Posts

Showing posts from October, 2010

saMtalE coccitigAni - సంతలే చొచ్చితిగాన

సంతలే చొచ్చితిగాన (రాగం: ) (తాళం : ) ప|| సంతలే చొచ్చితిగాని సరకు గాననైతి | యింతట శ్రీహరి నీవే యిట దయజూడవే || చ|| కాంతచనుగొండలు కడకునెక్కితిగాని | యెంతైనా మోక్షపుమెట్లు యెక్కలేనైతి | అంతట జవ్వనమనే అడవి చొచ్చితిగాని | సంతత హరిభక్తనే సంజీవి గాననైతి || చ|| తెగి సంసారజలధి దిరుగలాడితిగాని | అగడైవైరాగ్యరత్నమది దేనైతి | పొగరుజన్మాలరణభూములు చొచ్చితిగాని | పగటుగామాదులపగ సాధించనైతి || చ|| తనువనియెడికల్పతరువు యెక్కితిగాని | కొనవిజ్ఞానఫలము గోయనైతి | ఘనుడశ్రీవేంకటేశ కమ్మర నీకృపచేత | దనిసి యేవిధులను దట్టుపడనైతి || saMtalE coccitigAni (Raagam: ) (Taalam: ) pa|| saMtalE coccitigAni saraku gAnanaiti | yiMtaTa SrIhari nIvE yiTa dayajUDavE || ca|| kAMtacanugoMDalu kaDakunekkitigAni | yeMtainA mOkShapumeTlu yekkalEnaiti | aMtaTa javvanamanE aDavi coccitigAni | saMtata hariBaktanE saMjIvi gAnanaiti || ca|| tegi saMsArajaladhi dirugalADitigAni | agaDaivairAgyaratnamadi dEnaiti | pogarujanmAlaraNaBUmulu coccitigAni | pagaTugAmAdulapaga sAdhiMcanaiti || ca|| tanuvaniyeDikalpataruvu yekkitigAni | k...

saMtagADa vika - సంతగాడ విక

సంతగాడ విక (రాగం: ) (తాళం : ) ప|| సంతగాడ విక మమ్ము బాయకువయ్యా | బంతి చెట్టుకొని మమ్ము బాలార్చవయ్యా || చ|| జవ్వనపు వారమో సముకపు వారమో | యెవ్వర మేమన్నా నెగ్గులెంచకువయ్యా | నవ్వు నవ్వే వారమో ననుపైన వారమో | తవ్విన మోవి రసాల దప్పి దేర్చవయ్యా || చ|| సేవచేసే వారమో చిత్తములో వారమో | కావరించినా మమ్ముగై కొనవయ్యా | పూవువంటివారమో భోగించేవారమో | వేవేలు మన్ననల వెలయించవయ్యా || చ|| కడుమేన వారమో కప్రపుబడివారమో | యెడయక ఇట్టె వీడేలియ్యవయ్య | కడగి శ్రీ వేంకటేశ కలసిన నీ వారమో | జడియక యిట్లానే చనవియ్యవయ్యా || saMtagADa vika (Raagam: ) (Taalam: ) pa|| saMtagADa vika mammu bAyakuvayyA | baMti ceTTukoni mammu bAlArcavayyA || ca|| javvanapu vAramO samukapu vAramO | yevvara mEmannA negguleMcakuvayyA | navvu navvE vAramO nanupaina vAramO | tavvina mOvi rasAla dappi dErcavayyA || ca|| sEvacEsE vAramO cittamulO vAramO | kAvariMcinA mammugai konavayyA | pUvuvaMTivAramO BOgiMcEvAramO | vEvElu mannanala velayiMcavayyA || ca|| kaDumEna vAramO kaprapubaDivAramO | yeDayaka iTTe vIDEliyyavayya | kaDagi SrI vE...

saMsArinaina nAku - సంసారినైన నాకు

సంసారినైన నాకు (రాగం: ) (తాళం : ) ప|| సంసారినైన నాకు సహజమే | కంసారి నేనిందుకెల్లా గాదని వగవను || చ|| నరుడనైననాకు నానాసుఖదుఃఖములు | సరి ననుభవించేది సహజమే | హరిని శరణాగతులైనమీద బరాభవ- | మరయ నిన్నంటునని అందుకే లోగేను || చ|| పుట్టిననాకు గర్మపు పొంగుకు లోనైనవాడ | జట్టిగ గట్టువడుట సహజమే | యిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాట | పట్టు వోయీనోయని పంకించే నేనిపుడు || చ|| మాయకులోనైన నాకు మత్తుడనై యిన్నాళ్ళు | చాయకు రానిదెల్లా సహజమె | యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు | మోయరాని నేను మోపనివీగేను || saMsArinaina nAku (Raagam: ) (Taalam: ) pa|| saMsArinaina nAku sahajamE | kaMsAri nEniMdukellA gAdani vagavanu || ca|| naruDanainanAku nAnAsuKaduHKamulu | sari nanuBaviMcEdi sahajamE | harini SaraNAgatulainamIda barABava- | maraya ninnaMTunani aMdukE lOgEnu || ca|| puTTinanAku garmapu poMguku lOnainavADa | jaTTiga gaTTuvaDuTa sahajamE | yiTTE nIvAriki mOkShamittunanna nImATa | paTTu vOyInOyani paMkiMcE nEnipuDu || ca|| mAyakulOnaina nAku mattuDanai yinnALLu | cAyaku rAnidellA sahajame | ...

saMsAramE mElu - సంసారమే మేలు

సంసారమే మేలు (రాగం: ) (తాళం : ) ప|| సంసారమే మేలు సకల జనులకును | కంసాంతకుని భక్తిగలిగితే మేలు || చ|| వినయంపు మాటల విద్య సాధించితే మేలు | తనిసి యప్పులలోన దాగకుంటే మేలు | మునుపనే భుమి దన్నుమోచి దించకుంటే మేలు | వెనుకొన్నకోపము విడచితే మేలు || చ|| కొరివొకరి నడిగి కొంచపడకుంటే మేలు | సారె సారె జీవులను చంపకుంటే మేలు | భరపుటిడుమలను పడకుండితే మేలు | కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు || చ|| పరకాంతల భంగపరచకుంటే మేలు | దొరకని కెళవులు దొక్కకుంటే మేలు | అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి | యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు || saMsAramE mElu (Raagam: ) (Taalam: ) pa|| saMsAramE mElu sakala janulakunu | kaMsAMtakuni BaktigaligitE mElu || ca|| vinayaMpu mATala vidya sAdhiMcitE mElu | tanisi yappulalOna dAgakuMTE mElu | munupanE Bumi dannumOci diMcakuMTE mElu | venukonnakOpamu viDacitE mElu || ca|| korivokari naDigi koMcapaDakuMTE mElu | sAre sAre jIvulanu caMpakuMTE mElu | BarapuTiDumalanu paDakuMDitE mElu | kAriMci tiTla koDigaTTakuMTE mElu || ca|| parakAMtala BaMgaparacakuMTE mElu | do...

saMdaDi viDuvumu - సందడి విడువుము

సందడి విడువుము (రాగం: ) (తాళం : ) ప|| సందడి విడువుము సాసముఖా | మందరధరునకు మజ్జనవేళా || చ|| అమరాధిపులిడు డాలవట్టములు | కమలజ పట్టుము కాళాంజి | జమలి చామరలు చంద్రుడ సూర్యుడ | అమర నిడుడు పరమాత్మునకు || చ|| అణిమాది సిరులనలరెడు శేషుడ | మణిపాదుకలిడు మతి చెలగా | ప్రణుతింపు కదిసి భారతీరమణ | గుణాధిపు మరుగురు బలుమరును || చ|| వేదఘోషణము విడువక సేయుడు | ఆదిమునులు నిత్యాధికులు | శ్రీదేవుండగు శ్రీవేంకటపతి | ఆదరమున సిరు లందీ వాడె || saMdaDi viDuvumu (Raagam: ) (Taalam: ) pa|| saMdaDi viDuvumu sAsamuKA | maMdaradharunaku majjanavELA || ca|| amarAdhipuliDu DAlavaTTamulu | kamalaja paTTumu kALAMji | jamali cAmaralu caMdruDa sUryuDa | amara niDuDu paramAtmunaku || ca|| aNimAdi sirulanalareDu SEShuDa | maNipAdukaliDu mati celagA | praNutiMpu kadisi BAratIramaNa | guNAdhipu maruguru balumarunu || ca|| vEdaGOShaNamu viDuvaka sEyuDu | Adimunulu nityAdhikulu | SrIdEvuMDagu SrIvEMkaTapati | Adaramuna siru laMdI vADe ||

Samdekaada buttinatti - సందెకాడ బుట్టినట్టి

సందెకాడ బుట్టినట్టి (రాగం: ) (తాళం : ) సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత- చందమాయ చూడరమ్మ చందమామ పంట॥ మునుప పాలవెల్లి మొలచి పండినపంట నినుపై దేవతలకు నిచ్చపంట గొనకొని హరికన్ను గొనచూపులపంట వినువీధి నెగడిన వెన్నెలల పంట॥ వలరాజు పంపున వలపు విత్తిన పంట చలువై పున్నమనాటి జాజరపంట కలిమి కామిని తోడ కారుకమ్మినపంట మలయుచు తమలోని మర్రిమాని పంట॥ విరహుల గుండెలకు వెక్కసమైన పంట పరగచుక్కలరాసి భగ్యము పంట అరుదై తూరుపుకొండ నారగబండినపంట యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥ Samdekaada buttinatti (Raagam: ) (Taalam: ) Samdekaada buttinatti chaayala pamta yemta- Chamdamaaya choodaramma chamdamaama pamta Munupa paalavelli molachi pamdinapamta Ninupai daevatalaku nichchapamta Gonakoni harikannu gonachoopulapamta Vinuveedhi negadina vennelala pamta Valaraaju pampuna valapu vittina pamta Chaluvai punnamanaati jaajarapamta Kalimi kaamini toda kaarukamminapamta Malayuchu tamaloni marrimaani pamta Virahula gumdelaku vekkasamaina pamta Paragachukkalaraasi bhagyamu pamta Arudai toorupukomda naaragabamdinapamta...

sakalaSAstrasaMpannuDaTa - సకలశాస్త్రసంపన్నుడట

సకలశాస్త్రసంపన్నుడట (రాగం: ) (తాళం : ) ప|| సకలశాస్త్రసంపన్నుడట చిత్త- | మొకటికిని జొరదు విధియోగమౌగాదో || చ|| దొరతనంబట కలిమి దోడుగాదట మంచి- | తరుణులట మోహమట దైన్యంబట | విరహమట దారిద్ర్యవివశుడౌనట చూడ- | నరయ నిది కర్మఫలమౌనో కాదో || చ|| రాజసన్మానమట రవణహీనత్వమట | తేజమట నలువంక దిరిపెంబట | వాజివాహనములట వాడిలేదట తొంటి- | పూజఫలమిది వెలితిభోగమౌగాదో || చ|| యిలయెల్ల నేలునట ఇంటలేదట మిగుల | బలిమిగలదట సడా పరిభవమట | చెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరుని | గొలువనేరనివెనక గొరతలౌగాదో || sakalaSAstrasaMpannuDaTa (Raagam: ) (Taalam: ) pa|| sakalaSAstrasaMpannuDaTa citta- | mokaTikini joradu vidhiyOgamaugAdO || ca|| doratanaMbaTa kalimi dODugAdaTa maMci- | taruNulaTa mOhamaTa dainyaMbaTa | virahamaTa dAridryavivaSuDaunaTa cUDa- | naraya nidi karmaPalamaunO kAdO || ca|| rAjasanmAnamaTa ravaNahInatvamaTa | tEjamaTa naluvaMka diripeMbaTa | vAjivAhanamulaTa vADilEdaTa toMTi- | pUjaPalamidi velitiBOgamaugAdO || ca|| yilayella nElunaTa iMTalEdaTa migula | balimigaladaTa saDA pariBavamaTa | celuvalara vEDuka...

sakalasaMdEhamai - సకలసందేహమై

సకలసందేహమై (రాగం: ) (తాళం : ) ప|| సకలసందేహమై జరుగుచున్నది యొకటి | ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని || చ|| వసుదేవజఠరమనువననిధికి జంద్రుడై | అసమానగతి బొడమినా డితడు | వసుధ జంద్రుడు నీలవర్ణు డేటికినాయ | కసరెత్తి నునుగందు గలయగొనుబోలు || చ|| ఇనవంశమున లోకహితకల్పభూజమై | అనఘుడై జనియించినా డితడు | నను పై నసురతరువు నల్లనేటికినాయ | పెనుగొమ్మలో చేగ పెరిగిరాబోలు || చ|| తిరువేంకటాద్రిపై దెలియ జింతామణై | అరిదివలె బొడచూపినా డితడు | గరిమె నది యిపుడు చీకటివర్ణమేలాయ | హరినీలమణులప్రభ లలమికొనబోలు || sakalasaMdEhamai (Raagam: ) (Taalam: ) pa|| sakalasaMdEhamai jarugucunnadi yokaTi | prakaTiMpa jIvamO brahmamO kAni || ca|| vasudEvajaTharamanuvananidhiki jaMdruDai | asamAnagati boDaminA DitaDu | vasudha jaMdruDu nIlavarNu DETikinAya | kasaretti nunugaMdu galayagonubOlu || ca|| inavaMSamuna lOkahitakalpaBUjamai | anaGuDai janiyiMcinA DitaDu | nanu pai nasurataruvu nallanETikinAya | penugommalO cEga perigirAbOlu || ca|| tiruvEMkaTAdripai deliya jiMtAmaNai | aridivale boDacUpinA DitaDu | garime nadi yipuD...

sakalam hesakhi janame - సకలం హేసఖి జానామె

సకలం హే (రాగం: ) (తాళం : ) సకలం హేసఖి జానామె తత్ ప్రకత విలాసం పరమం దధసే అలిక మౄగ మద మయ మషి కలనౌ జ్వలతాహే సఖి జానామే లలితం తవ పల్లవి తమనసి నిస్చలతర మేఘ శ్యామం దధసే చారుకపొల స్థల కరాంకిత విచారం హే సఖి జానామే నారయణ మహినాయక శయనం శ్రి రమనం తవ చిత్తే దధసే ఘన కుచ శైల క్రస్చిత విభుమని జననం హే సఖి జానామే కనతురస వేంకట గిరిపతి వినుత భొగ సుఖ విభవం దధసే.. sakalaM hE (Raagam: ) (Taalam: ) sakalam hesakhi janame tat prakata vilasam paramam daddhase alika mruga mada maya mashi kalanou jwalatahein sakhi jaaname lalitam tava pallavi tamanasi nishchalatara megha shyamam dadhase charukapola sthala karankita vichaaram he sakhi jaaname naaryana mahinaayaka sayanam sri ramanam tava chitte dadhase ghana kucha saila kraschita vibhumani jananm he sakhi jaaname kanaturasa venkata giripati vinuta bhoga sukha vibhavam dadhase..

sakalaBUtadaya - సకలభూతదయ చాలగ

సకలభూతదయ చాలగ (రాగం: ) (తాళం : ) ప|| సకలభూతదయ చాలగ గలుగుట | ప్రకటించి దేహసంభవమైనఫలము || చ|| తలకొన్న ఫలవాంఛ దిగులకుండగ జిత్త- | మలవరించుట కర్మియైనఫలము | పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి | గలుగుట హరికృపగలిగినఫలము || చ|| ఎప్పుడు దిరువేంకటేశు సేవకుడౌట | తప్పక జీవుడు దానైన ఫలము | కప్పినసౌఖ్యదుఃఖమ్ములు సమముగా | నొప్పుట విజ్ఞానమొదవిన ఫలము || sakalaBUtadaya (Raagam: ) (Taalam: ) pa|| sakalaBUtadaya cAlaga galuguTa | prakaTiMci dEhasaMBavamainaPalamu || ca|| talakonna PalavAMCa digulakuMDaga jitta- | malavariMcuTa karmiyainaPalamu | palukarmamulalOna brahmArpaNapubuddhi | galuguTa harikRupagaliginaPalamu || ca|| eppuDu diruvEMkaTESu sEvakuDauTa | tappaka jIvuDu dAnaina Palamu | kappinasauKyaduHKammulu samamugA | noppuTa vij~jAnamodavina Palamu ||

sakala saMgrahamu - సకల సంగ్రహము

సకల సంగ్రహము (రాగం: ) (తాళం : ) ప|| సకల సంగ్రహము సకల సంచయము | అకృతసుకృత మిది హరినామం || చ|| సకలవేదశాస్త్రములసార మిది | సకలమంత్రరాజంబు నిది | సకలపురాణ రసములమధుర మిది | అకుటిలపావనం హరినామం || చ|| సకలతత్త్వ సంశయఖండన మిది | సకలకర్మ నిశ్చయము నిది | సకలవిధి రహస్యప్రధాన మిది | అకారణహితం హరినామం || చ|| సకలదేవతా స్వామిప్రియం బిది | సకలలోక రక్షణము నిది | ప్రకటం వేంకటపతి నామాంకిత- | మకించనధనం హరినామం || sakala saMgrahamu (Raagam: ) (Taalam: ) pa|| sakala saMgrahamu sakala saMcayamu | akRutasukRuta midi harinAmaM || ca|| sakalavEdaSAstramulasAra midi | sakalamaMtrarAjaMbu nidi | sakalapurANa rasamulamadhura midi | akuTilapAvanaM harinAmaM || ca|| sakalatattva saMSayaKaMDana midi | sakalakarma niScayamu nidi | sakalavidhi rahasyapradhAna midi | akAraNahitaM harinAmaM || ca|| sakaladEvatA svAmipriyaM bidi | sakalalOka rakShaNamu nidi | prakaTaM vEMkaTapati nAmAMkita- | makiMcanadhanaM harinAmaM ||

sakala jIvulakella - సకల జీవులకెల్ల

సకల జీవులకెల్ల (రాగం: ) (తాళం : ) ప|| సకల జీవులకెల్ల సంజీవి యీమందు | వెకలులై యిందరు సేవించరో యీమందు || చ|| మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది | పోడిమి నల్లని కాంతి బొదలినది | పీడుక కొమ్ములు నాల్గు పెనచి చేయువారినది | వాడే శేషగిరిమీద నాటుకొన్న మందు || చ|| పడిగెలు వేయింటి పాము గాచుకున్నది | కడు వేదశాస్త్రముల గబ్బు వేసీది | యెడయక వొకకాంత యెక్కుక వుండినది | కడలేని యంజనాద్రి గారుడపు మందు || చ|| బలు శంఖు జక్రముల బదనికెలున్నది | తలచిన వారికెల్ల దత్త్వమైనది | అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది | వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు || sakala jIvulakella (Raagam: ) (Taalam: ) pa|| sakala jIvulakella saMjIvi yImaMdu | vekalulai yiMdaru sEviMcarO yImaMdu || ca|| mUDu lOkamu lokkaTa muMci periginadi | pODimi nallani kAMti bodalinadi | pIDuka kommulu nAlgu penaci cEyuvArinadi | vADE SEShagirimIda nATukonna maMdu || ca|| paDigelu vEyiMTi pAmu gAcukunnadi | kaDu vEdaSAstramula gabbu vEsIdi | yeDayaka vokakAMta yekkuka vuMDinadi | kaDalEni yaMjanAdri gAruDapu maMdu || ca|| balu SaMKu jakramula...

sakalaloka nadhudu - సకలలోక నాధుడు

సకలలోక నాధుడు (రాగం: ) (తాళం : ) సకలలోక నాధుడు జనార్థునుడితడు శుకయొగి వంద్యుని సుగ్నానమెంత మరుని తండ్రికిని మరి చక్కదనమెంత సిరి మగని భాగ్యము చెప్పనెంత పురుషొత్తము ఘనత పొగడగ నికనెంత అరిమ జలధి సాయి గంభీరమెంత అమిత వరదునకు ఔదర్యగుణమెంత విమత దురవైరి విక్రమమెంత మమతల అలమెలుమంగాపతి సొబగెంత అమర శ్రీవేంకటేశు ఆధిక్యమెంత sakalaloka nadhudu (Raagam: ) (Taalam: ) sakalaloka nadhudu janarthanuditady sukayogi vandyuni sugnaanamenta maruni tandrikini mari chakkadanamenta siri magani bhagyamu cheppanenta purushottamu ghanata pogadaga nikanenta arima jaladhi sai gambheeramenta amita varadunaku audaryagunamenta vimata duravairi vikramamenta mamatala alamelumangapati sobagenta amara srivenkatesu aadityamenta

sakalabalaMbulu - సకలబలంబులు

Image
సకలబలంబులు (రాగం: ) (తాళం : ) సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు అకలంకమగుసుఖమే అన్నిటనిదే నాకు పొందుగ( జక్రాంకితమే బుజబల మిదే నాకు అందినహరి నీచింతే ఆత్మబలము నాకు సందడి( బేరుబలము కేశవనామము నాకు యిందును నందును భవభయ మిక లేదిదే నాకు అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు సంగతి నీపై పాటలె సర్వబలి మిదే నాకు రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు యింగితముగ నిహపరముల కెదురే దిదే నాకు కనుగొను నీవిగ్రహమే గ్రహబలి మిదే నాకు విను నీదాసులసేవే వెనుబలిమిదె నాకు తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు ఘనమే చెప్పగ నింతటా కలిగెబో యిదే నాకు sakalabalaMbulu (Raagam: ) (Taalam: ) sakalabalaMbulu nIvE sarwESwarA nAku akalaMkamagusukhamE anniTanidE nAku poMduga( jakrAMkitamE bujabala midE nAku aMdinahari nIchiMtE Atmabalamu nAku saMdaDi( bErubalamu kESavanAmamu nAku yiMdunu naMdunu bhavabhaya mika lEdidE nAku aMgapu tirumaNulivi paMchAMgabalamu nAku saMgati nIpai pATale sarwabali midE nAku raMguga nIguNarAsulE rAsibalamu nAku yiMgitamuga nihaparamula kedurE didE nAku kanugonu nIvigrahamE grahabali midE nAku vinu nIdAsul...

Sakalasaamtikaramu - సకలశాంతికరము

సకలశాంతికరము (రాగం: ) (తాళం : ) సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ ప్రకటమై మాకు నబ్బె బతికించు నిదియె సర్వేశ మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన నినుదలచినంతనే నీఱౌను కనుగొన్న పాపములు కడలేనివైనాను ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును చేతనంటి పాతకాలు సేనగానే జేసినాను ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు ఘాతలజెవుల వినగా నంటిన పాపము నీతితో నీ కథ వింటే నిమిషానబాయును కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల కాయపునీ ముద్రలచే గ్రక్కున వీడు యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా అయమైన నీ శరణాగతిచే నణగు Sakalasaamtikaramu (Raagam: ) (Taalam: ) Sakalasaamtikaramu sarvaesa neepai bhakti sarvaesa Prakatamai maaku nabbe batikimchu nidiye sarvaesa Manasulo paapabuddhi mariyemta dalachina Ninudalachinamtanae nee~raunu Kanugonna paapamulu kadalaenivainaanu Ghanudaninnu joochitae kadaku dolagunu Chaetanamti paatakaalu saenagaanae jaesinaanu Aatala neeku mrokkitae nanniyu baayu Ghaatalajevula vinagaa namtina paapamu Neetito nee katha vimtae nimishaanabaayunu Kaayamuna jaesaeti karmapu paapamulella Kaayapunee mudralachae gra...

saDibeTTe gaTakaTA - సడిబెట్టె గటకటా

సడిబెట్టె గటకటా (రాగం: ) (తాళం : ) ప|| సడిబెట్టె గటకటా సంసారము చూడ | జలధిలోపలియీత సంసారము || చ|| జమునోరిలో బ్రదుకు సంసారము చూడ | చమురుదీసినదివ్వె సంసారము | సమయించుబెనుదెవులు సంసారము చూడ | సమరంబులో నునికి సంసారము || చ|| సందిగట్టినతాడు సంసారము చూడ | సందికంతలతోవ సంసారము | చందురునిజీవనము సంసారము చూడ | చంద మేవలెనుండు సంసారము || చ|| చలువలోపలివేడి సంసారము చూడ | జలపూతబంగారు సంసారము | యిలలోన దిరువేంకటేశ నీదాసులకు | చలువలకు గడుచలువ సంసారము || saDibeTTe gaTakaTA (Raagam: ) (Taalam: ) pa|| saDibeTTe gaTakaTA saMsAramu cUDa | jaladhilOpaliyIta saMsAramu || ca|| jamunOrilO braduku saMsAramu cUDa | camurudIsinadivve saMsAramu | samayiMcubenudevulu saMsAramu cUDa | samaraMbulO nuniki saMsAramu || ca|| saMdigaTTinatADu saMsAramu cUDa | saMdikaMtalatOva saMsAramu | caMdurunijIvanamu saMsAramu cUDa | caMda mEvalenuMDu saMsAramu || ca|| caluvalOpalivEDi saMsAramu cUDa | jalapUtabaMgAru saMsAramu | yilalOna diruvEMkaTESa nIdAsulaku | caluvalaku gaDucaluva saMsAramu ||

sagamu mAnisi rUpu - సగము మానిసి రూపు

సగము మానిసి రూపు (రాగం: ) (తాళం : ) సగము మానిసి రూపు సగము మెగము రూపు అగణిత ప్రతాపుడు అహోబలేశుడు గద్దెమీద గూచున్నాడు కంబములో బుట్టినాడు కొద్దిమీర గడునవ్వుకొంటా నున్నాడు వొద్దనె శ్రీసతిచన్నులొరయచు నున్నవాడు అద్దివో చూడరమ్మ అహోబలేశుడు పెనుమీసాలవాడు పెదపెదగోళ్ళవాడు ఘనునిగా ప్రహ్లాదుని గాచుకున్నాడు మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు అనుపమతేజుడమ్మ అహోబలేశుడు వేవేలు చేతులవాడు వెన్నెలచాయలవాడు భావించి కొల్చినవారి పాలిటివాడు శ్రీవేంకటగిరిమీద జేరి భవనాశిదండ- నావల నీవల మించె నహోబలేశుడు sagamu mAnisi rUpu (Raagam: ) (Taalam: ) sagamu mAnisi rUpu sagamu megamu rUpu agaNita pratApuDu ahObalESuDu gaddemIda gUchunnADu kaMbamulO buTTinADu koddimIra gaDunavvukoMTA nunnADu voddane SrIsatichannulorayuchu nunnavADu addivO chUDaramma ahObalESuDu penumIsAlavADu pedapedagOLLavADu ghanunigA prahlAduni gAchukunnADu manasichchina suralatO mATalADuchunnavADu anupamatEjuDamma ahObalESuDu vEvElu chEtulavADu vennelachAyalavADu bhAviMchi kolchinavAri pAliTivADu SrIvEMkaTagirimIda jEri bhavanASidaMDa- nAval...

sadA sakalamu - సదా సకలము

సదా సకలము (రాగం: ) (తాళం : ) ప|| సదా సకలము సంపదలే | తుద దెలియగవలె దొలగగవలయు || చ|| అహర్నిశలు నాపదలే | సహించిన నవి సౌఖ్యములే | ఇహముననవి యిందరికిని | మహిమ దెలియవలె మానగవలెను || చ|| దురంతము లివి దోషములే | పరంపర లివి బంధములు | విరసములౌ నరవిభవములౌ- | సిరులే మరులౌ చిరసుఖ మవును || చ|| గతి యలమేల్మంగ నాంచారికి | బతియగువేంకటపతి దలచి | గతు లెరుగగవలె రవణము వలెను | హిత మెరుగగవలె నిదె తనకు || sadA sakalamu (Raagam: ) (Taalam: ) pa|| sadA sakalamu saMpadalE | tuda deliyagavale dolagagavalayu || ca|| aharniSalu nApadalE | sahiMcina navi sauKyamulE | ihamunanavi yiMdarikini | mahima deliyavale mAnagavalenu || ca|| duraMtamu livi dOShamulE | paraMpara livi baMdhamulu | virasamulau naraviBavamulau- | sirulE marulau cirasuKa mavunu || ca|| gati yalamElmaMga nAMcAriki | batiyaguvEMkaTapati dalaci | gatu lerugagavale ravaNamu valenu | hita merugagavale nide tanaku ||

Shodasakalaanidhiki - షోడసకళానిధికి

షోడసకళానిధికి (రాగం: ) (తాళం : ) షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ నిలయున కాసనము నెమ్మి నిదే అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె సరి శ్రీమంతునకు భూషణము లివే ధరణీధరునకు గంధపుష్ప ధూపములు తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము అమృతమథనునకు నదివో నైవేద్యము గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో Shodasakalaanidhiki (Raagam: ) (Taalam: ) Shodasakalaanidhiki shodasopachaaramulu Jaadatoda nichchalunu samarpayaami Alaru visvaatmakuna kaavaahana mide sarva Nilayuna kaasanamu nemmi nidae Alagamgaa janakuna karghyapaadyaachamanaalu Jaladhi Saayikini majjanamidae Varapeetaambarunaku vastraalamkaaramide Sari sreemamtunaku bhooshanamu livae Dharaneedharunaku gamdhapushpa dhoopamulu Tira mide kotisooryataejunaku deepamu Amrtamathanunaku nadivo naivaedyamu Gami(ravi)jamdrunaetrunaku kappuravidemu Amarina sreevaemkataadri meedi...

SrISOyaM susthirOyaM - శ్రీశోయం సుస్థిరోయం

శ్రీశో2యం (రాగం: ) (తాళం : ) ప|| శ్రీశో2యం సుస్థిరో2యం | కౌశికమఖరక్షకో2యం || చ|| నిగమనిధినిర్మలో2యం | జగన్మోహనసతీపతి- | విగత భయో2యం విజయసఖో2యం | భృగుముని సంప్రీతో2యం || చ|| సకలపతి శ్శాశ్వతో2యం | శుకముకమునిజనసులభో2యం | ప్రకటబహుళశోభనాధికో2యం | వికచరుక్మిణీవీక్షణో2యం || చ|| సరసో2యం | పరిసరప్రియో2యం | తిరువేంకటాధిపో2యం | చిరంతనో2యం చిదాత్మకో2యం | శరణాగతవత్సలో2యం || SrISO2yaM (Raagam: ) (Taalam: ) pa|| SrISO2yaM susthirO2yaM | kauSikamaKarakShakO2yaM || ca|| nigamanidhinirmalO2yaM | jaganmOhanasatIpati- | vigata BayO2yaM vijayasaKO2yaM | BRugumuni saMprItO2yaM || ca|| sakalapati SSASvatO2yaM | SukamukamunijanasulaBO2yaM | prakaTabahuLaSOBanAdhikO2yaM | vikacarukmiNIvIkShaNO2yaM || ca|| sarasO2yaM | parisarapriyO2yaM | tiruvEMkaTAdhipO2yaM | ciraMtanO2yaM cidAtmakO2yaM | SaraNAgatavatsalO2yaM ||

SrImannArAyaNa - శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ (రాగం: ) (తాళం : ) ప|| శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు || చ|| కమలాసతీ ముఖకమల కమలహిత | కమలప్రియ కమలేక్షణ | కమలాసనహిత గరుడగమన శ్రీ | కమలనాభ నీపదకమలమే శరణు || చ|| పరమయోగిజన భాగధేయ శ్రీ | పరమపూరుష పరాత్పర పరమాత్మ పరమాణురూప శ్రీ | తిరువేంకటగిరి దేవ శరణు || SrImannArAyaNa (Raagam: ) (Taalam: ) pa|| SrImannArAyaNa SrImannArAyaNa | SrImannArAyaNa nI SrIpAdamE SaraNu || ca|| kamalAsatI muKakamala kamalahita | kamalapriya kamalEkShaNa | kamalAsanahita garuDagamana SrI | kamalanABa nIpadakamalamE SaraNu || ca|| paramayOgijana BAgadhEya SrI | paramapUruSha parAtpara paramAtma paramANurUpa SrI | tiruvEMkaTagiri dEva SaraNu ||

SrIhari nityaSEshagirISa - శ్రీహరి నిత్యశేషగిరీశ

శ్రీహరి నిత్యశేషగిరీశ (రాగం: ) (తాళం : ) శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో || దేవకీ సుత దేవ వామన గోవిందా గోప గోపీనాథా గోవర్ధనధర గోకులపాలక దేవేశాధిక తే నమో నమో || సామాజావన శార్ణపాణి వామనా కృష్ణ వాసుదేవ రామనామ నారాయణ విష్ణో దామోదర శ్రీధర నమో నమో || పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి చిరంతన అచ్యుత శ్రీవేంకటేశ్వర నరమృగ తే నమో నమో || SrIhari nityaSEshagirISa (Raagam: ) (Taalam: ) SrIhari nityaSEshagirISa mOhanAkAra mukuMda namO || dEvakI suta dEva vAmana gOviMdA gOpa gOpInAthA gOvardhanadhara gOkulapAlaka dEvESAdhika tE namO namO || sAmaajAvana SArNapANi vAmanA kRshNa vAsudEva rAmanAma nArAyaNa vishNO dAmOdara SrIdhara namO namO || purushOttama puMDarIkAksha garuDadhwaja karuNAnidhi chiraMtana achyuta SrIvEMkaTESwara naramRga tE namO namO || Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

SrIharisEsinacihnalivi - శ్రీహరిసేసినచిహ్నలివి

శ్రీహరిసేసినచిహ్నలివి (రాగం: ) (తాళం : ) ప|| శ్రీహరిసేసినచిహ్నలివి యీ- | మోహము విడుచుట మోక్షమది || చ|| మలినంబేది మణుగననేది | కలుషపుమలముల కాయమిది | కలిగినదేది కడులేందేది | చలనపుమాయల జన్మమిది || చ|| తనిసినదేది తనియనిదేది | దినదినమాకలి దీరదిది | కొనయిందేది గురిమొదలేది | పనిగొనుకర్మపు బంధమిది || చ|| నిండినదేది నిండనిదేది | కొండలపొడపుల కోరికది | అండనే శ్రీ వేంకటాధిపు శరణని | వుండుటె యిహపర యోగమది || SrIharisEsinacihnalivi (Raagam: ) (Taalam: ) pa|| SrIharisEsinacihnalivi yI- | mOhamu viDucuTa mOkShamadi || ca|| malinaMbEdi maNugananEdi | kaluShapumalamula kAyamidi | kaliginadEdi kaDulEMdEdi | calanapumAyala janmamidi || ca|| tanisinadEdi taniyanidEdi | dinadinamAkali dIradidi | konayiMdEdi gurimodalEdi | panigonukarmapu baMdhamidi || ca|| niMDinadEdi niMDanidEdi | koMDalapoDapula kOrikadi | aMDanE SrI vEMkaTAdhipu SaraNani | vuMDuTe yihapara yOgamadi ||

SrIvEMkaTESuDu SrIpatiyu - శ్రీవేంకటేశుడు శ్రీపతియు

శ్రీవేంకటేశుడు శ్రీపతియు (రాగం: ) (తాళం : ) ప|| శ్రీవేంకటేశుడు శ్రీపతియు నితడే | పావనపువైకుంఠపతియును నితడే || చ|| భాగవతములో జెప్పే బలరాముతీర్థయాత్ర- | నాగమోక్తమైనదైవ మాత డితడే | బాగుగా బ్రహ్మాండపురాణపద్ధతియాత డితడే | యోగమై వామనపురాణోక్తదైవ మీతడే || చ|| వెలయ సప్తఋషులు వెదకి ప్రదక్షిణము- | లలర జేసినదేవు డాత డీతడే | నెలవై కోనేటిపొంత నిత్యము గుమారస్వామి | కలిమి దనముసేసి కన్నదేవు డీతడే || చ|| యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు | తక్కక కొలిచియున్న తత్త్వ మీతడే | చక్క నారదాదులసంకీర్తనకు జొక్కి | నిక్కినశ్రీవేంకటాద్రినిలయుడు నీతడే || SrIvEMkaTESuDu SrIpatiyu (Raagam: ) (Taalam: ) pa|| SrIvEMkaTESuDu SrIpatiyu nitaDE | pAvanapuvaikuMThapatiyunu nitaDE || ca|| BAgavatamulO jeppE balarAmutIrthayAtra- | nAgamOktamainadaiva mAta DitaDE | bAgugA brahmAMDapurANapaddhatiyAta DitaDE | yOgamai vAmanapurANOktadaiva mItaDE || ca|| velaya saptaRuShulu vedaki pradakShiNamu- | lalara jEsinadEvu DAta DItaDE | nelavai kOnETipoMta nityamu gumArasvAmi | kalimi danamusEsi kannadEvu DItaDE || c...

SrI vEMkaTESvaruni - శ్రీ వేంకటేశ్వరుని

శ్రీ వేంకటేశ్వరుని (రాగం: ) (తాళం : ) ప|| శ్రీ వేంకటేశ్వరుని సింగారము వర్ణించితే | యే విధాన దలచిన యిన్నటికి దగును || చ|| కరిరాజు గాచిన చక్రము పట్టిన హస్తము | కరి తుండమని చెప్పగా నమరును | వరములిచ్చేయట్టి వరద హస్తము కల్ప- | తరు శాఖయని పొలుప దగు నీకును || చ|| జలధి బుట్టిన పాంచజన్య హస్తము నీకు | జలధి తరగయని చాటవచ్చును | బలు కాళింగుని తోక పట్టిన కటి హస్తము | పొలుపై ఫణీంద్రుడని పొగడగ దగును || చ|| నలిన హస్తంబుల నడుమనున్న నీయుర- | మలమేలు మంగ కిరవన దగును | బలు శ్రీ వేంకట గిరిపై నెలకొన్న నిన్ను | నలరి శ్రీ వేంకటేశుడన దగును || SrI vEMkaTESvaruni (Raagam: ) (Taalam: ) pa|| SrI vEMkaTESvaruni siMgAramu varNiMcitE | yE vidhAna dalachina yinnaTiki dagunu || ca|| karirAju gAcina cakramu paTTina hastamu | kari tuMDamani ceppagA namarunu | varamuliccEyaTTi varada hastamu kalpa- | taru SAKayani polupa dagu nIkunu || ca|| jaladhi buTTina pAMcajanya hastamu nIku | jaladhi taragayani cATavaccunu | balu kALiMguni tOka paTTina kaTi hastamu | polupai PaNIMdruDani pogaDaga dagunu || ca|| nalina has...

Sree vaemkataesa raajeevaaksha - శ్రీ వేంకటేశ రాజీవాక్ష

శ్రీ వేంకటేశ రాజీవాక్ష (రాగం:భూపాళం ) (తాళం : జంపె) పల్లవి శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే వేగవేగ మేలుకొను వెలిఛాయ లమరే చరణాలు సురలు గంధర్వ కిన్నరులెల్ల గూడి తం బురుశ్రుతులను జేర్చి సరవిగాను అరుణోదయము దెలిసి హరిహరి యనుచు నర హరి నిన్ను దలచెదరు హంసస్వరూప అల చిలుక పలుకులకు నధరబింబము బోలె తెలివి దిక్కుల మిగుల తేట బారే అలరు కుచగిరుల నుదయాస్త్రాదిపై వెలిగె మలినములు తొలగ నిదో మంచు తెరవిచ్చే తళుకొత్త నిందిరా తాటంకరైరుచుల వెలిగన్ను తామరలు వికసింపగాను అలర్మేల్ మంగ శ్రీవేంకటాచలరమణ చెలువు మీఱగను ముఖకళలు గనవచ్చే Sree vaemkataesa raajeevaaksha (Raagam:bhoopaalam ) (Taalam:jampe ) Pallavi Sree vaemkataesa raajeevaaksha maelukonavae Vaegavaega maelukonu velichaaya lamarae Charanaalu Suralu gamdharva kinnarulella goodi tam Burusrutulanu jaerchi saravigaanu Arunodayamu delisi harihari yanuchu nara Hari ninnu dalachedaru hamsasvaroopa Ala chiluka palukulaku nadharabimbamu bole Telivi dikkula migula taeta baarae Alaru kuchagirula nudayaastraadipai velige Malinamulu tolaga nido mamchu teravic...

SOBanamE SOBanamE - శోభనమే శోభనమే

శోభనమే శోభనమే (రాగం: ) (తాళం : ) ప|| శోభనమే శోభనమే వై- | భవముల పావన మూర్తికి || చ|| అరుదుగ మును నరకాసురుడు | సిరులతో జెరలు దెచ్చిన సతుల | పరువపు వయసుల బదారు వేలను | సొరిది బెండ్లాడిన సుముఖునికి || చ|| చెందిన వేడుక శిశుపాలుడు | అంది పెండ్లాడగ నవగళించి | విందువలెనె తా విచ్చేసి రుకుమిణి | సందడి బెండ్లాడిన సరసునుకి || చ|| దేవదానవుల ధీరతను | దావతిపడి వార్థి దరుపగను | శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన | శ్రీ వేంకటగిరి శ్రీనిధికి || SOBanamE SOBanamE (Raagam: ) (Taalam: ) pa|| SOBanamE SOBanamE vai- | Bavamula pAvana mUrtiki || ca|| aruduga munu narakAsuruDu | sirulatO jeralu deccina satula | paruvapu vayasula badAru vElanu | soridi beMDlADina sumuKuniki || ca|| ceMdina vEDuka SiSupAluDu | aMdi peMDlADaga navagaLiMci | viMduvalene tA viccEsi rukumiNi | saMdaDi beMDlADina sarasunuki || ca|| dEvadAnavula dhIratanu | dAvatipaDi vArthi darupaganu | SrI vanitAmaNi jelagi peMDlADina | SrI vEMkaTagiri SrInidhiki ||

SatAparAdhamulu - శతాపరాధములు

శతాపరాధములు (రాగం: ) (తాళం : ) ప|| శతాపరాధములు సహస్రదండన లేదు | గతి నీవని వుండగ కావకుండగారాదు || చ|| తలచి నీకు మొక్కగా దయజూడకుండరాదు | కొలిచి బంటుననగా కోపించరాదు | నిలిచి భయస్తుడనై నీయెదుట దైన్యమే | పలుక గావకుండ బాడిగాదు నీకు || చ|| శరణు చొరగ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు | సరి బూరి గరవగ చంపరాదు | అరయ జగద్రోహినౌదు నైనా నీనామము | గరిమె నుచ్చరించగ గరగక పోదు || చ|| దిక్కు నీవని నమ్మగా దిగవిడువగరాదు | యెక్కువ నీలెంకగాగా యేమనరాదు | తక్కక శ్రీవేంకటేశ తప్పులెల్లా జేసి వచ్చి | యిక్కడ నీదాసినైతి నింక దోయరాదు || SatAparAdhamulu (Raagam: ) (Taalam: ) pa|| SatAparAdhamulu sahasradaMDana lEdu | gati nIvani vuMDaga kAvakuMDagArAdu || ca|| talaci nIku mokkagA dayajUDakuMDarAdu | kolici baMTunanagA kOpiMcarAdu | nilici BayastuDanai nIyeduTa dainyamE | paluka gAvakuMDa bADigAdu nIku || ca|| SaraNu coraga nIku sAre nAj~ja veTTarAdu | sari bUri garavaga caMparAdu | araya jagadrOhinaudu nainA nInAmamu | garime nuccariMcaga garagaka pOdu || ca|| dikku nIvani nammagA digaviDuvagarAdu | yekkuva nIle...

Saranu saranu suraemdra - శరణు శరణు సురేంద్ర

శరణు శరణు సురేంద్ర (రాగం: మాళవి ) (తాళం : ) శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయకా కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరీ విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా Saranu saranu suraemdra (Raagam:Maalavi ) (Taalam: ) Saranu saranu suraemdra sannuta saranu sreesati vallabhaa Saranu raakshasa garva samhara saranu vemkatanaayakaa Kamaladharudunu kamalamitrudu kamalasatrudu putrudu Kramamuto meekoluvu kippudu kaachinaa rechcharikayaa Animishaemdrulu munulu dikpatulamara kinnara siddhulu Ghanatato rambhaadikaamtalu kaachinaa rechcharikayaa Ennagala prahlaada mukhyulu ninnu goluvaga vachchiree Vinnapamu vinavayya tirupati vaemkataachalanaayakaa

SaraNu kapISwara - శరణు కపీశ్వర

శరణు కపీశ్వర (రాగం: ) (తాళం : ) శరణు కపీశ్వర శరణం బనిలజ సరవి నెంచ నీసరి యిక వేరీ పుట్టిననాడే భువనములెరగగ పట్టితి సూర్యుని పండనుచు ముట్టిన చుక్కలు మోవగ పెరిగితి(వి) ఇట్టిప్రతాపివి యెదురేదయ్యా అంపినయప్పుడే యంబుధి దాటితివి ఇంపులు సీతకు నిచ్చితివి సంపద మెరయుచు సంజీవి దెచ్చితి పెంపును సొంపును పేర్కొనవశమా చెదరక నేడే శ్రీవేంకటగిరి గదిసి రాముకృప గైకొంటి వదలక నీకృపవాడనైతి నిదె యెదుటనే కాచితి విక కడమేమీ SaraNu kapISwara (Raagam: ) (Taalam: ) SaraNu kapISwara SaraNaM banilaja saravi neMcha nIsari yika vErI puTTinanADE bhuvanamuleragaga paTTiti sUryuni paMDanuchu muTTina chukkalu mOvaga perigiti(vi) iTTipratApivi yedurEdayyA aMpinayappuDE yaMbudhi dATitivi iMpulu sItaku nichchitivi saMpada merayuchu saMjIvi dechchiti peMpunu soMpunu pErkonavaSamA chedaraka nEDE SrIvEMkaTagiri gadisi rAmukRpa gaikoMTi vadalaka nIkRpavADanaiti nide yeduTanE kAchiti vika kaDamEmI Get this widget | Track details | eSnips Social DNA

SaraNu SaraNu raamachaMdra - శరణు శరణు రామచంద్ర

శరణు శరణు రామచంద్ర (రాగం: ) (తాళం : ) శరణు శరణు రామచంద్ర నరేంద్రా సరి మమ్ముగావు రామచంద్రా నరేంద్రా ఘన దశరథునకు కౌసల్యాదేవికిని జననమందిన రామచంద్రా నరేంద్రా కనలి తాటకి చంపి కౌశుకుజన్నము గాచి చనవులిచ్చిన రామచంద్రా నరేంద్రా అరిది సీత పెండ్లాడి అభయమందరికిచ్చి శరధిగట్టిన రామచంద్రా నరేంద్రా అరసి రావణు చంపి అయేధ్యానగర మేలి సరవినేలిన రామచంద్రా నరేంద్రా పన్నుగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు సన్నిధినిల్చిన రామచంద్రా నరేంద్రా అన్నిటా లక్ష్మణభరతాంజనేయశత్రుఘ్నుల సన్నుతికెక్కిన రామచంద్రా నరేంద్రా SaraNu SaraNu raamachaMdra (Raagam: ) (Taalam: ) SaraNu SaraNu raamachaMdra naraeMdraa sari mammugaavu raamachaMdraa naraeMdraa ghana daSarathunaku kausalyaadaevikini jananamaMdina raamachaMdraa naraeMdraa kanali taaTaki chaMpi kauSukujannamu gaachi chanavulichchina raamachaMdraa naraeMdraa aridi seeta peMDlaaDi abhayamaMdarikichchi SaradhigaTTina raamachaMdraa naraeMdraa arasi raavaNu chaMpi ayaedhyaanagara maeli saravinaelina raamachaMdraa naraeMdraa pannuga nalamaelmaMgapati SreevaeMkaTaeSvaru ...

SaraNu SaraNu vEda - శరణు శరణు వేద

శరణు శరణు వేద (రాగం: ) (తాళం : ) శరణు శరణు వేద శాస్త్రనిపుణ నీకు అరుదైన రామ కార్యదురంధరా హనుమంతరాయ అంజనాతనయా ఘనవాయుసుత దివ్యకామరూప అనుపమలంకాదహన వార్ధిలంఘన జనసురనుత కలశాపురనివాస రవితనయస(న?)చివ రావణవనాపహార పవనవేగబలాఢ్య భక్తసులభ భువనపూర్ణదేహా బుధ్ధివిశారద జవసత్వవేగ కలశాపురనివాస సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ ఆతతప్రతాపశౌర్యా అసురాంతకా కౌతుక శ్రీవేంకటేశు కరుణాసమేత సాతకుంభవర్ణ కలశాపురనివాస SaraNu SaraNu vEda (Raagam: ) (Taalam: ) SaraNu SaraNu vEda SAstranipuNa nIku arudaina rAma kAryaduraMdharA hanumaMtarAya aMjanAtanayA ghanavAyusuta divyakAmarUpa anupamalaMkAdahana vArdhilaMghana janasuranuta kalaSApuranivAsa ravitanayasa(na?)chiva rAvaNavanApahAra pavanavEgabalADhya bhaktasulabha bhuvanapUrNadEhA budhdhiviSArada javasatvavEga kalasApuranivAsa sItASOkanASana saMjIvaSailAkarshaNa AtatapratApaSauryA asurAMtakA kautuka SrIvEMkaTESu karuNAsamEta sAtakuMbhavarNa kalaSApura nivAsa Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA

SaraNu SaraNu vibhIshaNa - శరణు శరణు విభీషణ

శరణు శరణు విభీషణ (రాగం: ) (తాళం : ) శరణు శరణు విభీషణ వరదా శరధిబంధన రామ సర్వగుణస్తోమ మారీచసుబాహుమదమర్దన తాటకాహర కౄరేంద్రజిత్తులగుండుగండా దారుణకుంభకర్ణదనుజ శిరచ్ఛేదక వీరప్రతాపరామ విజయాభిరామ వాలినిగ్రహ సుగ్రీవరాజ్యస్థాపక లాలితవానరబల లంకాపహార పాలితసవనాహల్యపాపవిమోచక పౌలస్త్యహరణ రామ బహుదివ్యనామ శంకరచాపభంజక జానకీమనోహర పంకజాక్ష సాకేతపట్టణాధీశ అంకితబిరుద శ్రీవేంకటాద్రినివాస ఓంకారరూప రామ వురుసత్యకామ SaraNu SaraNu vibhIshaNa (Raagam: ) (Taalam: ) SaraNu SaraNu vibhIshaNa varadA SaradhibaMdhana rAma sarwaguNastOma mArIchasubAhumadamardana tATakAhara kRUrEMdrajittulaguMDugaMDA dAruNakuMbhakarNadanuja SirachChEdaka vIrapratAparAma vijayAbhirAma vAlinigraha sugrIvarAjyasthApaka lAlitavAnarabala laMkApahAra pAlitasavanAhalyapApavimOchaka paulastyaharaNa rAma bahudivyanAma SaMkarachApabhaMjaka jAnakImanOhara paMkajAksha sAkEtapaTTaNAdhISa aMkitabiruda SrIvEMkaTAdrinivAsa OmkArarUpa rAma vurusatyakAma Get this widget | Track details | eSnips Social DNA

SaraNuvEDeda - శరణువేడెద

శరణువేడెద (రాగం: ) (తాళం : ) ప|| శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ | అరసి రక్షించుము అయోధ్యారామ || చ|| రావణనుని భంజించిన రాఘవ రామ | వావిరి విభీషణ వరద శ్రీరామ | సేవనలమేల్మంగతో వేంకటేశుడై | ఈవల దాసుల ఏలినట్టి శ్రీరామ || చ|| ధారుణిలో దశరథ తనయ రామ |చేరిన యహల్యను రక్షించిన రామ | వారిధి బంధన కపి వల్లభ రామ | తరక బ్రహ్మమైన సీతాపతి రామ || చ|| ఆదిత్య కులాంబుధి మృగాంక రామ హర- | కోదండ భంజనము చేకొనిన రామ | వేద శాస్త్ర పురాణాది వినుత రామ | ఆది గొన్నతాటకా సంహార రామ || SaraNuvEDeda (Raagam: ) (Taalam: ) pa|| SaraNuvEDeda yaj~jasaMBava SrIrAma | arasi rakShiMcumu ayOdhyArAma || ca|| rAvaNanuni BaMjiMcina rAGava rAma | vAviri viBIShaNa varada SrIrAma | sEvanalamElmaMgatO vEMkaTESuDai | Ivala dAsula ElinaTTi SrIrAma || ca|| dhAruNilO daSaratha tanaya rAma |cErina yahalyanu rakShiMcina rAma | vAridhi baMdhana kapi vallaBa rAma | taraka brahmamaina sItApati rAma || ca|| Aditya kulAMbudhi mRugAMka rAma hara- | kOdaMDa BaMjanamu cEkonina rAma | vEda SAstra purANAdi vinuta rAma | Adi gonnatATakA saMhAra...

SaraNaMbitaDE - శరణంబితడే సకలము

శరణంబితడే సకలము (రాగం: ) (తాళం : ) ప|| శరణంబితడే సకలము నాకును | వెరవున మనసా వెతకవో ఇతని || చ|| అభయంబొసగెడి యతడెవ్వడు మును | ఇభరక్షకుడు అతడెవ్వడు | ఉభయవిభూతుల కొడయండెవడూ | ప్రభువితడే నాపాలి దేవుడు || చ|| శరణాగతులకు సరి దా నెవ్వడు | యిరవుగ శ్రీపతి యెవ్వడు | అరి దుష్ట దైత్య హంతకు డెవ్వడు | పరమును నతడె నాపాలి దేవుడు || చ|| ఆది శంఖ చక్రాయుధు డెవ్వడు | యేదెస పూర్ణు డెవ్వడు | వేదమయుడు శ్రీ వేంకట పతియై | పాదాయ నిదె నా పాలిదేవుడు || SaraNaMbitaDE (Raagam: ) (Taalam: ) pa|| SaraNaMbitaDE sakalamu nAkunu | veravuna manasA vetakavO itani || ca|| aBayaMbosageDi yataDevvaDu munu | iBarakShakuDu ataDevvaDu | uBayaviBUtula koDayaMDevaDU | praBuvitaDE nApAli dEvuDu || ca|| SaraNAgatulaku sari dA nevvaDu | yiravuga SrIpati yevvaDu | ari duShTa daitya haMtaku DevvaDu | paramunu nataDe nApAli dEvuDu || ca|| Adi SaMKa cakrAyudhu DevvaDu | yEdesa pUrNu DevvaDu | vEdamayuDu SrI vEMkaTa patiyai | pAdAya nide nA pAlidEvuDu || Get this widget | Track details | eSnips Social ...

SaraNAgata vajra - శరణాగత వజ్ర

శరణాగత వజ్ర (రాగం: ) (తాళం : ) ప|| శరణాగత వజ్ర పంజరుడితడు | చక్రధరుడు అసుర సంహారుడు || అప|| వెరవుతోడ తను శరణనువారికి | వెనుబలమీతడే రక్షకుడు || చ|| అంతరాత్మ శ్రీ వేంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది | ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివొ మరి చెప్పుదురు | ఎంతలేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదన నేమిటికి | ఇంతకు శ్రీ వేంకటేశు దాసుల ఈతడే మాకిక రఖకుడు || చ|| శ్రీపతి దిక్కై కావగ జేరని సంపద లికనేవి | దాపల బుద్ధుల నది నమ్మక విచ్చలవిడి నోములు చెప్పుదురు | తీపులు పుట్టించి యెవ్వ రేమనిన తెలిపి వాదడువ నేమిటికి | శ్రీపతి గొలిచితి చేరె సంపదలు జిగినితడే మా రక్షకుడు || SaraNAgata vajra (Raagam: ) (Taalam: ) pa|| SaraNAgata vajra paMjaruDitaDu | cakradharuDu asura saMhAruDu || apa|| veravutODa tanu SaraNanuvAriki | venubalamItaDE rakShakuDu || ca|| aMtarAtma SrI vEMkaTESvaruDu anyamu BajiMca cOTEdi | iMtaTa nammaka dEvatAMtaramu lETETivo mari ceppuduru | eMtalEdu prAkRuta janamula Brama evvari kAdana nEmiTiki | iMtaku SrI vEMkaTESu dAsula ItaDE mAkika rakhakuDu || ca|| SrIpati dikkai kAvaga jErani s...

Saranamti maatani - శరణంటి మాతని

శరణంటి (రాగం: ) (తాళం : ) శరణంటి మాతనిసమ్మంధమున మరిగించి మమునేలి మన్నించవే ॥పల్లవి॥ సకలవేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిను బాడి పావనుడైన అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ॥శర॥ నారదాది సనకసనందనాదులవలె పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల చేరి యేలినయట్టి శ్రీ వేంకటనిలయ ॥శర॥ సామవేదసామగానసప్తస్వరములను బాముతో నీసతి నిన్ను బాడినయట్టి ఆముకొన్న తాళ్ళపాకన్నమాచరుల వేమరు మెచ్చిన శ్రీ వేంకటనిలయా ॥శర॥ Saranamti (Raagam: ) (Taalam: ) Saranamti maatanisammamdhamuna Marigimchi mamunaeli mannimchavae ||pallavi|| Sakalavaedamulu samkeertanalu chaesi Prakatimchi ninu baadi paavanudaina Akalamkudu taallapaakannamaachaaryula Vekaliyai yaelina sreevaemkatanilaya ||sara|| Naaradaadi sanakasanamdanaadulavale Paerupadi ninnu baadi peddalainatti Aareeti daallapaakannamaachaaryula Chaeri yaelinayatti sree vaemkatanilaya ||sara|| Saamavaedasaamagaanasaptasvaramulanu Baamuto neesati ninnu baadinayatti Aamukonna taallapaakannamaacharula Vaemaru mechchin...

SamamucAlaniyaTTi - శమముచాలనియట్టి

శమముచాలనియట్టిజన్మం (రాగం: ) (తాళం : ) ప|| శమముచాలనియట్టిజన్మం బిదేమిటికి | దమముచాలనియట్టితగు లిదేమిటికి || చ|| పగయునుబోలె నాపై సేయునడియాస | తగిలి యేపనేకాని దయ గొంత లేదు | జగడమునబోలె నలసతిలేనిమమత దను | తెగి వేచనేకాని తీరుగడ లేదు || చ|| ఋణమునుబోలె తీరియుదీరనిది కర్మ | గణనగలకాలంబు కడ మొదలు లేదు | వ్రణమునుబోలె విడువక రాగదేహజపు- | గుణము సౌఖ్యముతెరువు గొంతయును || చ|| నీతియుబోలె బ్రాణికి వేంకటేశుకృప | చేతికి నిధానంబు చేరినట్లాయ | భూతములుబోలె తలపున కితరసంస్మరణ- | భీతిపుట్టించి యప్రియభావమాయ || SamamucAlaniyaTTijanmaM (Raagam: ) (Taalam: ) pa|| SamamucAlaniyaTTijanmaM bidEmiTiki | damamucAlaniyaTTitagu lidEmiTiki || ca|| pagayunubOle nApai sEyunaDiyAsa | tagili yEpanEkAni daya goMta lEdu | jagaDamunabOle nalasatilEnimamata danu | tegi vEcanEkAni tIrugaDa lEdu || ca|| RuNamunubOle tIriyudIranidi karma | gaNanagalakAlaMbu kaDa modalu lEdu | vraNamunubOle viDuvaka rAgadEhajapu- | guNamu sauKyamuteruvu goMtayunu || ca|| nItiyubOle brANiki vEMkaTESukRupa | cEtiki nidhAnaMbu cErinaTlAya ...

vEvElacaMdAla vADu - వేవేలచందాల వాడు

వేవేలచందాల (రాగం: ) (తాళం : ) ప|| వేవేలచందాల వాడు విఠలేశుడు | భావించ నలవిగాని పరమాత్ముడితడు || చ|| సతతము రుక్మిణీ సత్యభామల నడుమ | రతికెక్కిన సింగార రాయడు ఇతడు | చతురత సనకాది సంయమీంద్రుల మతి | అతిశయిల్లేటి పరమానందమితడు || చ|| దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది | తావు కొన్నయట్టి యాధార మీతడు | మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము | కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు || చ|| వరముతో యశోద వసుదేవాదులకు | పరగిన కన్నుల పండుగీతడు | సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది | నిరతి దాసుల పాలి నిధాన మితడు || vEvElacaMdAla (Raagam: ) (Taalam: ) pa|| vEvElacaMdAla vADu viThalESuDu | BAviMca nalavigAni paramAtmuDitaDu || ca|| satatamu rukmiNI satyaBAmala naDuma | ratikekkina siMgAra rAyaDu itaDu | caturata sanakAdi saMyamIMdrula mati | atiSayillETi paramAnaMdamitaDu || ca|| dEvatala kellAnu dikku desai velugoMdi | tAvu konnayaTTi yAdhAra mItaDu | mUvoMka golletalu munnu sEsina tapamu | kaivasamai PaliMcina GanaBAgya mitaDu || ca|| varamutO yaSOda vasudEvAdulaku | paragina kannula paMDugItaDu | si...

vEsaritimeTla - వేసరితిమెట్ల

వేసరితిమెట్ల (రాగం: ) (తాళం : ) ప|| వేసరితిమెట్ల నీవెంట దిరిగి | గాసిబెట్టక మమ్ము గావరారా || చ|| తీసితివి కోరికల తెగనీక పంచలకు | తోసితివి యింటింట దోయదోయ | చేసితివి నీచేత చెల్లె నికనైనను | ఆస నీపొందొల్ల మంపరాదా || చ|| కట్టితివి కర్మముల కడదాక నాపదల | బెట్టితివి దుఃఖముల బెనచిపెనచి | పట్టితివి చలము మము పాయనని యాస నీ- | విట్లైన గొంత సుఖమియ్యరాదా || చ|| కరపితివి పాపములే కడగి నానావిధుల | నెరపితివి దుర్దశలే నేర్పుమెరసి | తెరగొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని- | నెరిగియును నెరగలేమింక నేతెరువో || vEsaritimeTla (Raagam: ) (Taalam: ) pa|| vEsaritimeTla nIveMTa dirigi | gAsibeTTaka mammu gAvarArA || ca|| tIsitivi kOrikala teganIka paMcalaku | tOsitivi yiMTiMTa dOyadOya | cEsitivi nIcEta celle nikanainanu | Asa nIpoMdolla maMparAdA || ca|| kaTTitivi karmamula kaDadAka nApadala | beTTitivi duHKamula benacipenaci | paTTitivi calamu mamu pAyanani yAsa nI- | viTlaina goMta suKamiyyarAdA || ca|| karapitivi pApamulE kaDagi nAnAvidhula | nerapitivi durdaSalE nErpumerasi | teragosaMgiyunu SrItiru...

vEsariMcEdAnagAnu - వేసరించేదానగాను

వేసరించేదానగాను (రాగం: ) (తాళం : ) ప|| వేసరించేదానగాను వేగినంతా నిన్నును | రాశికెక్క మీకృపనే రతి జెలగుదును || చ|| నట్టనడుమనే నీవు నావాడవై వుంటేజాలు | అట్టే నే నెంతటి నైనా నౌదును | గుట్టుతోడ నీవునాకు గొలువిచ్చితే జాలు | నెట్టన లోకమునకు నేనే రాజౌదును || చ|| కందువ నీవు నన్ను గన్నుల జూచితేజాలు | అందపు సిరుల నోలలాడుదును | మందలించి నాతో నొక మాటలాడితే చాలు | పందెమాడి నీచే తుదిపదము చేకొందును || చ|| చేరి శ్రీవేంకటేశ్వర సెలవి నవ్వితే జాలు | కోరి నీవలపులకు గురి యౌదును | సారె నలమేల్మంగను సతి నీకు నైతే జాలు | మేరతో గూడితిని మేలెల్లా సాదింతును || vEsariMcEdAnagAnu (Raagam: ) (Taalam: ) pa|| vEsariMcEdAnagAnu vEginaMtA ninnunu | rASikekka mIkRupanE rati jelagudunu || ca|| naTTanaDumanE nIvu nAvADavai vuMTEjAlu | aTTE nE neMtaTi nainA naudunu | guTTutODa nIvunAku goluviccitE jAlu | neTTana lOkamunaku nEnE rAjaudunu || ca|| kaMduva nIvu nannu gannula jUcitEjAlu | aMdapu sirula nOlalADudunu | maMdaliMci nAtO noka mATalADitE cAlu | paMdemADi nIcE tudipadamu cEkoMdunu || ca|| cEri SrIvEMkaTES...