kaninavADA gAnu - కనినవాడా గాను
కనినవాడా గాను (రాగం: ) (తాళం : ) ప|| కనినవాడా గాను కాననివాడా గాను | పొనిగి వొరులకై తే బోధించే నేను || చ|| ధరణి గర్మము గొంత తగినజ్ఞానము గొంత | సరికి సరే కాని నిశ్చయము లేదు | వొరిమె యెంచిచూచితే నొకటివాడా గాను | సరవి దెలియ కేమో చదివేము నేము || చ|| యీతల నిహము గొంత యింతలో బరము గొంత | చేతులు రెండు చాచే చిక్కుట లేదు | యీతెరవులో నొకటి నేరుపరుచుకోలేను | కాతరాన కతలెల్లా గఱచితి నేను || చ|| దైవిక మొకకొంత తగుమానుషము గొంత | చేవలుచిగురువలె జేసేను | యీవల శ్రీవేంకటేశు డిది చూచి నన్ను గాచె | భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను || kaninavADA gAnu (Raagam: ) (Taalam: ) pa|| kaninavADA gAnu kAnanivADA gAnu | ponigi vorulakai tE bOdhiMcE nEnu || ca|| dharaNi garmamu goMta taginaj~jAnamu goMta | sariki sarE kAni niScayamu lEdu | vorime yeMcicUcitE nokaTivADA gAnu | saravi deliya kEmO cadivEmu nEmu || ca|| yItala nihamu goMta yiMtalO baramu goMta | cEtulu reMDu cAcE cikkuTa lEdu | yIteravulO nokaTi nEruparucukOlEnu | kAtarAna katalellA garxaciti nEnu || ca|| daivika mokakoMta tagumAnuShamu goMta |...