Pattaro veedula - పట్టరో వీదుల
పట్టరో వీదుల (రాగం:దేవగాంధారి )(తాళం : ) పట్టరో వీదుల బరువులు వెట్టి పుట్టుగులతో హరి పొలసీ వీడే వేవేలు నేరాలు వెదకేటిదేవుడు ఆవుల గాచీ నలవాడే పోవుగ బ్రాహ్మల బుట్టించుదేవుడు సోవల యశోదసుతుడట వీడే ఘనయజ్ఞములకు గర్తగుదేవుడు కినిసి వెన్న దొంగిలె వీడే మునులచిత్తములమూలపుదేవుడు యెనసీ గొల్లెతలయింటింట వీడే నుడిగి నారదుడు నుతించుదేవుడు బడిరోలగట్టువడె వీడే వుడివోనివరము లొసగెడుదేవుడు కడగిన శ్రీ వేంకటగిరి వీడే Pattaro veedula (Raagam:Daevagaamdhaari ) (Taalam: ) Pattaro veedula baruvulu vetti Puttugulato hari polasee veedae Vaevaelu naeraalu vedakaetidaevudu Aavula gaachee nalavaadae Povuga braahmala buttimchudaevudu Sovala yasodasutudata veedae Ghanayaj~namulaku gartagudaevudu Kinisi venna domgile veedae Munulachittamulamoolapudaevudu Yenasee golletalayimtimta veedae Nudigi naaradudu nutimchudaevudu Badirolagattuvade veedae Vudivonivaramu losagedudaevudu Kadagina Sree vaemkatagiri veedae