinamElu pammidUShiMcinamElu | harinIsEvAparuDauTE cAlu || ca|| yila jaduvulurAnI yiTu rAkamAnanI | talapu nIpAdamulatagulE cAlu | yelami SrIvEMkaTESa yElitivi nann...

ihameTTidO parameTTidO - ఇహమెట్టిదో పరమెట్టిదో

ఇహమెట్టిదో పరమెట్టిదో (రాగం: ) (తాళం : ) ప|| ఇహమెట్టిదో పరమెట్టిదో ఇక నాకు | సహజమై హరియే శరణము నాకు || చ|| చిత్తమిది యొకటే చింత వేవేలసంఖ్య | పొత్తుల హరిదలచ బొద్దులేదు | జొత్తుల కన్నుల రెండు చూపులైతే ననంతాలు | తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు || చ|| చేతులివియు రెండే చేష్టలు లక్షోపలక్ష | యీతల హరి బూజింప నిచ్చలేదు | జాతి నాలిక వొకటే చవులు కోటానగోటి | రీతి హరినామ ముచ్చరించ వేళలేదు || చ|| వీనులివి రెండే వినికి కొలదిలేదు | పూని హరిభక్తి విన బుద్ధి లేదు | యీనటన శ్రీవేంకటేశు డిటు చూచినను | తానే యేలె నిక దడబాటు లేదు || ihameTTidO parameTTidO (Raagam: ) (Taalam: ) pa|| ihameTTidO parameTTidO ika nAku | sahajamai hariyE SaraNamu nAku || ca|| cittamidi yokaTE ciMta vEvElasaMKya | pottula haridalaca boddulEdu | jottula kannula reMDu cUpulaitE nanaMtAlu | tattariMci harirUpu daggari cUDalEdu || ca|| cEtuliviyu reMDE cEShTalu lakShOpalakSha | yItala hari bUjiMpa niccalEdu | jAti nAlika vokaTE cavulu kOTAnagOTi | rIti harinAma muccariMca vELalEdu || ca|| vInulivi reMDE viniki koladilEdu |...

ihamunu baramunu - ఇహమును బరమును

ఇహమును బరమును (రాగం: ) (తాళం : ) ప|| ఇహమును బరమును యిందే వున్నవి | వహికెక్క దెలియువారలు లేరు || చ|| చట్టువంటి దీచంచలపుమనసు | కొట్టులబడేది గుఱిగాదు | దిట్ట వొరులు బోధించిన గరగదు | పట్టబోయితే పసలేదు || చ|| చిగురువంటి దీజీవశరీరము | తగుళ్ళు పెక్కులు తతిలేదు | తెగనిలంపటమే దినమును బెనచును | మొగము గల దిదే మొనయును లేదు || చ|| గనివంటిది యీఘనసంసారము | తనిసితన్పినా దగ లేదు | ఘనుడగు శ్రీవేంకటపతి గావగ | కొనమొద లేర్పడె కొంకే లేదు || ihamunu baramunu (Raagam: ) (Taalam: ) pa|| ihamunu baramunu yiMdE vunnavi | vahikekka deliyuvAralu lEru || ca|| caTTuvaMTi dIcaMcalapumanasu | koTTulabaDEdi gurxigAdu | diTTa vorulu bOdhiMcina garagadu | paTTabOyitE pasalEdu || ca|| ciguruvaMTi dIjIvaSarIramu | taguLLu pekkulu tatilEdu | teganilaMpaTamE dinamunu benacunu | mogamu gala didE monayunu lEdu || ca|| ganivaMTidi yIGanasaMsAramu | tanisitanpinA daga lEdu | GanuDagu SrIvEMkaTapati gAvaga | konamoda lErpaDe koMkE lEdu ||

Ihamu baramu jikke - ఇహము బరము జిక్కె

ఇహము బరము (రాగం:వసంతవరాళి ) (తాళం : ) ఇహము బరము జిక్కె నీతనివంక అహిశయనునిదాసులంతవారు వేరీ సిరికలిగినవారు చింతలిన్నిటను బాసి నిరతపువర్గముతో నిక్కేరటా సిరికి మగడయిన శ్రీపతి యేలి మ__ మ్మరయుచునున్నాడు మాయంతవారు వెరి బలవంతుడైనవాడు భయములిన్నిట బాసి గెలిచి పేరువాడుచు గెరిలీనటా బలదేవుడైన శ్రీపతి మా యింటిలోన అలరివున్నాడు మాయంతవారు వేరి భూములేలేటివాడు భోగములతో దనిసి కామించి యానందమున గరగీనటా సేమముతో భూపతైన శ్రీవేంకటేశుడు మాకు ఆముకొనివుండగా మాయంతవారు వేరీ Ihamu baramu (Raagam: Vasamtavaraali) (Taalam: ) Ihamu baramu jikke neetanivamka Ahisayanunidaasulamtavaaru vaeree Sirikaliginavaaru chimtalinnitanu baasi Niratapuvargamuto nikkaerataa Siriki magadayina Sreepati yaeli ma__ Mmarayuchununnaadu maayamtavaaru veri Balavamtudainavaadu bhayamulinnita baasi Gelichi paeruvaaduchu gerileenataa Baladaevudaina Sreepati maa yimtilona Alarivunnaadu maayamtavaaru vaeri Bhoomulaelaetivaadu bhogamulato danisi Kaamimchi yaanamdamuna garageenataa Saemamuto bhoopataina sreevaemkataesudu maaku Aamukoniv...

ihaparamulakunu - ఇహపరములకును

ఇహపరములకును (రాగం: ) (తాళం : ) ప|| ఇహపరములకును ఏలికవు | బహురూపంబుల ప్రహ్లాదవరదుడు || చ|| వేయికరంబుల వివిధాయుధంబుల | దాయల నడచిన దైవమవు | నీయందున్నవి నిఖిల జగంబులు | పాయక మమ్మేలు ప్రహ్లాదవరద || చ|| కదిమి దుష్టులను గతము చేసితివి | త్రిదశుల గాచిన దేవుడవు | వదల కిందరికి వరములొసంగగ | బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద || చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు | కావలసినచో కలుగుదువు | శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన | భావింతు నీమూర్తి ప్రహ్లద వరద || ihaparamulakunu (Raagam: ) (Taalam: ) pa|| ihaparamulakunu Elikavu | bahurUpaMbula prahlAdavaraduDu || ca|| vEyikaraMbula vividhAyudhaMbula | dAyala naDacina daivamavu | nIyaMdunnavi niKila jagaMbulu | pAyaka mammElu prahlAdavarada || ca|| kadimi duShTulanu gatamu cEsitivi | tridaSula gAcina dEvuDavu | vadala kiMdariki varamulosaMgaga | bratikiti midivO prahlAdavarada || ca|| SrIvallaBuDavu cittajaguruDavu | kAvalasinacO kaluguduvu | SrIvEMkaTAdrini SrI ahObalAna | BAviMtu nImUrti prahlada varada ||

isuka pAtara - ఇసుక పాతర

ఇసుక పాతర (రాగం: ) (తాళం : ) ప|| ఇసుక పాతర యిందుకేది కడగురుతు | రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి || చ|| బయలు వలె నుండును పట్టరాదు వలపు | మొయిలి వలె నుండును ముద్దు శాయరాదు | నియతము లేదిందుకు నేరిచిన వారి సొమ్ము | క్రియ యెరుంగు తా నన్ను గెరలించ నేటికి || చ|| గాలివలె బారుచుండు కానరాదు మనసు | పాలవలె బొంగుచుండు పక్కన నణగదు | యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగ గుజ్జు | లోలోనే మమ్ము నింత లోచి చూడనేటికి || చ|| వెన్నెలే కాయుచు నుండు వింతగాను వయసు | అన్నిటా వసంత ఋతువై యుండ బోదు | వున్నతి శ్రీ వేంకటేశుడుండ నుండ జవి బుట్ట | మన్నించె యింక మారు మాటలాడ నేటికి || isuka pAtara (Raagam: ) (Taalam: ) pa|| isuka pAtara yiMdukEdi kaDagurutu | rasikuDa nannu niMta ravva SAya nETiki || ca|| bayalu vale nuMDunu paTTarAdu valapu | moyili vale nuMDunu muddu SAyarAdu | niyatamu lEdiMduku nEricina vAri sommu | kriya yeruMgu tA nannu geraliMca nETiki || ca|| gAlivale bArucuMDu kAnarAdu manasu | pAlavale boMgucuMDu pakkana naNagadu | yElIlA geluvarAdu yekkitE yEnuga gujju | lOlOnE mammu niMta lOci cUDanET...

ivi sEyaga nEnalasuDa - ఇవి సేయగ నేనలసుడ

ఇవి సేయగ (రాగం: ) (తాళం : ) ప|| ఇవి సేయగ నేనలసుడ యెటువలె మోక్షంబడిగెదను | వివరముతోడుత నీవు సులభూడవు విష్ణుడ నిన్నే కొలిచెదగాక || చ|| జపయజ్ఞదానకర్మంబులు యెంచగ జిరకాలఫలంబులు | యెపుడు బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు | అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు | వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకు గారణంబులు || చ|| రవిచంద్ర గ్రహతారాబలములు భువిలో గామ్యఫలములు | తవిలిన పంచేంద్రియ నిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు | అవిరళ ధర్మార్థ కామంబులు మఱియైశ్వర్యములకు మూలములు | ఆవల గ్రహణకానాలుష్ఠానము లధికఫలంబులు ఆశామయము || చ|| పరగ సప్తసంతాన బ్రాహ్మణ తర్పణములు ఖ్యాతిసుకృతములు | అరయ బుత్రదార క్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము | హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొసగెడిదాతవు | సరగున నీవే దయతో రక్షించజాలుదు వేకాలమును మమ్ములను || ivi sEyaga (Raagam: ) (Taalam: ) pa|| ivi sEyaga nEnalasuDa yeTuvale mOkShaMbaDigedanu | vivaramutODuta nIvu sulaBUDavu viShNuDa ninnE kolicedagAka || ca|| japayaj~jadAnakarmaMbulu yeMcaga jirakAlaPalaMbulu | yepuDu buNyatIrthasnAnamulu yila pApavimOcanamulu | aparimita dEva...

ilayunu naBamunu - ఇలయును నభమును

ఇలయును నభమును (రాగం: ) (తాళం : ) ప|| ఇలయును నభమును నేకరూపమై | జలజల గోళ్ళు జళిపించితివి || చ|| ఎడసిన నలముక హిరణ్యకశిపుని | దొడికిపట్టి చేతుల బిగిసి | కెడసి తొడలపై గిరిగొన నదుముక | కడుపుచించి కహకహ నవ్వితివి || చ|| రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు | గుప్పుచు లాలలు గురియుచును | కప్పినబెబ్బులి కసరుహుంకృతుల | దెప్పరపసురల ధృతి యణచితివి || చ|| పెళపెళనార్చుచు బెడబొబ్బలిడుచు | థళథళ మెరవగ దంతములు | ఫళఫళ వీరవిభవరస రుధిరము | గుళగుళ దిక్కుల గురియించితివి || చ|| చాతినప్రేవుల జన్నిదములతో | వాతెరసింహపు వదనముతో | చేతులువేయిట జెలగి దితిసుతుని | పోతర మణపుచు భువి మెరసితివి || చ|| అహోబలమున నతిరౌద్రముతో | మహామహిమల మలయుచును | తహతహ మెదుపుచు దగువేంకటపతి | యిహము బరము మాకిపుడొసగితివి || ilayunu naBamunu (Raagam: ) (Taalam: ) pa|| ilayunu naBamunu nEkarUpamai | jalajala gOLLu jaLipiMcitivi || ca|| eDasina nalamuka hiraNyakaSipuni | doDikipaTTi cEtula bigisi | keDasi toDalapai girigona nadumuka | kaDupuciMci kahakaha navvitivi || ca|| roppula nUrpula roccula kasarulu | guppucu lAlalu guriyucunu | kappinab...

iravainayaTTuMDu - ఇరవైనయట్టుండు

ఇరవైనయట్టుండు (రాగం: ) (తాళం : ) ప|| ఇరవైనయట్టుండు యెఱగనీ దీమాయ | తెరమఱగుమెకమువలె తిరుగు నీబ్రదుకు || చ|| అనిశమును దేహమున కన్నపానము లిడిన | యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో | గొనకొన్నమానినులకూటములసుఖము లివి | మనసుదాగినపాలు మట్టులేదెపుడు || చ|| వొదలబెట్టినసొమ్ము లొగి దనకు గానరా- | వడవి గాసినవెన్నె లది కన్నులకును | వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే | బెడిదంపుభ్రమతోడి పెనుగాలిమూట || చ|| చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు | యెద్దుయెనుపోతునై యేకంబు గాదు | వొద్దికై శ్రీవేంకటోత్తముడు యింతలో | అద్దంపునీడవలె నాత్మ బొడచూపె || iravainayaTTuMDu (Raagam: ) (Taalam: ) pa|| iravainayaTTuMDu yer~aganI dImAya | teramar~agumekamuvale tirugu nIbraduku || ca|| aniSamunu dEhamuna kannapAnamu liDina | yinumu guDicinanIru yeMdukekkinadO | gonakonnamAninulakUTamulasuKamu livi | manasudAginapAlu maTTulEdepuDu || ca|| vodalabeTTinasommu logi danaku gAnarA- | vaDavi gAsinavenne ladi kannulakunu | vuDivOniparimaLamu lokanimiShamAtramE | beDidaMpuBramatODi penugAlimUTa || ca|| caddisaMsAramuna sarusa suKadu...

iravaguvAriki - ఇరవగువారికి

ఇరవగువారికి యిహపర (రాగం: ) (తాళం : ) ప|| ఇరవగువారికి యిహపర మిదియే | హరిసేవే సర్వాత్ములకు || చ|| దురితమోచనము దుఃఖపరిహరము | హరినామమెపో ఆత్మలకు | పరమపదంబును భవనిరుహరణము | పరమాత్ముచింతే ప్రపన్నులకు || చ|| సారము ధనములు సంతోషకరములు | శౌరికథలు సంసారులకు | కోరినకోర్కియు కొంగుబంగరువు | సారె విష్ణుదాస్యము లోకులకు || చ|| యిచ్చయగుసుఖము యిరవగుపట్టము | అచ్చుతుకృప మోక్షార్థులకు | అచ్చపుశ్రీవేంకటాధిపుశరణము | రచ్చల మాపాలి రాజ్యపుసుగతి || iravaguvAriki yihapara (Raagam: ) (Taalam: ) pa|| iravaguvAriki yihapara midiyE | harisEvE sarvAtmulaku || ca|| duritamOcanamu duHKapariharamu | harinAmamepO Atmalaku | paramapadaMbunu BavaniruharaNamu | paramAtmuciMtE prapannulaku || ca|| sAramu dhanamulu saMtOShakaramulu | Saurikathalu saMsArulaku | kOrinakOrkiyu koMgubaMgaruvu | sAre viShNudAsyamu lOkulaku || ca|| yiccayagusuKamu yiravagupaTTamu | accutukRupa mOkShArthulaku | accapuSrIvEMkaTAdhipuSaraNamu | raccala mApAli rAjyapusugati ||

iyya koMTi nIpanulu - ఇయ్య కొంటి నీపనులు

ఇయ్య కొంటి నీపనులు (రాగం: ) (తాళం : ) ప|| ఇయ్య కొంటి నీపనులు ఇంతా మేలే | చెయ్యి మీదాయ నాకు సిరులేమి బాతి || చ|| నయగారి వాడవు నాకు నీవు గలవు | ప్రియములేమి గడమ పెక్కుమారులు | క్రియ లెఱుగుదువు కేలు చాచేవు నా మీద | నియతాన నిందుకే నీ యాలనైతిని || చ|| చలపాది వాడవు సతమై వున్నాడవు | చిలిము యేమి గడమ పై పై నేడు | వలపించ నేరుతువు వంచేవు నాపై ననుపు | కలకాలమును నీకు గైవశమైతిని || చ|| శ్రీ వేంకటేశుడవు చేరి నన్నుగూడితివి | దైవిక మేమి గడమ తగులాయను | భావమెఱుగుదువు పచ్చిగా నవ్వేవు నాతో | వే వెలకును నీకే వెల్లివిరి యైతిని || iyya koMTi nIpanulu (Raagam: ) (Taalam: ) pa|| iyya koMTi nIpanulu iMtA mElE | ceyyi mIdAya nAku sirulEmi bAti || ca|| nayagAri vADavu nAku nIvu galavu | priyamulEmi gaDama pekkumArulu | kriya lerxuguduvu kElu cAcEvu nA mIda | niyatAna niMdukE nI yAlanaitini || ca|| calapAdi vADavu satamai vunnADavu | cilimu yEmi gaDama pai pai nEDu | valapiMca nErutuvu vaMcEvu nApai nanupu | kalakAlamunu nIku gaivaSamaitini || ca|| SrI vEMkaTESuDavu cEri nannugUDitivi | daivika mEmi gaDa...

ippuDiTu viBubAsi - ఇప్పుడిటు విభుబాసి

ఇప్పుడిటు విభుబాస (రాగం: ) (తాళం : ) ప|| ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు | తప్పు లోపలి తప్పు దైవమా చెలికి || చ|| నగవు లోపలి యలపు నంపైన పొలయలుక | పగటు లోపలి వెరగు పచ్చివేడి | మొగము కాంతుల మెఱపు ముంచు నలుకల చెదరు | పగలు చీకట్లాయె బాపురా చెలికి || చ|| బలిమి లోపలి భయము పలుకుదేనెల కనరు | చెలిమి లోపలి చేదు చింత చెలికి | బలుపు కుచములలోని బట్టబయలగు నడుము | కలిమి లోపలి లేమి కట కటా చెలికి || చ|| నిడుపు లోపలి కురుచ నీడ లోపలి యెండ | వడి మంచి తరువు వడువని తమకము | కడు వేంకటేశ్వరుని కౌగిటను పరవశము | మడుగు లోపలి మైల మాన దీచెలికి || ippuDiTu viBubAsi(Raagam: ) (Taalam: ) pa|| ippuDiTu viBubAsi yiMtalOnane nEDu | tappu lOpali tappu daivamA celiki || ca|| nagavu lOpali yalapu naMpaina polayaluka | pagaTu lOpali veragu paccivEDi | mogamu kAMtula merxapu muMcu nalukala cedaru | pagalu cIkaTlAye bApurA celiki || ca|| balimi lOpali Bayamu palukudEnela kanaru | celimi lOpali cEdu ciMta celiki | balupu kucamulalOni baTTabayalagu naDumu | kalimi lOpali lEmi kaTa kaTA celiki || ca|| niDupu lOpa...

innilAgulacEta - ఇన్నిలాగులచేత

ఇన్నిలాగులచేత (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నిలాగులచేత లివియపో కడు- | నెన్నికకెక్కిన చేతులివియపో || చ|| గునియుచు దనునెత్తికొమ్మని తల్లిపై- | నెనయజాచిన చేతులివియపో | కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన | యినుమువంటి చేతులివియపో || చ|| పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన | యిసుమంతలు చేతులివియపో | పసుల గాచుచు గొల్లపడచుల యమునలో | యిసుకచల్లిన చేతులివియపో || చ|| పరమచైతన్యమై ప్రాణులకెల్లను | యెరవులిచ్చిన చేతులివియపో | తిరువేంకటగిరి దేవుడై ముక్తికి- | నిరవుచూపెడు చేతులివియపో || innilAgulacEta (Raagam: ) (Taalam: ) pa|| innilAgulacEta liviyapO kaDu- | nennikakekkina cEtuliviyapO || ca|| guniyucu danunettikommani tallipai- | nenayajAcina cEtuliviyapO | kinisi gOvardhanagiri vellagiMcina | yinumuvaMTi cEtuliviyapO || ca|| pisiki pUtakicannu bigiyiMcipaTTina | yisumaMtalu cEtuliviyapO | pasula gAcucu gollapaDacula yamunalO | yisukacallina cEtuliviyapO || ca|| paramacaitanyamai prANulakellanu | yeravuliccina cEtuliviyapO | tiruvEMkaTagiri dEvuDai muktiki- | niravucUpeDu cEtuliviyapO ||

innirAsula yuniki - ఇన్నిరాసుల యునికి

ఇన్నిరాసుల యునికి (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి | కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి || చ|| కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి | మెలయు మీనాక్షికిని మీనరాశి | కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి | చెలగు హరిమధ్యకును సింహరాశి || చ|| చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి | కన్నెపాయపు సతికి కన్నెరాశి | వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి | తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి || చ|| ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి | గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి | కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి | ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి || innirAsula yuniki (Raagam: ) (Taalam: ) pa|| innirAsula yuniki yiMti celuvapu rASi | kanne nI rASi kUTami galigina rASi || ca|| kaliki boma viMDlugala kAMtakunu dhanurASi | melayu mInAkShikini mInarASi | kuluku kucakuMBamula kommakunu kuMBarASi | celagu harimadhyakunu siMharASi || ca|| cinnimakarAMkapu bayyeda cEDiyaku makararASi | kannepAyapu satiki kannerASi | vannemai paiDi tuladUgu vanitaku dulArASi | tinnani vADi g...

inniyu mugisenu - ఇన్నియు ముగిసెను

ఇన్నియు ముగిసెను (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే | పన్ని పరుల చెప్పగ చోటేది || చ|| కుందని నీ రోమకూపంబులలో | గొందుల బ్రహ్మాండ కోట్లట | యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో | యిందు పరులమని యెంచగ నేది || చ|| నీ కొన చూపున నెరి కోటి సూర్యు | లేకమగుచు నుదయించురట | నీ కాయమెంతో నీ వుని కేదో | నీకంటె పరులని నిక్కగ నేది || చ|| జీవకోటి నీ చిన్ని మాయలో | ప్రోవులగుచు నటు పొడమె నట | శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో | ఆవల పరులకు ఆధిక్య మేది || inniyu mugisenu (Raagam: ) (Taalam: ) pa|| inniyu mugisenu iTu nIlOnanE | panni parula ceppaga cOTEdi || ca|| kuMdani nI rOmakUpaMbulalO | goMdula brahmAMDa kOTlaTa | yeMdaru brahmalO yeMta prapaMcamO | yiMdu parulamani yeMcaga nEdi || ca|| nI kona cUpuna neri kOTi sUryu | lEkamagucu nudayiMcuraTa | nI kAyameMtO nI vuni kEdO | nIkaMTe parulani nikkaga nEdi || ca|| jIvakOTi nI cinni mAyalO | prOvulagucu naTu poDame naTa | SrIvEMkaTESvara ceppaga nIveMtO | Avala parulaku Adhikya mEdi ||

inniyu galuguTEjanmamuna - ఇన్నియు గలుగుటేజన్మమున

ఇన్నియు గలుగుటేజన్మమున (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నియు గలుగుటేజన్మమున నైన | జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు || చ|| అరయ వేదాధ్యనమది బ్రహ్మశుద్ధికొర- | కిరవైన శాస్త్రంబులెరుక కొరక | తరి యజ్ఞములు ఋణోత్తారమయ్యెడి కొరకు | సరిలేని దానములు జన్మములకొరకు || చ|| మమకారదూరంబు మనసు గెలుచుటకొరకౌ | సమవివేకంబు శాంతములకొరకు | అమర శ్రీతిరువేంకటాద్రీశు మనసు నీ- | జముగెలుచు బ్రహ్మ విజ్ఞానంబుకొరకు || inniyu galuguTEjanmamuna (Raagam: ) (Taalam: ) pa|| inniyu galuguTEjanmamuna naina | jennalara harisEva siddhiMcukoraku || ca|| araya vEdAdhyanamadi brahmaSuddhikora- | kiravaina SAstraMbuleruka koraka | tari yaj~jamulu RuNOttAramayyeDi koraku | sarilEni dAnamulu janmamulakoraku || ca|| mamakAradUraMbu manasu gelucuTakorakau | samavivEkaMbu SAMtamulakoraku | amara SrItiruvEMkaTAdrISu manasu nI- | jamugelucu brahma vij~jAnaMbukoraku ||

inninEtalaku - ఇన్నినేతలకు

ఇన్నినేతలకు (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నినేతలకు నిది యొకటే | కన్నా మన సిది కానదుగాని|| చ|| పాతకకోట్లు భవములు భస్మీ- | భూతముసేయగ బొడవొకటే | శ్రీతరుణీపతిచింత, నిజముగా | యేతరి చిత్తం బెఱగదుగాని || చ|| మరణభయంబులు మదములు మలినీ- | కరణము సేయగగల దొకటే | హరినామామృత మందుమీది రతి | నిరతము నాకిది నిలువదుగాని || చ|| కుతిలములును దుర్గుణములును దృణీ- | కృతములు సేయగ గురుతొకటే | పతియగు వేంకటపతి సేవారతి, | గతియని మతిగని కానదుగాని || inninEtalaku (Raagam: ) (Taalam: ) pa|| inninEtalaku nidi yokaTE | kannA mana sidi kAnadugAni|| ca|| pAtakakOTlu Bavamulu BasmI- | BUtamusEyaga boDavokaTE | SrItaruNIpaticiMta, nijamugA | yEtari cittaM berxagadugAni || ca|| maraNaBayaMbulu madamulu malinI- | karaNamu sEyagagala dokaTE | harinAmAmRuta maMdumIdi rati | niratamu nAkidi niluvadugAni || ca|| kutilamulunu durguNamulunu dRuNI- | kRutamulu sEyaga gurutokaTE | patiyagu vEMkaTapati sEvArati, | gatiyani matigani kAnadugAni ||

inniTiki mUlamu - ఇన్నిటికి మూలము

ఇన్నిటికి మూలము (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నిటికి మూలము యీతనిరూపు | యెన్నగ నుపమలకు నిరవైనట్లుండె || చ|| కమలనాభునికి కప్పురకాపు మేన | సముచితముగ బైపై చాతినపుడు | అమృతముదచ్చేవేళ నట్టే మేన దుంపుర్లు | తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె || చ|| దైవశిఖామణికి తట్టుపుణుగు మేనను | చేవమీర నించి సేవసేసేయప్పుడు | వేవేలుగా యమునతో వేమారు నీదులాడగా | కావిరి కాళిమ నిండాగప్పినయట్లుండె || చ|| అలమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి- | కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు | కులికి గొల్లెతలను కూడగా గుబ్బలమీద | గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె || inniTiki mUlamu (Raagam: ) (Taalam: ) pa|| inniTiki mUlamu yItanirUpu | yennaga nupamalaku niravainaTluMDe || ca|| kamalanABuniki kappurakApu mEna | samucitamuga baipai cAtinapuDu | amRutamudaccEvELa naTTE mEna duMpurlu | tamitODa niMDukoni daTTamainaTluMDe || ca|| daivaSiKAmaNiki taTTupuNugu mEnanu | cEvamIra niMci sEvasEsEyappuDu | vEvElugA yamunatO vEmAru nIdulADagA | kAviri kALima niMDAgappinayaTluMDe || ca|| alamElumaMgatODa naTTE SrIvEMkaTapati- | kelamitO somm...

inniTiki brErakuDu - ఇన్నిటికి బ్రేరకుడు

ఇన్నిటికి బ్రేరకుడు (రాగం: ) (తాళం : ) ప|| ఇన్నిటికి బ్రేరకుడు యీశ్వరుడింతే | పన్ని యీతని దెలిసి బ్రదుకుటే జ్ఞానము || చ|| మనసున బుట్టిన మంకుగామక్రోధాలు | పనిలేవు తనకంటే బాపమంటదు | పనివి తొడిమ నూడి పండు తీగె నంటదు | జనులకెల్లా బ్రకృతి సహజమింతే || చ|| చేతులార జేసికొన్న కర్మానకు | ఘాతల గర్త గానంటే కట్టువడడు | ఆతల నబక ముంచినట్టివేడి చెయ్యంటదు | జాతి దేహము మోచిన సహజమింతే || చ|| వాకుననాడినయట్టి వట్టిపల్లదాలనెల్లా | దాకొని పొరయనంటే తప్పులే లేవు | పైకొని శ్రీవేంకటేశు బంటుకు వళకులేదు | సైకమైన హరిభక్తి సహజమింతే || inniTiki brErakuDu (Raagam: ) (Taalam: ) pa|| inniTiki brErakuDu yISvaruDiMtE | panni yItani delisi bradukuTE j~jAnamu || ca|| manasuna buTTina maMkugAmakrOdhAlu | panilEvu tanakaMTE bApamaMTadu | panivi toDima nUDi paMDu tIge naMTadu | janulakellA brakRuti sahajamiMtE || ca|| cEtulAra jEsikonna karmAnaku | GAtala garta gAnaMTE kaTTuvaDaDu | Atala nabaka muMcinaTTivEDi ceyyaMTadu | jAti dEhamu mOcina sahajamiMtE || ca|| vAkunanADinayaTTi vaTTipalladAlanellA | dAkoni poraya...

inniTi mUlambISwaruDaatani - ఇన్నిటి మూలంబీశ్వరుడాతని

ఇన్నిటి మూలంబీశ్వరుడాతని (రాగం:మలహరి ) (తాళం : ఆది ) ఇన్నిటి మూలంబీశ్వరుడాతని మన్నన కొలదినె మలయుట గాక మాయ మయమై మనియెడి జగమిది చాయల నిందు నిజము కలదా కాయము సుఖ దూఃఖములకు పొత్తిది రేయి పగలు ఒకరీతే కలదా దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వసమౌనా ధావతి మనసిది తన కర్మ మూలము వేవేలైనా విడువగ వశమా పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చంచలంబు నిశ్చల మౌనా ఎంచగ శ్రీ వేంకటేశ్వరు కృప తో సంచయ మైతే సతమౌ గాక inniTi mUlambISwaruDaatani (Raagam: malahari) (Taalam:aadi ) inniTi mUlambISwaruDaatani mannana koladine malayuTa gaaka maaya mayamai maniyeDi jagamidi chaayala nindu nijamu kaladaa kaayamu sukha dua@hkhamulaku pottidi rEyi pagalu okareetE kaladaa daivaadheenamu tagu samsaaramu vaaviri jeevula vasamounaa dhaavati manasidi tana karma mUlamu VEvElainaa viDuvaga vaSamaa panchEmdriyamula paragETi bratukidi chamchalambu niSchala mounaa emchaga SrI vEnkaTESwaru kRpa tO samchaya maitE satamou gaaka Get this widget | Track details | eSnips Social DNA